చనిపోతేనే ప్రయోజనం.. విషమే ఔషధం!
జంతువులను మచ్చిక చేసుకుని వాటి ద్వారా సహాయం పొందడం అనాది నుంచి వస్తుంది. మానవుడు అనేక జంతువులను మాంసం, పాలు, ఉన్ని, వివిధ రకాల ఉత్పత్తుల కోసం ఉపయోగించుకుంటున్నాడు. వాటి ఉత్పత్తుల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వివిధ రకాల జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత
పట్టు సంవర్ధనం
– వాణిజ్యపరంగా పట్టు ఉత్పత్తి కోసం చేపట్టే పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ లేదా పట్టు పరిశ్రమ అంటారు.
-పట్టుపురుగు శాస్త్రీయ నామం – – బాంబిక్స్ మోరి
-పట్టు పురుగులు మల్బరీ ఆకులను తింటాయి.
– పట్టు మాత్ గొంగళి పురుగు. దీని లాలాజల గ్రంథులు పట్టు గ్రంథులుగా మారి పట్టును ఉత్పత్తి చేస్తాయి.
– గొంగళి పురుగులు (కాటర్ పిల్లర్స్) ఒక నెల రోజుల్లో మల్బరీ ఆకులను విపరీతంగా తిని పెరిగి నాలుగుసార్లు నిర్మోచనం జరుపుకొంటాయి.
-పెరగడం పూర్తయ్యాక గొంగళి పురుగు ఆహారం తీసుకోవడం మాని, శరీరం చుట్టూ పట్టుదారాలతో ఒక కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని పట్టుగూడు లేదా కొకూన్ అంటారు.
-ఈ దశనే ప్యూపా దశ అంటారు.
-కొకూన్లు పూర్తిగా ఏర్పడిన తర్వాత వాటిని మరుగుతున్న నీటిలో ఉంచుతారు. దీని వల్ల లోపల ఉన్న గొంగళి పురుగు చనిపోతుంది.
-గొంగళి పురుగును చంపకపోతే అది మాత్గా రూపవిక్రియ చెంది కొకూన్ను చీల్చుకొని వెలుపలకు వస్తుంది. దీని వల్ల పట్టుదారం ముక్కలై వ్యాపార రీత్యా ఉపయోగపడదు.
-కొకూన్లను పట్టు కోసం రీలింగ్ యూనిట్లకు పంపుతారు. పట్టుకోసం కొకూన్ల నుంచి దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు.
-పట్టుదారంలో ఫైబ్రోయింగ్ అనే ప్రొటీన్ ఉంటుంది.
పట్టులో మల్బరి పట్టుగాక టసార్, ఈరీ, మూంగా అనే పట్టు రకాలున్నాయి. ఇవి చాలా చవకైనవి. (నాణ్యమైనవి కావు)
పట్టును దుస్తుల తయారీలోనే గాక, గాలి గుమ్మటాలు, బెలూన్లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
తేనెటీగలు
– తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు.
– భారతదేశంలో కనిపించే తేనెటీగ శాస్త్రీయ నామాలు- ఎపిస్ ఇండికా, ఎపిస్ డార్సెట
– తేనెటీగలు సాంఘిక జీవులు. ఒక తేనె పట్టులో 50,000 తేనెటీగలుంటాయి.
– తేనె ఎంతో విలువైన పోషక పదార్థం. దీనిలో లెవ్యులోజ్, డెక్టోజ్, మాల్టోజ్ వంటి చక్కెరలుంటాయి.
– ఇది మంచి యాంటీసెప్టిక్ పదార్థం.
-దీన్ని ఆయుర్వేద, యునాని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
-తేనెపట్టు నుంచి వచ్చే మైనాన్ని కొన్వొత్తులు, పాలిష్ తయారీలో ఉపయోగిస్తారు.
– తేనెటీగల విష గ్రంథుల నుంచి సేకరించిన విషాన్ని కీళ్ల ప్పులు (ఆర్థరైటిస్) నివారణలో ఉపయోగిస్తారు.
లక్క కీటకం
-లాక్సీఫర్ లక్కా లేదా టాకార్డియా లక్కా అనే లక్క కీటకం నుంచి లక్క ఉత్పత్తి అవుతుంది.
-లక్క పురుగు తుమ్మ, రేగు, రావి, మోదుగు మొదలైన చెట్ల మీద ఉంటుంది.
– చెట్ల బెరడుపై ఉత్పత్తి అయిన లక్కను తీసి రెండు దశల్లో శుభ్రపరుస్తారు.
-మొదటి దశలో లక్కని ఎండబెట్టి, పొడి చేసి, జల్లించి కడుగుతారు.
-రెండో దశలో దాన్ని కరిగించి వడబోస్తారు.
– ప్రపంచానికి కావలసిన లక్కలో 70 శాతం మనదేశం ఉత్పత్తి చేస్తుంది.
– వాణిజ్యంగా ఎగుమతి చేసే లక్కను షెల్లాక్ అంటారు.
ఉపయోగాలు
-లక్కను సీల్ వేయడానికి ఉపయోగిస్తారు.
-వార్నిష్లు, రంగులు, పాలిష్‌ల ఉత్పత్తిలో వాడతారు.
-గాజులు, లక్కబొమ్మలు, గుండీలు, లక్క పిడతల తయారీలో వినియోగిస్తారు.
-లక్క పురుగు దేహాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
మరికొన్ని జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత
-చనిపోయిన ఉప్పునీటి ప్రొటోజోవా జీవులైన పొరామినిఫెరా, రేడియోలేరియాలు ఓషన్ ఊజ్ను ఏర్పరుస్తాయి. ఈ ప్రొటోజోవా ఓషన్ ఊజ్ (అస్థిపంజరాలు)ను ఆకురాయిలా విసరటానికి, మెరుగుపెట్టడానికి, పరిశ్రమల్లో వడపోత సాధనంగా ఉపయోగిస్తారు.
-స్పంజిక అస్థిపంజరం కంటకాలనే స్పాంజిన్ తంతువులతో ఏర్పడుతుంది. పురాతన కాలం నుంచి ఈ స్పంజికలను స్నానాది కార్యక్రమాలకు ఉపయోగించుకునేవారు.
– ఆయిస్టర్, ఆల్చిప్ప, మంచి నీటి ఆల్చిప్ప వంటి ద్వి కవాట (రెండు కర్పరాలుండేవి)మొలస్కన్లను ఆహారంగా తింటారు. కొన్ని ఆటవిక (గిరిజన) తెగల వారు మొలస్కా కర్పరాలను నాణేలుగా ఉపయోగిస్తారు.
-ముత్యాలు పెరల్ ఆయిస్టర్ అనే మొలస్కన్ల నుంచి లభిస్తాయి. పెరల్ ఆయిస్టర్ కాల్షియం కార్బొనేట్‌ను స్రవిస్తుంది. ఇది గట్టిపడి ముత్యంగా తయారవుతుంది. ఈ జీవులు సముద్రపు అడుగుభాగంలో నివసిస్తాయి.
-ప్రొటీన్లు లభించే ముఖ్యమైన జంతువులు- చేపలు
-పంటలను నాశనం చేసే కీటకాలను తినే చక్కటి పరభక్షకాలు పక్షులు.
– కోడి, బాతు, టర్కీల వంటి పక్షులు మనకు పోషకాహారాన్నిచ్చేవి (మాంసం, గుడ్లు).
-రోడ్ ఐలెండ్, లెగ్హారన్ జాతి కోళ్లు గిరాకీ గల కోళ్లు. ఈ కోళ్లు ఏడాదికి 300 గుడ్లు పెడతాయి.
పశువులు
– పెంపుడు జంతువులుగా పాలు, మాంసాన్ని ఇచ్చి మానవుడితో అతి సన్నిహితంగా మెలిగే జంతువులు క్షీరదాలు అవి పశువులు, గొరెలు, మేకలు.
-ఆవులు, ఎద్దులు, గేదెలను లైవ్ స్టాక్ అంటారు.
-అనాది నుంచి ఒక చోటు నుంచి మరో చోటికి బరువులు చేరవేయడం కోసం, చర్మంతో తోలు వస్తువులు చేయడం కోసం పశువులను ఉపయోగించారు.
– నేడు సరైన జాతుల (హోల్స్టిన్, జెర్సీ) ఆవులను ఎంచుకొని సంకరణ విధానాలు పాటించి, రోజుకు 20-30 లీటర్ల పాలిచ్చే జాతులను పెంచుతున్నారు.
-భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దీని ముఖ్య ఉద్దేశం పాల ఉత్పత్తిని పెంచడం.
-ఒకే జీవికి చెందిన రెండు జాతుల మధ్య జరిగే సంపర్కాన్ని అడ్డు ప్రజననం (సంకరణ) లేదా బాహ్య ప్రజననం అంటారు.
-మేలు జాతి జంతువుల ఉత్పత్తి కోసం కృత్రిమ గర్భధారుణం, సూపర్ఝ ఒవ్యులేషన్, పిండ మార్పిడి అనే పద్ధతులు ఉన్నాయి.
పశువుల శుక్రాన్ని 196..0 సెంటీగ్రేడ్ వద్ద నత్రజని ద్రావణంలో గడ్డ కట్టించి నిల్వ చేస్తారు. ఇది 10 నుంచి 12 సంవత్సరాల వరకు చైతన్యవంతంగా ఉంటుంది.
మన దేశంలో 7 జాతుల గేదెలున్నాయి. అవి మురా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్న, నాగ్‌పూరి, నీలిరావి.
మురా దేశీయ జాతుల్లో ఎక్కువ పాలిచ్చేదిగా భారత ప్రభుత్వం గుర్తించింది.
పశువుల పెంటకు బ్యాక్టీరియా జోడించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
మేకలు, గొర్రెలు
-మేకలను ముఖ్యంగా మాసం, పాలు, చర్మం కోసం మచ్చిక చేస్తారు. అన్ని మేక జాతుల్లోకి అంగోరా జాతి ముఖ్యమైనది. దీని ఉన్ని మెత్తగా సిల్కులాగా మెరుస్తుంది.
– గొర్రెలను ముఖ్యంగా ఉన్ని, మాంసం, చర్మం (తోలు) కోసం మచ్చిక చేసుకున్నారు.
– గొర్రెల శరీరం మీద రెండు రకాల రోమాలుంటాయి. రెండో రకం రోమాలు పొట్టిగా, మెత్తగా, పట్టులా, నొంపులు తిరిగి ఉంటాయి. వీటిని ఉన్ని లేకా ఫ్లీస్ అంటారు.
-ఉన్ని దుస్తులకు ఉష్ణాన్ని బయటకు పోకుండా ఆపగల శక్తి ఉంది. శీతాకాలంలో ధరించడానికి ఇవి ఉపయోగపడతాయి.
-మేలు రకం ఉన్నిని ఇచ్చే గొర్రె జాతులు- మెరినో, కోరిడేన్
-పూర్వం మాంసానికి, రవాణా సాధనంగా ఉపయోగించారు.
గుర్రాలు
– పశువులతో పోలిస్తే గుర్రాలకు ప్రత్యుత్పత్తి శక్తి చాలా తక్కువ.
– మగ గాడిదకు, ఆడ గురానికి పుట్టిన సంకర సంతానాన్ని మ్యూల్ అంటారు. ఇవి వంధ్య జీవులు.
-హిమాలయా పర్వతాల్లో బరువులను మోయటానికి, రక్షణ దళంవారు మ్యూల్స్‌ను ఉపయోగిస్తారు.
– ఆడ గాడిదకు, మగ గుర్రానికి పుట్టిన సంతానాన్ని హెన్ని అంటారు.
పందులు
-పంది మాంసాన్ని పోర్క్ అంటారు. బెర్క్ షైర్, యూర్క్ షైర్, లాండ్‌రేస్ జాతి పందులు మాంసానికి ప్రసిద్ధి.
-చేపల మాంసంలో 15 నుంచి 25 శాతం మాంసకృత్తులు ఉండటం వల్ల చేపలు ప్రొటీన్లు లభించే ముఖ్యమైన ఆహారం.
-చేప మాంసంలో విటమిన్లు అధికంగా బళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి.
– చేప మాంసంలో విటమిన్-ఎ, డి అధికంగా ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి అవసరం. చేప మాంసం పెరుగుదలకు తోడ్పతుంది.
– గుడ్లు పెట్టే చేపలను బ్రీడర్స్ అంటారు.
-అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేపలను స్పాన్ అంటారు.
-ప్లవకాలు అంటే నీటి మీద తేలుతూ ఉండే చిన్న జంతువులు, మొక్కలు. ఇవి చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి.
-చేపలకు ఆయిల్ కేక్‌ను (గానుగ చెక్క), వరి తవుడును పిండిగా చేసి ఆహారంగా ఇవ్వవచ్చు.-ఒకటి కంటే ఎక్కువ రకాల చేపలను ఒకే కుంటలో పెంచితే దాన్ని పాలీకల్చర్ లేదా కాంపోజిట్ కల్చర్ అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే కోళ్లు?
1) పుంజు
2) పెట్ట
3) లేయర్
4) బ్రాయిలర్
2, ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది వేటి పెంపకం?
1) చేపలు 2) పుట్టగొడుగులు
3) ఈము పక్షులు 4) పశువులు
3. తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
1) సెరికల్చర్ 2) సిల్వికల్చర్
3) ఆక్వాకల్చర్ 4) ఎపికల్చర్
4. నీలి విప్లవం వేటికి సంబంధించింది?
1) చేపలు 2) తిమింగలాలు
3) సొరచేపలు 4) పశువులు
5. చేప ఆహారం మానవ దేహంలో ఏ అవయవానికి ఉపయోగకరం?
1) కాలేయం 2) మెదడు
3) గుండె 4) మూత్రపిండాలు
6. తేనెపట్టులో ఫలవంతమైన ఆడ ఈగ ఏది?
1) కూలి ఈగ 2) డ్రోన్
3) క్వీన్ 4) అన్నీ
8. ప్రపంచంలో పట్టును ఉత్పత్తి చేసే దేశాలేవి?
1) జపాన్, చైనా, భారత్
2) అమెరికా, నేపాల్, రష్యా
3) జర్మనీ, ఇంగ్లండ్, పాకిస్థాన్
4) బంగ్లాదేశ్, శ్రీలంక, ఫ్రాన్స్
9. ప్రపంచానికి కావలసిన లక్కలో 70 శాతం ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది?
1) అమెరికా 2) భారత్
3) చైనా 4) రష్యా
10. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఫ్లడ్ ఏ జంతువుల పెంపకానికి ఉద్దేశించింది?
1) చేపలు 2) కోళ్లు
3) పందులు 4) పశువులు
జవాబులు
1. 3 2. 3 3. 4 4. 1 5. 2 6. 3 7. 4 8. 1 9. 2 10. 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు