ముగిసిన కానిస్టేబుల్ రాత పరీక్ష
# మొత్తం అభ్యర్థుల్లో 91.34% మంది హాజరు
# త్వరలో కీ విడుదల చేయనున్న టీఎస్ఎల్పీఆర్బీ
కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష సజావుగా ముగిసింది. పోలీస్‌శాఖలో 15, 644, ఎక్సైజ్‌శాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు 1,601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న మొత్తం 6,61,196 మంది అభ్యర్థుల్లో 60,3955 మంది (91.34%) పరీక్షకు హాజరైనట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశామని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు, డిజిటల్ వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్స్ సేకరించినట్టు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలో www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇటీవల ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షతో పోలిస్తే కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం చాలా సులభంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రీజనింగ్ (మెంటల్ ఎబిలిటీ) విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చినట్టు సమాచారం. జనరల్ స్టడీస్ విభాగంలో భారత, తెలంగాణ చరిత్ర నుంచి సుమారు 40 ప్రశ్నలు ఇచ్చారని, వీటిలో ఎక్కువ ప్రశ్నలు తెలంగాణ చరిత్ర నుంచే వచ్చాయని నిపుణులు చెప్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు