ఐఓటీ.. ప్రతి రంగంలో మేటి
స్మార్ట్ వాచ్‌తో శారీరక కదలికలు, హార్ట్ బీట్, బ్లడ్, ఆక్సిజన్ లెవల్ వంటివి చూసుకుంటాం. టెస్లా కారు ప్రత్యేకమైన ఆటో పైలట్ ఫీచర్‌తో డ్రైవర్ లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటిస్తుంది, పార్కింగ్ కూడా చేసుకుంటుంది. ఎలాన్ మస్క్ స్థాపించిన కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ ఇంజినీరింగ్‌లో గొప్ప పురోగతి సాధించింది. రాకెట్‌ను తయారు చేయాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఒక రాకెట్‌ని పునర్వినియోగపరచుకుంటే కొన్ని కోట్లు ఆదా చేయవచ్చు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ అటువంటిదే. 5 లక్షల కేజీల బరువు, 70 మీటర్లు పొడవు ఉండే ఈ రాకెట్ 20 మీటర్ల వెడల్పు ఉండే ప్యాడ్ మీద ల్యాండ్ అవుతుంది. ఇదంతా మాకు ఎందుకు చెబుతున్నారా అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇలాంటివి సాధ్యపడేలా చేసే టక్నాలజీల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అనేది చాలా కీలకమైంది.
ఈ ఐవోటీ అంటే ఏమిటి?
దీనిని కెరీర్‌గా ఎంచుకుంటే కలిగే లాభాలేంటో ప్రత్యేక కథనం మీకోసం..
ఐఓటీ అంటే ఏంటి?
స్మార్ట్ ఫోన్ లేకుండా రోజుని ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. అమెరికాలో ఉండే స్నేహితులు, బంధువులతో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. ఇష్టమైన సినిమాని చూస్తున్నాం. నచ్చిన గేమ్ ఆడుతున్నాం. ఇలా ఎన్నో ఎన్నెన్నో స్మార్ట్ ఫోన్‌తో చేయగలుగుతున్నాం. స్మార్ట్ ఫోన్‌తో ఇన్ని చేయగలిగినప్పుడు సమీపంలో ఉన్న అన్ని వస్తువులు అంటే టీవీ, ఏసీ, లైట్, ఫ్యాన్ ఇలా అన్ని కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది. ఉదాహరణకు ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు ఏసీ, ఫ్యాన్, లైట్ వాటంతట అవే ఆఫ్ అవడం, మళ్లీ లోనికి వచ్చినప్పుడు ఆన్ అవడం, అలాగే మాల్కి వెళ్లినప్పుడు పార్కింగ్ కోసం వెతకకుండా ఫలానా చోట ఖాళీ ఉందని చెప్పడం.. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది కదా!. ఇవన్నీ సాధ్యపడాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనెక్ట్ చెయ్యగలిగే టెక్నాలజీనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అంటారు.
స్మార్ట్ థింగ్స్ అంటే?
మన చుట్టూ ఉండే పరికరాలు పరిసరాలను సెన్స్ చేస్తాయి. అంటే పర్సు మర్చిపోయారని సెన్స్ చేసి సమాచారాన్ని మొబైల్‌కి కమ్యూనికేట్ చేయడం అన్నమాట. ఇలా సెన్స్, కమ్యూనికేట్ చేయగలిగి, తెలివిగా ప్రవర్తించే వాటినే స్మార్ట్ థింగ్స్ లేదా కనెక్టెడ్ థింగ్స్ అంటాం. ఇక్కడ ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. మొదటిది డివైజెస్ (పరికరాలు) అంటే పరిసరాలను సెన్స్ చేయడానికి, రెండోది నెట్వర్క్ ఒక డివైజ్ మరొక డివైజ్‌తో కమ్యూనికేట్ చేయడానికి, మూడోది అప్లికేషన్ ఈ డివైజెస్ తెలివిగా ప్రవర్తించేలా చేయడానికి.
ఐఓటీ డివైజెస్ ఎలా సెన్స్ చేస్తాయి?
వీటిలో సెన్సర్లు, పవర్, ప్రాసెసింగ్ (MCU), కమ్యూనికేషన్, ఫర్మ్‌వేర్ ఇలా చాలా ఉంటాయి. కానీ ముఖ్యమైనది ఏంటంటే సెన్సర్లు. చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, స్పర్శకి చర్మం మనకు ఎలా ఉంటాయో ఒక ఐఓటీ డివైజ్‌కి ఈ సెన్సర్లు ఉంటాయన్నమాట.
సెన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో గుర్తించడం కోసం ప్రాక్సిమిటీ సెన్సర్, పరిసరాల్లోని కాంతి ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలుసుకోవడానికి లైట్ సెన్సర్, ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి టెంపరేచర్ సెన్సర్. మొబైల్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఆటోమెటిక్‌గా రొటేట్ అవుతుంది కదా అది కూడా ఒక సెన్సర్ వల్లే. ఆ సెన్సర్ పేరు గైరోస్కోప్. స్మార్ట్ థింగ్స్ వాటి పరిసరాలను ఈ సెన్సర్ సాయంతోనే సెన్స్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్లో సుమారు 16 సెన్సర్లు ఉంటాయి.
అడ్వాన్స్డ్ సెన్సర్ అంటే ఏంటి?
ఇప్పటివరకు ఇచ్చిన ఉదాహరణలన్నీ సాధారణమైన సెన్సర్లు. అడ్వాన్స్డ్ సెన్సర్లు ఎంత ఆధునికమైనవంటే మెదడులోని ఆలోచనలను కూడా సెన్స్ చేయగలవు. వీటితో మెదడుతో శరీర భాగాలను కంట్రోల్ చెయ్యడమే కాకుండా ఆలోచనలతో వేరొక మనిషి శరీర భాగాలు కూడా కంట్రోల్ చేయవచ్చు. ఎలాగంటే ఈ సెన్సర్‌ని మనతో పాటు మరొక మనిషికి కనెక్ట్ చేస్తే మన మెదడులో మన చేతిని కదిలించాలన్న ఆలోచన వస్తే అది మన చేతినే కాకుండా మనతో కనెక్ట్ అయిన మరొక మనిషి చేతిని కూడా కదిలిస్తుంది.
ఐఓటీ డివైజెస్ ఎలా కమ్యూనికేట్ చేస్తాయి?
ఫోన్లో బ్లూటూత్ ద్వారా ఫొటోస్, వీడియోస్ పంపడానికి, వైఫైతో ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాం కదా! అలాగే
వేరే పరికరాలతో కమ్యూనికేట్ చేయడానికి కూడా చాలా వైర్లెస్ టెక్నాలజీలు ఉంటాయి. 4జీ, 5జీ, LoRaWAN వంటివి కొన్ని ఉదాహరణలు.
ఐఓటీ ఎలా ఉపయోగపడుతుంది?
సెన్సర్ల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి, తెలివిగా ప్రవర్తించడానికి ఒక అప్లికేషన్ని వాడతాం. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో పంటల్లో సెన్సర్లు పెట్టాకా ఒక రైతు అతనికి కావాల్సిన విధంగా ప్రాధాన్యతలు ఇచ్చుకోవచ్చు. పంటకు ఉదయం ఈ సమయానికి ఈ మోతాదులో, సాయంత్రం ఈ సమయానికి ఈ మోతాదులో నీరు పెట్టాలని సెట్ చేసుకోవచ్చు. అలాగే సెన్సర్ల నుంచి వచ్చిన సమాచారం అంటే ఉదాహరణకు పంట పొడిగా ఉందా తడిగా ఉందా, వాతావరణం ఎండగా ఉందా తేమగా ఉందా ఇటువంటి సమాచారంతో రైతు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
ఐఓటీని ఎలా వాడుతున్నారు?
స్మార్ట్ వాటర్ మీటరింగ్, స్మార్ట్ ఎనర్జీ మానిటరింగ్, వాటర్ లెవల్ మానిటరింగ్, గ్యాస్ లెవల్ మానిటరింగ్ ఇలా చాలా వాటిలో ఐఓటీని ఉపయోగిస్తున్నాం.
స్మార్ట్ వాటర్ మీటరింగ్
ఫ్రాన్స్‌లో సుమారు 30 లక్షలకు పైగా స్మార్ట్ వాటర్ మీటర్లను ఇన్స్ట్టాల్ చేశారు. అంటే ఐఓటీ డివైజెస్ అన్నమాట. వీటి ద్వారా సుమారు 1200 వాటర్ లీకేజీలు గుర్తించి రిపేర్ చేశారు. దీని ద్వారా సుమారు వంద కోట్ల లీటర్ల నీటిని ఆదా చేశారు.
2025 నాటికి ఐఓటీ ప్రభావం
2018లో ఐఓటీకి సంబంధించిన ప్రపంచ మార్కెట్ విలువ 151 బిలియన్ డాలర్లు ఉంది. అది 2025 నాటికి సుమారు పది రెట్లు పెరుగుతుంది. అంటే సుమారు 1567 బిలియన్ డాలర్లు. అంటే రూ.1.1 కోట్ల కోట్లు అవబోతుంది. 2025 నాటికి 4160 కోట్ల డివైజెస్ ఈ ఐఓటీ ద్వారా కనెక్ట్ అవుతాయి. కరోనా వల్ల అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పరిశ్రమలు మళ్లీ లాభాల బాట పట్టడానికి అడాప్ట్ చేసుకోవలసిన టెక్నాలజీల్లో ఐఓటీ అనేది మొదటి నాలుగు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. సాంసంగ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్, ఇంటెల్ వంటి ఎన్నో అగ్ర కంపెనీలు ఐఓటీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
1.5 కోట్ల ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభావం చూపుతుందంటే అంతే ఎక్కువగా ఉద్యోగాలు కూడా ఉంటాయి. 2017లో టెలికం డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఇండియాలోనే సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు రాబోతున్నాయి. 47 శాతం కంపెనీలు ఐఓటీలో నైపుణ్యం కలిగిన వ్యక్తుల కొరత ఉందని చెబుతున్నాయి.
ఐఓటీని కెరీర్‌గా మలచుకోవాలంటే
ఐఓటీ డివైజెస్‌లో సెన్సర్లు చాలా ముఖ్యమైనవి. మొదటగా వివిధ రకాల సెన్సర్ల గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ సెన్సర్లను ఇంటిగ్రేట్ చేయడానికి Arduino UNO, Node MCU, Raspberry Pie వంటి ఐఓటీ డెవలప్మెంట్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ డివైజెస్ పని చేయాలంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని రూపొందించాలి. దానినే ఫర్మ్‌వేర్ అంటారు. దానికోసం C /embedded C, C++, Micro python, python వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు అవసరం. అలాగే అప్లికేషన్ని రూపొందించడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రెడిక్స్, థింగ్ స్పీక్ వంటి ప్లాట్‌ఫాం మీద అవగాహన కూడా ఉండాలి.
ఐఓటీని నేర్చుకోవడం ఎలా?
ఇన్ని కోట్ల ఉద్యోగ అవకాశాలున్న ఈ ఐఓటీలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఉడెమి, కోర్స్ఎరా వంటి వాటిలో ఐఓటీని నేర్చుకోవచ్చు. ఐబీ హబ్స్, నెక్ట్స్ వేవ్ కంపెనీలు సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా ఐఓటీలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు కోసం 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి, support@ nxtwave.tech కి మెయిల్ పంపండి లేదా ccbp.in/professional వెబ్‌సైట్‌ను లాగిన్ అవండి.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన శేష సాయి క్వాల్కమ్ కంపెనీలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ల కోసం అనలాగ్ & మిక్స్డ్సిగ్నల్ క్యారెక్టరైజేషన్లో, తరువాత క్వాల్కమ్లోనే 4జీ టెక్నాలజీ పై పనిచేశారు. అనంతరం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇర్విన్ ఎక్స్టెన్షన్ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్పెషలైజేషన్ చేసి విశేష అనుభవం గడించారు. ప్రస్తుతం ఐబీ హబ్స్ అనుబంధ అంకుర సంస్థ అయిన సైబర్ ఐకి వెస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా నెక్ట్స్ వేవ్ సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా ఐఓటీని బోధిస్తున్నారు.
వ్యవసాయం రంగంలో
వ్యవసాయ రంగంలో కూడా ఐఓటీని పంటలు, నేల నాణ్యతలు, పశువుల ఆరోగ్యం పర్యవేక్షించడానికి ఇలా చాలా వాటికి ఉపయోగించవచ్చు. వ్యవసాయ రంగంలో ఈ ఐఓటీని ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రెసిషన్ ఇరిగేషన్‌తో మైక్రో లెవల్ మానిటరింగ్ కూడా చేయవచ్చు. అంటే ఎక్కడెక్కడ పంట నాణ్యత ఎలా ఉంది? ఎంత నీరు అవసరం అని తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అమెరికాకు చెందిన డివైన్ ఆర్గానిక్స్ అనే సంస్థ సుమారు 28 లక్షల లీటర్ల నీటిని ఆదా చేసింది. అలాగే పంట దిగుబడి కూడా రెండు రెట్లు పెరిగింది. ఇది చాలా పెద్ద విషయం కదా.
అంతేకాకుండా పరిశ్రమల్లో పర్యావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి, కార్మికుల భద్రత చూడటానికి, ఆరోగ్య రంగంలో వైద్యుడు పేషెంట్ దగ్గరికి వెళ్లకుండా అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, ఔషధాలు నిల్వ చేసే ప్రదేశాలను పర్యవేక్షించడానికి ఇలా చాలా రంగాల్లో ఈ ఐఓటీని ఉపయోగిస్తారు.
శేషసాయి , వీపీ ఐఓటీ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైబర్ ఐ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు