డిజాస్టర్ మేనేజ్మెంట్- ప్రీవియస్ క్వశన్స్
1. జాతీయ విపత్తు నివారణ అథారిటీ చైర్మన్ ఎవరు?
1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి
3) ప్రధానమంత్రి 4) కేంద్ర హోంమంత్రి
2. జాతీయ విపత్తు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖలో ఉంది?
1) హోంమంత్రిత్వ శాఖ
2) వ్యవసాయ శాఖ
3) పరిశ్రమల శాఖ 4) పర్యావరణ శాఖ
3 జాతీయ విపత్తు కార్యనిర్వాహక కమిటీ పదవీ రీత్యా చైర్మన్ ఎవరు?
1) కేంద్ర హోంమంత్రి
2) కేంద్ర వ్యవసాయ కార్యదర్శి
3) కేంద్ర హోం శాఖ కార్యదర్శి
4) కేబినెట్ కార్యదర్శి
4. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలోని సభ్యుల సంఖ్య?
1) 12 2) 9 3) 19 4) 8
5. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యుల సంఖ్య?
1) 7 2) 8 3) 9 4) 10
6. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది?
1) 72వ రాజ్యాంగ సవరణ
2) 73వ రాజ్యాంగ సవరణ
3) 75వ రాజ్యాంగ సవరణ
4) 64వ రాజ్యాంగ సవరణ
7. విపత్తు నిర్వహణ విభాగం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నుంచి కేంద్ర హోం (గృహ) వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి ఎప్పుడు వచ్చింది?
1) 2001 2) 2002
3) 2003 4) 2005
8. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది?
1) 1980వ దశాబ్దం 2) 2000వ దశాబ్దం
3) 1990వ దశాబ్దం 4) 2010వ దశాబ్దం
9. హ్యోగో కార్యచట్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది?
1) 2000-2010 2) 2003-2013
3) 2005-2015 4) 2006-2016
10. వేగంగా సంభవించే విపత్తు
1) భూకంపం 2) మెరుపు వరద
3) రసాయన ప్రమాదం 4) పైవన్నీ
11. భూకంపాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో వస్తాయి?
1) భూఫలక సరిహద్దుల వద్ద
2) భూకేంద్రం వద్ద
3) భూ ఫలకల ఉపరితలం వద్ద
4) పైవన్నీ
12. క్రాకటోవా అగ్ని పర్వతం బద్ధలవడం కారణంగా ఇండోనేషియాలో సునామీ ఎప్పుడు సంభవించింది?
1) 1983 2) 1883
3) 1973 4) 1974
13. కిందివాటిలో సునామీని కలిగించనిది?
1) సముద్రగర్భంలో భూకంపం
2) సముద్రగర్భంలో అగ్నిపర్వత పేలుడు
3) చంద్రుని గురుత్వాకర్షణ
4) పైవన్నీ
14. సునామీ తీవ్ర విధ్వంసాన్ని సృష్టించే ప్రాంతం?
1) సముద్ర అంతర్భాగంలో
2) సముద్ర ఉపరితలంపై
3) తీర ప్రాంతంలో 4) పైవన్నీ
15 భూకంప విపత్తు తీవ్రతను తగ్గించే వ్యూహం ?
1) ముందస్తు హెచ్చరిక
2) భవన నిర్మాణ డిజైన్
3) వృక్ష సంపదను పెంచడం
4) జంతు సంపదను పెంచడం
16. భూకంపాన్ని కొలిచే సాధనం?
1) కార్టోగ్రాఫ్ 2) టెలిగ్రాఫ్
3) సిస్మోగ్రాఫ్ 4) ఇంటర్‌గ్రాఫ్
17. ఒకే రకమైన తీవ్రత గల భూకంపాలను పొందే ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) హోమ్సీస్కల్ రేఖలు
2) ఐసోసీస్మల్ రేఖలు
3) ఐసోథర్మల్ రేఖలు
4) ఐసోక్లినికల్ రేఖలు
18. ఒక సమయంలో భూకంపాలను పొందిన ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) హోమ్సీస్కల్ రేఖలు
2) ఐసోథర్మల్ రేఖలు
3) ఐసోసీస్మల్ రేఖలు
4) ఐసోబార్ రేఖలు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు