ఇంజినీరింగ్ స్కిల్స్ @ఈఎస్సీఐ
సమాజంలో ఇంజినీర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాగు, సాగునీరు, ఆహారం, విద్య, రోడ్లు, ప్రాజెక్టులు ఇలా ప్రతిదానిలో వీరి పాత్ర చాలా కీలకం. కేవలం నాలుగేండ్లు చదవగానే ఇంజినీరింగ్ పూర్తికాదు. ఎప్పటికప్పుడు దీనిలో అప్డేట్స్తోపాటు సమర్థవంతమైన మేనేజ్మెంట్ చేసినప్పుడే దీని పాత్ర పూర్తవుతుంది. దీనికోసం ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ట్రెయినింగ్, రిసెర్చ్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) పరిధిలోని అటానమస్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
ఈఎస్సీఐ
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాను 1981లో ప్రారంభించారు. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) స్థాపించింది. దేశంలో అతిపెద్ద ప్రొఫెషనల్స్ కలిగిన సంస్థ. ఆసియా ఖండంలో ఇలాంటి సంస్థ మరొకటి లేదు. ఇంజినీర్లకు శిక్షణ, పరిశోధన కోసం దీన్ని ఏర్పాటు చేశారు. స్కిల్స్‌ను నేర్చుకోవడానికి, కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈ సంస్థ శిక్షణ అందిస్తుంది.
ఈ సంస్థలో 9 డివిజన్లు ఉన్నాయి. సివిల్/ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఐటీ, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, పవర్ అండ్ ఎనర్జీ, క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిజైన్ ప్రోటోటైపింగ్ సెంటర్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇవేకాకుండా ప్రభుత్వ సంస్థలకు, శాఖలకు, ఇండస్ట్రీకి కన్సల్టెన్సీ సంస్థగా ఇది పనిచేస్తుంది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు