ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది?
- కింది వాటిలో సరైనది ఏది? (డి)
ఎ) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని పార్లమెంట్ నియమిస్తుంది
బి) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కొలీజియం
నియమిస్తుంది
సి) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని
ప్రధాన మంత్రి నియమిస్తారు
డి) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు
వివరణ: రాజ్యాంగంలోని 124వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్త్తితో పాటు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతే నియమిస్తారు. అయితే నియామకానికి ముందు తప్పనిసరిగా సుప్రీంకోర్ట్ కొలీజియంను సంప్రదించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాబ్డే ఉన్నారు. ఏప్రిల్ 2021లో ఆయన పదవీ విరమణ పొందనున్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఆయన రాష్ట్రపతికి సూచించారు. సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది హెచ్‌జే కానియా. సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది జస్టిస్ వైవీ చంద్రచూడ్. అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కమల్ నారాయణ్ సింగ్. - ప్రతిపాదన (ఏ): కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఇటీవల గ్రామ్ యూజేఏఎల్ఏ (ఉజాల) పథకాన్ని ప్రారంభించారు (ఎ)
కారణం(ఆర్): వాతావరణంలోకి కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా
వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: గ్రామ్ ఉజాల పథకాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మార్చి 19న బీహార్‌లోని అర్రాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ కేవలం రూ.10కే ఎల్ఈడీ బల్బులను గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తుంది. తొలి దశలో సుమారుగా 1.5 కోట్ల ఎల్ఈడీ బల్బులను బీహార్‌లోని అర్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ఇవ్వనున్నారు. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. - ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? (సి)
ఎ) బెంగళూర్ బి) కొచ్చిన్
సి) శ్రీనగర్ డి) నాగ్‌పూర్
వివరణ: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ శ్రీనగర్‌లో ఉంది. దీని పేరు ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. సందర్శకులను మార్చి మూడో వారం నుంచి అనుమతిస్తున్నారు. 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాల్ సరస్సు ఒడ్డున జబర్వాన్ పర్వత శ్రేణిలో ఇది ఉంది. 64 రకాలకు చెందిన 15 లక్షల తులిప్ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. కశ్మీర్ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి 2007లో దీనిని ప్రారంభించారు. - జంతువులకు అంబులెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం? (బి)
ఎ) కేరళ బి) ఆంధ్రప్రదేశ్
సి) కర్నాటక డి) ఒడిశా
వివరణ: దేశంలోనే తొలిసారిగా జంతువులకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. జంతువుల సంరక్షణ, ఆరోగ్యం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 మొబైల్ అంబులెన్స్‌ల క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో హైడ్రాలిక్ పద్ధతిలో వాటిని సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రులకు చేరుస్తారు. - ఇటీవల పీఆర్ఏఎన్ఐటీ (ప్రణిత్) వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
ఎ) యువతకు ప్రభుత్వం
ప్రారంభించనున్న స్కాలర్షిప్ ప్రోగ్రాం
బి) పవర్‌గ్రిడ్‌కు సంబంధించిన
ఈ టెండర్ పోర్టల్
సి) వివిధ రిక్రూట్మెంట్ సంస్థలు
ఉమ్మడిగా ప్రారంభించిన పోర్టల్
డి) ఏదీ కాదు
వివరణ: ప్రణిత్ పేరుతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ఈ-టెండరింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది. పారదర్శకత పెంపుతో పాటు టెండర్ల ఆహ్వానాన్ని సులభతరం చేయడం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థకు చెందిన స్టాండైర్డెజేషన్, టెస్టింగ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ దీనిని ఆమోదించింది. పవర్‌గ్రిడ్ ఒక మహారత్న సంస్థ. దీని ప్రధాన కేంద్రం గురుగ్రామ్‌లో ఉంది. - దేశపు తొలి ఎఫ్‌పీవో పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం? (సి)
ఎ) నాగాలాండ్ బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్ డి) పంజాబ్
వివరణ: కిసాన్ కల్యాణ్ మిషన్‌లో భాగంగా ఎఫ్‌పీవో శక్తి పోర్టల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహాయంతో ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. రైతులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ ఏజెన్సీలు అందరినీ ఒకే వేదికమీదకు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఎఫ్‌పీవో పూర్తి రూపం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. రైతుల కోసమే రూపొందించిన తొలి ఎఫ్‌పీవో పోర్టల్ ఇదే. - దేశంలో ఇథనాల్ ప్రమోషన్ విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రం? (డి)
ఎ) రాజస్థాన్ బి) మహారాష్ట్ర
సి) ఉత్తరాఖండ్ డి) బీహార్
వివరణ: ఇథనాల్ ప్రమోషన్ విధానాన్ని బీహార్ రాష్ట్రం ప్రకటించింది. ఈ ఘనత సాధించిన దేశంలోని తొలి రాష్ట్రం ఇదే. మక్కజొన్న, బియ్యం తదితర ధాన్యాలతో నేరుగా ఇథనాల్‌ను తయారు చేసుకొనే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. 2021 మార్చి 16న ఈ విధానానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్లకు 15% సబ్సిడీ ఇవ్వనున్నారు. గరిష్ట స్థాయిలో రూ.5 కోట్ల మేర రాయితీ అందనుంది. - ప్రతిపాదన (ఏ): నెదర్లాండ్స్ ప్రధానిగా మార్క్ రూట్ విజయం సాధించారు (బి)
కారణం (ఆర్): ఈ ఏడాది జనవరిలో నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ రాజీనామా చేశారు
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: నెదర్లాండ్స్ ప్రధానిగా నాలుగోసారి మార్క్ రూట్ విజయం సాధించారు. ఆ దేశంలో అతి ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన వారిలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. ఆయన జనవరి 2021లో రాజీనామా చేశారు. శిశువుల సంక్షేమానికి సంబంధించిన నిధుల్లో కుంభకోణం బయటపడటంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నెదర్లాండ్స్ పశ్చిమ యూరప్‌లో ఉండే ఒక దేశం. దీని రాజధాని అమ్‌స్టర్‌డామ్. - మార్చి 23ని కింది వాటిలో ఏ రోజుగా నిర్వహిస్తారు? (సి)
- అమర వీరుల దినోత్సవం
- వరల్డ్ మెటీరియోలాజికల్ డే
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: మార్చి 23ని అమర వీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. 1929, ఏప్రిల్ 8న భగత్ సింగ్, బాతుకేశ్వర్ దత్‌లు నాటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు వేశారు. అలాగే మార్చి 23న వరల్డ్ మెటీరియోలాజికల్ డేగా కూడా నిర్వహిస్తారు. 1950లో ఇదే రోజున వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. భూమి వాతావరణాన్ని పరిరక్షించడానికి ఈ సంస్థ సాయపడుతుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
- 2020 గాంధీ శాంతి బహుమతి ముజిబుర్ రెహమాన్‌కు ఇచ్చారు. అతడు ఏ దేశస్థుడు? (ఎ)
ఎ) బంగ్లాదేశ్ బి) మాల్దీవులు
సి) ఇండోనేషియా డి) ఆఫ్ఘనిస్థాన్
వివరణ: 2020 గాంధీ శాంతి బహుమతిని బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్‌కు, 2019కు ఒమన్ దేశానికి చెందిన కబూస్ బిన్ సయిద్ అల్ సయిద్‌కు ప్రకటించారు. ఈ ఇద్దరు కూడా మరణానంతరం అవార్డ్‌ను పొందారు. మరణించిన వారికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించడం ఇదే తొలిసారి. 1995లో ఈ అవార్డ్‌ను స్థాపించారు. అవార్డ్‌ను అందుకున్న తొలి వ్యక్తి టాంజానియాకు చెందిన జులియస్ నైరేరే. 1998లో దీనిని రామకృష్ణ మిషన్‌కు ఇచ్చారు. అవార్డ్‌ను పొందిన తొలి సంస్థ ఇదే. 1999లో బాబా ఆమ్టే ఈ అవార్డ్‌ను దక్కించుకొని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు అయ్యారు. - ప్రపంచ సంతోష సూచీలో భారత్ ఎన్నో ర్యాంక్‌లో నిలిచింది? (డి)
ఎ) 136 బి) 137 సి) 138 డి) 139
వివరణ: ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచీని విడుదల చేసింది. మొత్తం 149 దేశాలకు ర్యాంకులను ప్రకటించగా భారత్ 139వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఉంది. ఆ తర్వాత 2, 3, 4, 5వ స్థానాల్లో వరుసగా ఐస్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ తదితర దేశాలు నిలిచాయి. 2019లో ఈ జాబితాలో భారత్ 140వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉంది. మార్చి 20న ప్రపంచ సంతోష దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజున ఈ నివేదిక విడుదలయ్యింది. ఈ ఏడాది ఇతివృత్తం ‘అందరికీ ఎప్పటికీ సంతోషం (హ్యాపీనెస్ ఫర్ ఆల్, ఫరెవర్). - పీఏబీబీఐ-యాంటీటెర్రర్-2021 విన్యాసాలను నిర్వహించాలని కింది పేర్కొన్న ఏ కూటమి పిలుపు ఇచ్చింది? (సి)
ఎ) జీ-20 బి) జీ-20 సి) ఎస్సీవో డి) బ్రిక్స్
వివరణ: ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ పీఏబీబీఐ-యాంటీ టెర్రర్-2021 విన్యాసాన్ని నిర్వహించాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) నిర్ణయించింది. మార్చి 18న ఉజ్భెకిస్థాన్లోని తాష్కెంట్లో నిర్వహించిన 36వ ఆర్ఏటీఎస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఏటీఎస్ అంటే రీజినల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఎస్సీవోకు చెందిన ఒక శాశ్వత వ్యవస్థే ఆర్ఏటీఎస్. ఎస్సీవో అనే కూటమిని 2001లో ఆరు దేశాలతో కలిపి ఏర్పాటు చేశారు. జూన్ 2017లో భారత్, పాకిస్థాన్‌లు ఇందులో చేరడంతో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇతర ఆరు దేశాలు చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్. సంస్థ ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్‌లో ఉంది.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
ఇవీ కూడా చదవండి…
స్టీల్ అథారిటీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
- Tags
Previous article
విషయ అవగాహనకు ఎక్కువ మార్కులు
Next article
ఫిజిక్స్‌లో మార్కులు తెచ్చుకుందామిలా!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు