ఎమర్జింగ్ కోర్సుల్లో మరో 10 వేల సీట్లు!

ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటాసైన్స్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఆయా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నాయి. కోర్ కోర్సులుగా పేరొందిన మెకానికల్, సివిల్, ఎలక్టికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, ఎమర్జింగ్ కోర్సుల్లో పెంచుకొనేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు అనుమతులు కోరుతూ పలు యాజమాన్యాలు ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తు చేశాయి. ఆయా కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరంలో అఫిలియేషన్ ఇవ్వాలని జేఎన్టీయూ హైదరాబాద్‌తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టాయి.
ఏఐసీటీఈ అనుమతులు లభిస్తే రానున్న విద్యా సంవత్సరంలో ఎమర్జింగ్ కోర్సుల్లో మరో 10 వేల సీట్ల వరకు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. దీంతో ఎమర్జింగ్ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య దాదాపు 30 వేలకు చేరుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నట్టయితే కొత్త కోర్సులకు అనుమతులు ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, అఫిలియేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉన్నదని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్ తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలతో పాటు పాటు భారీ ప్యాకేజీలు లభిస్తున్నాయి.
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు