1,150కే అంబేద్కర్ వర్సిటీ స్టడీ మెటీరియల్
# ఆన్లైన్ బుకింగ్స్ మొదలుపెట్టిన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
# తొలిరోజు 500 మంది అభ్యర్థుల నమోదు
# పోస్టులో, నేరుగా వర్సిటీలో పొందేందుకు అవకాశం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) రూపొందించిన స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ పెరుగుతున్నది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ఈ మెటీరియల్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే బుకింగ్స్ మొదలయ్యాయి. వర్సిటీ అధికారులు నాలుగు పుస్తకాల ధరను రూ. 1,150గా నిర్ణయించారు. సోమవారం ఆన్లైన్ బుకింగ్‌ను ప్రారంభించగా, తొలిరోజు 500 మంది అభ్యర్థు లు బుక్ చేసుకొన్నారు. మొత్తం 2,200 పేజీలు ఉన్న ఈ మెటీరియల్‌ను జిరాక్స్ తీస్తే రూ.2వేలకు పైగా ఖర్చవుతుంది. కానీ వర్సిటీ అధికారులు అతి తక్కువకే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలివిడతగా 20వేల పుస్తకాలను ముద్రించారు. వీటిలో కొన్ని గ్రంథాలయాలకు అందించగా, మరికొన్నింటిని వర్సిటీలోనే విక్రయిస్తున్నారు. బీఏ, ఎంఏ పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ నెలకొన్నది. వీటిని మార్కెట్లో విక్రయించరు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. ఈ పుస్తకాలు సివిల్స్‌కు పోటీపడే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మెటీరియల్ రూపకల్పన కమిటీ చైర్మన్‌గా ఉండి అన్ని అంశాలను క్రోడీకరించి, పుస్తకాలను తయారుచేయించారు.
పుస్తకాలు ఇవే..
# తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవతరణ
#ఆర్థిక వ్యవస్థ -అభివృద్ధి
#భారత సమాజం – రాజ్యాంగ పరిపాలన
# భారతదేశ చరిత్ర – సంస్కృతి
బుకింగ్ ఇలా..
మెటీరియల్ కావాలనుకొనే అభ్యర్థులు www.braouonline.inలో పేమెంట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన పేమెంట్ రశీదుతో వర్సిటీకి వెళ్లి మెటీరియల్ పొందవచ్చు. పోస్టు ద్వారా పొందాలనుకొనేవారు https://www. braouonline.in/booksale/servicesbooks.aspxను సంప్రదించాలి. కాగా, వర్సిటీ కౌంటర్లో డబ్బులు చెల్లించి వెంటనే మెటీరియల్ పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్లైన్లో బుక్‌చేసుకొంటే, పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు