23 నుంచి జేఈఈ మెయిన్.. అడ్మిట్ కార్డుల విడుదల
హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జేఈఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగనున్నాయి.
విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ మూడు వేరువేరు లింక్‌లను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అడ్మిట్ కార్డులను సులభంగా, వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాదినుంచి జేఈఈ మెయిన్ పరీక్షను ఒకటికంటే ఎక్కువసార్లు రాసుకునే అవకాశం ఉన్నది. జేఈఈకి అర్హత సాధించాలంటే విద్యార్థులు 12 తరగతి పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ కోసం 6.60 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
వెబ్సైట్: jeemain.nta.nic.in.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు