శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ?
- రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది?
1) సర్దుబాటు విధానాలు
2) అభ్యసన పద్ధతులు
3) ప్రేరణ రకాలు
4) వికాస దశలు - సాంఘిక పరిణతి లేని వ్యక్తి లక్షణం?
1) అందరితో సహకరించడం
2) బాధ్యత వహించడం
3) ప్రేమానురాగాలు కలిగి ఉండటం
4) ఒడిదొడుకులను తట్టుకోలేకపోవడం - కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు కారణం?
1) శారీరక వికాసం వేగంగా జరుగుతుంది
2) మానసిక వికాసం వేగంగా జరుగుతుంది
3) శారీరక, మానసిక వికాసం రెండూ వేగంగా జరుగుతాయి 4) ఏదీకాదు - పూర్వ బాల్యదశలో బోధనోపకరణలు ఉపయోగించమని సూచించడానికి గల కారణం?
1) పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కాబట్టి
2) పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి
3) పిల్లలు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కాబట్టి
4) పైవన్నీ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ‘ఆత్మ భావన’ ప్రారంభమయ్యే దశ?
1) యవ్వనారంభ దశ
2) ఉత్తర బాల్యదశ
3) పూర్వ బాల్యదశ
4) కౌమార దశ - కింది వాటిలో మానవ జీవితం దేని నుంచి ప్రారంభమవుతుంది?
1) భ్రూణం (ఫీటస్)
2) సంయుక్త బీజం (జైగోట్)
3) పిండం (ఎంబ్రియో)
4) శిశువు (చైల్డ్) - శిశువులో నైపుణ్యాలు పూర్తిస్థాయిలో వికసించకపోవడంవల్ల తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ?
1) పూర్వ బాల్యదశ 2) శైశవ దశ
3) యవ్వనావిర్భావ దశ
4) ఉత్తర బాల్యదశ - శిశువులో మొదటగా వికాసం చెందే, శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా?
1) స్పర్శ, రుచి 2) దృష్టి, వాసన
3) వినడం, దృష్టి 4) స్పర్శ, దృష్టి - చతురస్రాకారంలో ఉండే మొండెం క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ?
1) శైశవ దశ 2) ఉత్తర బాల్యదశ
3) పూర్వ బాల్యదశ 4) నవజాత శిశుదశ - పీయూషగ్రంథి విడుదలచేసే హార్మోన్ వల్ల శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) యవ్వనారంభ దశ - చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ?
1) శైశవ దశ 2) కౌమార దశ
3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యదశ - వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల ఏ దశలో జరుగుతుంది?
1) యవ్వనారంభ, కౌమార దశల్లో
2) జనన పూర్వ, యవ్వనారంభ దశల్లో
3) బాల్యదశ, యవ్వనారంభ దశల్లో
4) శైశవ, బాల్య దశల్లో - శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పర్చుకుంటాడు?
1) వేళ్లు 2) చేతులు
3) వెన్నుపాము 4) తల - పిల్లలు బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మనైపుణ్యాలతో పాటు, స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను నేర్చుకొనే దశ?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) యవ్వనారంభ దశ - శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ?
1) కౌమార దశ 2) వృద్ధాప్య దశ
3) వయోజన దశ 4) యవ్వనారంభ దశ - పిల్లలకు వారి సాంఘికమితి స్థితే కాకుండా ఇతరుల సాంఘికమితి గురించిన అవగాహన ఏర్పడే దశ?
1) కౌమార దశ 2) శైశవ దశ
3) వయోజన దశ 4) ఉత్తర బాల్యదశ - ఏ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది?
1) కౌమార దశ 2) వయోజన దశ
3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యదశ - వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ, మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ?
1) పూర్వ బాల్యదశ 2) కౌమార దశ
3) ఉత్తర బాల్యదశ 4) వయోజన దశ - తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ?
1) బాల్యదశ 2) శైశవ దశ
3) యవ్వనారంభ దశ 4) కౌమార దశ - శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ?
1) కౌమార దశ 2) శైశవ దశ
3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యదశ - శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ?
1) కౌమార దశ 2) యవ్వనారంభ దశ
3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యదశ - శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకొనే దశ?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) యవ్వనారంభ దశ - శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండటం మనకు ఏ దశలో కనిపిస్తుంది?
1) ఉత్తర బాల్యదశ 2) శైశవ దశ
3) పూర్వ బాల్యదశ 4) యవ్వనారంభ దశ - శిశువు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతడు సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా? కోపిష్టిగా మారుతాడా? అని తెలిపే దశ?
1) పూర్వ బాల్యదశ 2) శైశవ దశ
3) ఉత్తర బాల్యదశ 4) యవ్వనారంభ దశ - ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య తనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను, కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తుంది. నైతిక వికాసపరంగా రమ్య ఏ దశకు చెందుతుంది?
1) పూర్వ బాల్యదశ 2) ఉత్తర బాల్యదశ
3) శైశవ దశ 4) యవ్వనారంభ దశ - వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు?
1) భయం, ఆనందం, విచారం
2) కోరిక, ఆనందం, భయం
3) సంతోషం, భయం, కోపం
4) సంతోషం, దుఃఖం, కోరిక - శారీరక, మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా?
1) శైశవ, కౌమార దశలు
2) శైశవ, పూర్వ బాల్యదశలు
3) యవ్వన, కౌమార దశలు 4) ఏదీకాదు - శిశువు భాషాభాగాలను ఉపయోగించి 6 నుంచి 8 పదాలున్న వాక్యాలు మాట్లాడే దశ?
1) శైశవ దశ 2) ఉత్తర బాల్యదశ
3) యవ్వనావిర్భావ దశ
4) పూర్వ బాల్యదశ - కింది ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగా జీవిత పర్యంతం వికాసం జరుగుతుంది?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) కౌమార దశ 4) యవ్వనారంభ దశ - ఒక వ్యక్తి తనను నిరంతరం బాధకు గురిచేసే విషయాల వల్ల కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషం కలిగించే వేరే పనుల్లో నిమగ్నం కావడాన్ని తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దశ, అతడిలో జరిగిన అభ్యసనం, ఆ విధానాలు వరుసగా?
1) ఉత్తర బాల్యదశ, యత్నదోష అభ్యసన పద్ధతి, ఉద్వేగ కేథార్సిస్
2) పూర్వ బాల్యదశ, ఉద్వేగ కేథార్సిస్, యత్నదోష అభ్యసనం
3) ఉత్తర బాల్యదశ, అంతరదృష్టి అభ్యసనం, ఉద్వేగ కేథార్సిస్
4) పూర్వ బాల్యదశ, నిబంధనం, ఉద్వేగ కేథార్సిస్ - మహాత్ముని జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ జయతే అనే సూక్తిని గౌరవించి ఆ నియమాన్ని పాటించాడు. పవన్లో పెంపొందిన వికాసం?
1) నైతిక వికాసం 2) సాంఘిక వికాసం
3) ఉద్వేగ వికాసం 4) మానసిక వికాసం - గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పనిచేసినప్పుడు తప్పు అని, పొగడ్త కాని, బహుమానం కాని లభించే పని ఒప్పు అని అనుకుంటుంది. గీత ఏ వికాస దశకు చెందుతుంది?
1) ఉత్తర బాల్యదశ 2) యవ్వన దశ
3) కౌమార దశ 4) పూర్వ బాల్యదశ - ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటల్లో నిందాస్తుతితో వ్యంగ్యాన్ని అర్థం చేసుకొనే దశ?
1) శైశవ దశ 2) కౌమార దశ
3) ఉత్తర బాల్యదశ 4) పూర్వ బాల్యదశ - మానసిక వికాసం లక్షణం కానిది?
1) మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం
2) మూర్త, అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం
3) వివిధ రకాల భావనలు కలిగి ఉండటం
4) సహకార భావం కలిగి సామాజిక బాధ్యతల్లో పాలుపంచుకోవడం - కింది వాటిలో సరికానిది?
1) ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ- పూర్వ బాల్యదశ
2) శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ- శైశవ దశ
3) భయాన్ని కలిగించే దశ- కౌమార దశ
4) భిన్న లింగేయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ- ఉత్తర బాల్యదశ - సామాజిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం, తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ వికాసం, ఏ దశకు చెందింది?
1) సాంఘిక, బాల్యదశ
2) ఉద్వేగ, శైశవ దశ
3) నైతిక, బాల్యదశ
4) సాంఘిక, కౌమార దశ - కిరణ్ అనే విద్యార్థి తనకెంతో నచ్చిన పెన్నును తన స్నేహితుడి వద్ద నుంచి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు. కిరణ్ నైతిక వికాస దశ?
1) ఉత్తర బాల్యదశ 2) పూర్వ బాల్యదశ
3) యవ్వన దశ 4) కౌమార దశ - మూర్త భావనలతోపాటు అమూర్త భావనలను అర్థం చేసుకొనే దశ?
1) యవ్వనారంభ దశ
2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ
4) కౌమార దశ - కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడే ఉద్వేగం?
1) ఆర్తి 2) ఉత్సాహం
3) విస్మయం 4) సృజనశీలత - శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ, అనుకరణ అధికంగా ఉండే దశ, తార్కిక, పరిశీలన, ఆలోచన, వివేచనా శక్తులు అధికంగా ఉండే దశ?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) కౌమార దశ - శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వల్ల శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకొనే దశ?
1) పూర్వ బాల్యదశ 2) కౌమార దశ
3) ఉత్తర బాల్యదశ 4) శైశవ దశ - అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ?
1) ఉత్తర బాల్యదశ 2) కౌమార దశ
3) పూర్వ బాల్యదశ 4) యవ్వన దశ - ఉద్వేగ అస్థిరత్వంగల దశ?
1) శైశవ దశ 2) బాల్యదశ
3) కౌమార దశ 4) వయోజన దశ - వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాటుల పరంగా క్లిష్టమైన దశ?
1) కౌమార దశ 2) శైశవ దశ
3) పూర్వ బాల్యదశ 4) ఉత్తర బాల్యదశ - పిల్లలు ఆటవస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరికొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట?
1) ఏకాంతర క్రీడ 2) ప్రతీకాత్మక క్రీడ
3) సాంఘిక క్రీడ 4) సమాంతర క్రీడ - పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయస్సు?
1) సంవత్సరంలోపు 2) 2 సంవత్సరాలు
3) 3-4 సంవత్సరాలు
4) 1-2 సంవత్సరాలు - చింతన, అవధానం, సమస్యా పరిష్కారం అనేవి దేని కిందకు వస్తాయి?
1) మానసిక వికాసం 2) ఉద్వేగ వికాసం
3) నైతిక వికాసం 4) శారీరక వికాసం - వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ?
1) నవజాత శిశువు దశ
2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) శైశవ దశ - భాషా వికాసంలో మూడో దశ?
1) ప్రాగ్భాషా దశ
2) ముద్దు మాటల దశ
3) శబ్దానుకరణ దశ
4) భాషావగాహన దశ - పిల్లల వికాసంలో ‘ముఠా దశ’గా పేర్కొనే దశ?
1) ఉత్తర బాల్యదశ 2) పూర్వ బాల్యదశ
3) యవ్వనారంభ దశ 4) కౌమార దశ
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
Previous article
కనుపాపను నియంత్రించే నాడీవ్యవస్థ?
Next article
మధ్యధరా శీతోష్ణస్థితికి గల మరొక పేరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు