123 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్
# ఖరారు చేసిన జేఎన్టీయూ
# మరో ఏడు కాలేజీలకు ఒకటి రెండు రోజుల్లో అఫిలియేషన్లు
ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థుల సౌకర్యం కోసం ఇంజినీరింగ్ కాలేజీ అఫిలియేషన్లపై జేఎన్టీయూ కసరత్తు కొనసాగుతున్నది. అందులో భాగంగా గురువారం 123 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాలను ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్కు పంపినట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ సేన్ తెలిపారు. 123 కాలేజీలలో కలిపి దాదాపు 80 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయని, వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి వీలుంటుందని అన్నారు.
ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలోనే దాదాపు 40 శాతం వరకు అందుబాటులోకి వచ్చాయని, మార్కెట్ డిమాండ్, విద్యార్థుల ఆసక్తిని బట్టి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఈ కోర్సుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. అలాగే త్వరలో మరో ఏడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. అయితే కొన్ని కాలేజీల్లో నియామకాల ఖాళీల వల్ల వాటికి మరో అవకాశం ఇచ్చేందుకు ఒకటి రెండు రోజులు అఫిలియేషన్ పెండింగ్లో పెట్టినట్టు సేన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఆయా కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నదని అన్నారు. మరో నాలుగు వేల వరకు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు