కమర్షియల్ పైలట్ కోర్సు ఎంట్రన్స్


ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ) కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘ఐజీఆర్‌యూఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’కు నోటిఫికేషన్ విడుదలైంది.
బీఎస్సీ (ఏవియేషన్)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు.
ఈ కోర్సు పూర్తిచేసినవారికి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తోపాటు మల్టీ ఇంజిన్ ఎండార్స్మెంట్, ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ (ఐఆర్) ఆన్ మల్టీ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు సీపీఎల్ కోర్సుతోపాటు బీఎస్సీ (ఏవియేషన్) ప్రోగ్రామ్‌లో కూడా చేరవచ్చు. ఈ ప్రోగ్రామ్ వ్యవధి మూడేండ్లు.
మొత్తం సీట్లు: 120
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
వయస్సు: కనీసం 17 ఏండ్లు ఉండాలి.
పరీక్ష విధానం
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నలు ఇంటర్ స్థాయిలో ఉంటాయి.
నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
పరీక్షలోమెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ/ వైవా, పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ సైకోమెట్రిక్ టెస్టులకు ఎంపిక చేసి వాటిని నిర్వహిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 21
ఐజీఆర్‌యూఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీ: ఆగస్ట్ 21
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్సైట్: http://www.igrua.gov.in/
- Tags
- commercial pilot
- igrui
Latest Updates
Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
PHYSICS Groups Special | విశ్వవ్యాప్తం.. దృష్టి శక్తి స్వరూపం
CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
INCOIS Recruitment | ఇన్‌కాయిస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ లో 138 ఇంజినీరింగ్ ఉద్యోగాలు
ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో 39 పోస్టులు
DPH&FW, Nagarkurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
TSNPDCL Recruitment | టీఎస్ఎన్పీడీసీఎల్లో 100 ఉద్యోగాలు