ఇనుము తుప్పు పట్టడం అంటే?
1. కింది వాటిలో ఏది భౌతిక మార్పు కాదు?
1) NH4 Cl ను వేడిచేయడం
2) ZnO ను వేడిచేస్తే పసుపు రంగులోకి మారడం
3) పారఫిన్ మైనాన్ని వేడి చేయడం
4) లెడ్ నైట్రేట్‌ను వేడి చేయడం
2. లెడ్ నైట్రేట్‌ను వేడిచేస్తే వెలువడే జేగురు రంగు వాయువు?
1) NO2 2) O2
3) H2 4) N2
3. కింది వాటిలో ఏది రసాయన మార్పు కాదు?
1) CuCO3 ని వేడి చేయడం
2) మెగ్నీషియం తీగను గాలిలో మండించడం
3) జింక్ కార్బోనేట్‌ను వేడి చేయడం
4) రసాయన సంఘటనంలో మార్పు రాదు
4. భౌతిక మార్పు కానిది?
1) కొత్త పదార్థాలు ఏర్పడవు
2) ఫార్ములాలో మార్పు ఉండదు
3) ఇరువైపులా చర్య ఉంటుంది, తిరిగి మొదటి పదార్థాన్నే పొందవచ్చు
4) సంఘటనంలో మార్పు వస్తుంది
5. CuCO3 రంగు?
1) ఆకుపచ్చ 2) పసుపుపచ్చ
3) నలుపు రంగు 4) రంగు ఉండదు
6. కింది వాటిలో దేన్ని వేడి చేయడం రసాయనిక చర్య?
1) సోడియం నైట్రేట్ (NaNO3)
2) కాపర్ కార్బోనేట్ (CuCO3)
3) పొటాషియం నైట్రేట్ (KNO3)
4) పైవన్నీ
7. కాపర్ కార్బోనేట్‌ను వేడిచేస్తే ఏర్పడే నల్లటి పదార్థం?
1) CuCl2 2) CuO
3) CuBr2 4) CuI2
8. ఇనుప ముక్కను అయస్కాంతీకరణ చేయడం?
1) భౌతిక మార్పు 2) రసాయన మార్పు
3) పై రెండూ 4) ఏదీకాదు
9. కింది వాటిలో ఏది రసాయన చర్య కాదు?
1) C + O2 -> CO2
2) 2Mg + O2 -> 2MgO
3) S + O2 -> CO2
4) NH4Cl -> NH4Cl
10. కింది వాటిలో భౌతిక మార్పు?
1) ద్రావణం ఏర్పడటం
2) పదార్థం ఉత్పతనం చెందడం
3) ఇది తాత్కాలికం, ఫార్ములాలో మార్పు ఉండదు
4) పైవన్నీ సరైనవే
11. కింది వాటిలో రసాయన సంయోగ నియమం కానిది?
1) ద్రవ్య నిత్యత్వ నియమం
2) స్థిరానుపాత నియమం
3) బాహ్యానుపాత నియమం
4) వియోగ నియమం
12. ఒక చర్యలో క్రియాజనకాల భారం, క్రియాజన్యాల భారం రెండూ సమానం అయిన, ఆ నియమం?
1) ద్రవ్య నిత్యత్వ నియమం
2) స్థిరానుపాత నియమం
3) బాహ్యానుపాత నియమం
4) ఏదీకాదు
13. కింది వాటిలో వియోగ చర్య ఏది?
1) లెడ్ నైట్రేట్‌ను వేడి చేయడం
2) నీటిని విద్యుత్ విశ్లేషణం చెందించడం
3) సూర్యకాంతి సమక్షంలో సిల్వర్ బ్రోమైడ్ను చర్యనొందించడం
4) పైవన్నీ
14. కింది వాటిలో స్థానభ్రంశ చర్య ఏది?
1) Fe + CuSO4 -> FeSO4 + Cu
2) Zn + CuSO4 -> ZnSO4 + Zn
3) A + B + C -> A – C + B
4) పైవన్నీ
15. కింది వాటిలో రసాయన సంయోగ చర్య ఏది?
1) X + Y -> X – Y
2) Mg + Cl2 -> MgCl2
3) CaCO3 -> CaO + CO2
4) 1, 2
16. కింది వాటిలో ద్వంద్వ వియోగ చర్య?
1) X + YZ -> XY + Z
2) X + Y -> XY
3) XYZ -> YZX
4) XY + A – B -> XA + YB
17. CuO + H2 -> Cu + H2O రసాయన చర్యలో క్షయకారిణి ఏది?
1) CuO 2) H2 3) Cu 4) H2O
18. సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు జింక్‌ను స్థానభ్రంశం చెందించే వాయువు?
1) O2 2) CO2
3) NO2 4) H2
19. ఇనుము తుప్పు పట్టడం?
1) ఆక్సీకరణం, సంయోగ చర్య
2) ఆక్సీకరణం, స్థానభ్రంశ చర్య
3) క్షయకరణం, సంయోగ చర్య
4) క్షయకరణం, ద్వంద్వ వియోగం
20. H2S + Cl2 -> S + 2HCl సమీకరణంలో Cl2 అనేది?
1) ఆక్సీకరణి 2) క్షయకారిణి
3) పై రెండూ 4) చెప్పలేం
21. X ఆవేశం +3, అది ఒక ఫాస్ఫేట్ అయాన్‌తో చర్య జరిపితే దానికి సంబంధిత ఫార్ములా?
1) XPO4 2) XPO3
3) XPO2 4) XPO5
22. కింది వాటిలో వాయుస్థితిలో లేని మూలకం?
1) హైడ్రోజన్ 2) ఆమ్లజని
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) నత్రజని
23. కింది వాటిలో ఏ సంకేతం లాటిన్ నుంచి రాలేదు?
1) Fe 2) Hg 3) Sn 4) Ar
24. కింది వాటిలో ఏవి చతుర్, అష్ట పరమాణుకతను కలిగి ఉంటాయి?
1) P, S 2) S, P
3) P, Na 4) H, Na
25. కింది వాటిలో చతుర్సంయోజకత లేనిది?
1) లెడ్ 2) ప్లాటినం
3) టిన్ 4) ఐరన్
26. కింది వాటిలో అయాన్ కానిది ఏది?
1) ఆక్సైడ్ 2) నైట్రైడ్
3) నైట్రేట్ 4) ఆక్సిజన్
27. జింక్ పూత వేయడం ద్వారా ఇనుము తుప్పుపట్టకుండా నిరోధించే పద్ధతి?
1) గాల్వనైజేషన్ 2) తుప్పుపట్టడం
3) కార్బోనైజేషన్ 4) పల్వనైజేషన్
28. STP వద్ద 44 గ్రా. CO2 వాయువు ఆక్రమించునది, కలిగినది?
1) 22.4 లీ.
2) 6.023 X 1023 CO2 అణువులు
3) గ్రామ్ మోలార్ ఘ.ప.
4) పైవన్నీ
29. చలువరాతి ముక్కలను వేడిచేస్తే వచ్చేది?
1) Ca, CO2 2) CaC2, O2
3) CaO + CO2 4) ఏదీకాదు
30. లెడ్ నైట్రేట్‌ను విఘటం చెందించే వాయువులు?
1) H2 + N2 2) NO2 + O2
3) NO2 + N2 4) NO2
31. హైడ్రోజన్ అంటే లాటిన్ భాషలో?
1) నీటిని ఇచ్చేది 2) ఆమ్లాన్ని ఇచ్చేది
3) రెండూ ఇచ్చేది 4) లవణాన్ని ఇచ్చేది
32. ఆక్సీకరణం అంటే లాటిన్ భాషలో?
1) నీటిని ఇచ్చేది 2) ఆమ్లాన్ని ఇచ్చేది
3) పై రెండూ 4) లవణాన్ని ఇచ్చేది
33. H2 ను సేకరించే పద్ధతి?
1) అధో ముఖస్థాన చలనం
2) ఊర్ధ ముఖస్థాన చలనం
3) 1, 2 4) ఏదీకాదు
34. కింది వాటిలో H2 – వాయు ధర్మం కానిది ఏది?
1) అతి తేలికైన వాయువు
2) ఆక్సీ హైడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత – 24000 C
3) ఇది లిట్మస్కు పరీక్ష ఇస్తుంది
4) ఇది సల్ఫర్‌తో చర్యనొంది H2S వాయువును ఇస్తుంది
35. H2 వాయువు తయారీలో థిసిల్ గరాటు ఆమ్లంలో ఎందుకు మునిగి ఉండాలి?
1) మునిగి ఉండకపోతే H2 వాయువు దానిగుండా బయటికి పోయే అవకాశం ఉంది
2) ఇతర వాయువులు లోపలికి రాకుండా
3) ఏవిధంగా ఉన్నా పర్వాలేదు
4) ఏదీకాదు
36. కింది వాటిలో సరికానిది?
1) ఆక్సీజన్లను కలుపడం ఆక్సీకరణం
2) H2- లను తొలగించడం ఆక్సీకరణమే
3) ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల – క్షయకరణం
4) ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల క్షయకరణం
37. 2K + Cl2 -> 2KCl అనే చర్య ఆక్సీకరణి, క్షయకారిణిలు వరుసగా…
1) K, Cl2 2) Cl2-, K
3) K, K 4) K, KCl
38. నీటి విద్యుత్ వాహకతను పెంచడానికి ఏం కలుపుతారు?
1) NaCl 2) HCl
3) NH3 4) Cl2
39. నీటిని విద్యుత్ విశ్లేషణం చేస్తే వెలువడే ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘనపరిమాణాల నిష్పత్తి?
1) 1:2 2) 2:1 3) 1:1 4) 4:1
40. ప్రయోగశాలలో O2 ను సేకరించే పద్ధతి?
1) అధోముఖ 2) ఊర్ధముఖ
3) 1, 2 4) ఏదీకాదు
41. కింది వాటిలో సల్ఫర్ దాతువు కానిది ఏది?
1) గెలినా 2) సిన్నబార్
3) ఐరన్ పైరటిస్ 4) కార్నలైట్
42. కింది వాటిలో అధిక స్థిరత్వం కాలిగింది?
1) రాంబిక్ సల్ఫర్ 2) మోనోక్లినిక్ సల్ఫర్
3) ప్లాస్టిక్ సల్ఫర్ 4) ఏదీకాదు
43. కింది వాటిలో ఏది సల్ఫర్ గొలుసులుగా ఉంటుంది?
1) రాంబిక్ సల్ఫర్ 2) మోనిక్లినిక్ సల్ఫర్
3) ప్లాస్టిక్ సల్ఫర్ 4) పైవన్నీ
44. సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత?
1) 760C 2) 860C
3) 960C 4) 1060C
సమాధానాలు
1-4, 2-1, 3-4, 4-4, 5-1, 6-4, 7-2, 8-1, 9-4, 10-4, 11-4, 12-1, 13-4, 14-4, 15-4, 16-4, 17-2, 18-4, 19-1, 20-1, 21-1, 22-3, 23-4, 24-1, 25-4, 26-4, 27-1, 28-4, 29-3, 30-2, 31-1, 32-2, 33-1, 34-3, 35-1, 36-4, 37-2, 38-1, 39-1, 40-1, 41-4, 42-1, 43-3, 44-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు