ఫుల్ స్టాక్ డెవలప్మెంట్తో భవిష్యత్తు
సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది. ఈ మహమ్మారి అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ కీలకమైన ఐటీ రంగం మాత్రం దీన్ని దీటుగా ఎదుర్కొంది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. డిజిటల్ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరిగేకొద్దీ అన్ని కంపెనీలు ఆయా రంగాల్లో నిపుణుల సంఖ్యను కూడా పెంచుకోవాలి. అంత కీలకమైనవి కాబట్టి అనేక మల్టీ నేషనల్ కంపెనీలు కోడింగ్ నైపుణ్యాలపై పట్టు సాధించినవారికి పెద్ద పీట వేసి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. అలా కంపెనీలు ముఖ్యంగా వెతుకుతున్న వారి జాబితాలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ ముందు వరుసలో ఉన్నారు.
డిమాండ్ ఎక్కువ
గ్లాస్ డోర్‌లోని సమాచారం ప్రకారం ఇండియాలో ఈ అప్లికేషన్ డెవలపర్స్‌కు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. ఉదా: ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కు ఐబీఎం కంపెనీలో రూ.30 లక్షలు, వీఎం వేర్ కంపెనీలో రూ.24 లక్షలు వార్షిక వేతనం ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఏడాదికి రూ.6 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు లభిస్తాయి. పే స్కేల్లోని సమాచారం ప్రకారం అమెరికాలో ఈ అప్లికేషన్ డెవలపర్స్‌కు మూల వేతనం $ 91,000. అక్కడ కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి ఇండియాలో రూ.6 లక్షలు అయినా అమెరికాలో $ 91,000 అయినా ఒకటే అని అనుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో కొత్తగా రిమోట్ జాబ్స్ అనేవి కూడా వస్తున్నాయి. అంటే ఇంటి నుంచే అమెరికాలో ఉన్న కంపెనీ కోసం పని చెయ్యవచ్చు. అమెరికాలో ఇచ్చే వేతనాలనే ఇస్తారు. అలాంటి ఆకర్షణీయమైన జీతాలను ఇండియాలో ఇంటి నుంచే సంపాదించవచ్చు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్న వారికి ఈ దశాబ్దంలో అవకాశాలకు కొదవలేదు.
ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
ఫుల్ స్టాక్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఫుల్ స్టాక్‌లో ఉన్న రెండు భాగాల గురించి తెలుసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్.
ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్
ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లోకి వెళతాం. రంగురంగులతో కొనాలనుకున్న వస్తువులన్నీ ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. ఒక వస్తువుపై క్లిక్ చేయగానే ఆ వస్తువు వివరాలతో మరొక కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అలాగే కావాల్సిన వస్తువుల పరిమాణం మారుస్తుంటే వెబ్ సైట్ మొత్తం మారకుండా కేవలం ఆ వస్తువు పరిమాణం మాత్రమే మారుతుంది. ఇలా కనబడుతూ, ఇంటరాక్ట్ అవడానికి వీలు కల్పించేదానిని ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇలా ఏదైనా వెబ్‌సైట్‌ను వాడటానికి సులభంగా ఉండేలా, అందంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దేవారిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు అంటారు. చూడటానికి, ఒక యూజర్ ఉపయోగించడానికి అనుగుణంగా ఎలా ఉండాలన్న దానిపైనే వీళ్లు పనిచేస్తారు.
క్రాస్ ప్లాట్‌ఫాం డెవలప్మెంట్
అదే విధంగా మొబైల్లో అయితే ఆండ్రాయిడ్ ఐఓఎస్, ల్యాప్‌టాప్‌లో అయితే విండోస్ ఇంకా ఎన్నోరకాల ఆపరేటింగ్ సిస్టమ్ (OS)లు ఉంటాయి. అప్లికేషన్ డెవలపర్స్ ఆండ్రాయిడ్ కోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను, ఐఓఎస్ కోసం వేరొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించాలి. దానికి చాలా సమయం పడుతుంది.
అలా కాకుండా వెబ్‌సైట్స్‌కి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ టూల్స్ ఎలా ఉంటాయో, యాప్స్‌కి కూడా క్రాస్ ప్లాట్‌ఫాం డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. అంటే వీటితో యాప్‌ను ఒక్కసారి డెవలప్ చేస్తే ఆండ్రాయిడ్ అయినా, ఐఓస్ అయినా రెండిట్లోనూ పనిచేస్తుంది. ఇటువంటి క్రాస్ ప్లాట్‌ఫాం డెవలప్మెంట్ టూల్స్‌లో రియాక్ట్ నేటివ్, ఫ్లట్టర్ ప్రాముఖ్యమైనవి. రియాక్ట్ నేటివ్ను ఫేస్బుక్ కంపెనీ డెవలప్ చేసింది. ఇన్స్టాగ్రామ్, మింత్ర వంటి చాలా పెద్ద కంపెనీలు దీనిని వాడుతున్నాయి. అలాగే ఫ్లట్టర్ను గూగుల్ కంపెనీ డెవలప్ చేసింది. గూగుల్ పే, ఈబే వంటి కంపెనీలు దీనిని వాడుతున్నాయి.
బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్
ఓలా, ఉబెర్ లాంటి అప్లికేషన్స్ వాడుతున్నాం. అందులో రైడ్ రిక్వెస్ట్ చెయ్యగానే దగ్గరలో ఉన్న డ్రైవర్స్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. అలాగే డ్రైవర్ రిక్వెస్ట్ అంగీకరించగానే తక్కువ వ్యవధిలోనే ఆ డ్రైవర్, రైడ్ వివరాలు వస్తాయి.
కేవలం రైడ్ రిక్వెస్ట్ పెట్టగానే అన్ని ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి. అలా జరగడానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ సర్వర్ లో రన్ అవుతుంది. సర్వర్ అంటే కంప్యూటర్ లాగా అనుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడాన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. అలా సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసే వారిని బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు.
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వంటివి చూశాం. అలాంటి రోజుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని లక్షల కస్టమర్లు వివిధ రకాల వస్తువులు కొంటారు. ఇలా లక్షల్లో వస్తున్న రిక్వెస్ట్‌లను హ్యాండిల్ చేసేలా బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్‌ను బిల్డ్ చేయడం, ఆ సర్వర్స్‌ను తయారు చేసుకోవడం, సర్వర్ల సంఖ్యని పెంచుకోవడం వంటివి కూడా సాధారణంగా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చూసుకుంటారు.
ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవడానికి HTML, CSS, Bootstrap, JavaScript, React వంటి వాటిపై పట్టు సాధించాలి. బ్యాక్ ఎండ్ డెవలపర్ అవడానికి Java, Python, NodeJS, SQL, Django వంటి వాటిపై పట్టు సాధించాలి. అంతకంటే ముఖ్యంగా ప్రోగ్రామర్లా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజ్ తెలిస్తే సరిపోదు. వాటిని ఉపయోగించి అప్లికేషన్స్ తయారు చేయగలిగేవారే కంపెనీలకు కావాలి.
ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు?
ఒక అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని అంశాలు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండింటిపై పనిచేయగలిగేవారే ఫుల్ స్టాక్ డెవలపర్లు. వీరు మొత్తంగా ఒక అప్లికేషన్ సమర్థంగా పనిచేసేలా చూస్తారు.
లక్షల్లో జీతాలు
సీసీబీపీ టెక్ 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రాంతో కేవలం 4.5 నెలల్లోనే ఫుల్ స్టాక్ డెవెలప్మెంట్ నేర్చుకొని ఏడాదికి రూ.4.5 నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించవచ్చు. దీనిలో దేశంలో మొట్టమొదటిసారిగా ‘ఇండస్ట్రీ రెడీ సర్టిఫికెట్’ను ప్రవేశపెట్టారు. ఇది సాధారణ సర్టిఫికెట్ కాదు. నేటి టెక్ ఇండస్ట్రీకి మీ సంసిద్ధతను కంపెనీలకు చూపిస్తుంది.
ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవడానికి కోడింగ్‌పై ఎటువంటి అవగాహన అవసరం లేదు. పూర్వానుభవం, విద్యార్హతలతో సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో కంపెనీలు ఏ నైపుణ్యాల కోసం చూస్తున్నాయో సరిగ్గా వాటినే నేర్చుకుంటారు. క్లిష్టమైన అంశాలను చాలా తేలికగా అర్థం చేసుకునేలా ఐఐటీల్లో చదివి అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో పనిచేసిన నిపుణులు నేర్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రోగ్రాం గురించి ccbp.in/intensive వెబ్సైట్లో, 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా లేదా support@nxtwave.tech మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు.
నైపుణ్యాలను నేర్పిస్తున్నాం: రాహుల్ అత్తులూరి, సీఈఓ నెక్ట్స్ వేవ్
నెక్ట్స్‌వేవ్.. ఐబీ హబ్స్ అనుబంధ అంకుర సంస్థ. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దీనిని స్థాపించాం. నేపథ్యం ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా వివిధ రకాల ప్రోగ్రామ్స్‌తో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తున్నాం.
రెస్పాన్సివ్ వెబ్ డిజైన్
-మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి వివిధ రకాల పరికరాలను వాడుతూ ఉంటాం. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. డెవలపర్స్ ఒక వెబ్‌సైట్‌ను ల్యాప్‌టాప్‌కు విడిగా, టాబ్లెట్‌కు విడిగా, మొబైల్‌కు విడిగా డెవలప్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే చాలా సమయం వృథా అవుతుంది. అలా కాకుండా రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనే విధానాన్ని ఉపయోగిస్తాం. ఈ పద్ధతిలో వెబ్‌సైట్‌ను ఒక్కసారి డెవలప్ చేస్తే అన్ని పరికరాల్లో వాటి స్క్రీన్ పరిమాణానికి తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో కొత్తగా ఏదైనా వెబ్‌సైట్‌ను డెవలప్ చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్‌నే వాడుతున్నారు. అందుకే ఇది చాలా ముఖ్యమైంది.
రాహుల్ అత్తులూరి
సీఈఓ
నెక్ట్స్ వేవ్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు