యూకే.. ఉన్నత ప్రమాణాల చదువుకు ఓకే
యునైటెడ్ కింగ్డమ్ ఇది ఇంగ్లండ్, సాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ల సమాహారం యూరోప్ ఖండంలో ఉన్నది. స్టీమ్ పవర్ ఆవిర్భావంతో యూకే ప్రపంచంలోనే మొట్టమొదటి పారిశ్రామిక దేశంగా మారి 19, 20 శతాబ్దాల్లో ప్రపంచాన్ని ఏలింది. ఇప్పుడు అంతర్జాతీయంగా గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, శాస్త్రీయ, సాంకేతిక, రాజకీయ ప్రభావంతో ప్రపంచంలోని గొప్ప శక్తుల్లో ఒకటిగా ఉంది. యునైటెడ్ కింగ్డమ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ గొప్పగా ఉంటాయి. ఇకడి టీచింగ్ విధానం మంచి స్టాండర్డ్స్ కలిగి ఉంటుంది. సుమారు 100కు పైగా యూనివర్సిటీలు, అందులోను ప్రపంచంలోనే ప్రాచీనమైన యూనివర్సిటీలు ఇకడ ఉండటం వల్ల ఇకడి ఎడ్యుకేషన్ ఇతరులకు మార్గదర్శకంగా కూడా ఉంటుందంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారు 2.38 మిలియన్ విద్యార్థులు యూకేలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులు చేస్తున్నారని అంచనా.
యూకేనే ఎందుకు?
ప్రపంచంలోనే ప్రాచీనమైన, మంచి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీలు ఎకువగా ఉండటం వల్ల విద్యార్థులు యూకేలో చదవడానికి ఇష్టపడుతున్నారు. అకడి యూనివర్సిటీల్లో చదివిన వారి డిగ్రీలకు విలువ ఉండటంవల్ల మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండటంతో పాటు కొన్ని కోర్సులు తకువ సమయంలో పూర్తవడంవల్ల ఎకువ లాభ పడతారు. కొన్ని యూనివర్సిటీల్లో చదివే వారికి 20 గంటల వరకు పనిచేసుకునే అవకాశం ఉంది.
డెస్టినేషన్ సిటీస్
2019 లో నిర్వహించిన QS బెస్ట్ స్టూడెంట్ డెస్టినేషన్ సిటీస్లోని 120 నగరాల్లో 14 నగరాలు యునైటెడ్ కింగ్డమ్లోనివే.
లండన్: థేమ్స్ నదిపై ఉన్న ఈ మహానగరానికి పరిచయం అవసరం లేదు. వివిధ దేశాల నుంచి విద్యార్థులను స్వాగతించే ఈ నగరం ఎన్నో ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలకు నిలయం. అందుకే ఇది స్టూడెంట్ ర్యాంకింగ్స్లో మొదటిస్థానంలో ఉంటుంది. అలాగే ఇకడ ఉద్యోగావకాశాలు కూడా బాగానే ఉంటాయి. ఇంపీరియల్ కాలేజీ లండన్, యూనివర్సిటీ కాలేజీ లండన్, లండన్ సూల్ ఆఫ్ ఎకనామిక్స్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ వంటి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో రెండు ఇకడివే ఉన్నాయి. లండన్లో లివింగ్ ఎక్స్పెన్సెస్కి నెలకి సుమారు 1100 నుంచి 1300 పౌండ్లు ఖర్చవుతుంది. కాస్ట్ ఆఫ్ స్టడీ సుమారు 22 వేల పౌండ్లు ఉంటుంది.
ఎడిన్బర్గ్
సాట్లాండ్ క్యాపిటల్ అయిన ఎడిన్బర్గ్ని స్టూడెంట్ డైవర్సిటీ, నేచర్, ఆరిటెక్చర్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, కల్చర్ చరిత్రను చూసి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. 1583లో ప్రారంభమైన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రపంచ స్థాయిలో పేరు గడించింది. ఆర్ట్స్, హ్యుమానిటీస్తో పాటు లా, సైకాలజీకి పేరున్నది. బిజినెస్ సూల్ కూడా ఎంతోమంది విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఇకడి విద్యార్థుల్లో సుమారు 39 శాతం విద్యార్థులు విదేశాల నుంచి వస్తున్నారు. పెద్ద సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ, జేపీ మోర్గాన్ వంటివి ఇకడ ఉన్నాయి.
మాంచెస్టర్
నార్త్ వెస్ట్ ఇంగ్లండ్లో ఉన్న ఈ నగరానికి గొప్ప పారిశ్రామిక హెరిటేజ్ ఉంది. లండన్ మహానగరం కంటే మాంచెస్టర్లో కాస్ట్ అఫ్ లివింగ్ చాలా తకువ. ఇకడి వారు ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు. ఎకువ ఉద్యోగ అవకాశాలు, రెంట్, ఫుడ్ వంటి వాటిలో తకువ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల విద్యార్థులు ఈ నగరానికి వస్తున్నరు. 1824లో ప్రారంభమైన మాంచెస్టర్ యూనివర్సిటీ బ్యాచిలర్స్, మాస్టర్స్, మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తుంది.
గ్లాస్గో
ఈ పేరు వినగానే కామన్ వెల్త్ స్పోర్టింగ్ ఈవెంట్స్ గుర్తుకువస్తాయి. 2014లో ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. సాట్లాండ్లోని ఈ నగర ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. సాట్లాండ్లోనే పెద్ద నగరమైన ఇకడ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్ైక్లెడ్ ఉన్నాయి.
కోవెంట్రీ
టాప్ 5వ బెస్ట్ సిటీ. థియేటర్, ఆర్ట్స్కి ప్రసిద్ధి. ఇకడి విద్యార్థుల్లో సుమారు 42 శాతం మంది బయటివారు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ఇకడి టాప్ యూనివర్సిటీ, గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 70లో ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ నెలకు సుమారు 1000 పౌండ్లు ఉంటుంది.
నాటింగ్హామ్
ఈ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. కాబట్టి విద్యార్థులు సులభంగా ఎక్కడికయినా ప్రయాణం చేయవచ్చు. ఇకడ ఇల్లు కిరాయి లండన్ కంటే సుమారు 66 శాతం తకువ. యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీల్లో ఒకటి.
బర్మింగ్ హామ్
పారిశ్రామిక చరిత్ర, అందమైన కాల్వలు, రుచికరమైన వంటలు అందించే రెస్టారెంట్లు ఇకడ ప్రసిద్ధి. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ టాప్ యూనివర్సిటీల్లో ఒకటి.
న్యూక్యాజిల్ అపాన్ టైన్, అబెర్డీన్, బ్రైటన్ వంటి ఇతర నగరాలు కూడా ఉన్నాయి.
టాప్ యూనివర్సిటీలు
QS ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 యూనివర్సిటీల్లో 4 యూకేలో ఉన్నాయి. ఇంకా 4 టాప్ 50 యూనివర్సిటీల్లో ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
ఇది యూకేలోనే ప్రథమస్థానంలో ఉంది. గ్లోబల్ ర్యాంక్ 5. ఇకడ అడ్మిషన్ సాధించాలంటే చాలా కష్టపడాలి. యాక్సెప్టెన్సీ రేషియో 17 శాతం ఉంది. వరల్డ్ క్లాస్ టీచింగ్, రిసర్చ్ ఇతర ఫెసిలిటీస్కు ఇది పేరుగాంచింది. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏడాదికి సుమారు 18,000 పౌండ్లు అవుతాయి. సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, టెక్నాలజీల్లో ఎన్నో కోర్సులున్నాయి.
కింగ్స్ కాలేజీ లండన్
150కు పైగా దేశాల నుంచి సుమారు 28,000 మంది విద్యార్థులు ఇకడ చదువుతున్నారు. ఈ ప్రాచీన యూనివర్సిటీ ఇంజినీరింగ్, సైన్స్, మెడిసిన్, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి అనేక విభాగాల్లో మంచి కోర్సులను అందిస్తుంది. 15,000 మంది ఇంటర్నేషనల్ విద్యార్థులు ఇకడ చదవడం వల్ల మంచి కల్చరల్ డైవర్సిటీ ఉంది.
లండన్ సూల్ ఆఫ్ ఎకనామిక్స్
అండ్ పొలిటికల్ సైన్స్
వరల్డ్ క్లాస్ అకడమిక్స్కు పేరుగాంచిన ఈ విశ్వవిద్యాలయాన్ని సోషల్, పొలిటికల్, ఎకనామిక్స్ సైన్సెస్లో కోర్సులు చేయాలనుకునే వారు ఎకువ ఇష్టపడుతారు.
ఈ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్టడీ నుంచి, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, దూరవిద్య, భాషా అధ్యయనం వంటి వివిధ ప్రోగ్రామ్లను అందిస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్
1876లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి 150 దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఈ యూనివర్సిటీ గ్రీన్ ఎనర్జీ, కె్లైమేట్కి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ వార్విక్
1965లో హయ్యర్ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయడానికి ఈ పబ్లిక్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఇకడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులు ఎకువ జీతాలు పొందుతున్న వారిలో ఉన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్
యూకేలో 2వ స్థానంలో ఉన్న ఈ యూనివర్సిటీ ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటి. ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీజు సుమారు 22,000 పౌండ్లు ఖర్చవుతుంది. ఇంజినీరింగ్, సైన్స్, మెడిసిన్ ఎకనామిక్స్ వంటివి ఎన్నో అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి.
ఇంపీరియల్ కాలేజీ లండన్
సెంట్రల్ లండన్లో ఉన్న ఇంపీరియల్ కాలేజీ 1907లో ప్రారంభించిన పబ్లిక్ యూనివర్సిటీ. ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటి. సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాల్లో అత్యున్నతమైన విద్యను ఇస్తూ రిసెర్చ్ ఫెసిలిటీస్ కలిగి ఉంది. ఇకడి యాక్సెప్టెన్సీ రేషియో సుమారు 14.5%.
యూనివర్సిటీ కాలేజీ లండన్
ఇది టాప్ 10 గ్లోబల్ కాలేజీల్లో ఒకటి. మంచి రిసెర్చ్ ఫెసిలిటీస్కి పేరుగాంచింది. సుమారు 30 మంది నోబెల్ గ్రహీతలతో అనుబంధం ఉన్న గొప్ప కళాశాల. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు ఎన్నో షార్ట్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్
సాట్లాండ్లోని ఈ విశ్వవిద్యాలయం యూకేలోని 5వ బెస్ట్ కాలేజీ. సుమారు 156 దేశాల నుంచి విద్యార్థులు ఇకడ చదువుకోవడానికి వస్తారు. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి అనేక రంగాల్లో కొన్ని వందల కోర్సులు ఉన్నాయి. అలాగే 70 వరకు ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. బిజినెస్ సూల్కి మంచి పేరుంది. ఎంతోమంది నోబెల్ గ్రహీతలతో అనుబంధం ఉంది. మంచి రిసెర్చ్ ఫెసిలిటీలు కలిగి ఉన్న కాలేజీ.
యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్
ఇది ప్రపంచంలోని టాప్ 30లో ఒకటి. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం హ్యుమానిటీస్. బిజినెస్, సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో సుమారు 1,000 ప్రోగ్రామ్లను అందిస్తుంది. ఈ కార్యక్రమాల్లో ఫౌండేషన్ కోర్సులు, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ, ఎంబీఏ ఉన్నాయి.
ఇతర టాప్ యూనివర్సిటీలు
యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో
దుర్హమ్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్
యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్
యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్
ది యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్
యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్
యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్
క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్
లాంకాస్టర్ యూనివర్సిటీ
అడ్మిషన్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎంతో అవసరం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులు (IELTS వంటివి) ఉపయోగపడుతాయి. విద్యార్థులు తాము చదవాలనుకున్న యూనివర్సిటీ అడిగిన పరీక్షలు రాయాలి. కోర్స్, యూనివర్సిటీని బట్టి అవి మారవచ్చు. జీమ్యాట్, జీఆర్ఈ, మ్యాథమెటిక్స్ అడ్మిషన్ టెస్ట్, నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా, బయోమెడికల్ అడ్మిషన్ టెస్ట్ వంటివి అవసరాన్ని బట్టి రాయాలి.
సోర్స్: ఐడీపీ
10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ మారుల ఉత్తీర్ణత కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైన పరీక్షలు రాసి మంచి విశ్వవిద్యాలయంలో, మంచి కోర్సులో చేరవచ్చు. సాధారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ లాంగ్ కోర్సులు చేసేవారు టైర్-4 జనరల్ స్టూడెంట్ వీసాకు అప్లయ్ చేస్తారు. సెప్టెంబర్లో అకడమిక్ ఇయర్ మొదలవుతుంది. కొన్ని కళాశాలల్లో జనవరి అడ్మిషన్స్ కూడా ఉంటాయి. యూనివర్సిటీ అడ్మిషన్ సైకిల్ చెక్ చేసుకోవాలి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు