డిగ్రీ విద్యార్థులకు వన్‌టైమ్ చాన్స్
హైదరాబాద్: ఓయూలో అన్ని డిగ్రీ కోర్సులు పూర్తిచేసి, బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్నవారికి వన్‌టైమ్ చాన్స్ కల్పించినట్టు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ తెలిపారు. ఈ మేరకు 2012 కంటే ముందు డిగ్రీలో చేరినవారికి అవకాశం కల్పించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో పరీక్ష ఫీజును వచ్చే నెల 15లోగా, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 19లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని కోరారు.
డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఓయూలో అన్ని డిగ్రీ కోర్సుల రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వివిధ కోర్సుల పరీక్ష తేదీలు ఖరారు
ఉస్మానియా వర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల తేదీలను ప్రకటించారు. ఎండీహెచ్‌ఎం మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27 నుంచి, ఎమ్మెస్సీ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) (సీబీసీఎస్) మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి, ఎంబీఏ (ఈవినింగ్) మూడు, అయిదో సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగనున్నాయి. మూడేండ్ల ఎల్ఎల్బీ, మూడేండ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ మూడో ఏడాది ఆరో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఐదేండ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేండ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేండ్ల బీకాం ఎల్ఎల్బీ తదితర కోర్సుల అయిదో ఏడాది పదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు