ఫిజిక్స్‌లో మార్కులు తెచ్చుకుందామిలా!
ఏ సబ్జెక్టులోనైనా అధిక మార్కులు తెచ్చుకోవాలంటే 3పీ ముఖ్యం. అవి. 1) ప్లానింగ్ 2) ప్రిపరేషన్ 3) ప్రజెంటేషన్
ప్లానింగ్: మొదటగా ప్రశ్నపత్రాలను పరిశీలించి వాటిపై అవగాహన ఏర్పర్చుకోవాలి.
ఈసారి ప్రశ్నపత్రంలో దాదాపు 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా తెలివిని ఉపయోగించి చదివితే 10/10 జీపీఏ సాధించడం కష్టమేమీకాదు.
పరీక్ష- జనరల్ సైన్స్, సమయం- 3 గంటలు
మొదటి గంటన్నర భౌతిక, రసాయన శాస్ర్తాలు
రెండో గంటన్నర జీవశాస్త్రం
ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉంటాయి. జవాబులు వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి.
పేపర్ విధానం
మొత్తం మార్కులు 40
విభాగం-ఎ
సెక్షన్-I: మొత్ంత ప్రశ్నలు 6. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. సమాధానం రాయాల్సినవి 3. దీనిలో 3 ప్రశ్నలు భౌతికశాస్త్రం, 3 ప్రశ్నలు రసాయనశాస్త్రం
సెక్షన్-II: మొత్తం ప్రశ్నలు 4. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సమాధానం రాయాల్సినవి రెండు. దీనిలో 2 ప్రశ్నలు భౌతికశాస్త్రం, రెండు ప్రశ్నలు రసాయన శాస్త్రం
సెక్షన్-III: మొత్తం ప్రశ్నలు 4. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. దీనిలో 1 లేదా 2 ప్రశ్నలు భౌతికశాస్త్రం, 3 లేదా 2 ప్రశ్నలు రసాయనశాస్త్రం
విభాగం-బి
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 10. భౌతిక శాస్త్రం 5, రసాయనశాస్త్రం 5.
పై ప్రశ్నపత్ర నమూనాను పరిశీలిస్తే రసాయన, భౌతిక శాస్త్రం విభాగంలో ఏదేని ఒకదానిపై పూర్తిగా పట్టు సాధించాలి. మిగతా విభాగాన్ని సాధారణ స్థాయిలో చదివినా పూర్తి మార్కులు సాధించవచ్చు.
విభాగం-బి కోసం అన్ని పాఠ్యాంశాలపై అవగాహన అవసరం. విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. పై తరగతుల్లో మంచి ప్రదర్శన కోసం పూర్తిస్థాయి సబ్జెక్టుపై పట్టు సాధించాలి.
ప్రిపరేషన్
భౌతిక, రసాయన శాస్ర్తాల ప్రతి చాప్టర్లో మౌలిక అంశాలు, ప్రతి చాప్టర్ వెయిటేజీ అర్థం చేసుకోవాలి.
మొదట రసాయనశాస్త్ర చాప్టర్లలో పట్టు సాధించడానికి దృష్టిసారించాల్సిన అంశాలు
రసాయన శాస్త్రంలో మొత్తం చాప్టర్లు- 7
అంతర్గత మూల్యాంకనం, యాక్టివిటీ, ప్రాజెక్టులకు కేటాయించిన చాప్టర్లు- రసాయన బంధం, కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రం.
నోట్: పై చాప్టర్ల నుంచి వార్షిక పరీక్షలో ప్రశ్నలు రావు.
సిలబస్‌లోని పాఠాలు
1) రసాయన సమీకరణాలు
ఈ చాప్టర్ నుంచి 2 లేదా 4 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంది.
దృష్టి సారించాల్సిన అంశాలు
రసాయన సమీకరణం-భౌతిక స్థితులను గుర్తించడం
తుల్య సమీకరణం-సమీకరణం తుల్యం చేయాల్సిన అవశ్యకత
భారం-భారం, భారం-ఘనపరిమాణం, ఘనపరిమాణం-ఘనపరిమాణంపై సమస్యల సాధన
బేసిక్ మోల్ కాన్సెప్ట్ గతంలో అడిగిన ప్రశ్నలు
రసాయన సమీకరణం అంటే ఏమిటి? దానిని ఎందుకు తుల్యం చేయాలి?
కొన్ని సమీకరణాలను ఇచ్చి వాటి భౌతిక స్థితులను గుర్తించమన్నారు.
పుస్తకంలో ఉన్న మాదిరి సమస్యలు, ప్రశ్నల విభాగంలో ఉన్న సమస్యలు (గతంలో వ్యాసరూప ప్రశ్నలుగా వచ్చాయి)
2) ఆమ్లాలు-క్షారాలు-లవణాలు
సిలబస్‌లోని కొంత భాగం ఇంటర్నల్ అసెస్మెంట్కు కేటాయించాక మిగిలిన అతిముఖ్యమైన చాప్టర్లలో ఇది ముఖ్యమైనది.
ప్రస్తుతం SCERT విడుదల చేసిన నమూనా ప్రశ్నపత్రంలో ఎక్కువ వెయిటేజీ దీనికే ఉంది.
దృష్టిసారించాల్సిన అంశాలు
ఆమ్ల-క్షారాలను గుర్తించే ఇండికేటర్స్ (వెరీషార్ట్, ఆబ్జెక్టివ్) విభాగంలో ముఖ్యమైనవి.
కింది యాక్టివిటీస్లలో వ్యాసరూన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
1) మెటల్+యాసిడ్-> సాల్ట్+H2
(గత ప్రశ్న)
2) మెటల్ కార్బోనేట్+యాసిడ్-> సాల్ట్+CO2 +H2O
(3 సార్లు వచ్చిన ప్రశ్న)
3) Dry Hcl హైడ్రోజన్ క్టోరైడ్, ద్రవ Hcl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని నిరూపించే ప్రయోగం (2017)
4) బలమైన, బలహీన ఆమ్ల, క్షారాలను గుర్తించే ప్రయోగం
5) H+ అయాన్లను విడుదల చేసేవి ఆమ్లాలు, OH విడుదల చేసేవి క్షారాలు అని నిరూపించే ప్రయోగం లఘు ప్రశ్నల విభాగంలో
క్లోర్-ఆల్కలీ ప్రాసెస్‌లో లభించే ప్రొడక్టులు, ఉపయోగాలు
సోడియం కార్బోనేట్, సోడియం బై కార్బోనేట్, బ్లీచింగ్ పౌడర్ తయారీ, క్రిస్టలైజేషన్ ఆఫ్ సాల్ట్స్, వాటి ఉపయోగాలు (2019)
దైనందిన జీవితంలో PH అనువర్తనాలు
యాంటాసిడ్-టాబ్లెట్స్ సంబంధించి అనువర్తన ప్రశ్నలు
3) పరమాణు నిర్మాణం
ఈ చాప్టర్ నుంచి డయాగ్రమ్ బేస్డ్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
దృష్టిసారించాల్సిన అంశాలు
ఈఎంఆర్ ధర్మాలు
క్వాంటం నంబర్స్. ముఖ్యంగా S-ఆర్బిటాల్, P-ఆర్బిటాల్, d-ఆర్బిటాల్ ఆకృతులు (గత ప్రశ్న)
ఆఫ్ బౌ నియమం, హుండ్ నియమం, పౌలీ నియమం
ఎలక్ట్రాన్ విన్యాసం రాయడం, మాయిలర్ డయాగ్రమ్
ప్రశ్నలు అడుగుతున్న విధం, గత ప్రశ్నలు
ఏదైనా ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం రాసి, దాని వేలన్సీ గుర్తించమనడం, నాలుగు క్వాంటం నంబర్స్ రాయమనడం ఆఫ్ బౌ నియమం ఆధారంగా అప్లికేషన్ ప్రశ్నలు ఉదా: 3P ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ నిండిన తర్వాత 3dలో కాకుండా 4sలో ప్రవేశిస్తుంది ఎందుకు?
గమనిక: ఈ విభాగం నుంచి అప్లికేషన్, అనాలసిస్, హ్యాండ్స్కిల్స్ (పటాలు గీయడం) వంటివి అడిగే అవకాశం ఎక్కువ.
4) మూలకాల ఆవర్తన పట్టిక
అధిక వెయిటేజీ కలిగిన చాప్టర్లలో ఇది ఒకటి. ఇందులో సరాసరిగా ఒక వ్యాసరూప, ఒక లఘు ప్రశ్న, ఒక అతిలఘు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
దృష్టిసారించాల్సిన అంశాలు
ఆధునిక ఆవర్తన పట్టికను గురించి రాయడం
పీరియడ్ నంబర్, గ్రూప్ నంబర్, వేలన్సీ, లోహ, అలోహాలను గుర్తించడం
డాబర్‌నీర్ త్రికం ఉదాహరణలు, అనామలస్ సిరీస్ ఆఫ్ మెండలీస్
ఆవర్తన ధర్మాలు- పరమాణు సైజు, అయనీకరణశక్మం, ధన, రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ ఏజెంట్స్ పీరియడ్, గ్రూప్‌లలో మారే విధం
ప్రశ్నలు అడిగే విధం, గత ప్రశ్నలు
ఈ చాప్టర్‌ను పరమాణు నిర్మాణం, లోహశాస్ర్తానికి అనుసంధానం చేసి పట్టక రూపంలో ఉన్న ప్రశ్న తరచుగా వ్యాసరూపప్రశ్నగా వస్తుంది.
ఉదా: ఒక పట్టికలో ఎ, బి, సి, డి, ఇ అనే అక్షరాలను ఇచ్చి మూలకం గుర్తించి, పీరియడ్ నంబర్, గ్రూప్ నంబర్, వేలన్సీ, ఎలక్ట్రాన్ విన్యాసం, లోహమా? అలోహమా?, ‘ఎ’ మూలకం ‘ఇ’తో కలిస్తే వచ్చే కాంపౌండ్ ఏది అనే ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆధునిక ఆవర్తన పట్టికను గురించి రాయండి.
అయనీకరణ శక్మం అంటే ఏమిటి? దానిని ప్రభావితం చేసే అంశాలు ఏవి?
కింది ధర్మాలు పీరియడ్, గ్రూప్‌లో మారే విధం
ఎ) పరమాణు సైజ్
బి) అయనీకరణ శక్మం
సి) ఇ, ఎ డి) ఇ, ఎన్
5) లోహ సంగ్రహణ శాస్త్రం
ఈ చాప్టర్లో ఒక 4 మార్కుల ప్రశ్న లేదా 8 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.
దృష్టిసారించాల్సిన అంశాలు
వివిధ మూలకాల ధాతువులు
ఫ్రోత్-ఫ్లోటేషన్ ప్రాసెస్
ఎలక్ట్రోలైటిక్ రిఫయినింగ్ ఆఫ్ Cu
లోహ క్షయం – అరికట్టే విధానాలు (గత ప్రశ్న)
లోహ క్షయానికి అవసరమైన పరిస్థితులకు సంబంధించిన ప్రయోగం (గత ప్రశ్న-వ్యాసరూపం)
భౌతిక శాస్త్రం
n భౌతిక శాస్త్రం విద్యుదయస్కాంతత్వం, మానవుని కన్ను రంగుల ప్రపంచంలో కేవలం రంగుల ప్రపంచం అనే సబ్ టాపిక్‌ను ఇంటర్నల్ అసెస్మెంట్కు తీసుకున్నారు.
సిలబస్‌లోని పాఠాలు
గోళాకార దర్పణాల్లో కాంతి పరావర్తనం
దృష్టిసారించాల్సిన అంశాలు
పుటాకార దర్పణం నాభ్యంతరం ‘f’ కనుక్కొనే ప్రయోగం
వస్తు, ప్రతిబింబ దూరాలను పుటాకార దర్పణం ద్వారా కొలవడం
కుంభాకార, పుటాకార దర్పణాల తేడాలు, ఉపయోగాలు
నిజ, మిధ్యా ప్రతిబింబాల మధ్య పోలికలు, తేడాలు
పుటాకార దర్పణం ప్రధానాక్షంపై వివిధ సందర్భాల్లో వస్తువు ఉంచితే ప్రతిబింబం ఏర్పడే విధం (పటసహాయంతో)కుంభాకార, పుటాకార దర్పణ కిరణ చిత్రాలను గీసే నియమాలు
దర్పణ సూత్రం, నాభ్యంతరం, వక్రతావ్యాసార్థం మధ్య సంబంధం, సమస్యల సాధన.
నోట్: లఘు ప్రశ్నల్లో ఈ విభాగం నుంచి డే టు డే లైఫ్ అప్లికేషన్ ప్రశ్న అడుగుతున్నారు. ఉదా: ఈఎన్టీ వైద్యులు తలకు ఉపయోగించే దర్పణం, సెలూన్లలో ఉపయోగించే దర్పణం, వాహనాల హెడ్లైట్లకు ఉపయోగించే దర్పణం, దంత వైద్యులు ఉపయోగించే దర్పణం, అందులో ఇమిడి ఉన్న సూత్రం. వాహనాల రియర్ వ్యూ మిర్రర్స్‌గా కుంభాకార దర్పణాలు వాడటానికి కారణం? సోలార్ కుక్కర్లో పాత్రను ఉంచే స్థలం.
గోళాకార దర్పణాలు ఆవిష్కరించకపోతే మానవుని జీవన సరళి ఎలా ఉండేది ఊహించండి.
2) వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం
ఈ విభాగం నుంచి రే డయాగ్రమ్స్, సమస్యల సాధనపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ.
దృష్టిసారించాల్సిన అంశాలు
కటక రకాలు వాటిని ఉపయోగించే విధానం
స్నెల్ నియమం-అనువర్తనాలు
కుంభాకార కటకానికి సంబంధించి వివిధ సందర్భాల్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు
కటక సూత్రం, కటక తయారీ సూత్రం దానిపై గల సమస్యల సాధన
కటకాల్లో పాటించే సంజ్ఞా సంప్రదాయం
వృద్ధీకరణంపై సమస్యల సాధన
కుంభాకార కటకం నీటిలో ఉంచితే నాభ్యంతరం పెరుగుతుందని చూపే ప్రయోగం
3) మానవుని కన్ను
n గమనిక: ఈ చాప్టర్లోని రంగుల ప్రపంచం అనే అంశం పరీక్షల సిలబస్‌లో పరిగణలోకి తీసుకోరు.
దృష్టిసారించాల్సిన అంశాలు
n దృష్టి దోష రకాలు, ఏర్పడే విధం, సరిచేసుకోడానికి ఉపయోగించే కటకాలు
n పుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వదృష్టి నివారణ పటం
n మానవుని కన్ను – దండాలు, శంకుల మధ్య తేడాలు, రెటీనా మీద ఏర్పడే ప్రతిబింబ స్వభావం, మన కంటిలో కటకం రకం
n కాంతి విక్షేపణ, పరిక్షేపణం అంశాలు
సమస్యలు- కటక సామర్థ్యం, నాభ్యంతరం, కంటి కటక కనిష్ట, గరిష్ట నాభ్యంతరాలు కనుగొనడం, వక్రీభవన కోణం కనుగొనడం
4) విద్యుత్ ప్రవాహం
భౌతిక శాస్త్రంలో అధిక వెయిటేజీ కలిగిన పాఠ్యాంశాల్లో ఇది కూడా ఒకటి
దృష్టిసారించాల్సిన అంశాలు
V/I విలువ స్థిరం అని చూపే ప్రయోగం, వాహక నిరోధం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుందని తెలిపే ప్రయోగం, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానం (R=R1+R2+R3, 1/R = 1/R1 +1/R2) వివిధ పట సంకేతాలు గీయడం, ఓమ్ నియమం వాటిపై గల సమస్యల సాధన.
డే టు డే లైఫ్ అప్లికేషన్
ఈ ప్రశ్నలు కూడా లఘుప్రశ్నల్లో అడుగుతున్నారు. ఉదా: ఇస్త్రీపెట్టె, రొట్టె వేడిచేసే పరికరంలో వాడే మిశ్రమ లోహాలు, ఇండ్లలో ఓవర్‌లోడ్ ఎప్పుడు ఏర్పడుతుంది. విద్యు త్ వలయంలో ఫ్యూజ్ ఎందుకు వాడుతారు. మీ ఇంట్లో విద్యుత్ వలయం శ్రేణి సంధానమా? లేదా సమాంతర సంధానమా? వంటి ప్రశ్నలు తరచుగా వస్తున్నా యి. కాబట్టి దైనందిన జీవితంలో విద్యుత్ అప్లికేషన్‌ను బాగా అర్థం చేసుకోవాలి.
ప్రజంటేషన్
డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్‌లో ఈ అంశం ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సదేహం లేదు. మీ పాఠశాలలో మీరు ఏ స్థాయి విద్యార్థి అనేది మీ ఉపాధ్యాయుడికి ఒక అంచనా ఉంటుంది. కానీ ఎగ్జామినర్‌కి మీరు ఏ స్థాయి విద్యార్థి అనేది మీరు రాసిన జవాబు పత్రం మాత్రమే తెలుపుతుంది. కాబట్టి ప్రజంటేషన్ ప్లేస్ ఏ కీ రోల్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సంవత్సర కష్టాన్ని అది 3 గంటల్లో చూపే అద్దం లాంటిది.
ప్రజంటేషన్ మెలకువలు
మొదటగా ప్రశ్నపత్రం పూర్తిగా చదివిన తర్వాత వెంటనే సమాధానాలను మొదలుపెట్టకూడదు. ప్రతి సమాధానాన్ని పేపర్‌పై పెట్టేకంటే ముందు 2 నిమిషాలపాటు సమాధానం మైండ్‌ఫ్రేమ్ చేసుకుని అప్పుడు రాయడం ప్రారంభించాలి.
ప్రశ్నల ఎంపిక
ఇది ప్రజంటేషన్లో మరో ముఖ్యాంశం. ప్రశ్నలను చాలా తెలివిగా ఎంచుకోవాలి. రిస్కీ ప్రశ్నలను అటెంప్ట్ చేయకూడదు. ఉదా: ఆవర్తన పట్టికలో ఒక పట్టికను ఇచ్చి పీరియడ్ నంబర్, గ్రూప్ నంబర్, లోహమా? అలోహమా? గుర్తించమంటారు. మీ జవాబులో కచ్చితత్వం ఉంటే ఇందులో మార్క్స్ కట్ చేయడానికి ఆస్కారం లేదు. ప్రశ్నపత్రంలో ఏదేని బిట్ మనకు ప్రశ్నలు రానప్పుడు అందులో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నను ఎంపిక చేసుకొని కొద్దిగా రిలేటెడ్‌గా రాసినా ఎంతో కొంత మార్కులు పొందే అవకావం ఉంది.
జవాబులను పేరాలుగా కాకుండా పాయింట్స్వైజ్గా రాస్తూ ముఖ్యమైన పదాలను కింద పెన్సిల్‌తో అండర్లైన్ చేస్తే ఎగ్జామినర్‌కి గుడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.
ఏదైనా విభాగంలో మీకు ఏదైనా ప్రశ్న డౌట్‌గా అనిపిస్తే ఆ విభాగం నుంచి అదనపు జవాబులను బిట్ నం, ప్రశ్న సంఖ్యతోచివరగా జవాబు రాయండి. కానీ ఎక్స్ట్రా అని హెడ్లైన్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే జవాబు పత్రం మూల్యాంకనం చేసే వ్యక్తి ఆ విభాగంలో ఎక్కువ మార్కులు వచ్చిన జవాబులను పరిగణలోకి తీసుకొని మిగతా వాటిని ఎక్స్ట్రాగా గుర్తిస్తారు. ఒకవేళ మీరే ఎక్స్ట్రా అని రాస్తే వాటిని పరిగణలోకి తీసుకొనే ప్రమాదం ఉంది.
పరీక్షలకు కేవలం నెల మాత్రమే. కాబట్టి ప్రతి చాప్టర్‌కు సంబంధించి సెల్ఫ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం స్మార్ట్‌వర్క్ అవుతుందనడంలో సందేహం లేదు.
ప్రశ్నపత్రం సరళి కోసం SCERT వెబ్సైట్ పొందుపర్చిన మోడల్ పేపర్‌ను చూడండి.
అలాగే సాధన కోసం SCERT వెబ్సైట్లో పొందుపర్చిన వర్క్‌షీట్‌ను వాడటం మంచిది.
ప్రణాళిక ప్రకారం ఉన్న సమయం వినియోగించుకొని బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
అనీల్‌కుమార్
సబ్జెక్ట్ నిపుణులు
అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్
ఇవీ కూడా చదవండి…
బ్యాంక్ ఆఫ్ మహారాష్రలో జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఏప్రిల్ 1 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆరోదశ పరీక్ష
ఎన్‌బీసీసీలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు