‘జీఈఆర్డీ’ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై చేపడుతున్నారు?
- ఎన్ఏటీఆర్ఏఎక్స్ (నాట్రాక్స్) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? ( బి)
ఎ) భారత్, నాటో దళాల సంయుక్త సైనిక విన్యాసం
బి) హైస్పీడ్ ట్రాక్
సి) తేలియాడే యుద్ధ నౌక
డి) కక్ష్యలు మార్చుకొనే ఒక ఉపగ్రహం
వివరణ: ఎన్ఏటీఆర్ఏఎక్స్ అనేది ఒక హైస్పీడ్ ట్రాక్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రారంభించారు. దీని పొడవు 11.3 మీటర్లు. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన ట్రాక్. వాహన వేగ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన నిర్మాణం. 1000 ఎకరాలలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ద్విచక్ర వాహనాల నుంచి అన్ని రకాల వాహనాల వేగాన్ని ఇక్కడ పరీక్షించేందుకు వీలు ఉంటుంది. వాహనాలు ఇక్కడ గంటకు 375 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనేందుకు వీలుంటుంది. ట్రాక్‌లు కూడా సురక్షితంగా ఉండేలా నిర్మించారు. - ప్రస్తుతం మలేరియా రహిత దేశాలు ఎన్ని ఉన్నాయి? (డి)
ఎ) 20 బి) 35 సి) 30 డి) 40
వివరణ: ప్రస్తుతం ప్రపంచంలో మలేరియా రహిత దేశాలు 40 ఉన్నాయి. చైనాను మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రకటించారు. ప్రాజెక్ట్ 523ని చేపట్టి ఆ దేశం మలేరియాను నిర్మూలించింది. గడిచిన వరుస మూడు సంవత్సరాల్లో రోగ వ్యాప్తి లేనప్పుడు, ఆయా దేశాలను లేదా ప్రాంతాలను రోగరహితంగా ప్రకటిస్తారు. 2021లో చైనాకు ముందు ఎల్సెల్వడార్ దేశాన్ని కూడా మలేరియా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పసిఫిక్ సముద్ర పశ్చిమ ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా ఆవిర్భవించిన తొలి దేశం చైనానే. - దేశంలో తొలి చలనంలో ఉండే మంచినీటి టన్నెల్ అక్వేరియాన్ని ఎక్కడ అందుబాటులోకి తెచ్చారు? (సి)
ఎ) పుణె బి) అహ్మదాబాద్ సి) బెంగళూర్ డి) చెన్నై
వివరణ: విజ్ఞానం, వినోదం అందించడానికి దేశంలో తొలిసారిగా మూవబుల్ ఫ్రెష్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని బెంగళూర్‌లోని క్రాంతివీర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. దీనివల్ల జలాల్లో ఉండే అనేక వృక్ష, జంతు జాతుల గురించి తెలుసుకొనేందుకు వీలుంటుంది. - చట్టసభల్లో పార్టీలు ఫిరాయించిన సభ్యుల అనర్హతపై సభాపతి నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని మార్పు తీసుకొచ్చే అధికారం ఎవరికి ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది? (ఎ)
ఎ) పార్లమెంట్ బి) రాష్ట్రపతి
సి) కేంద్ర క్యాబినెట్ డి) అంతరాష్ట్ర మండలి
వివరణ: సభ్యుల అనర్హతపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకొనేలా చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌దే అని సుప్రీంకోర్ట్ పేర్కొంది. చట్టంలో నిర్ణీత కాల పరిమితి విధించకపోవడంతో పార్టీ ఫిరాయించే సభ్యులపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్లు జాప్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. ఈ కేసును సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్టాలను న్యాయస్థానాలు చేయలేవని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. - బీవోఎల్డీ (బోల్డ్) పూర్తి రూపం ఏంటి? (బి)
ఎ) బ్రోచర్స్ ఆర్గనైజింగ్ త్రూ లెడ్
బి) బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాట్
సి) బీమా ఆర్గనైజేషన్ లీడింగ్
డి) ఏదీ కాదు
వివరణ: బోల్డ్ పూర్తి రూపం బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాట్. శుష్క, అర్ధ శుష్క భూముల్లో వెదురు చెట్లను పెంచే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి, అవి 1. ఎడారీకరణ నిరోధించడం 2. గ్రామీణ వాసులకు ఉపాధి కల్పించడం. ఇందులో భాగంగా అస్సాం నుంచి వెదురుకు చెందిన వేర్వేరు జాతులను తెచ్చి రాజస్థాన్‌లో నాటారు. 16 ఎకరాల్లో సుమారు 5000 మొక్కలను నాటారు. ఒకే రోజు, ఒకే ప్రదేశంలో గరిష్ట స్థాయిలో వెదురు మొక్కలను నాటడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. - ఎల్ఈఏఎఫ్ ప్రాజెక్ట్‌లో భాగం కాని దేశం? (సి)
ఎ) యూకే బి) యూఎస్
సి) భారత్ డి) నార్వే
వివరణ: లోయరింగ్ ఎమిషన్స్ బై యాగ్జిలరేటింగ్ ఫారెస్ట్ ఫైనాన్స్‌కు సంక్షిప్త రూపమే ఎల్ఈఏఎఫ్. అమెరికా, యూకే, నార్వే సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. ఉష్ణ మండల పరిరక్షణకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఇందులో యూనీలివర్, అమెజాన్, నెస్ట్లే తదితర ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయి. - ఈ ఏడాది ఒలింపిక్స్ లేదా పారాఒలింపిక్స్‌లో పతాకధారి కానివాళ్లు ఎవరు? (డి)
ఎ) మేరీ కోం బి) మన్‌ప్రీత్ సింగ్
సి) మరియప్పన్ డి) పీవీ సింధు
వివరణ: ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పతాకధారులుగా బాక్సింగ్ చాంపియన్ మేరీకోం, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్‌లు వ్యవహరిస్తారు. అలాగే ఆగస్ట్ 24న ప్రారంభం కానున్న పారాఒలింపిక్స్‌లో తంగవేలు మరియప్పన్ పతాకధారిగా వ్యవహరిస్తారు. 2016లో నిర్వహించిన రియో ఒలింపిక్స్‌లో హైజంప్‌లో అతడు పసిడి పతకం సాధించాడు. రియో ప్రదర్శనకుగాను అతడికి ఖేల్త్న్ర పురస్కారం లభించింది. దుబాయ్‌లో జరిగిన 2019 ప్రపంచ అథ్లెట్స్ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలవడం ద్వారా తంగవేలు టోక్యో బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. - ఇటీవల మిథాలీ రాజ్ సృష్టించిన రికార్డ్ కింది వాటిలో ఏది? (బి)
- మహిళా క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెటర్‌గా రికార్డ్
- మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్
ఎ) 1 బి) 1, 2 సి) 2 డి) 1, 2
వివరణ: 1999లో అంతర్జాతీయ మహిళా క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ 22 ఏళ్ల కెరీర్‌ను పూర్తిచేసుకుంది. సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్లో ఇంతటి సుదీర్ఘ కాలం ఉన్న క్రికెటర్ ఆమె. మొత్తం క్రికెట్ చరిత్రలో రెండో స్థానంలో, మహిళా క్రికెట్లో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మరో రికార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె చేసిన మొత్తం పరుగులు 10,337
- ‘జీఈఆర్డీ’ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై చేపడుతున్నారు? (సి)
ఎ) బ్రహ్మపుత్ర బి) మెకాంగ్
సి) బ్లూనైల్ డి) వోల్గా
వివరణ: గ్రాండ్ ఇథియోపియా రెనైజాన్స్ డ్యామ్‌కు సంక్షిప్త రూపమే జీఈఆర్డీ. బ్లూనైల్ నదిపై దీనిని నిర్మిస్తున్నారు. 2011లో నిర్మించడం ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రెండో దశను జూలై 2021లో మొదలు పెట్టాలని ఇథియోపియా నిర్ణయించింది. జీఈఆర్డీ నిర్మాణంపై సూడాన్, ఈజిప్ట్ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. 145 మీటర్ల ఎత్తయిన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. 6000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించింది. ఆఫ్రికాలోనే అతి పొడవైన నది అయిన నైల్‌కు బ్లూనైల్ ఉపనది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై అభ్యంతరాలు చెబుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేవనెత్తనున్నట్లు ఈజిప్ట్ ఇప్పటికే ప్రకటించింది. - కింది వాటిలో సహకార రంగ ప్రస్తావన లేనిది? (డి)
ఎ) ఆర్టికల్ 19 (1) (c) బి.ఆర్టికల్ 43B
సి) భాగం IXB
డి) ఎనిమిదో షెడ్యూల్
వివరణ: కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను చేపట్టిన తొలి మంత్రి అమిత్ షా. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. అయితే సహకార రంగం ప్రస్తావన రాజ్యాంగంలో ఉంది. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా భాగం IXB రాజ్యాంగంలో చేర్చారు. అలాగే ఆర్టికల్ 19 (1) (c) ఆర్టికల్‌లో సహకారం అనే పదాన్ని ఉపయోగించారు. అధికరణం ఆర్టికల్ 43B సహకార సంఘాల అభివృద్ధిని ప్రస్తావించారు. - ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు? (బి)
ఎ) 10 బి) 11 సి) 12 డి) 13
వివరణ: ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో 11 మంది మహిళా మంత్రులు ఉన్నారు. 2004 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో ఉండటం ఇదే ప్రథమం. అప్పట్లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో 10 మంది ఉండేవాళ్లు. జూలై 7న చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో ఏడుగురు మహిళలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా క్యాబినెట్లోకి వచ్చిన మహిళలు మీనాక్షి లేఖి, శోభ కరంద్లాజే, అనుప్రియా సింగ్ పటేల్, దర్శన విక్రమ్ జర్దోష్, అన్నపూర్ణాదేవి, ప్రతిమా భౌమిక్, భారతి ప్రవీణ్ పవార్ - చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు నిరాకరించిన ఒపెక్+ కూటమిలోని దేశం? (సి)
ఎ) సౌదీఅరేబియా బి) ఒమన్
సి) యూఏఈ డి) బహ్రెయిన్
వివరణ: ఏప్రిల్ 2022 తర్వాత చమురు ఉత్పత్తి తగ్గించాలన్న ఒపెక్+ దేశాల ప్రతిపాదనను కూటమిలోని సభ్య దేశం అయిన యూఏఈ వ్యతిరేకించింది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్, సప్లయ్ ఆధారంగా చమురు ధరలను ఈ కూటమిలోని దేశాలు నియంత్రిస్తూ ఉంటాయి. కొవిడ్ నేపథ్యంలో 2020లో చమురుకు డిమాండ్ తగ్గడం, ధర కూడా పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించాలని కూటమిలోని దేశాలు నిర్ణయించాయి. క్రమంగా లాక్డౌన్ పరిస్థితులు సడలించడం, డిమాండ్ పెరుగుతూ ఉన్నా ఇవి ఉత్పత్తిని, సరఫరాను పెంచలేదు. కారణం ఆగస్ట్ 2021 వరకు ఉత్పత్తిని పెంచరాదని ఇవి అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని అన్ని దేశాలు భావిస్తున్నప్పటికీ ఈ నిర్ణయాన్ని యూఏఈ వ్యతిరేకించింది. - సోషల్ ఇంపాక్ట్ బాండ్‌ను విడుదల చేయాలని భావిస్తున్న ఆఫ్రికా దేశం? (బి)
ఎ) ఇథియోపియా బి) ఘనా
సి) దక్షిణాఫ్రికా డి) టునీషియా
వివరణ: సోషల్ బాండ్లను విక్రయించాలని ఘనా దేశం ప్రణాళిక రచిస్తుంది. ఈ పద్ధతి ద్వారా 2 బిలియన్ డాలర్లను సమీకరించాలని నిర్ణయం. ఈ తరహా బాండ్లను విక్రయించనున్న తొలి ఆఫ్రికా దేశం ఘనానే. దీనినే సోషల్ ఇంపాక్ట్ బాండ్ అంటారు. నిజానికి బాండ్ అంటున్నప్పటికీ దీనికి ఆ స్వభావం లేదు. తిరిగి చెల్లింపు అనేది నిర్ధారించిన తేదీ ప్రకారం కాకుండా, ఆశించిన సామాజిక మార్పు జరిగినప్పుడే వస్తుంది. ఒకవేళ సాధించని పక్షంలో పెట్టుబడిదారులు తమ మొత్తాన్ని కోల్పోతారు. ఈ తరహా బాండ్లను మొదట ప్రతిపాదించింది హోరేశ్ అనే న్యూజిలాండ్ ఆర్థికవేత్త. మొదటి సోషల్ ఇంపాక్ట్ బాండ్‌ను యూకే కేంద్రంగా పనిచేసే సోషల్ ఫైనాన్స్ లిమిటెడ్ విడుదల చేసింది. - శాసనమండలి ఏర్పాటుకు ఏ రాష్ట్ర శాసనసభ ఇటీవల తీర్మానాన్ని ఆమోదించింది? (డి)
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) ఒడిశా
సి) కర్నాటక డి) పశ్చిమబెంగాల్
వివరణ: పశ్చిమబెంగాల్లో శాసనమండలి ఏర్పాటు తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ జూలై 6న ఆమోదించింది. సభకు హాజరైన 265 మంది సభ్యులకుగాను 196 మంది అనుకూలంగా 69 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతం శాసన మండలి ఉన్న రాష్ర్టాలు-తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక. నిజానికి గతంలో పశ్చిమబెంగాల్లో శాసనమండలి ఉంది. 1969లో నాటి వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. - యునెస్కో వారసత్వ హోదాకు ఈ ఏడాది భారత్ నుంచి వెళ్లిన ప్రతిపాదన? ( సి)
ఎ) రామప్ప దేవాలయం, తంజావూర్ దేవాలయాలు
బి) రామప్ప దేవాలయం, లోథాల్ కట్టడాలు
సి) రామప్ప దేవాలయం, ధోలవీర కట్టడాలు
డి) రామప్ప దేవాలయం
వివరణ: తెలంగాణలోని ప్రముఖ రామప్ప దేవాలయంతో పాటు గుజరాత్‌లోని ధోలవీరలోని కట్టడాలను యునెస్కో వారసత్వ హోదా కోసం నామినేట్ చేశారు. రామప్ప దేవాలయాన్ని కాకతీయులకు చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ధోలవీర సింధూనాగరికత కాలం నాటి పట్టణం.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
Previous article
ఎన్టీఏ‘బయోటెక్నాలజీ’ ఎంట్రన్స్
Next article
విదేశీ విద్యకు మార్గం.. ఇలా సుగమం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు