ఇస్రోలో అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నేషనల్ కెరీర్ సర్వీసెస్ (ఎన్సీఎస్) పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్షను బెంగళూరు, చెన్నై, భోపాల్, అహ్మదాబాద్, గువాహటి తదితర పట్టణాల్లో నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు: 24
ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 6, అకౌంట్స్ ఆఫీసర్ 6, పర్చేజ్ అండ్ స్టోర్ ఆఫీసర్ 12 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్చేజ్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎంబీఏ, డిగ్రీ, పీజీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అకౌంట్స్ ఆఫీసర్ కోసం ఏసీఏ, ఎఫ్సీఏ లేదా ఏఐసీడబ్ల్యూఏ, ఎఫ్ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీకామ్, ఎంకామ్లలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 35 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
పరీక్ష ఫీజు: రూ. 250, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్లకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 21
వెబ్సైట్: www.isro.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
మట్టివాసన ఉన్న సినిమా ఇది!
ఈ నెలలో అన్ని రోజులూ టీకా
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
మోనాలిసా, మార్లిన్ మన్రో, లిబర్టీ విగ్రహానికి.. మాస్క్!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు