తెలుగులో ద్విపద పద్యాలకు ఆద్యుడు ఎవరు?
పద్య లక్షణాలు తెలిపే శాస్త్రం.
(గేయ లక్షణాలు కూడా)
- ఛందస్సు ఛద్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది.
- ఛద్ అంటే చదీ ఆహ్లాదనే, చదీ సంవరణేః
- ఛందస్సు = జ్ఞానం + వేదం
- ఛందస్సు రుషులకు పాదం వంటిది.
- ఛందస్సు అనే పదం మొదట వాల్మీకి నోటివెంట వచ్చింది.
- ఛందస్సు అంటే గాయత్రిమాత అని అర్థం.
- చదీ ఆహ్లాదనే : ఒక విధమైన లయ కలిగి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
- చదీ సంవరణే : మనస్సులోని భావాలకు ఒక విలక్షణమైన ఆకృతి కలిగిస్తుంది.
- ఛందస్సు శాస్త్ర పితామహుడు, మూల పురుషుడు పింగళుడు. (పింగళ ఛందము – రచన).
- పింగళ ఛందము సంస్కృతంలో ప్రామాణిక గ్రంథం.
- తెలుగులో ప్రామాణికమైన గ్రంథం (ఛందోగ్రంథం)- కవిజనాశ్రయ
- అనంతామాత్యుడు రాసిన ఛందోగ్రంథం – ఛందోదర్పణం
- కవిజనాశ్రయ గ్రంథం రచించింది – మల్లియ రేచన .
- ఏకాక్షర గణాలతో గణ విభజన చేసే పద్యం ఏది ?
- ఇంద్రగణాల సంఖ్య మాత్రలన్నింటిని అనురాధ అనే పద్యంలోని వర్ణాల సంఖ్యలో సగం సంఖ్యను
- తీసివేసి మత్తకోకిల పద్యంలో మూడవ గణం మాత్రలను తీస్తే వచ్చే సంఖ్య ఎంత ? – 6/2
ఛందస్సు రెండు రకాలు
1. మార్గ ఛందస్సు 2. దేశీ ఛందస్సు
1) మార్గ ఛందస్సు – సంస్కృతం నుంచి తెలుగులోకి చేరిన పదాలు (ఉత్పలమాల+ చంపకమాల+మత్తేభం+శార్దూలం+మత్తకోకిల)
2) దేశీ ఛందస్సు – అచ్చమైన తెలుగు పద్యాలతో ఏర్పడిన పద్యాలు (జాతి, ఉపజాతి పద్యాలు)
పద్యాలు – రకాలు
పద్యాలు మూడు రకాలు.
1. వృత్త 2. జాతి 3. ఉపజాతి
1) వృత్త పద్యాలు – ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్తకోకిల
2) జాతి పద్యాలు – కందం, ద్విపద
3) ఉపజాతి పద్యాలు – తేటగీతి, ఆటవెలది, సీసం
[అరే మామ తే ఆ సీస – CODE]
అక్షరాల సంఖ్యను అనుసరించి పద్యాల పేర్లు
10 అక్షరాలు – పంక్తి
15 అక్షరాలు – అతిశక్వరి
18 అక్షరాలు – ధృతి
19 అక్షరాలు – అతిధృతి
20 అక్షరాలు – కృతి
21 అక్షరాలు – ప్రకృతి
22 అక్షరాలు – ఆకృతి
మాత్రల ఆధారంగా గతులు
3 మాత్రలు – త్రిసగతి
4 మాత్రలు – చతురస్రగతి
5 మాత్రలు – ఖండగతి
7 మాత్రలు – మిశ్రగతి
9 మాత్రలు – సంకీర్ణగతి
1. వృత్త పద్యాలు – ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు ఇవి : ఇది వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి ఉంటాయి, నాలుగు పాదాలు ఉంటాయి.
ఉత్పలమాల
ఉత్పలమాలలోని గణాలు
భ, ర, న, భ, భ, ర, వ
యతి స్థానం 10వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి
చంపకమాల
చంపకమాలలోని గణాలు న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానం 11వ అక్షరం
21 అక్షరాలు ఉంటాయి.
శార్దూలం
శార్దూలంలోని గణాలు మ, స, జ, స, త, త, గ
యతిస్థానం 13వ అక్షరం
19 అక్షరాలు ఉంటాయి.
మత్తేభం
మత్తేభంలోని గణాలు స, భ, ర, న, మ, య, వ
యతిస్థానం 14వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి
1. ఉత్పలమాల పద్యంలో మొత్తం ఎన్ని లఘువులు ఉంటాయి ?
ఎ) 20 బి) 24
సి) 48 డి) 54
వివరణ- భ, ర, న, భ, భ, ర, వ = 12 x 4 = 48
2. శార్దూల విక్రీడిత పద్యంలో గురువుల సంఖ్య ఎంత ?
ఎ) 44 బి) 48 సి) 54 డి) 38
వివరణ – మ, స, జ, స, త, త, గ x 4 = 11 x 4 = 44
3. ధృత్యుండాతడు మూడులోకములలో బెంపొం దు సర్వేశ్వరా ! యతి అక్షరం ఏంటి?
ఎ) ము బి) పొ సి) బెం డి) లో
వివరణ – శార్దూలం – 13వ అక్షరం
మత్తేభ పద్యంలో లఘువు, గురువుల సంఖ్య- 80
వివరణ – స, భ, ర, న, మ, య, వ x 4 = 20 x 4= 80
జాతి పద్యం :-
ద్విపద, కంద పద్యాలు (దేశీ ఛందస్సు)
ద్విపద – ద్వి + పద = ద్విపద
జాతి పద్యాలకు తల్లి వంటిది ఈ పద్యం.
కన్నడ భాషలో రగడ అనే పద్యానికి సమాన పద్యం
తెలుగులో ద్విపద పద్యాలకు ఆద్యులు పాల్కురికి సోమనాథుడు.
బిరుదులు – కవితాచార్య, తత్వ విద్యా కలాపి, ప్రత్యక్షవృంగీశావధాన,
ద్విపద అనే ప్రక్రియ కనుమరుగవుతున్న సందర్భంలో పునఃజీవం పోసింది గోరన. అంతేకాకుండా తన రచనలు ఎక్కువ ద్విపదలోనే ఉంటాయి.
ద్విపదకి ఆధునిక కాలంలో మిక్కిలి
ప్రజా దరణ కల్పించింది తాళ్లపాక కవులు.
జవాబులు
1-సీ, 2-ఏ, 3-సీ
లఘువు-గురువు లక్షణాలు
పద్య పాదంలో దీర్ఘం లేని అక్షరాలు లఘువులు.
ఉదాహరణకు- I I I
అ, ఇ, ఎ
పద్యపాదంలో దీర్ఘం ఉన్న అక్షరాలు గురువులు
ఉదాహరణకు- U U U
ఆ, ఈ, ఏ
అరసున్నాతో కూడుకొని ఉన్నది లఘువు.
I I I I
ఉదా. – అ | టc | జ | ని
O నిండు సున్నాతో కూడి ఉన్నది గురువు
U U
ఉదా. – అం | దం
పొల్లు అక్షరంతో కూడుకున్నది గురువు
U U
ఉదా. – శం | కర్
విసర్గతో కూడుకున్నది గురువు
U U I U
ఉదా. – అంతః | పురం
ఐ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U U I U
ఉదా. – ఐరావతం
ఔ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U I U
ఉదా. – ఔషధం
ద్విత్వాక్షరానికి ముందు ఉన్నది గురువు
U I
ఉదా.- అమ్మ
సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు
I U I
ఉదా. – అపర్ణ
గణాల వర్గీకరణ
గణాల వర్గీకరణ నాలుగు రకాలు
1. ఏకాక్షర గణాలు : ఇవి రెండు ల – I , గ – U
2. ద్వయాక్షర గణాలు : ఇవి నాలుగు లల- II, లగ -IU , గగ – UU, గల – UI
3. త్రయాక్షర గణాలు : ఇవి ఎనిమిది భ- UII, జ- IUI, స- IIU, య- IUU, ర- UIU, త- UUI, మ- UUU, న- III
4. చతురాక్షర గణాలు :
ఇవి మూడు నల-IIII, నగ-IIIU, సల- IIUI
లగ – IUకు మరో పేరు వగణం
గల – UIకు మరో పేరు హగణం
త్రయాక్షర గణాలను విసర్గ గణాలు అంటారు.
ఇంద్రగణాలు (6)-
నల-IIII, నగ-IIIU, సల-IIUI, భ-UII, ర-UIU, త-UUI
[చతురాక్షరాల భరతం పడుతా – CODE]
సూర్యగణాలు
(2) :- నగణం-III, హగణం-UI
code
ఉ – భ – UUI – 20
చ – న – III – 21
శా – మ – UUU – 19
మ – స – IIU – 20
పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) నల్గడం బెదరగా బి) ప్రతతుల్
సి) బాఱెన్ మనోవేగుడై డి) సాల్పడి
నల్గడం బెదరగా | ప్రతతుల్ | బాఱెన్ మనోవేగుడై | సాల్పడి
U I U I I I I U I I U U U I U U I U U I I
అక్షరం – 20
స, భ, ర, న, మ, ర, వ – IIU
భ, ర, న, భ, భ, ర, వ – UII
UII పునారావృతం కాలేదు కనుక స, భ, ర, న, మ, ర, వ
ప్రతతుల్ | సాల్పడి | నల్గడం | బెదర | గాబాఱెన్ | మనోవే | గుడై
I I U U I I U I U I I I U U U I U U I U
స భ ర న మ ర వ
పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) తపసులెం బి) బారదో
సి) బ్రోవంగనానీవోపవో డి) పూరంబేరుల
వివరణ –
తపసులెం బారదో బ్రోవంగనీవోపవో పూరంబేరుల
I I I U UIU U U I U U I U U U U I I
మ, స, జ, స, త, త, గ (డి బి ఎ సి) – శార్దూలం
పూరంబే | రుల బా | రదో త | పసులెం | బ్రోవంగ | నీవోప | వో
UUU I I U I U I I I U U U I U U I U
పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) మైనసకు బి) వాచివికింజెడిపోయె
సి)వనకరిచిక్కె డి) మీనుతా
వివరణ : సి ఎ డి బి
మైనసకు వాచివికింజెడిపోయె వనకరిచిక్కె మీనుతా
U I I I U I I U I I U I I I I I U I UIU
న,జ,భ,జ,జ,జ,ర
వనక | రిచిక్కె | మైనస | కువాచి | వికింబె | డిపోయె | మీనుతా
III IUI UII IUI IUI IUI UIU
ఆతత పక్షమారుతరయప్రవికంపితఫరార్ణితాచల ఏ పద్య పాదం ?
ఈ పద్య పాదం ఉత్పలమాల పద్యం
l ఉత్పలమాల పద్యంలోని మాత్రల సంఖ్య ?(డి)
ఎ) 20 బి) 80 సి) 27 డి) 28
వివరణ –
ఏక మాత్ర కాలంలో పలికేది – లఘువు (I)
ద్విమాత్ర కాలంలో పలికేది – గురువు (U)
భ ర న భ భ ర వ
UII UIU III UII UII UIU IU
l శార్దూల పద్యంలోని మాత్రల సంఖ్య : మ స జ స త త గ
11 x 2 = 22
1 x 8 = 8
30 x 4 = 120
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు