ఎంబీఏకు ఇలా ఎంపికవుదాం!
మేనేజ్మెంట్ విద్యను అభ్యసించినవారికి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు ఆసారం ఉంది. ఉదాహరణకు కార్పొరేట్ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మారెటింగ్, అకౌంటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ ట్రావెల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫారిన్‌ట్రేడ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ వంటి విభిన్న రంగాలు. మేనేజ్మెంట్ అంటే ఒక ప్రణాళికను రూపొందించడం, నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వం నిర్వహిస్తూ ఉద్యోగులకు మార్గదర్శకత్వం చేయడం. కాబట్టి మేనేజ్మెంట్ విద్య చదవడానికి అర్హులైన విద్యార్థులను కూడా వారి అకడమిక్ నాలెడ్జ్, సిల్స్ని పరిగణనలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. ఇది రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ వంటి వివిధ అడ్మిషన్ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ఐఐఎంలు, ఇతర కళాశాలలు రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులను రెండో రౌండ్‌కు పిలుస్తారు. రెండో సెలక్షన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
అడ్మిషన్ సెలక్షన్ ప్రాసెస్
ఇంటర్వ్యూ, రైటింగ్ వివిధ ఎంబీఏ కాలేజీలు వారి సెలక్షన్ ప్రక్రియకు అనుగుణంగా రౌండ్-2ని నిర్వహించవచ్చు. మీరు చేరాలనుకుంటున్న కాలేజీ అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకొని దానికనుగుణంగా సిద్ధం కావాలి. సాధారణంగా ఎంబీఏ రెండో రౌండ్లో పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిసషన్, టీం బిల్డింగ్ యాక్టివిటీ, రైటింగ్ టెస్ట్ వంటివి ఉంటాయి.
ఇంటర్వ్యూకి ఎలా సిద్ధం కావాలి
ఇంటర్వ్యూ ప్యానెల్లో అందరూ ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ అందరి ప్రశ్నలు ఒకేలాగా స్వీకరించండి. సాధారణంగా15 నుంచి 30 నిమిషాల మధ్యలో ఇంటర్వ్యూ ఉండవచ్చు. కానీ అది ఎంత సేపైనా జరగవచ్చు. మీరు చెప్పే జవాబులను బట్టి సెలక్షన్ ఉంటుంది.
అకడమిక్స్
ఇంటర్వ్యూలో విద్యార్హతల గురించి అడగవచ్చు. చదివిన కోర్సులు అందులో ఇష్టమైన వాటి గురించి అవగాహన ఉండాలి. సర్టిఫికెట్స్, మెమోలు సిద్ధంగా పెట్టుకోవాలి. కాలేజీ రోజుల్లో పాల్గొన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి చర్చించవచ్చు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా కొన్ని పజిల్స్ వంటి ప్రశ్నలు అడిగినప్పుడు, వారు మీ ఆలోచన విధానాన్ని పరీక్షిస్తారు.
అనుభవం
కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత ఎంబీఏ చేసిన వారు మీ జాబ్ గురించి పూర్తి పట్టును ప్రదర్శించాలి. మీరు చేసిన పని, లేదా ఆ పనికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. పనిలో ఎదురొన్న చాలెంజ్‌ల గురించి మాట్లాడవచ్చు. ఉద్యోగానుభవం లేనివారు మీరు చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ గురించి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
పర్సనల్ ప్రశ్నలు: మీ గురించి మీకే అందరికన్నా బాగా తెలుసు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని ఎదురోవచ్చు. మీరు చెప్పే సమాధానాలు గుర్తుపెట్టుకోండి, వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎటువంటివైనా అడగవచ్చు. బలం, బలహీనతలు, లీడర్షిప్ సిల్స్, కమ్యూనికేషన్ సిల్స్ వంటి విషయాలను పరీక్షిస్తూ వాటికి అనుగుణంగా ప్రశ్నలు అడగవచ్చు. సమయస్ఫూర్తిని, కష్టమైన సందర్భాల్లో ఎలా ప్రతిస్పందిస్తారో తెలుసుకోడానికి కొన్ని ప్రశ్నలు స్ట్రెస్ టెస్ట్ లాగా ఉండే అవకాశం ఉంది.
జనరల్ అవేర్నెస్
ఇంటర్వ్యూ జరుగుతున్న రోజుల్లో ప్రపంచంలో ఉన్న బర్నింగ్ టాపిక్స్ అంటే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి సమగ్రంగా తెలుసుకోండి. వాస్తవాలు మాట్లాడాల్సి వస్తే నిజమని తెలిసిన వాటి గురించి మాత్రమే మాట్లాడండి. మీ ఉద్దేశాన్ని సరైన ఉదాహరణలతో తెలపండి. కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహన ఉంటే ఇంటర్వ్యూలో ఏదైనా విషయంపై మీ అభిప్రాయం అడిగితే జవాబు చెప్పవచ్చు.
రెజ్యూమే అండ్ ఫారం ఫిల్లింగ్: రాత పరీక్షలో ఉతీర్ణులైన వారిని ఇంటర్వ్యూకి పిలిచే ముందు ఫారం ఫిల్లింగ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో కొన్ని జనరల్ ప్రశ్నలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు చదివిన పుస్తకం గురించి కొన్ని వాక్యాలు రాయడం. రెజ్యూమేలో రాసిన ఎంత చిన్ని విషయం గురించైనా ప్రశ్నలు ఎదురోడానికి సిద్ధంగా ఉండాలి.
సాధారణంగా అడిగే ప్రశ్నలు
ఎంబీఏ ఎందుకు చదవాలనుకుంటున్నారు? ఈ కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? మీ గురించి చెప్పండి? ప్రస్తుతం ఉన్న కరెంట్ టాపిక్‌పై ఉద్దేశం, సాధించిన వాటి గురించి, కెరీర్, గోల్స్ గురించి చెప్పండి? జీవితంలో ఎదురొన్న సవాళ్లు లేదా అనుభవాల గురించి అడగవచ్చు. భవిష్యత్ ప్రణాళిక ఏంటి? వర్ ఎక్స్పీరియన్స్, అకడమిక్ లైఫ్ గురించి? సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి, జవాబులను బట్టి కూడా ప్రశ్నలు అడుగుతారు.
రైటింగ్ టెస్ట్‌కు ఎలా సిద్ధమవ్వాలి?
రైటింగ్ టెస్ట్ రచనా నైపుణ్యాలను పరీక్షించడానికి నిర్వహిస్తారు. ఈ పరీక్ష వ్యక్తిగత ఇంటర్వ్యూ సెషన్‌కు ముందు ఉంటుంది. కొన్ని కాలేజీలు గ్రూప్ డిసషన్కు బదులుగా ఇవి ప్రవేశ ప్రక్రియలో చేర్చారు. ఒక విషయం గురించి ఎంత స్పష్టంగా, ఎన్ని కోణాల నుంచి ఆలోచిస్తారన్నది ఇందులో పరీక్షిస్తారు.
ఇందులో ఇచ్చిన టాపిక్కు 15 నుంచి 30 నిమిషాల సమయంలో జవాబు రాయాలి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, బిజినెస్, స్పోర్ట్స్ లేదా అబ్స్ట్రాక్ట్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉండవచ్చు.
సుమారు 500 పదాలు ఉపయోగిస్తూ వ్యాసాలను రాయడం సాధన చేయాలి. రియల్ టైం ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేయండి. గ్రామర్ తప్పులు ఉండకుండా చూసుకోండి. విభిన్నమైన, సరైన పదజాలాన్ని ఉపయోగించండి.
వార్తాపత్రికలు చదివినప్పుడు అందులో ఆర్టికల్స్ రాసిన విధానాన్ని గమనించండి.
వ్యాసం రాయడం సాధన చేసేటప్పుడు సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంటర్వ్యూ, రైటింగ్ టెస్ట్‌లో ఎంత సమయం ఉంటుందో దానికనుగుణంగా సాధన చేయండి. రైటింగ్ సిల్స్ మెరుగు పరుచుకోవాలి.
ప్రతి కాలేజీ సెలక్షన్ ప్రక్రియ విభిన్నంగా ఉండవచ్చు. అలాగే ఏ పరీక్ష ప్రక్రియకు ఎంత శాతం ప్రాముఖ్యం ఇస్తున్నారనేది కూడా మారుతూ ఉంటుంది.
కొన్ని ప్రశ్నలు
సోషల్ మీడియా ప్రభావం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, స్పోర్ట్స్ భవిష్యత్తు, దేశభక్తి, జాతీయవాదం, డీమానిటైజేషన్
గ్రూప్ డిసషన్కు ఎలా సిద్ధమవ్వాలి?
ఒక విషయాన్ని ఇచ్చి కొంతమంది విద్యార్థులను ఆ విషయం గురించి చర్చించమని అడుగుతారు. ఇందులో ఎవరు చర్చ ప్రారంభిస్తున్నారు, ఎవరు ఎటువంటి విషయాలను చర్చలోకి తీసుకువస్తున్నారు, ఎవరు ఆ విషయం గురించి లోతైన అవగాహనతో మాట్లాడుతున్నారన్నది గమనిస్తారు. అలాగే చివరగా చర్చకు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు.
ఇందులో రాణించాలంటే సరిగ్గా మాట్లాడగలగాలి. ఎదుటి వారి మాటలను కూడా సరిగ్గా వినాలి. వాక్చాతుర్యానికి, వాగ్ధాటికి ఇది పరీక్ష. వార్తలు చదివినప్పుడు పై పై సమాచారంతో ఆగిపోకుండా లోతుగా చదవండి. ఆ అలవాటు ఈ రౌండ్లో బాగా ఉపయోగపడుతుంది.
మాట్లాడటానికి మీరే అవకాశం సాధించుకోవాలి. ఎవరూ మీకోసం ఆగరు. కానీ మీరు ఉపయోగించే మాటలు, మాట్లాడే విషయాల ద్వారా ఎదుటి వారిని ఆలోచింపచేస్తూ మాట్లాడే సమయాన్ని పొందవచ్చు.
అలాగే కొన్ని కళాశాలలు కొంతమంది విద్యార్థులకు కలిపి ఒక టాస్ ఇస్తారు. అది ఒక టీం సిల్స్ ని పరీక్షించినట్టు ఉంటుంది.
క్యాట్ లేదా ఇతర ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్షలు రాయడం కేవలం ఒక మెట్టు ఎకడం మాత్రమే. రెండో రౌండ్లో ఎలా ప్రదర్శించారన్న దానిని బట్టి ఫైనల్ అడ్మిషన్ ఆఫర్ నిర్ణయం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రిపేర్ అవ్వండి.
మాక్ ఇంటర్వ్యూ
మాక్ ఇంటర్వ్యూలు ఎంబీఏ ఇంటర్వ్యూకి చాలా ఉపయోగపడుతాయి. స్నేహితులతో గాని, ఉపాధ్యాయులతోనైనా మాక్ ఇంటర్వ్యూలు చేయండి. ప్రతి ఇంటర్వ్యూలో సాధారణంగా అడిగే ప్రశ్నలకు సిద్ధపడండి. మీరు చెప్పే సమాధానాలను బట్టీపట్టిన జవాబు మాదిరిగా ఉండకుండా చూసుకోండి.
పవర్ డ్రెస్సింగ్, కాన్ఫిడెన్స్: ఇంటర్వ్యూకి వేసుకునే దుస్తులపై దృష్టి పెట్టండి. బాధ్యతాయుతంగా ఉన్నవారి లాగా కనిపించాలి. కాబట్టి ప్రొఫెషనల్‌గా రెడీ అవండి. ఎంత ఆందోళనగా ఉన్నా ధైర్యాన్ని వదలకండి. మీ పట్ల నమ్మకం ఉంచుకోండి, ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ఉండండి. ఇంటర్వ్యూకి కావల్సిన కాల్ లెటర్, సర్టిఫికెట్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి.ఇంటర్వ్యూ, రైటింగ్ వివిధ ఎంబీఏ కాలేజీలు వారి సెలక్షన్ ప్రక్రియకు అనుగుణంగా రౌండ్-2ని నిర్వహించవచ్చు. మీరు చేరాలనుకుంటున్న కాలేజీ అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకొని దానికనుగుణంగా సిద్ధం కావాలి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు