రాజ్యాంగపర, చట్టపరమైన సంస్థలు
రాజ్యాంగంలో కొన్ని పదవులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. వీటి నిర్మాణం అధికార విధులకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం
- రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు దీని గురించి ప్రస్తావించారు.
ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. - వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మాదిరిగానే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తారు. ఇతర కమిషనర్లను మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.
- వీరి జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి.
- దేశంలో అన్ని ఎన్నికలను (స్థానిక సంస్థల ఎన్నికలు మినహా) కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.
- రాజకీయ పార్టీని గుర్తించి వాటికి ఎన్నికల చిహ్నాలు, పార్టీ చిహ్నాలను కేటాయిస్తుంది.
- ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను అలాగే పార్టీల మధ్య వచ్చే వివాదాలను కూడా ఎన్నికల సంఘమే పరిష్కరిస్తుంది. అందుకే దీనిని ‘క్వాసీ జ్యుడీషియల్ బాడీ’ (అర్ధ న్యాయ సంస్థ) అంటారు.
- ప్రకరణ 325 ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకొనే హక్కు ఉంటుంది.
- మొట్టమొదటి చీఫ్ ఎన్నికల కమిషనర్- సుకుమార్ సేన్
- ప్రస్తుత చీఫ్ ఎన్నికల కమిషనర్- సుశీల్ చంద్ర
రాష్ట్ర ఎన్నికల సంఘం
- ప్రకరణ 243కె ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం 5 సంవత్సరాలు.
- హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతి ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కూడా తొలగిస్తారు.
- ఎన్నికల కమిషనర్‌గా నియామకం కావాలంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసి ఉండాలి.
- రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
కేంద్ర ఆర్థిక సంఘం
- ప్రకరణ 280 ప్రకారం రాష్ట్రపతి ఐదేండ్లకోసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
- ఇందులో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు.
- కేంద్ర, రాష్ర్టాల మధ్య వనరుల విభజనపై ఆర్థిక సంఘం సలహాలు ఇస్తుంది. ఇది తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
- మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్- కేసీ నియోగి
- 15వ ఆర్థిక సంఘం చైర్మన్ – ఎన్కే సింగ్
రాష్ట్ర ఆర్థిక సంఘం
- 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 243ఐ కింద గవర్నర్ ప్రతి ఐదేండ్లకోసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
- ఇందులో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
- స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించాల్సిన వనరులపై సిఫారసులు చేస్తుంది.
- మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ (ఉమ్మడి రాష్ట్రం)- లక్ష్మణ స్వామి
- ప్రస్తుత తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్- జీ రాజేశం గౌడ్
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- ప్రకరణ 315 ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తారు.
- ఇందులో ఒక చైర్మన్, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు.
- వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. వీరిని కూడా రాష్ట్రపతి తొలగిస్తారు.
- ప్రస్తుతం జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ రాష్ర్టాలకు లేవు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
- ప్రకరణ 148 నుంచి 151 వరకు ఈ పదవి ప్రస్తావన ఉంది.
- కాగ్‌ను రాష్ట్రపతి తన అధికార ముద్ర ద్వారా 6 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
- పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఏది ముందైతే దానిని తీసుకుంటారు.
- కాగ్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం నెల వేతనం రూ.90 వేలు.
- పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులకు అర్హుడు కాదు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలను తనిఖీ చేసి నివేదికలను ప్రకరణ 151 ప్రకారం రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు సమర్పిస్తారు.
- కాగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే తొలగిస్తారు.
- కాగ్‌ను భారత ఖజానా సంరక్షకునిగా, పార్లమెంటుకు పొడిగించిన చేయిగా వర్ణిస్తారు.
- మొట్టమొదటి కాగ్- నరహరి రావు
- ప్రస్తుత కాగ్- గిరీష్ చంద్రముర్ము
అటార్నీ జనరల్
- ప్రకరణ 76 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో కొనసాగుతారు.
- కాబట్టి నిర్ణీత పదవీ కాలం ఉండదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండవలసిన అర్హతలు ఉండాలి.
- దేశంలో అత్యున్నతమైన ‘లీగల్ ఆఫీసర్’ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుడు.
- పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ ఓటు చేసే అధికారం ఉండదు.
- జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుతం నెలకు రూ.90,000
- మొట్టమొదటి అటార్నీ జనరల్- ఎంసీ సెతల్వాడ్
- ప్రస్తుత అటార్నీ జనరల్- కేకే వేణుగోపాల్
అడ్వకేట్ జనరల్
- ప్రకరణ 165 ప్రకారం గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటాడు.
- హైకోర్టు న్యాయమూర్తులకు ఉండవలసిన అర్హతలు ఉండాలి.
- జీతభత్యాలను గవర్నర్ నిర్ణయిస్తారు.
- ప్రస్తుత వేతనం రూ.80,000
- రాష్ట్రంలో అత్యున్నతమైన ‘లీగల్ ఆఫీసర్’
- రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు.
- రాష్ట్ర శాసనసభా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ ఓటు హక్కు ఉండదు.
- రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసులను వాదిస్తారు.
- మొట్టమొదటి రాష్ట్ర అడ్వకేట్ జనరల్- డీ నరసరాజు (ఉమ్మడి రాష్ట్రం)
- ప్రస్తుత అడ్వకేట్ జనరల్- సుబ్రమణ్యం శ్రీరామ్ (ఏపీ)
- తెలంగాణ అడ్వకేట్ జనరల్- బీఎస్ ప్రసాద్
సొలిసిటర్ జనరల్
- అటార్నీ జనరల్‌కు సహాయకారునిగా పనిచేస్తాడు. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు.
- కాబట్టి ఇతన్ని ఒక సాధారణ ‘లీగల్ ఆఫీసర్’గా పరిగణిస్తారు.
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
- 1978లో బోలా పాశ్వాన్ శాస్త్రి అధ్యక్షతన మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటయింది.
- 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు (ప్రకరణ 338).
షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని మొదటగా వాడింది సైమన్ కమిషన్. - 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్టీ కమిషన్‌ను వేరుచేశారు. దీని కోసం రాజ్యాంగంలోని ప్రకరణ 338ఎ ని చేర్చారు.
- వీటి నిర్మాణం, విధులు ఒకే విధంగా ఉంటాయి.
- ఈ కమిషన్లలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి 3 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పర్యాయాల కంటే ఎక్కువ కాలం పనిచేయడానికి అనర్హులు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించి రాష్ట్రపతి తొలగిస్తారు.
- ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి.
- మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్- రామ్ధన్
- ప్రస్తుత ఎస్సీ కమిషన్ చైర్మన్- విజయ్ సాంప్లా
- మొట్టమొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్ – కున్వర్సింగ్
- ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్- హర్ష చౌహాన్
జాతీయ మైనారిటీ కమిషన్
- 1978లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్, 5గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి 3 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
- మైనారిటీ స్థితిగతులపైన నివేదికలను ఇస్తుంది.
- ఇది 1993లో ఏర్పాటయింది.
- మొట్టమొదటి చైర్మన్- సర్దార్ అలీఖాన్
- ప్రస్తుత చైర్మన్- సయ్యద్ గయరుల్ హసన్ రిజ్వీ
జాతీయ మహిళా కమిషన్
- 1992లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది. ఇందులో ఒక చైర్పర్సన్, 5గురు సభ్యులు ఉంటారు.
- వీరిని కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాలానికి నియమిస్తుంది. రాష్ట్రపతి తొలగిస్తారు.
- మహిళా హక్కుల ఉల్లంఘన, రక్షణ, సంక్షేమంపై సిఫారసులు చేస్తుంది.
- మొట్టమొదటి అధ్యక్షురాలు- జయంతి పట్నాయక్
- ప్రస్తుతం అధ్యక్షురాలు- రేఖా శర్మ
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
- 1953లో కాకా కాలేకర్ అధ్యక్షతన మొట్టమొదటి కమిషన్ ఏర్పాటయింది. 1979లో బీపీ మండల్ అధ్యక్షతన రెండవ కమిషన్ ఏర్పాటయింది.
- 1992లో పార్లమెంట్ చట్టం ద్వారా దీనికి చట్ట ప్రతిపత్తి కల్పించారు. ఆ తర్వాత దీనికి రాజ్యాంగబద్ధతను ఈ మధ్యనే కల్పించారు.
- రాజ్యాంగంలోని 342 ఎ అధికరణ ప్రకారం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది.
- 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
- ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో అధికరణ 338 (బి) ని చేర్చారు. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు.
- ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్- భగవాన్ లాల్ సాహ్ని
కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
- భాగం 14, ప్రకరణ 315 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్మాణం, విధులకు సంబంధించిన వివరాలు పేర్కొన్నారు.
- యూపీఎస్సీలో ఒక చైర్మన్, ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. వీరిని రాష్ట్రపతి 6 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
- పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఏది ముందైతే అది వర్తిస్తుంది.
- సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ అనంతరం రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు.
- కేంద్ర సర్వీసులకు, అఖిల భారత సర్వీసులకు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- యూపీఎస్సీ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
- మొట్టమొదటి యూపీఎస్సీ చైర్మన్- హెచ్‌కే కృపలాని
- ప్రస్తుత చైర్మన్- ప్రదీప్ కుమార్ జోషి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
- ప్రకరణ 315 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది.
- ఇందులో ఒక చైర్మన్, గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు.
- ప్రకరణ 316 ప్రకారం గవర్నర్ వీరిని 6 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. పదవీ విరమణ వయస్సు 62 ఏండ్లు.
- రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు.
- రాష్ట్ర సర్వీసులకు సంబంధించి పోటీ పరీక్షల నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఏపీపీఎస్సీ మొట్టమొదటి చైర్మన్- వివేకానంద మూర్తి
- ఏపీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్- ఏవీ రమణా రెడ్డి (ఇన్చార్జి)
- టీఎస్పీఎస్సీ మొదటి చైర్మన్- ఘంటా చక్రపాణి
- ప్రస్తుత చైర్మన్- వీ జనార్దన్ రెడ్డి
Previous article
ప్రభుత్వ కొలువు.. ప్రణాళికతో చదువు
Next article
మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు