వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువులు?
- రాకెట్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది?
1) శక్తి నిత్యత్వ నియమం
2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
3) ద్రవ్య నిత్యత్వ నియమం
4) గురుత్వాకర్షణ బలం - ఏ బలం కారణంతో వస్తువు మార్గం వృత్తాకారం అవుతుంది?
1) అపకేంద్రబలం 2) అభికేంద్ర బలం
3) కృత్రిమ బలం 4) రేఖీయ బలం - గమనంలో ఉన్న రైలు నుంచి ఒక వస్తువు కిందకు జార విడిచితే రైలులో ఉన్న వ్యక్తి దాని మార్గం ఎలా ఉందని భావిస్తాడు?
1) పరావలయం
2) సరళరేఖా మార్గంలో కిందకు
3) క్షితిజ సమాంతరం 4) ఏదీకాదు - వాతావరణ పీడనం ఒక్కసారిగా పడిపోతే (తగ్గిపోతే) అది దేనిని సూచిస్తుంది?
1) రాబోయే వర్షాన్ని
2) ప్రశాంత వాతావరణాన్ని
3) రాబోయే తుఫాన్‌ను
4) చల్లటి గాలులను - కింది వాటిలో నీటితో ఆర్పని మంటలు?
1) ప్లాస్టిక్ మంటలు
2) చమురు మంటలు
3) పిడుగు వల్ల కలిగే మంటలు
4) వస్ర్తాలు కాలడం వల్ల కలిగే మంటలు - నీటి మీద నూనె బిందువు వ్యాపించడానికి కారణం?
1) నీటి కంటే నూనె తలతన్యత తక్కువ
2) నూనె సాంద్రత నీటి కంటే తక్కువ
3) నూనె సాంద్రత నీటి కంటే ఎక్కువ
4) ఏదీకాదు - చమురు బావిలో చమురు, వాయువు, నీరు కింది నుంచి పైకి ఉండే క్రమం?
1) చమురు, వాయువు, నీరు
2) నీరు,వాయువు, చమురు
3) వాయువు, చమురు, నీరు
4) నీరు, చమురు, వాయువు - ఓజోన్ అనేది?
1) ఆక్సిజన్ రూపాంతరం
2) హైడ్రోజన్ రూపాంతరం
3) నైట్రోజన్ రూపాంతరం
4) ఏదీకాదు - టాబ్లెట్ లేదా పొడి స్థితిలో ఉన్న ఔషధాల సీసాలో సిలికాజెల్తో ఉన్న చిన్న సంచీని ఉంచుతారు కారణం ఏమిటి?
1) బ్యాక్టీరియాను చంపుతుంది
2) తేమను గ్రహిస్తుంది
3) అవసరం లేని వాయువులను గ్రహిస్తుంది
4) సూక్ష్మక్రిముల గుడ్లను చంపుతుంది - రసాయన ఎరువులో ఉండే పదార్థాలు?
1) ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం
2) నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం
3) ఇనుము, పొటాషియం, నైట్రోజన్
4) మెగ్నీషియం, కాల్షియం, కాపర్ - పొడి బ్యాటరీల్లో ఉపయోగించే ఆమ్లం?
1) సజల నత్రికామ్లం
2) సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) నత్రికామ్లం
4) ఆకావరీజియా - ఎలక్ట్రిక్ బల్బు పగిలినప్పుడు టప్మని పెద్ద శబ్దం వస్తుంది కారణం?
1) లోపలి వాయువు ఒక్కసారిగా
బయటకు రావడం వల్ల
2) బయటిగాలి బల్బులో ఉన్న
శూన్యంలోనికి ఒక్కసారిగా ప్రవేశించడం వల్ల
3) గాజు బల్బు కావడం వల్ల
4) ఏదీకాదు - ఒక వాహనపు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిజశక్తి విలువ?
1) నాలుగు రెట్లు పెరుగుతుంది
2) ఆరు రెట్లు పెరుగుతుంది
3) ఎనిమిది రెట్లు పెరుగుతుంది
4) 16 రెట్లు పెరుగుతుంది - ఒక వస్తువు భారం చంద్రునిపై ఎంత ఉంటుంది?
1) భూమిపై దాని భారంలో 1/2వ వంతు
2) భూమిపై దాని భారంలో 1/4వ వంతు
3) భూమిపై దాని భారంలో 1/6 వంతు
4) భూమిపై దాని భారంలో 6 రెట్లు - వాహనాల టైర్ల పైభాగాన్ని కాలువల వంటి ముడుతలుగా, గరుకుగా చేయడానికి కారణం?
1) ఘర్షణ పెంచడానికి
2) ఘర్షణ తగ్గించడానికి
3) ఘర్షణ ప్రభావాన్ని నివారించడానికి
4) ఏదీకాదు - ఒక కిటికీ అద్దాన్ని పేల్చిన బుల్లెట్ రంధ్రం చేస్తుంది. కానీ విసిరిన రాయి కిటికీని
పగలకొడుతుంది కారణం?
1) బుల్లెట్ కంటే రాయి ద్రవ్యరాశి ఎక్కువగా ఉండటం
2) రాయి ఎక్కువ ద్రవ్యవేగాన్ని కలిగి ఉండి క్రమరహిత అభిఘాతాన్ని ఏర్పరుస్తుంది
3) గాజు ద్రవ్యరాశితో పోల్చితే బుల్లెట్ ద్రవ్యవేగం చాలా ఎక్కువ
4) ఏదీకాదు - పొగమంచు ఉన్నప్పుడు మనం చూడలేక పోవడానికి కారణం?
1) కాంతి పరావర్తనం
2) వక్రీభవనం
3) అంతర పరావర్తనం
4) కాంతి పరిక్షేపనం - మట్టి కుండలో నీరు చల్లగా ఉండటానికి కారణం?
1) మట్టి మంచి ఉష్ణబంధకం
2) బాష్పీభవన ప్రక్రియ కారణం
3) కుండకు గల సన్నటి రంధ్రాల నుంచి నీరు ఆవిరికావడం
4) మట్టి పాత్ర కావడం వల్ల - గాజు గ్లాసులో వేడినీటిని పోస్తే అది పగిలిపోతుంది కారణం ఏమిటి?
1) గాజు వేడిని గ్రహించడం వల్ల
2) గాజు వేడినీటి పీడనాన్ని తట్టుకోలేదు
3) గాజు లోపలి, బయటి తలాలు అసమాన వ్యాకోచం
4) ఏదీకాదు - ఒక చెక్క ముక్క ఉన్న మంచుగడ్డ నీటిలో తేలుతుంది. మంచు కరిగితే నీటి మట్టం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మార్పు ఉండదు 4) చెప్పలేం - ఎరువుగా వాడే ఒక అమ్మోనియం మిశ్రమం?
1) అమ్మోనియం క్లోరైడ్
2) అమ్మోనియం సల్ఫేట్
3) అమ్మోనియం పాస్ఫేట్
4) అమ్మోనియం కార్బోనేట్ - పిండి పదార్థాలు జీర్ణమయ్యేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లను స్రవించేవి ఏవి?
1) లాలాజల గ్రంథులు, క్లోమరస గ్రంథులు
2) లాలాజల గ్రంథులు, జఠరరస గ్రంథులు
3) జఠరరస గ్రంథులు, క్లోమరస గ్రంథులు
4) జఠరరస గ్రంథులు, లాలాజల గ్రంథులు - కింది వాటిలో సరైనది?
1) రక్తప్రసరణలో ఏర్పడిన గడ్డలను కనుగొనడానికి రేడియో ఐసోటోప్ సోడియం-24
2) రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించే ఐసోటోపు ఇరిడియం-192
3) క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రేడియో ఐసోటోప్ కోబాల్ట్-60
4) ట్యూమర్లు కనుగొనడానికి ఉపయోగించే ఐసోటోప్ ఆర్సెనిక్-74 - తొలి మహిళా సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ
జరిగింది?
1) ఒడిశా 2) తమిళనాడు
3) కర్ణాటక 4) కేరళ - PSLVలో వాడే ఇంధనం?
1) ఘన ఇంధనం 2) ద్రవ ఇంధనం
3) ఘన ఇంధనం (1, 3 దశల్లో)
ద్రవ ఇంధనం (2, 4 దశల్లో)
4) వాయు ఇంధనం - ‘కాస్మోనాట్స్’ అని వ్యవహరించే అంతరిక్ష నావికులు ఏ దేశానికి చెందినవారు?
1) అమెరికా 2) చైనా
3) జపాన్ 4) రష్యా - శనిగ్రహం అధ్యయనం కోసం ప్రయోగించిన వ్యోమనౌక?
1) లుంబిని 2) కేసిని
3) పాథ్‌ఫైండర్ 4) ఏరిస్ వాలిస్ - కంప్యూటర్ మైక్రోప్రాసెసర్ పని ఏమిటి?
1) కంప్యూటర్ నుంచి అవుట్‌పుట్
తీసుకోవడానికి అనుమతిస్తుంది
2) కంప్యూటర్ మీద రాయడానికి
కీ బోర్డును అనుమతిస్తుంది
3) సెంట్రల్ ప్రాసెసర్ యూనిట్ (సీపీయూ) పనులను నిర్వహిస్తుంది
4) కంప్యూటర్ను మొత్తం కంట్రోల్ చేస్తుంది - టెలివిజన్ ప్రసారంలో ధ్వని తరంగాలను ప్రసారం చేసే విధానం?
1) ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్
2) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్
3) పల్స్ కోడ్ మాడ్యులేషన్
4) టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ - వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువులు?
1) ఆక్సిజన్, హైడ్రోజన్
2) ఆక్సిజన్, నైట్రోజన్
3) హైడ్రోజన్, నైట్రోజన్
4) హైడ్రోజన్ - LPG లోఎక్కువ శాతం గల వాయువు?
1) ఈథేన్ 2) మీథేన్
3) ప్రొఫేన్ 4) బ్యూటేన్ - తెల్ల భాస్వరాన్ని దేనిలో నిల్వచేస్తారు?
1) హైపో 2) నీరు
3) కిరోసిన్ 4) ఆల్కహాల్ - అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
1) తెలుపు 2) నలుపు
3) నీలి 4) ఎరుపు - గట్టిపడే స్వభావాన్ని సిమెంట్ కలిగి
ఉండటానికి కారణం?
1) సిలికాన్ 2) జిప్సం
3) క్లే 4) సున్నం - గుండెదడను తగ్గించే రసాయనం?
1) ఎసిటిలీన్ 2) ఎసిటైల్ క్లోరిన్
3) క్రోసిన్ 4) ఆస్పిరిన్
బయోటెక్నాలజీ పదాలు: వివరణ
బయోఎక్యుములేషన్: ఆవరణ వ్యవస్థలోని జీవుల్లో పెస్టిసైడ్లు, ఇన్సెక్టిసైడ్లు వంటి రసాయనాలు చేరుతాయి. అవి విసర్జించబడకుండా జీవుల్లోనే నిల్వ ఉండటాన్ని బయోఎక్యుములేషన్ అంటారు. ఉదా: DDT
బయోకెమికల్ ఫ్యూయల్సెల్: పారిశ్రామిక, గృహవ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిచేసే ప్రక్రియ. దీనిలో మిథైల్ట్రోపిక్ సూక్ష్మజీవులను వాడుతున్నారు.
బయోలాజికల్ ఆక్సిజన్: నీటిలో చేరిన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. నీటిలో వ్యర్థాలు ఎక్కువగా ఉంటే వాటిని విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణం కూడా పెరుగుతుంది. అవి ఎంత ఎక్కువగా ఆక్సిజన్‌ను గ్రహిస్తే ఆ నీరు అంతగా కలుషితం అయిందని గ్రహించవచ్చు.
బయోకెమిస్ట్రీ: జీవుల్లోఉన్న రసాయన పదార్థాల (ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కేంద్రకామ్లాలు, లిపిడ్లు మొదలైనవి)ను అధ్యయనం చేసే శాస్త్రం.
బయోఇంజినీరింగ్: శరీరంలో పాడైపోయిన గుండె కవాటాలు, హృదయం వంటి అవయవాల స్థానంలో కృత్రిమంగా పనిచేసే అవయవాలను అమర్చడం గురించిన విజ్ఞానం. ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని జంతుశాస్త్రంలో, వైద్యరంగంలో ఉపయోగించడమే బయోఇంజినీరింగ్ అని చెప్పవచ్చు.
బయోరియాక్టర్: సూక్ష్మజీవుల సహాయంతో ఎంజైములు, ఇతర రసాయనాలు తయారు చేయడానికి పరిశ్రమల్లో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్ తొట్టి.
బయోసెన్సర్: ఎంజైములు, యాంటీబయాటిక్స్, సూక్ష్మజీవులు మొదలైన వాటిని ఉపయోగించి ఏదైనా ఒక రసాయనం జీవుల్లో ఉందేమో అని పరిశీలించడానికి, ఉంటే కొలవడానికి ఉపయోగపడే పరికరం. దీనిని రోగనిర్ధారణ పరీక్షల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు