10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
పార్ట్-ఎ
1. అవగాహన ప్రతిస్పందన : (20 మార్కులు)
అ) కింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతున్ని ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణ దండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానర యోధులు కిష్కింధకు చేరుకొంటున్నారు. సుగ్రీవుడి ఆజ్ఞ అటువంటిది. దానికి తిరుగుండదు. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది.
శ్రీరామునితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు. వానరులరాకను గురించి తెలిపాడు. సీత జాడను తెలుసుకోవడం రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖలతో కూడిన సేనను పంపాడు. మేనమామ అయిన సుసేనుని నాయకత్వంలో పడమరకు, శతబతి నాయకత్వంలో ఉత్తర దిక్కుకు సేనను పంపాడు. ఒక్కొక్క దిక్కుకు ఏయే ప్రదేశాల గుండా వెళ్లాలో, అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడిపై అంత విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముని భావన కూడా అదే. అందుకే తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. సీత దీన్ని చూస్తే హనుమంతుడిని రామదూతగా నమ్ముతుందన్నాడు శ్రీరాముడు. హనుమంతుడు నమస్కరించి రాజముద్రికను గ్రహించాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు.
ప్రశ్నలు
1) సుసేనుడు ఎవరు?
2) సుగ్రీవుడి నమ్మకం ఏమిటి?
3) సీతాన్వేషణకు వానర వీరులు ఏయే దిక్కులకు వెళ్లారు?
4) జాంబవంతుడు ఎవరి నాయకత్వంలో సీతాన్వేషణకు వెళ్లాడు?
5) ఉంగరంపై ఎవరి పేరు చెక్కి ఉంది?
ఆ) కింది పద్యాల్లో ఒక దాన్ని పూరించి భావం రాయండి?
6. భండన భీము ఁ డార్త జన బాంధవుడ్రుజ్వల బాణ తూణ ——— దండము నెక్కి చావేద పురాణ శాస్త్ర పదవీ —– ఘల్లు ఘల్లునన్!
(ఇ) కింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు 1, 2 వాక్యాల్లో రాయండి.
కమలములు నీట బాపిన
గమలాప్తుని రశ్మిసోక కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
7) కమలాప్తుడు అంటే ఎవరు?
8) నెలవులు అంటే అర్థం ఏమిటి?
9) మిత్రులు, శత్రువులు ఎప్పుడు అవుతారు?
10) సుమతి అంటే అర్థం ఏమిటి?
11) సుమతి శతకాన్ని రాసిందెవరు?
II. వ్యక్తీకరణ -సృజనాత్మకత 40 మార్కులు
12. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి తక్షణ అవసరాలు ఏమిటి?
13. జీవన భాష్యం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి?
14. రామదాసు రాముని ఏ విధంగా కీర్తించాడు?
15. భూమిక పాఠ్యాంశ రచయితను గురించి రాయండి?
ఆ) కింది ప్రశ్నలకు 10 నుంచి 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి? 4X7=28
16. వ్యాసుని కోపానికి కారణమైన సంఘటన దాని పరిణామాలు విశ్లేషించండి?
(లేదా)
l శతక మధురిమలోని శతక పద్యాల్లో నీవు తెలుసుకున్న నీతులు ఏమిటి?
17. నెల్లూరి కేశవస్వామి రాసిన కథల విశిష్టతను నీ సొంత మాటల్లో రాయండి?
(లేదా)
l గోలకొండ పట్టణం గొప్పతనాన్ని, వైభవాన్ని ప్రత్యేకతను గురించి రాయండి?
18. హనుమంతుడు రామలక్ష్మణులను పరిచయం చేసుకొన్న విధానాన్ని తెలియజేయండి?
(లేదా)
l శ్రీరాముడు వానర సైన్యాలతో లంకను చేరుకున్న విధం రాయండి?
ఇ) సృజనాత్మకత:
l మీ పాఠశాలలో నిర్వహిస్తున్న వైజ్ఞానిక దినోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రం తయారు చేయండి?
l నగరంలోని అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి?
భాషాంశాలు
ఎ) పదజాలం 10 మార్కులు
అ) కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి?
1. పరివేష్టించు : 2. మాదుకరము :
ఆ) కింది వాటికి సరైన జవాబు గుర్తించి ఆ సంకేతాన్ని (ఎ/బి/సి/డి) కేటాయించిన బ్రాకెట్లలో రాయండి?
3. మనమందరం నిరతము తోటి వారితో స్నేహంగా ఉండాలి. నిరతము అనే పదానికి అర్థం ( )
ఎ) ఒకరోజు బి) ఒకసారి
సి) ఎల్లప్పుడు డి) ఒకచోట
4. కింది వాటిలో ఉపజాతి పద్యం? ( )
ఎ) చంపక మాల బి) ఆటవెలది
సి) కందం డి) మత్తేభం
5. యయాతి చరిత్ర అచ్చమైన తెలుగు కావ్యం గీత గీసిన పదానికి వికృతి ( )
ఎ) కబ్బం బి) పుస్తకం
సి) బుక్ డి) పత్రిక
6. ‘రాజకువలయానందకరుడు’ వాక్యంలో అలంకారం? ( )
ఎ) రూపకం బి) శ్లేషాలంకారం
సి) ఉపమాలంకారం డి) ఉత్ప్రేక్ష అలంకారం
7. య, వ, ర, ల ను —— అంటారు?
ఎ) సవర్ణములు బి) త్రికములు
సి) మణ్ణులు డి) వృద్ధులు
8. అన్య పదార్థ ప్రాధాన్యం కలది?
1) బహువ్రీహి 2) రూపక
3) ద్విగు 4) ద్వంద్వ
9. సహజం అనే పదానికి వికృతి
ఎ) సాజం బి) సాయుద్యం
సి) సైతం డి) సాహిత్యం
10. 3 సూర్యగణాలు, 2 ఇంద్ర గణాలు, మూడు సూర్యగణాలు వరుసగా వచ్చే పదం ( )
ఎ) సీసం బి) కందం
సి) తేటగీతి డి) ఆటవెలది
11. మహావృక్షం అనేది ఏ సమాసం?
ఎ) విశేషణ పూర్వపద కర్మదారయ
బి) రూపక
సి) షష్ఠీ తత్పురుష డి) ద్విగు
12) UUU అనేది ఏ గణం?
ఎ) రగణం బి) యగణం
సి) మగణం డి) సగణం
13. జ్యోతి ఇంటికి వెళ్లి అన్నం తిన్నది ఏ వాక్యం? ( )
1) సంశ్లిష్ట బి) సంయుక్త
సి) కర్తరీ డి) కర్మణీ
14. రమ్యోధ్యానములు ఇది ఏ సంధి? ( )
ఎ) గుణ సంధి బి) సవర్ణ దీర్ఘ సంధి
సి) యణాదేశ సంధి డి) పైవన్నీ
15. విద్య వికృతి
ఎ) కైత బి) విద్దె సి) కూత డి) కెత
16. గీత కచేరీలో పాటలు బాగా పాడింది. ఇందులో గీత గీసిన భాషా భాగం ( )
ఎ) నామవాచకం బి) అవ్యయం
సి) క్రియ డి) విశేషణం
17. జ్ఞాన జ్యోతి అనే సమాసానికి విగ్రహవాక్యం ( )
ఎ) జ్ఞానమైన జ్యోతి
బి) జ్ఞానమనెడి జ్యోతి
సి) జ్ఞానం యొక్క జ్యోతి
డి) జ్ఞానమును, జ్యోతియును
18. పొలిపెర అర్థం ఇచ్చేది? ( )
ఎ) పత్రం బి) నేత్రం
సి) గుర్తులు డి) సత్రం
19. ఒక హల్లుల జంట పలుమార్లు వస్తే అది ఏ అలంకారం? ( )
ఎ) వృత్యానుప్రాస బి) చేకాను ప్రాస
సి) లాటానుప్రాస డి) అంత్యానుప్రాస
20. కింది వాటిలో సవర్ణములు కానివి? ( )
ఎ) అ+అ బి) ఇ+ఇ
సి) ఉ+ఎ డి) ఉ+ఉ
సమాధానాలు
3- సి 4-బి 5-ఎ 6-బి
7-సి 8-ఎ 9-ఎ 10-డి
11-ఎ 12-సి 13-సి 14-ఎ
15-బి 16-సి 17-బి 18-సి
19-ఎ 20-సి
హెచ్. అర్చన
తెలుగు హెచ్వోడీ,
శ్రీ చైతన్య స్కూల్
బోడుప్పల్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు