చదివిస్తారు.. కొలువిస్తారు!
చదువు+శిక్షణ = కొలువు.. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ డిగ్రీ పూర్తయ్యిందా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? చదివించి.. అనంతరం శిక్షణ ఇచ్చి కొలువునిచ్చే సదావకాశం. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బ్యాంకింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పించి తర్వాత ఇంటర్న్‌షిప్ చేయించి విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం అవకాశం కల్పించే పీజీడీబీఎఫ్ కోర్సు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కు ఎవరు అర్హులు, పరీక్ష విధానం, ఫీజు తదితర అంశాలపై నిపుణ పాఠకుల కోసం….
ఐడీబీఐ పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్).. ఈ కోర్సు కోసం ఐడీబీఐ బ్యాంక్ బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రేటర్ నోయిడాలోని నిట్టి ఎడ్యుకేషన్‌తో ఎంఓయూ చేసుకుని అందిస్తుంది.
ఈ కోర్సులో తొమ్మిది నెలల క్లాస్రూంతోపాటు మూడు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
ఈ కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వడంతోపాటు ఐడీబీఐలో గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టును ఇస్తారు.
ఎవరు అర్హులు ?
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 2021, జూలై 1 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎక్స్సర్వీస్మెన్లకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పీజీడీబీఎఫ్ సీట్ల సంఖ్య: 650. వీటిలో జనరల్-265, ఎస్సీ-97, ఎస్టీ-48, ఈడబ్ల్యూఎస్-65, ఓబీసీ-175 (వీఐ-7, ఓహెచ్-6, హెచ్ఐ-7, ఎండీ/ఐడీ-6) ఖాళీలు ఉన్నాయి.
నోట్: ఈ సంఖ్య ఐడీబీఐ అవసరాల మేరకు మారవచ్చు. ఇంకా పెరగవచ్చు.
ఎంపిక విధానం
ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
ఆన్లైన్ టెస్ట్
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
లాజికల్ రీజనింగ్, డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు- 60 మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు
జనరల్/ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 60 ప్రశ్నలు- 60 మార్కులు
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
అభ్యర్థి ఆప్షన్ ప్రకారం ఇంటర్వ్యూలను ఇంగ్లిష్ లేదా హిందీలో నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ, ఆన్లైన్ టెస్ట్ స్కోర్, మెడికల్ ఫిట్ ప్రకారం తుది ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ టెస్ట్ సెంటర్లు
రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం తదితర కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ప్రోగ్రామ్ ఫీజులు
రూ.3,50,000 + జీఎస్టీ
రుణ సౌకర్యం
ఎంపికయిన అభ్యర్థులకు ఎడ్యుకేషన్ లోన్ కింద కోర్సు ఫీజును అందిస్తారు. ఈ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఇస్తుంది.
శిక్షణ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.2,500/ స్టయిఫండ్ కింద చెల్లిస్తారు.
మూడు నెలల శిక్షణ కాలంలో నెలకు పదివేలు స్టయిఫండ్ ఇస్తారు.
బ్యాంక్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరిన తర్వాత ప్రారంభ వేతనం నెలకు రూ.36,000/- ఇస్తారు.
ప్రొబేషనరీ పీరియడ్
బ్యాంక్‌లో జాయిన అయిన రోజు నుంచి ఏడాది కాలాన్ని ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణిస్తారు.
సర్వీస్ బాండ్
ఎంపికయిన అభ్యర్థులు సర్వీస్ బాండ్ సమర్పించాలి. దీని ప్రకారం ఐడీబీఐ బ్యాంక్‌లో కనీసం మూడేండ్ల పాటు తప్పనిసరిగా పనిచేయాలి. ఒకవేళ మధ్యలో వెళ్లిపోతే రూ.2 లక్షలు+ జీఎస్టీని పెనాల్టీగా చెల్లించాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ లోన్ కింద తీసుకున్న మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.200/-, ఇతరులకు రూ.1000/-
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఆగస్టు 22
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 22
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 4
వెబ్సైట్: https://www.idbibank.in
ఫుట్‌వేర్ కోర్సులు
సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చెన్నైలోని
ఎంఎస్ఎంఈ-టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ కింది కోర్సుల్లో
ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు- కాలవ్యవధి v అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ కోర్సు
ఫుట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ- 12 నెలలు
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్- 12 నెలలు
పీజీ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ- 18 నెలలు
పోస్ట్ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ- 12 నెలలు
లెదర్ గూడ్స్ మేకర్ కోర్సు- 12 నెలలు
డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్- 24 నెలలు
సర్టిఫికెట్ కోర్సు (ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్)- 6 నెలలు
అర్హతలు: ఆయా ప్రోగ్రామ్స్‌ను బట్టి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తారు
ఎంపిక: మెరిట్ ఆధారంగా (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆయా ప్రోగ్రామ్స్‌కు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
వెబ్సైట్: https://cftichennai.in
‘అంబేద్కర్’ యూనివర్సిటీలో
బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ (బీబీఏయూ)లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) యూజీ కోర్సులు: 27 రకాల కోర్సులు, 23 సబ్జెక్టులు ఉన్నాయి. బీఏ (ఆనర్స్), బీకాం (ఆనర్స్), బీబీఏ, బీబీఏ ఎల్ఎల్బీ, బీఎల్ఐఎస్సీ, బీ వొకేషనల్, బీఈడీ, బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్, బీటెక్ (సివిల్, సీఎస్, ఈఈ, ఈసీఈ, మెకానికల్ తదితరాలు),ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-ఎమ్మెస్సీ (బేసిక్ సైన్స్),
బీఏ (హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, సొషియాలజీ, ఎకనామిక్స్), బీఎస్సీ (ఐటీ), బీసీఏ, బీకాం డిప్లొమా ఇన్ ఫార్మసీ,
పీజీ కోర్సులు
42 కోర్సులు, 99 సబ్జెక్టులు ఉన్నాయి.ఎంఏ (హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిందీ, ఎకనామిక్స్ తదితరాలు)ఎమ్మెస్సీ (యోగా, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జువాలజీ, ఐటీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హార్టికల్చర్, ఎస్టీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తదితరాలు), ఎంసీఏ, ఎంటెక్, ఎంబీఏ, ఎల్ఎల్ఎం
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 6
వెబ్సైట్: https://bbauet.nta.nic.ina
బీహెచ్‌యూ ఎంట్రన్స్ టెస్ట్ -2021
వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
బీహెచ్‌యూ
జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థ బెనారస్ హిందూ యూనివర్సిటీని 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ ప్రారంభించారు. యూనివర్సిటీలో 140 డిపార్ట్మెంట్లు, 40 వేల మంది విద్యార్థులు, 2000 మంది టీచర్లు, 7000 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌తో నడుస్తుంది. సుమారు 48 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
యూజీ కోర్సులు
బీఏ (ఆనర్స్), బీపీఈడీ, వొకేషనల్ కోర్సులు, బీకాం (ఆనర్స్), బీఎస్సీ (ఆనర్స్), బీఈడీ, బీటెక్ (అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, డైయిరీ టెక్నాలజీ), ఎల్ఎల్బీ, బీఏ ఎల్ఎల్బీ, బీపీఏ, బీఎఫ్ఏ, శాస్త్రి (ఆనర్స్) తదితరాలు
అర్హతలు: కోర్సును బట్టి సంబంధిత సబ్జెక్టులతో కనీసం 50 మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
పీజీ కోర్సులు
ఎంఏ, ఎంకాం, ఎమ్మెసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితరాలు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 పద్ధతిలో) ఉత్తీర్ణత.
ఎంపిక: ఎన్టీఏ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 7
వెబ్సైట్: https://bhuet.nta.nic.in
- Tags
- Education News
- IDBI Bank
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు