సీఏ ర్యాంకర్స్ వాయిస్


మంచి వ్యాపారవేత్తగా రాణిస్తా
- సీఏ కోర్సు అత్యుత్తమైనదిగా భావించి ఈ కోర్సులో చేరాను. నన్ను నేను నిరూపించుకునేందుకు ఈ ప్ల్లాట్‌ఫాం సరైనదిగా భావించాను. సీఏ సాధించేందుకు ఇంటర్ ఎంఈసీ 973 మార్కులు, సీఏ-సీపీటీ 188, సీఏ-ఐపీసీసీ 472, సీఏ ఫైనల్ 45వ ర్యాంకు సాధించాను.
- పేరెంట్స్ ప్రోత్సాహం, మాస్టర్‌మైండ్స్ విద్యాప్రణాళిక నా ఈ సక్సెస్‌కు కారణం. నిర్దిష్ట ప్రణాళిక, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సులువుగా సీఏ పాస్ కావచ్చు.
- స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ తక్కువ సమయంలో సిలబస్ మొత్తం చదవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. సీఏ బహుళప్రయోజనాలు కలిగిన కోర్సు. ప్రస్తుతం సీఏ పూర్తిచేసినవాళ్లకు దేశ, విదేశాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యేకించి జీఎస్టీ రావడం వల్ల ఇన్‌కం ట్యాక్స్ పరంగా వస్తున్న మార్పులు సీఏలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి.
- ఎగ్జామ్స్ పూర్తయ్యాక రాసిన పరీక్ష గురించి ఆలోచించడం, ఎన్ని మార్కులు వస్తాయని ఆలోచనలు చేయకూడదు. తరువాత పరీక్ష మీద ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి రాసిన పరీక్ష గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు.
- ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఎంత కష్టమైనా ఆ లక్ష్యసాధనకు అలుపెరుగని పోరాటం చేయాలనేది నేను నేర్చుకున్న విజయసూత్రం. భవిష్యత్తులో వస్తు తయారీ సంస్థను స్థాపించి మంచి వ్యాపారవేత్తగా రాణించాలన్నదే నా ఆశయం.
పేరు: చిట్టిప్రోలు గంగాధర్
ఊరు: దాచేపల్లి, గుంటూరు జిల్లా
తండ్రి: రామారావు, బిజినెస్
తల్లి: కృష్ణకుమారి, గృహిణి
పదోతరగతి: 9.7 గ్రేడ్ పాయింట్లు
ఇంటర్ (ఎంఈసీ): 973 మార్కులు
సీఏసీపీటీ: 188 మార్కులు
సీఏఐపీసీసీ: 472 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 45వ ర్యాంకు
ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలి
- స్నేహితుల ప్రేరణతో సీఏ చేయాలని నిర్ణయించుకున్నాను. సీఏ ఇంటర్లో 639 మార్కులతో ఆలిండియా 31వ ర్యాంకు సాధించాను. సీఏలో చేరిన మొదటి రోజు నుంచే కోర్సును చాలా సీరియస్‌గా తీసుకుని పరీక్షలకు సన్నద్ధమయ్యాను. సీఏ లక్ష్యంగా కష్టపడి చదివాను.
- క్లాసులు జాగ్రత్తగా విని ఏ రోజు చెప్పిన అంశం అదేరోజు చదివాను. అన్ని అంశాలు చదువుతూ.. వీకెండ్ పరీక్షలు రాశాను. ఏదైనా సందేహం ఉంటే ఫ్యాకల్టీని అడిగి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునేదాన్ని. సీఏ చదవాలనుకునే వారు ముందుగా కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉండాలి. తుది పరీక్ష వరకు సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.
- సమయస్ఫూర్తి, లాజికల్ ఆలోచనా విధానంతో పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నకైనా సరైన సమాధానం రాసే వీలుంటుంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో చదవాలి.
- బట్టీ చదువులకు గుడ్‌బై చెప్పాలి. ఒక డౌట్స్బుక్ పెట్టుకుని వచ్చిన డౌట్స్‌ని అందులో రాసుకోవాలి. ఆ డౌట్స్‌ని ఫ్యాకల్టీ ద్వారా క్లారిఫై చేసుకోవాలి.
- అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్‌లో పట్టుసాధించాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి.
- మొదటగా ఇష్టమైన సబ్జెక్టులను చదివితే తరువాత కష్టమైన సబ్జెక్టులు చదవడం కష్టమనిపించదు. సులువుగా అనిపించిన సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాలి. అప్పుడు కష్టంగా ఉన్న సబ్జెక్టుల్లో కనీస మార్కులు తెచ్చుకున్నా అగ్రిగేట్ దెబ్బతినదు.
- కష్టపడేతత్వం, నిబద్ధత, సహనం ఉంటే ఒక సాధారణ విద్యార్థి కూడా సీఏ ఇంటర్ పూర్తిచేయవచ్చు.
- గత ఎంటీపీ, ఆర్టీపీలు సాధన చేయాలి.
- థియరీ పేపర్లలో కీలకమైన ఐసీఏఐ స్టడీ మెటీరియల్ బాగా సహాయపడుతుంది.
- తెల్లవారుజామున చదవడం బాగా ఉపయోగపడుతుంది.
- రోజుకు 12 గంటలు ప్రణాళికాబద్ధంగా చదివాను.
- రివిజన్ పరీక్షల తర్వాత మాస్టర్‌మైండ్స్ నిర్వహించే కౌన్సెలింగ్ సెషన్స్ పరీక్షలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఎంత సహాయపదింది.
- తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి కారణం. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనేది నా లక్ష్యం.
పేరు: రచన క్రతం
ఊరు: క్రోసూరు, గుంటూరు జిల్లా
తండ్రి: సాయిబాబారెడ్డి, రైతు
తల్లి: లక్ష్మి, గృహిణి
పదోతరగతి: 10 గ్రేడ్ పాయింట్లు
సీఏసీపీటీ: 179 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 31వ ర్యాంకు
కంపెనీకి సీఈవో కావలన్నదే ఆశయం
- చిన్నప్పటి నుంచి విలక్షణతను ఇష్టపడే నేను సీఏ చదవాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఇంటర్లో ఎంఈసీ చదివి 979 మార్కులు, సీఏ-సీపీటీ 187, సీఏ-ఐపీసీసీలో 435 మార్కులు సాధించాను. సీఏ ఫైనల్లో 46వ ర్యాంకు సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్లాన్ నా విజయానికి కారణం. సీఏ అందరూ భావించే విధంగా అంత కష్టం కాదని చదివేటప్పుడు నాకు అర్థమైంది. సీఏ ఫైనల్లో రోజుకు 14 గంటలు చదివాను. స్టడీ అవర్స్‌కు హాజరవడంతో ఎక్కువ గంటలు చదివే అలవాటు, ఓపిక ఏర్పడ్డాయి. రివిజన్ ఎగ్జామ్ రాయడం వల్ల సీఏ ఫైనల్ సక్సెస్‌కు ఉపయోగపడింది.
- చదివే సమయంలో మోటివేషనల్ వీడియోస్, సానుకూల దృక్పథం కలిగినవారితో చర్చించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఓర్పు, ఏకాగ్రత, అంకితభావం నా విజయసూత్రాలు. ఒక బహుళజాతి సంస్థకు సీఈవో అవాలన్నదే నా ఆశయం.
పేరు: పసుల సాయిప్రియ
ఊరు: మిర్యాలగూడ,నల్లగొండ జిల్లా
తండ్రి: కాశీయాదవ్, టీచర్
తల్లి: ప్రవీణ, టీచర్
పదో తరగతి: 9.7 గ్రేడ్ పాయింట్లు
ఇంటర్ (ఎంఈసీ): 979 మార్కులు (స్టేట్ 3వ ర్యాంక్)
సీఏ-సీపీటీ: 187 మార్కులు
సీఏ-ఐపీసీసీ: 435 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 46వ ర్యాంకు
సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడమే లక్ష్యం
- ఆర్థిక రంగంపై ఉన్న ఆసక్తితో సీఏ వైపు అడుగులు వేశాను. ఇందుకు అమ్మానాన్నలు కూడా ప్రోత్సహించారు. టెన్త్ చదువుతున్నప్పుడే సీఏ చేయాలని నిర్ణయించుకున్నాను.
- ఇంటర్ చదువుతున్నప్పుడు మాస్టర్‌మైండ్స్ అకడమిక్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను. స్టడీఅవర్స్, రివిజన్ ఎగ్జామ్స్‌కు హాజరవడం వల్ల ఫైనల్ పరీక్షలు చాలా సులభంగా రాశాను.
- ప్రిపేర్ సమయంలో చాయిస్ తీసుకోకుండా అన్ని చాప్టర్స్ చదివాను. కాలేజీ నిర్వహించిన కౌన్సెలింగ్ సెషన్స్‌లో ఫ్యాకల్టీ ఇచ్చే గైడెన్స్ పరీక్షలకు ఎంతో ఉపయోగపడింది.
- సరైన ప్రణాళికతో ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు చదివాను. ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏయే టాపిక్స్ ఎక్కువగా వస్తున్నాయనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
- సిలబస్ పూర్తి అంశాల గురించి అవగాహన కల్పించుకుని ప్రతి చాప్టర్ వెయిటేజీ చూసుకోవాలి. సీఏలో ఏ దశలోనైనా రాణించాలంటే.. ముందుగా ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన ఉండాలి.
- పరీక్ష రాసే సమయంలో ఆందోళనకు గురికావద్దు. ఆందోళన వల్ల బాగా తెలిసిన సమాధానాలు తప్పుగా రాసే అవకాశం ఉంటుంది.
- పరీక్షలప్పుడు వేర్వేరు పుస్తకాలు, మెటీరియల్స్ చదవడం వల్ల అనవసర ఆందోళన, అయోమయానికి గురవుతారు. సన్నద్ధ సమయంలో ఎలాంటి పుస్తకం/మెటీరియల్ చదువుతున్నాం అనేది ముఖ్యం. జవాబు ఎంత రాశామనేది కాకుండా ఎంత సూటిగా రాశామన్నదే ముఖ్యం.
- అకౌంట్స్ సబ్జెక్టుల్లో లెక్కకి ఇచ్చిన ప్రాధాన్యం ఫార్మాట్లకు ఇవ్వరు. అలా చేయడం వల్ల కూడా కొన్ని మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.
- తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ అకడమిక్ ప్రోగ్రామ్ నా సక్సెస్‌కు కారణం. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడమే నా లక్ష్యం.
పేరు: భాను ప్రవీణ్ తేజ్ కొల్లి
ఊరు: గుండాలపాడు, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా
తండ్రి: వీరవసంతరావు, బిజినెస్
తల్లి: గీతాంజలి, గృహిణి
పదోతరగతి: 10 గ్రేడ్ పాయింట్లు
సీఏసీపీటీ: 174 మార్కులు
సీఏ ఫైనల్: ఆలిండియా 33వ ర్యాంకు
- Tags
RELATED ARTICLES
-
Scholarships | Scholarships for 2023
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !