సుమత్రా దీవుల్లో నివసించే ఆదిమజాతి?
- సౌరస్థిరాంకం (Solar Constant) విలువ ఎంత?
1) 1.76 గ్రా. కెలోరీలు
2) 1.94 గ్రా. కెలోరీలు
3) 1.82 గ్రా. కెలోరీలు
4) 2.00 గ్రా. కెలోరీలు - సూర్యకిరణాలు భూమిని ఏ రూపంలో చేరుకుంటాయి?
1) దీర్ఘతరంగాలు 2) హ్రస్వతరంగాలు
3) 1, 2 4) ఏదీకాదు - సౌరస్థిరాంకం అంటే?
1) సూర్యుని నుంచి వెలువడే ఉష్ణశక్తి
2) వాతావరణం గ్రహించే సౌరశక్తి
3) ఒక చదరపు సెం.మీ భూమి ఒక నిమిషానికి సూర్యుని నుంచి గ్రహించే ఉష్ణశక్తి
4) ఏదీకాదు - చెన్నై, తిరువనంతపురంతో పోలిస్తే ఢిల్లీ భూమధ్యరేఖకు దూరంగా ఉన్నప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి కారణం ఏమిటి?
1) చెన్నై, తిరువనంతపురం ఢిల్లీ కన్నా అధిక ఎత్తులో ఉండటం
2) మిగిలిన రెండు నగరాల కన్నా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉండటం
3) చెన్నై, తిరువనంతపురం సముద్రతీర నగరాలు కాగా ఢిల్లీ ఖండాంతర్గత ప్రాంతం కావడం 4) పైవన్నీ - ఉష్ణోగ్రత విలోమానికి అనుకూలమైన పరిస్థితులు ఏవి?
1) మేఘరహితమైన సుదీర్ఘమైన శీతాకాలపు రాత్రులు
2) మేఘావృతమైన వేసవికాలపు రాత్రుల్లో నెమ్మదిగా వికిరణం
3) ఉష్ణ ఉపరితలం ప్రాంతం మీద చల్లటి గాలి చలనం 4) ఏదీకాదు - ఖండాంతర పర్వత లోయల్లో నివసించే వారు నివాస గృహాలను లోయ దిగువన కాకుండా లోయ వాలులో కట్టుకోవడానికి కారణం?
1) లోయ దిగువ భాగాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండటం
2) కొండరాళ్లు జారిపడతాయన్న భయం వల్ల
3) ఉష్ణోగ్రత విలోమం కారణంగా లోయ వాలుల వెంట ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండటం
4) పైవన్నీ - సూర్యాస్తమయం తరువాత కూడా వాతా వరణం కొంత వేడెక్కడానికి కారణం?
1) భూమికి చెందిన రేడియోధార్మికత
2) భౌమవికిరణం
3) అగోచరమైన సౌరవికిరణం
4) సంపీడన ఉష్ణం - ధృవప్రాంతాల్లో సాధారణంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉండటానికి కారణం?
ఎ. పగలు తక్కువగా ఉండటం
బి. సౌరకిరణాలు ఏటవాలుగా పడటం
సి. అధిక పీడనం
డి. హిమానృతానికి చెందిన అధిక ఆల్బిడో
1) ఎ, బి 2) బి, సి, డి
3) బి, డి 4) పైవన్నీ - ఉత్తరార్ధ గోళంతో పోలిస్తే దక్షిణార్ధ గోళంలో సమోష్ణరేఖలు క్రమంగాను, దూరం దూరంగాను ఉండటానికి కారణం?
1) దక్షిణార్ధగోళం గ్రహించే సౌరపుటం అధికంగా ఉండటం
2) దక్షిణార్ధగోళంలో జలభాగం హెచ్చుగా ఉండటం
3) దక్షిణార్ధగోళంలో సముద్ర ప్రవాహాలు అధికంగా ఉండటం
4) పైవన్నీ - సముద్ర మట్టం నుంచి పైకి వెళ్లే కొద్ది పీడనం ఏ రేటు చొప్పున తగ్గుతుంది?
1) 100 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్
2) 1000 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్
3) 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్
4) 100 మీటర్ల ఎత్తుకు 10 మిల్లీబార్ - పీడన ప్రవణత అంటే?
1) ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ప్రతి
యూనిట్ దూరానికి పీడనంలో చోటుచేసుకునే వ్యత్యాసం
2) ప్రతి యూనిట్ దూరానికి పీడనంలో చోటు చేసుకునే మార్పురేటు
3) ప్రతి యూనిట్ దూరానికి పీడనం పెరుగుదల
4) ఏదీకాదు - పవన వేగాన్ని కొలిచే సాధనం?
1) ఎనిమోమీటర్ 2) విండ్రోమ్
3) బారోమీటర్ 4) ఆగ్రోమీటర్ - ప్రపంచ పవనాలు అంటే?
1) ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వీచే పవనాలు
2) సముద్రం నుంచి భూమిపైకి వీచే పవ నాలు
3) భూమి నుంచి ఇతర గ్రహాల మీదికి వీచే పవనాలు
4) పీడన వలయాల మధ్య వీచే పవనాలు - కింది వాటిని జతపర్చండి
ఎ. శాంతా అనా 1. అర్జెంటీనా
బి. చినూక్ 2. ఆల్ఫ్స్
సి. ఫాన్ 3. రాకీస్
డి. జొండా 4. కాలిఫోర్నియా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1 - బ్లిజార్డ్లంటే ఏమిటి?
1) సహారాలో వేగంగా వీచే వేడి గాలులు
2) ఆస్ట్రేలియాలో వేగంగా వీచే వేడి గాలులు
3) ధృవ ప్రాంతాల్లో వీచే వేగవంతమైన శీతల పవనాలు
4) చైనా సముద్రంలోని చక్రవాత తుఫానులు - రుతుపవనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
1) భూమి నీరు విభిన్న రీతుల్లో ఉష్ణాన్ని గ్రహించడం, చల్లబడటం
2) ఎగువ ట్రోపో ఆవరణంలో వీచే ‘జెట్’ ప్రహహాలు
3) 1 మాత్రమే 4) 1, 2 - ఒకే స్థలంలో రెండు రేఖలు కలిసి ఒకే వర్షపాతాన్ని కలిగి ఉండేదానిని ఏమని పిలుస్తారు?
1) ఐసోబార్స్ 2) ఐసోహైట్స్
3) ఐసోథెర్మ్స్ 4) ఐసోహలైన్స్ - కింది వాటిని జతపర్చండి
ఎ. బ్రిక్ ఫీల్డర్స్ 1. ఉత్తర కాలిఫోర్నియా
బి. సిరోకా 2. ఆస్ట్రేలియా
సి. బెర్గ్ 3. మధ్యధరా
డి. నార్తర్ 4. ఆఫ్రికా
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4 - గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ధ్రత ఏమవుతుంది?
1) పెరుగుతుంది
2) మార్పు చెందుతుంది
3) తగ్గుతుంది
4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు - మేఘాలు ఏర్పడటానికి కారణం ఏమిటి?
1) సముద్రాల నుంచి నీరు భాష్పీభవనం చెందడం
2) వాతావరణంలో నీటి ఆవిరి
సాంద్రీకరణం
3) పైకి పోతున్న వాయు ప్రవాహాలు
4) కిందికి పోయే వాయు ప్రవాహాలు - తుఫాన్ ఆగమనాన్ని సూచించే మేఘాలు?
1) క్యుములోనింబస్ 2) సిర్రోక్యుములస్
3) నింబోస్ట్రాటస్ 4) సిర్రోస్ట్రాటస్ - అవపాతం అంటే ఏమిటి?
1) గాలిలోని నీటి ఆవిరి వర్షం రూపంలో భూమి మీదకు చేరుకోవడం
2) నీటి ఆవిరి ఘనరూపంలో భూమికి
చేరుకోవడం
3) నీటి ఆవిరి ద్రవ, ఘన రూపాల్లో భూమిని చేరుకోవడం
4) పైవన్నీ
2 - ఏ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి సంభవిస్తుంది?
1) క్యుములోనింబస్ 2) సిర్రస్
3) నింబోస్ట్రాటస్ 4) ఆల్టోక్యుములస్ - మేఘావృతమైన రాత్రుల కంటే నిర్మల ఆకాశం గల రాత్రులు చల్లగా ఉంటాయి. కారణం ఏమిటి?
1) అవపాతం 2) ద్రవీభవనం
3) సూర్యపుటం 4) వికిరణం - బంగాళాఖాతంలోని ఉష్ణమండలం చక్రవాతాలను ఏమంటారు?
1) టైపూన్లు 2) టోర్నడోలు
3) వాయుగుండాలు 4) విల్లీ-విల్లీస్ - భూమధ్యరేఖా ప్రాంత శీతోష్ణస్థితిని కలిగిన ప్రాంతాలేవి?
1) దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ లోయ ప్రాంతం
2) ఆఫ్రికాలోని కాంగో నదీలోయ ప్రాంతం
3) ఆగ్నేయాసియాలోని మలేషియా,
ఇండోనేషియా, న్యూగినియా, బోర్నియాలతో కూడిన ప్రాంతం
4) పైవన్నీ - ఏ మండలంలోని చెట్లకు పందిరిలాంటి శీర్షభాగాలు ఉంటాయి?
1) భూమధ్యరేఖ మండలం
2) భూమధ్యరేఖ ప్రాంతం
3) మధ్యధరా మండలం
4) సవానా మండలం - ‘బేలూకర్’ అంటే ఏమిటి?
1) మధ్య ఆఫ్రికా ఆదిమ తెగలు
ఉపయోగించే ఆయుధం
2) మలేషియాలో పెరిగే గౌణ అడవులు
3) అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బరు తోటలు
4) ఏదీకాదు - సుమత్రా దీవుల్లో నివసించే ఆదిమజాతి?
1) హెడ్ హంటర్స్ 2) సెమాంగ్
3) కాబూజాతి 4) వెడ్డా - చెట్ల కొమ్మలపై గుడిసెలను నిర్మించుకుని జీవించే భూమధ్యరేఖా జాతి ఏది?
1) దయాక్ 2) హెడ్ హంటర్స్
3) సెమాంగ్ 4) వెడ్డా - రబ్బరు తోటలు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి?
1) సమశీతోష్ణ అటవీ ప్రాంతం
2) స్టెప్పీ అటవీ ప్రాంతం
3) పంపాస్
4) భూమధ్యరేఖ అటవీ ప్రాంతం - భూమధ్యరేఖా అడవుల్లో పెరిగే వృక్షాలు?
1) పైన్, స్ప్రూస్, దేవదార్, ఫర్
2) ఆలివ్, సిడార్, పైన్
3) ఎబోని, మహాగని, రోజ్‌వుడ్, సింకోనా
4) టేకు, సాల్, చందనం - సవన్నాప్రాంతం ఏ ఖండంలో అధికంగా విస్తరించి ఉంది?
1) ఆఫ్రికా 2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా 4) యూరప్ - సవన్నా మండలాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) ఈశాన్య పవనాల మండలం
2) వ్యాపార పవనాల మండలం
3) నైరుతి పవనాల మండలం
4) వాయవ్యపవనాల మండలం - ‘ఎలిఫెంట్ గ్రాస్’ ఏ ప్రాంతంలో అధికంగా పెరుగుతుంది?
1) మధ్యధరా మండలం
2) భూమధ్యరేఖామండలం
3) అయనరేఖాప్రాంతం
4) సవన్నా ప్రాంతం - ఉష్ణమండల ఎడారులు సాధారణంగా?
1) వ్యాపార పవనాల మేఖలలో ఖండాల తూర్పు అంచున నెలకొని ఉంటాయి
2) వ్యాపార పవనాల మేఖలలో ఖండాల పశ్చిమ అంచున నెలకొని ఉంటాయి
3) వ్యాపార పవనాల మేఖలలో ఖండాల పశ్చిమ భాగంలో ఉంటాయి
4) వ్యాపార పవనాల మేఖలలో ఖండాల తూర్పు భాగంలో ఉంటాయి - ఉష్ణమండల ఎడారులు లేని ఖండం?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆస్ట్రేలియా 4) ఐరోపా - ప్రపంచంలో ‘ఎడారి లాంటి ఎడారి’ అని దేన్ని పిలుస్తారు?
1) సహారా 2) నమీబియా
3) అటకామా 4) రుబాలీఖలి - ఎడారి జాతుల్లో సంచార జీవనం గడిపే జాతులేవి?
1) బిండిబాటు 2) బుష్మెన్
3) టౌరేగులు 4) పైవన్నీ - జెరోఫైటిక్ మొక్కలు ఎలాంటి ప్రాంతాల్లో పెరుగుతాయి?
1) పుష్కలంగా తేమ ఉన్న ప్రాంతాల్లో
2) తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో
3) తేమ మారుతూ ఉండే ప్రాంతాల్లో
4) తగినంత తేమ ఉన్న ప్రాంతాల్లో
- Tags
Previous article
స్టీల్ అథారిటీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Next article
వచ్చేనెల 1 నుంచి కేవీల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు