భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకు పునాదివేసిన యుద్ధం ఏది?
క్రీ.శ. 1600 డిసెంబర్ 31న రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది. అప్పటి ఇంగ్లండ్ చక్రవర్తి – ఎలిజబెత్
రాయల్ చార్టర్ ప్రకారం ఇంగ్లండ్‌లో ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు.
మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత వరకు యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారత్‌లో స్థాపించడం సాధ్యం కాలేదు. షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో యూరప్ కంపెనీలు పోరాడి ఓడినాయి.
కాన్స్టాంటినోపుల్ భూమార్గం
- క్రీ.శ. 330లో మొదటి కాన్స్టాంటైన్.. కాన్‌స్టాంట్‌నోపుల్ -ఇస్తాంబుల్(టర్కీ) అనే నగరాన్ని నిర్మించాడు.
- ఈ నగరం ద్వారానే యూరేపియన్లు భూమార్గం గుండా వర్తకం చేసేవారు.
- సుగంధ ద్రవ్యాలు, సురేకారం, నల్లమందు, నీలిమందు, పత్తి, పట్టు మొదలైన వస్తువులతో వ్యాపారం చేసేవారు
- క్రీ.శ. 1453లో 2వ మహమ్మద్, కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి 11వ కాన్‌స్టాంట్‌నోపుల్‌ను వధించి భూమార్గం అయిన కాన్స్టాంట్నోపుల్ని ఆక్రమించాడు.
సముద్ర మార్గం భౌగోళిక పరిశోధనలు
- క్రీ.శ. 1453లో కాన్‌స్టాంట్‌నోపుల్‌ను ఆక్రమించటంతో సముద్ర మార్గాన్ని కనుక్కోవలసి వచ్చింది.
- హెన్రీ ది గ్రేట్ (పోర్చుగల్): సముద్రాలపై ప్రయాణించిన మొదటి చక్రవర్తి
- సముద్ర పటాలను గీయించాడు, నావికులకు శిక్షణా కళాశాలలను స్థాపించాడు.
భార్తవోమ్యాడయాజ్ (పోర్చుగల్)
- 1486లో పోర్చుగల్ నుంచి బయలుదేరి, ఆఫ్రికా దక్షిణభాగానికి చేరుకొన్నాడు (1488)
- ఆ ప్రాంతానికి తుఫానుల అగాథం అని పేరు పెట్టారు.
- నోట్: తుఫానుల అగాథానికి ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’గా పేరు మార్చినది 2వజాన్ (పోర్చుగల్)
క్రిస్టఫర్ కొలంబస్ (ఇటలీ-స్పెయిన్)
- 1492 అక్టోబర్ నాటికి అమెరికా క్యూబా పశ్చిమ ఇండీస్‌లను కనుగొన్నాడు.
- అమెరికాకు ఆపేరు రావడానికి కారణం – అమెరిగో వెస్పూక్కీ (ఇటలీ)
- అమెరికాకు ఆ పేరు పెట్టమని సలహా ఇచ్చింది మార్టిమర్ సి.ముల్లర్
- వాస్కో డ గామా (పోర్చుగల్) భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
- 1495లో సౌదీ గాబ్రియల్ అనే నౌక ద్వారా 1498 మే 17 నాటికి కళ్ళికోట/ కాలికట్ ప్రాంతానికి చేరుకొన్నాడు.
- భారత్‌కు వచ్చిన యూరోపియన్లు వరుసగా పోర్చుగల్-డచ్-డేనిస్- ఇంగ్లండ్-ఫ్రెంచ్
యూరోపియన్ల కంపెనీలు -వలస స్థావరాలు
- పోర్చుగల్ (15వ శతాబ్దం) – 1498-గోవా, డయ్యు, డామన్, సాల్సెట్టి, బెస్సిన్, సెయింట్ డేవిడ్ (బొంబాయి)
- ఇంగ్లండ్ (17వ శతాబ్దం) -1600- సూరత్, మద్రాస్, కలకత్తా, ఢిల్లీ.
- డచ్ (నెదర్లాండ్స్/ హాలెండ్) -1602 మచిలీపట్నం, పులికాట్, నాగపట్టణం, భీమిలి, చిన్సురా
డేవిస్ (డెన్మార్క్)-1616- సేరాంపూర్, ట్రాంకీబార్ - ఫ్రెంచ్ (ఫ్రాన్స్) -1664- సూరత్, మహి, కరైకల్, పాండిచ్చేరి, మచిలీపట్నం
- 1707లో మొఘలులు పతనమైన తర్వాత అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి.
- ఉదా: బెంగాల్, అవధ్, లక్నో-హైదరాబాద్
- భారతదేశంలో ఉన్న యూరోపియన్లు తమలో తాము యుద్ధాలు చేసుకునేవారు. చివరకు ‘ఇంగ్లండ్’ విజయం సాధించింది.
- బెంగాల్, బీహార్, ఒడిస్సా, కర్ణాటక, మైసూర్, మహారాష్ట్రలను ఆక్రమించడానికి ఇంగ్లండ్ కింది యుద్ధాలు చేసింది.
ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు (1746-1763)
- ఇవి ఫ్రెంచి, ఇంగ్లండ్ వారి మధ్య జరిగాయి.
- కర్ణాటక రాజధాని ‘ఆర్కాటు’ నగరం కోసం ఈ యుద్ధాలు జరిగాయి.
- మొత్తం మూడు యుద్ధాలు: 1746-48, 1749-56, 1756-63, ఈ యుద్ధాల్లో భాగంగానే ఆర్కాట్ నవాబు అయిన అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ వారి సైన్యంతో ఓడిపోయాడు.
- హైదరాబాద్ సుల్తాన్‌గా- ముజఫర్‌జంగ్‌ను ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన డూప్లే అనే అధికారి ప్రకటించాడు.
- దీంతో ముజఫర్ జంగ్ డూప్లేకు ఇచ్చింది
- ఎ) యానాం, మచిలీపట్నం, దివిసీమ
- బి) ఫ్రెంచ్ కంపెనీలకు రూ.50 వేలు+ ఫ్రెంచ్ సైన్యానికి రూ.50 వేలు
- డూప్లేకు సంవత్సరానికి లక్ష రూపాయలు+ 20 లక్షల విలువచేసే జాగీరులు
- క్రీ.శ. 1700 సంవత్సరంలో భారత పాలకుల సైన్యం కంటే యూరప్ సైన్యాలు భిన్నమైనవి. దీనికి కారణం.. మంచి శిక్షణ+ ఎక్కువ జీతభత్యాలు, మంచి ఫిరంగులు, తుపాకులు, డ్రిల్, పరేడ్ లాంటి నిరంతర శిక్షణ
ఆంగ్లో మరాఠా యుద్ధాలు (1775-1818)
- మరాఠా రాజ్య స్థాపకులు శివాజీ. ఇతడు 1674లో రాయగఢ్ అనే ప్రాంతంలో ఛత్రపతిగా ఎన్నికయ్యాడు.
- శివాజీ గురువు సమర్థరామదాసు. శివాజీ అష్ట ప్రధానుల సహకారంతో పాలించాడు. ఇతని కాలంలో 3 యుద్ధాలు జరిగాయి.
- 1) 1775-1782
- 2) 1802 -1804
- 3) 1818
- మరాఠా తరపున పాల్గొన్నది మహాదాజీ సింథియా, నానా ఫఢ్నవీస్
- ఆంగ్లో మైసూర్ యుద్ధాలు (1767-1799):
- మైసూర్ రాజ్య స్థాపకులు చిలక కృష్ణరాజు వడయార్.
- ఇతడిని ఓడించి హైదరాలీ’ మైసూరును ఆక్రమించాడు. హైదరాలీ హయాంలోనే నాలుగు ఆంగ్లో- మైసూర్ యుద్ధాలు జరిగాయి.
- 1) 1767-69, 2) 1780-82,
- 3) 1790-92, 4) 1799
- మైసూర్ తరపున హైదరాలీ, టిప్పు సుల్తాన్లు యుద్ధంలో పాల్గొన్నారు.
ప్లాసీ యుద్ధం (1757 జూన్-23)
- భారతదేశంలో బ్రిటిష్ రాజ్యస్థాపనకు పునాది వేసిన యుద్ధం ఇదే. దీనికి కారణం కలకత్తా చీకటి గది ఉదంతం
- ఈ యుద్ధ కాలంలో బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా ఉన్నాడు.
- ప్లాసీ గ్రామం బెంగాల్‌లోని నాడియా జిల్లాలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది.
- ఇంగ్లండ్ వైపు నుంచి రాబర్ట్ క్లైవ్ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు.
- ఈ యుద్ధం వల్ల బెంగాల్ బ్రిటిష్ వశమైంది.
భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం స్థిరపడటానికి కారణమైన యుద్ధం
- యుద్ధంలో పాల్గొన్న భారతీయ పాలకులు
- 1) 2వ షా ఆలం – మొఘల్ చక్రవర్తి
- 2) ఘాజీ ఉద్దౌల – అవధ్ నవాబు
- 3) మీర్ ఖాసిం- బెంగాల్ నవాబు
- ఇంగ్లండ్ తరఫున పాల్గొన్నది – కెప్టెన్ మన్రో
- మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ పాలకునిగా రాబర్ట్ ైక్లెవ్కు హక్కు కల్పించాడు.
- క్రీ.శ. 1765-68 మధ్య కాలంలో హైదరాబాద్ నిజాం నుంచి బ్రిటిష్ వారు పొందినవి – ఉత్తర సర్కారులు
ఉత్తర సర్కారులంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం. - 1765లో అలహాబాద్ సంధి ప్రకారం ఈ యుద్ధం అంతమయ్యింది. 1765లోనే రాబర్ట్‌క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.
- భారతదేశ రాజులు నవాబు రాజ్యాల్లో వారిని గమనించేందుకు బ్రిటిష్ ప్రభు త్వం నియమించిన అధికారి ‘రెసిడెంట్’
- భారతదేశంలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్‌లు
- 1. వారెన్ హేస్టింగ్స్
- 2. కారన్ వాలీస్
- 3. రాబర్ట్ క్లైవ్ 4. వెల్లస్లీ
- క్రీ.శ. 1770 నాటికి బెనారస్, కలకత్తా, ఆంధ్రా (హైదరాబాద్)లో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు.
1857 నాటికి గుజరాత్, రాజస్థాన్, నేపాల్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాలు ఆంగ్లేయుల వశమయ్యాయి.
1857 సిపాయిల తిరుగుబాటు
- ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మొదటిసారి తిరుగుబాటు చేసినది సన్యాసులు, ఫకీర్లు.
- ఇతర పేర్లు: సిపాయిల తిరుగుబాటు-సయ్యద్ అహ్మద్ ఖాన్
- ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం – వీడీ సావర్కర్.
- హిందువులు, ముస్లింలు, క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు- 1806లో వెల్లూరు (తమిళనాడు)లో జరిగింది.
- వెల్లస్లీ సైన్యసహకార పద్ధతి/ సబ్సిడరీ అలయన్స్‌ను ప్రవేశ పెట్టాడు.
- డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం/ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్‌ను ప్రవేశపెట్టాడు.
- ఈ తిరుగుబాటులో సిపాయిలు+ రైతులు+ గిరిజనులు+ భూయజమానులు+ చేతి వృత్తులవారు+ స్వదేశీ రాజులు కూడా పాల్గొన్నారు.
- తిరుగుబాటు సమయంలో సిపాయిల సంఖ్య 2,32,000
- సైనికుల సంఖ్య 45,000
- తిరుగుబాటుకు తక్షణ కారణం ఎన్ఫీల్డ్ తుపాకులు/ ఆవుకొవ్వు. పందికొవ్వు తూటాలు.
- 1857 మార్చిలో బారక్పూర్లో మంగల్‌పాండే అనే సిపాయి ఈ తుపాకీ ద్వారా ‘బాగ్’ అనే ఆంగ్ల అధికారిని చంపాడు.
- మీరట్ 1857 మే 10 (ఆదివారం)
- 1857 మే 10న మీరట్ అనే ప్రాంతంలో తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది.
- మీరట్ పట్టణమంతా సిపాయిల తిరుగుబాటు వ్యాపించి ఆంగ్లేయుల బంగ్లాలకు నిప్పంటించారు.
- ఢిల్లీ ఎర్రకోట -1857 మే 11 (సోమవారం)
- మీరట్ సిపాయిలు ఒక రోజులోనే యమునా నది బల్లకట్టుతో ఢిల్లీకి చేరారు.
- మొఘల్ చక్రవర్తిని, బహదూర్షా జాఫర్‌ను నిర్బంధించి ఎర్రకోటలోకి సైన్యం ప్రవేశించింది.
- ‘ఆంగ్లేయులను పారద్రోలండి, మొఘలుల పాలనను తిరిగి తెండి’ అని తిరుగుబాటు దారులు పిలుపునిచ్చారు.
- తిరుగుబాటు వ్యాప్తి : ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అలీఘర్, మొయిన్‌పురి, బులంద్‌షహర్, అట్టక్, మధుర, కంటోన్మెంట్లలో సిపాయిలు తిరగబడ్డారు.
- ఉత్తర ప్రదేశ్, బీహార్లలో గ్రామ గ్రామానికి వీధి వీధికి తిరుగుబాటు జ్వాలలు వ్యాపించాయి.
- రైతులు, జమీందారులు ఆయుధాలు తీసుకొని ఆంగ్ల అధికారులను తరిమికొట్టారు.
- పన్నులు కట్టకుండా, రైలు మార్గాలను ధ్వంసం చేసి, పోలీస్ స్టేషన్లు తగులబెట్టి, టెలిగ్రాఫ్ వైర్లను తెంచివేసి, తంతితపాలా కార్యాలయాలను నేలమట్టం చేశారు.
తిరుగుబాటులో భారత్ తరఫున పాల్గొన్నది
బహదూర్షా, మొఘల్ చక్రవర్తి తిరుగుబాటు నాయకులు.
లక్ష్మీబాయి ఝూన్సీ రాజ్యానికి చెందినది. అసలు పేరు మణికర్ణిక గ్వాలియర్‌లో మరణించింది.
నానాసాహెబ్- పీష్వా/ ప్రధాని (మహారాష్ట్ర) కాన్పూర్‌లో నాయకులు
తాంతియాతోపే పీష్వా సైన్యానికి నాయకుడు
బేగం హజరత్ మహల్-ఆవధ్ నవాబు
ఊట్రాట్ సింగ్ -ఈశాన్య భారతం
నోట్ : నానాసాహెబ్ అసలు పేరు ధోండూనాథ్ పాండే
తాంతియాతోపే అసలు పేరు రామచంద్ర పాండే
తిరుగుబాటులో ఇంగ్లండ్ తరపున పాల్గొన్నది:
విక్టోరియా మహారాణి అప్పటి ఇంగ్లండ్ చక్రవర్తి
లార్డ్ కానింగ్ – గవర్నర్ జనరల్
అఫ్జల్ ఉద్దౌలా – హైదరాబాద్ సుల్తాన్
మీర్ తురబ్ అలీఖాన్ – హైదరాబాద్ ప్రధానమంత్రి
తిరుగుబాటు అణచివేత
- తిరుగుబాటు దారుల్లో రెండు బలహీనతలు ఉన్నాయి.
- ఐకమత్యంగా పోరాడలేకపోవడం, తగినంత ప్రణాళిక లేకపోవడం, ఆధునిక ఆయుధాలు లేకపోవడం
తిరుగుబాటు దారులను చంపి గ్రామాల్లో చెట్లకు ఉరితీశారు. మర ఫిరంగులముందు వీరిని కట్టి ఫిరంగులను పేల్చేవారు. - దీంతో కొంతమంది నేపాల్‌కు పారిపోయారు. ఉదా: నానాసాహెబ్
- 1858, నవంబర్ 1న కానింగ్.. విక్టోరియా మహారాణి ప్రకటనను అలహాబాద్ దర్బార్‌లో చదివి వినిపించాడు.
- 1858 సెప్టెంబర్‌లో బహదూర్షా జాఫర్‌ను, అతని కుమారులను కెప్టెన్ హడ్సన్ అరెస్ట్ట్ చేశాడు.
బహదూర్‌షాను ‘రంగూన్’ తీసుకెళ్ళి‘మాండల్ జైలు’లో బంధించారు.
1858 చట్టం ముఖ్యాంశాలు
- భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారు.
- జమీందారులకు తమ ఆస్తులను కాపాడతామని చెప్పి వారికి రాయితీలు ఇచ్చారు.
- పాత సంప్రదాయాలను కొనసాగిస్తామని పండిట్లు, మౌళ్వీలకు హామీ ఇచ్చారు.
- గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి ‘వైశ్రాయ్’ అనే పదవిని సృష్టించారు.
- ఈస్టిండియా కంపెనీని రుద్దచేసి బ్రిటన్ ప్రత్యక్షంగా భారత్‌ను పాలిస్తానని తెలియజేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు