ఎన్టీఏ‘బయోటెక్నాలజీ’ ఎంట్రన్స్


గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ (గ్యాట్ – బీ), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)
నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ (గ్యాట్ – బీ)
ఈ పరీక్ష ద్వారా బయోటెక్నాలజీ, అనుబంధ సబ్జెక్టుల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ /అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ), ఎంటెక్ (బయోటెక్నాలజీ), ఎంవీఎస్సీ (యానిమల్ బయోటెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ ఎంట్రన్స్‌లో పాల్గొంటున్న ప్రముఖ యూనివర్సిటీల్లో మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు.
సీట్ల వివరాలు: మొత్తం 63 డీబీటీ సపోర్టెడ్ పీజీ ప్రోగ్రాములు ఉన్నాయి. మొత్తం 1217 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ) 30 సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ (హైదరాబాద్)లో ఎమ్మెస్సీ (మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్) 10 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: స్పెషలైజేషన్‌ను బట్టి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ/ బీఈ/ బీటెక్ లేదా బీవీఎస్సీ, బీఫార్మసీ, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్/ ఎంబీబీఎస్ లేదా ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులు.
పరీక్ష విధానం
మొత్తం 240 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు
దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నలు ఇంటర్ స్థాయిలో ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు 1 మార్కు. మొత్తం 60 ప్రశ్నలకు 60 మార్కులు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పు జవాబుకు అర మార్కు కోత విధిస్తారు.
రెండో సెక్షన్లో బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ విభాగాల నుంచి 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
రెండో సెక్షన్ ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 180. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)
ఈ పరీక్షను డీబీటీ- జేఆర్ఎఫ్ కోసం ఎన్టీఏ నిర్వహిస్తుంది.
ఈ పరీక్ష ద్వారా బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ విభాగాల్లో డాక్టోరల్ రిసెర్చ్ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం అభ్యర్థులను రెండు కేటగిరీలకు ఎంపిక చేస్తారు.
మొదటి కేటగిరీకి ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ యూనివర్సిటీల్లో పీహెచ్డీ చేసుకోవచ్చు.
రెండో కేటగిరీ కింద ఎంపికైనవారిని డీబీటీ ప్రాజెక్టుకు స్పాన్సర్ చేసి నిబంధనల ప్రకారం పీహెచ్డీ అవకాశం కల్పిస్తారు. వీరికి ఎటువంటి ఫెలోషిప్ లభించదు.
అర్హతలు: బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంటెక్/ ఎంవీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు నాటికి 28 ఏండ్ల వయసు మించరాదు.
పరీక్ష విధానం: ఇందులో కూడా రెండు సెక్షన్లు ఉంటాయి. అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఇస్తారు. మొదటి సెక్షన్లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ బయోటెక్నాలజీ విభాగాలనుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్లో సంబంధిత స్పెషలైజేషన్ నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నకు 3 మార్కుల చొప్పున రెండు సెక్షన్లకు కలిపి మొత్తం మార్కులు 300. తప్పుగా గుర్తించిన సమాధానాలకు 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1200,
రెండు పరీక్షలు రాసేవారు రూ.2400
చివరితేదీ: జూలై 31
పరీక్షతేదీ: ఆగస్ట్ 14
వెబ్సైట్: www.nta.ac.in
- Tags
- bio technology
- bsc
- BTech
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు