ఔషధాల పనితీరును అధ్యయనం చేసే శాస్త్రం?


- జీవపదార్థ స్థాయి వ్యవస్థీకరణ వేటిలో కనిపిస్తుంది?
1) స్పంజికలు 2) ప్రొటోజోవన్లు
3) సీలెంటరేట్లు 4) అనెలిడ్‌లు - స్పంజికల్లో కంటకాలు వేటినుంచి స్రవించబడతాయి?
1) స్లిరోబ్లాస్ట్లు 2) ఆర్కియోసైట్లు
3) థిసోసైట్లు 4) కొయానోసైట్లు - డీపీటీ వ్యాక్సిన్‌లో ‘డి’ అక్షరం ఏ వ్యాధిని సూచిస్తుంది?
1) డెంగ్యూ 2) డీసెంట్రా
3) డిప్తీరియా 4) డయేరియా - గర్భాశయంలో పిండ ప్రతిష్టాపన జరిగే దశ?
1) బ్లాస్టులా 2) బ్లాస్టోసిస్ట్
3) మారులా 4) గ్రాస్టులా - హృదయంలో లయారంభకం పాత్ర?
1) హృదయస్పందన ఎక్కువ చేయడం
2) హృదయస్పందన తక్కువ చేయడం
3) హృదయస్పందన ప్రారంభిస్తాయి
4) హృదయస్పందన రక్త సరఫరా
నియంత్రించడం - క్షయ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి?
1) మైక్రో బ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్
2) మైక్రో బ్యాక్టీరియమ్ లెప్రే
3) ఇన్‌ఫ్లూయెంజా-ఏ
4) సాల్మోనెల్లా టైపి - షేక్టెస్ట్ ఏ వ్యాధి నిర్ధారణ పరీక్ష?
1) డెంగ్యూ 2) స్వైన్‌ఫ్లూ
3) డిప్తీరియా 4) కలరా - భౌగోళిక వివక్తత వల్ల జరిగే జాతుల ఉత్పత్తి?
1) సింపాట్రిక్ 2) అల్లోపాట్రిక్
3) అనాజెనిసిన్ 4) క్లాడోజెనిసిన్ - శుక్రకణపు ఏక్రోజోమ్ను ఏర్పర్చేది?
1) గాల్జీ సంక్లిష్టం 2) అంతర్జీవ ద్రవం
3) రైబోసోమ్ 4) ఖాండ్రోసోమ్ - స్పోరోజోవా జీవుల్లో చలన సూక్ష్మాంగుళికలు?
1) మిధ్యాపాదాలు 2) సైలికలు
3) కశాభాలు
4) సూక్ష్మాంగుళికలు ఉండవు - అనువంశిక లక్షణాలు సంక్రమించే విధానాన్ని వివరించడానికి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం?
1) బీజ ద్రవ్య సిద్ధాంతం
2) పాన్జెనిసిన్ సిద్ధాంతం
3) దేహ ద్రవ్య సిద్ధాంతం
4) ఉత్పరివర్తన సిద్ధాంతం - మానవునిలోని జఠాయువు రకం?
1) హీమోకొరియాల
2) ఎండోథీలియల్
3) ఎపిథీలియోకొరియల్
4) సిన్డెస్మోకొరియల్ - శరీరం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు పంపే బాధ్యతను చేసేది?
1) ఊపిరితిత్తులు 2) మూత్రపిండం
3) స్వేదగ్రంథి 4) కాలేయం - ఒక బీజకణం సాధారణంగా కలిగి ఉండేది?
1) జన్యువుకు సంబంధించి అన్ని
యుగ్మవికల్పకాలు
2) జన్యువు అనేకమైన యుగ్మవికల్పకాలు
3) జన్యువు ఒక యుగ్మకల్పకం
4) జన్యువు రెండు
యుగ్మకల్పకాలు - డౌన్‌సిండ్రోమ్ దేని వల్ల కలుగుతుంది?
1) పెరుగుదల హార్మోన్ తగ్గడం
2) 21వ జతలో అదనంగా ఒక క్రోమోజోమ్ ఉండటం
3) క్రోమోజోమ్ నిర్మాణంలో మార్పు
4) జన్యు ఉత్పరివర్తనం - మానవునిలో బట్టతలకు కారణం?
1) లింగపరిమిత జన్యువులు
2) వై-సహలగ్న జన్యువులు
3) లింగ సహలగ్న జన్యువులు
4) లింగ ప్రభావిత జన్యువులు - విశ్వవ్యాప్త దాతలు రక్తాన్ని ఇతర అన్ని రక్త సముదాయాల వారికి ఇస్తారు. ఇందుకు గల కారణం?
1) ప్రతిరక్ష జనకాలు, ప్రతిదేహాలుంటాయి
2) ప్రతిదేహాలుండవు
3) ప్రతిరక్ష జనకాలుండవు
4) ప్రతిరక్ష జనకాలుంటాయి - కింది వాటిలో సమవిభజనతో ఏకీభవించదు?
1) శరీర సంబంధమైన కణ విభజన
2) జన్యుపరమైన అభిన్న పిల్ల కణాలు
ఏర్పడటం
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) ఏక స్థితిక లింగ కణాలు ఏర్పడటం - కొవ్వులో కరిగే విటమిన్స్?
1) ఎ, బి, సి, డి 2) సి, డి, ఇ, కె
3) ఎ, బి, ఇ, కె 4) ఎ, డి, ఇ, కె - రక్తం గడ్డకడుతున్నప్పుడు, థ్రాంబోప్లాస్టిన్ దెబ్బతిన్న.. వీటి నుంచి విడుదలవుతుంది?
1) ఎర్రరక్తకణాలు 2) మాక్రోఫేజ్‌లు
3) ల్యూకోసైట్లు 4) రక్తఫలికలు - ఆస్పేడియం ఎలా పనిచేస్తుంది?
1) విసర్జక అవయవం
2) ప్రత్యుత్పత్తి అవయవం
3) జ్ఞాన అవయవం
4) శ్వాస అవయవం - సకశేరుకాల్లో శరీర కుహరం దేని నుంచి ఏర్పడుతుంది?
1) మధ్యస్త తచం, అంతఃతచం
2) మధ్యస్త తచం
3) బాహ్య తచం 4) అంతఃతచం - రెడ్ డేటా బుక్ అని దేనిని అంటారు?
1) అపాయకర, అరుదైన జాతుల జాబితా కలిగిన పుస్తకం
2) కార్ల్ మార్క్స్ రచించిన పుస్తకం
3) ఎర్రసముద్ర జీవసముహం కలిగిన పుస్తకం
4) ఎరుపు అట్టకలిగిన పుస్తకం - ‘అంపుల్లా లోరెంజిని’ అనేది ఒక?
1) ఘ్రాణ గ్రాహకం 2) ఉష్ణ గ్రాహకం
3) పీడన గ్రాహకం
4) రసాయనిక గ్రాహకం - న్యూక్లిక్ అంశాలు (కేంద్రకాంశం) వేటిని ప్రత్యేకంగా అధికంగా కలిగి ఉంటుంది?
1) ఆర్ఎన్ఏ, కొవ్వుపదార్థాలు
2) ఆర్ఎన్ఏ, మాంసకృత్తులు
3) డీఎన్ఏ, కొవ్వుపదార్థాలు
4) డీఎన్ఏ, మాంసకృత్తులు - కార్పస్ కెల్లోజోమ్ ఎక్కడ ఉంటుంది?
1) మస్తిష్కార్ధ గోళాలు, మజ్జాముఖం మధ్యన
2) మస్తిష్కార్ధ గోళాలు, వెన్నుపాముల మధ్యన
3) రెండు మస్తిష్కార్ధ గోళాల మధ్యన
4) మెదడు, వెన్నుపాముల మధ్యన - కేరియాటైస్ అంటే?
1) క్రోమోజోమ్‌ల సంఖ్యను తెలియజేయడం
2) క్రోమోజోమ్‌ల రూపాన్ని తెలియజేయడం
3) క్రోమోజోమ్‌ల బాహ్య స్వరూపం సంబంధం తెలియజేయడం
4) పైవన్నీ - ‘ఫాండర్స్’ అంటే
1) ఒక అపరిమిత జనాభా నుంచి వివిక్తత ద్వారా వేరే ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించుకునే జీవులు
2) పరిమిత జనాభా నుంచి జీవులు వేరుబడి అక్కడే వేరే ప్రాంతంలో సమూహంగా
ఏర్పడటం
3) పరిమిత జనాభాలోని జీవుల మధ్య లైంగిక పరమైన వివిక్తత ద్వారా సమూహాలుగా ఏర్పడటం 4) 2, 3 - ‘ఫ్రిమార్టిన్’ అనేది ఒక?
1) ఏక సంయుక్త బీజం నుంచి ఏర్పడిన
ఆడ సహకవల
2) ఏక సంయుక్త బీజం నుంచి ఏర్పడిన
మగ సహకవల
3) ద్వితీయ సంయుక్త బీజం కవల్లో
ఆడ సహకవల
4) ద్వితీయ సంయుక్త బీజ కవల్లో
మగ సహకవల - జీవపరిణామానికి మూలాధారమైనది?
1) అనుకూలత 2) కాంపిటీషన్
3) ఉత్పరివర్తనం 4) ప్రకృతి వరణం



- Tags
- Education News
Previous article
కాగులు అంటే?
Next article
భాషా నైపుణ్యాలు-సాధించాల్సిన సామర్థ్యాలు
RELATED ARTICLES
-
Scholarships | Scholarships for 2023
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !