కనుపాపను నియంత్రించే నాడీవ్యవస్థ?
- మానవునిలో చిన్న ఎముక ఏది?
1) జత్రుక 2) స్టెపిన్
3) ఉరోమేఖల 4) భుజాస్థి - కంటిలోని కిటికి అని దేనికి పేరు?
1) కంటిపొర 2) శుక్లపటలం
3) కనుపాప 4) నేత్రపటలం - చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి?
1) స్పర్శగ్రాహకాలు 2) నాసిసెప్టార్స్
3) ఫాసియన్ కణాలు 4) ఉష్ణగ్రాహకాలు - చర్మం బరువు ఎంత?
1) 400 కి.గ్రా 2) 4 కి.గ్రా
3) 2 కి.గ్రా 4) 14 కి.గ్రా - కప్పలో భూమి మీద దేని ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది?
1) ఊపిరితిత్తులు 2) చర్మం
3) అస్యకుహరం 4) యూరోక్రోమ్ - మానవుడిని ఇతర జంతువులతో పోల్చినప్పుడు వాసన పసిగట్టే సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది?
1) ఎక్కువ 2) తక్కువ
3) సమానం 4) మధ్యస్థం - మానవుడు పీల్చే గాలిలో కంటే విడుదల చేసే గాలిలో తక్కువగా ఉండే వాయువు?
1) ఆక్సిజన్ 2) కార్బన్‌డైఆక్సైడ్
3) నైట్రోజన్ 4) జడవాయువులు - ఆహారం ముక్కలు చేసేందుకు తోడ్పడే దంతాలు ఏవి?
1) కోరపళ్లు 2) రదనికలు
3) కుంతకాలు 4) విసురు దంతాలు - గుండె గదులకు రక్తాన్ని సరఫరా చేసేవి?
1) కరోనరి సిర 2) కరోనరీ ధమని
3) పుపుస సిర 4) పుపుస ధమని - గుండెను అఘాతాల నుంచి కాపాడేది?
1) పుపుస ద్రవం
2) మస్తిష్క మేరుద్రవం
3) హృదయావరణ ద్రవం
4) సిలోమర్ ద్రవం - ఏ ధమని ద్వారా మలిన రక్తం ప్రవహిస్తుంది?
1) కరోటిడ్ ధమని 2) పుపుస ధమని
3) ఎడదైహిక మహా ధమని
4) ఉదరాంత్ర ధమని - నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు ?
1) సమానంగా ఉంటాయి
2) నాడీ స్పందన రేటు కంటే హృదయ స్పందన రేటు ఎక్కువ
3) హృదయ స్పందన రేటు కంటే నాడీ స్పందన రేటు ఎక్కువ
4) ఏదీకాదు - ద్వివలయ రక్తప్రసరణలో రక్తం గుండె ద్వారా ఎన్నిసార్లు ప్రవహిస్తుంది?
1) ఒకసారి 2) రెండుసార్లు
3) మూడుసార్లు 4) నాలుగుసార్లు - రక్తం గడ్డకట్టిన తర్వాత పైన పేరుకునే ద్రవం?
1) ప్లాస్మా 2) శోషరసం
3) సీరం 4) ఏదీకాదు - రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం?
1) 2 నిమిషాలు
2) 3-6 నిమిషాలు
3) 9 నిమిషాలు
4) 15-20 నిమిషాలు - ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయినప్పుడు గర్భధారణకు తోడ్పడే పద్ధతిని ఏమంటారు?
1) V.I.F 2) I.F.V
3) Test Tube Baby
4) I.V.F - మానవునిలో మెదడు బరువు శరీర బరువులో ఎంత శాతం ఉంటుంది?
1) 20% 2) 2% 3) 2.5% 4) 1.5% - వాసనను తెలియజేసే మెదడు భాగం ఏది?
1) దృష్టిలంబికలు 2) హైపోథాలమస్
3) ఘ్రాణలంబికలు 4) థెలామస్ - కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది?
1) అనుమస్తిష్కం 2) హైపోథాలమస్
3) సెరిబెల్లమ్ 4) ద్వారగోర్థం - మానవ దేహంలో పొడవైన కణం?
1) అండం 2) శుక్రకణం
3) న్యూరాన్ 4) ఏదీకాదు - కనుపాపను నియంత్రించే నాడీ వ్యవస్థ?
1) కేంద్రీయ నాడీవ్యవస్థ
2) పరిదీయ నాడీవ్యవస్థ
3) స్వయంచోదిత నాడీవ్యవస్థ
4) జీర్ణనాళ నాడీవ్యవస్థ - ఎర్రరక్తకణాల స్మశాన వాటిక?
1) ఉండుకం 2) పిత్తాశయం
3) క్లోమం 4) ప్లీహం - అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో జీవించే జీవులు?
1) శైవలాలు 2) బ్యాక్టీరియాలు
3) శిలీంధ్రాలు 4) ప్రొటోజోవా - మట్టిలో ఉండి మానవునిలోకి గాయాల ద్వారా ప్రవేశించి ధనుర్వాతం కలిగించేది?
1) క్లాస్ట్రీడియం బాటులీనమ్
2) మెగాస్కోలెక్స్
3) ప్లాస్మోడియం
4) క్లాస్ట్రీడియం టెటానై - పైకాలజీ అనేది దేని గురించి తెలియజేస్తుంది?
1) శిలీంధ్రాలు 2) ఫంగై
3) ఆల్గే 4) ప్రొటోజోవా - పంట మొక్కలను ఎక్కువగా నష్టపరిచేవి?
1) బ్యాక్టీరియా 2) శిలీంధ్రం
3) వైరస్ 4) ఏదీకాదు - స్వపరాగ సంపర్కం ఏ మొక్కల్లో జరుగుతుంది?
1) పొగాకు 2) మామిడి
3) సీతాఫలం 4) బఠానీ, పొగాకు - అరటి పిలక మొక్కలను ఏమంటారు?
1) కొమ్ము 2) రైజోమ్
3) సోర్డు సక్కర్లు 4) అన్ని - అసంకల్పిత ప్రతీకార చర్యల్లో పాల్గొనే మానవ దేహంలోని భాగం ఏది?
1) మెదడు 2) వెన్నుపాము
3) 1, 2 4) ఏదీకాదు - శరీరంలోని కణాంతరావకాశాల్లోకి నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లు కనిపించే వ్యాధి?
1) క్యాషియార్కర్
2) మరాస్మస్
3) స్థూలకాయత్వం
4) రికెట్స్ - మరాస్మస్ వ్యాధికి కారణం?
1) ప్రొటీన్ల లోపం
2) కేలరీల లోపం
3) ప్రొటీన్, కేలరీలలోపం
4) విటమిన్ల లోపం - హానికర రక్తహీనతను కలుగజేసే విటమిన్?
1) బి1 2) బి2 3) బి6 4) బి12 - కాల్సిఫెరాల్ లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి?
1) రికెట్స్ 2) గాయిటర్
3) స్టెరిలిటి 4) యాంటీబ్లీడింగ్ - పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ద్రవం?
1) ఆల్కహాల్ 2) అయోడిన్
3) KOH 4) మొలాసిన్ - నియాసిన్/ నికోటినికామ్లం లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి 2) ఎనిమియా
3) పెల్లాగ్రా 4) హానికర రక్తహీనత - ‘వెజిటెబుల్ కార్వింగ్’ అంటే?
1) కూరగాయలను కొనడం
2) కూరగాయలను రిఫ్రిజిరేటర్లో దాచడం
3) కూరగాయలను వండటం
4) కూరగాయలను వివిధ ఆకారాలు,
డిజైన్లతో అలంకరించడం - ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే బ్యాక్టీరియా?
1) లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా
2) లాక్టోబాసిల్లన్
3) ఆర్కే (సల్ఫర్ బ్యాక్టీరియా)
4) పైవన్నీ - ఆహారనాళంలో జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం?
1) చిన్నపేగు 2) జీర్ణాశయం
3) ఆస్యకుహరం 4) నోరు - మానవునిలో ‘గవద బిళ్లల వ్యాధి’ కి గురయ్యే లాలాజల గ్రంథులు?
1) నిమ్ననేత్ర 2) పెరోటిక్
3) అధోజిహ్విక 4) అధోజంభిక - వానపాములో శ్వాసాంగం ఏది?
1) ఊపిరితిత్తులు 2) చర్మం
3) మొప్పలు 4) వాయునాళ శ్వాసక్రియ - ప్రోత్రాంబిన్‌ను త్రాంబిన్‌గా మార్చడానికి త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. దీనిని విడుదల చేసేవి?
1) RBCలు 2) WBCలు
3) రక్తఫలకికలు 4) గ్రాన్యులోసైట్లు - కింది వాటిలో వేటిని సూక్ష్మరక్షకభటులు అంటారు?
1) ఎసిడోఫిల్ 2) బేసోఫిల్స్
3) లింఫోసైట్లు 4) న్యూట్రోఫిల్స్ - ముష్కాల నుంచి ఏర్పడే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) టెస్టోస్టిరాన్
3) ప్రొజెస్టిరాన్ 4) ప్రోలాక్టిన్ - తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం వంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది?
1) మజ్జాముఖం 2) అనుమస్తిష్కం
3) మస్తిష్కం 4) ఏదీకాదు - క్షయవ్యాధి ఏ సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్యాక్టీరియా 4) వైరస్ - జీర్ణాశ్రయంలో అల్సర్ కలిగించే బ్యాక్టీరియా ఏది?
1) హెలికో బ్యాక్టీరియా 2) రైజోబియం
3) క్లాస్ట్రీడియం 4) ఈ-కొలై - ట్రిపుల్ యాంటీజెన్ ద్వారా నియంత్రించే వ్యాధి?
1) డిఫ్తీరియా 2) కోరింత దగ్గు
3) టిటనస్ 4) పైవన్నీ - డెంగ్యూ వ్యాధికి వాహకంగా పనిచేసేది?
1) అనాఫిలిస్ 2) క్యూలెక్స్
3) ఎడిస్ 4) ట్సి-ట్సి - కలరా వ్యాధికి కారణమైన దోమ?
1) విబ్రియో 2) బోర్డ్డుటెల్లా
3) క్లాస్ట్రీడియం 4) అజోస్పైరిల్లమ్ - ఎర్రరక్తకణాల జీవిత కాలం?
1) 10-12 రోజులు 2) 12-13 రోజులు
3) 120 రోజులు 4) 140 రోజులు
ఇవీ కూడా చదవండి…
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న పీఠం?
‘డెవలప్మెంట్ సైకాలజీ’ గ్రంథ రచయిత?
- Tags
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు