విదేశీ భాషల కాణాచి ఇఫ్లూ
శరవేగంగా పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం కుగ్రామంగా మారుతుంది. ఈ సమయంలో ప్రపంచంలోని ఆయా దేశాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భాష ప్రధానం. ఆయా భాషల్లో ప్రావీణ్యము సంపాదిస్తే ఉద్యోగావకాశాలు మరింతగా పెరుగుతాయి. సుమారు ఆరు దశాబ్దాలుగా దేశంలోని విద్యార్థులకు విదేశీ భాషలను నేర్పిస్తూ ఆయా భాషలకు సంబంధించిన కోర్సులను అందిస్తున్న ఇఫ్లూలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..
ది ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. దీన్ని 1958లో హైదరాబాద్లో ప్రారంభించారు. మొదట్లో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (సీఐఈ)గా వ్యవహరించేవారు. మొదట్లో ఇంగ్లిష్ టీచర్ ట్రెయినింగ్, రిఫ్రెషర్ కోర్సులు, ఆయా కోర్సులకు సంబంధించిన ఇంగ్లిష్ బుక్స్ తర్వాత రేడియో లెసన్స్ను అందించేది. కాలానుగుణంగా మారుతూ పలు విదేశీ భాషలు, రిసెర్చ్ వైపు సంస్థ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. 1972లో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (సీఫెల్)గా మార్చారు. 1973లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. 2006-07లో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను ప్రభుత్వం ఇచ్చింది. సీఫెల్ పేరును ఇఫ్లూగా మార్చారు.
ఇఫ్లూ
ఇంగ్లిష్తోపాటు పది విదేశీ భాషలను ఇఫ్లూ అందిస్తుంది.
ఇఫ్లూ ఆఫర్ చేసే భాషలు
ఇంగ్లిష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, రష్యన్, జపనీస్, కొరియన్, పర్షియన్
క్యాంపస్లు
ఇఫ్లూ దేశవ్యాప్తంగా మూడు క్యాంపస్లు కలిగి ఉంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. లక్నో, షిల్లాంగ్లో క్యాంపస్లు ఉన్నాయి.
యూజీ కోర్సులు
బీఏ (ఆనర్స్), ఇంగ్లిష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్ తదితరాలు.
పీజీ కోర్సులు
ఎంఏ ఇంగ్లిష్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ తదితరాలు.
పీజీ డిప్లొమా కోర్సు
పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ (పీజీడీటీ)
టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, బీఈడీ ఇంగ్లిష్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ అరబిక్
పీహెచ్డీ ప్రోగ్రామ్స్
లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఇంగ్లిష్ లిటరేచర్ తదితరాలు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 31
వెబ్సైట్: https://www.efluniversity.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
- EFLU
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు