పదో తరగతి వార్షిక పరీక్షల సంసిద్ధత
కరోనా మహమ్మారి కారణంగా చాలాకాలం విద్యార్థులు ప్రత్యక్షబోధనకు దూరమయ్యారు. 180కి పైగా పనిదినాలతో ప్రత్యక్షబోధన ద్వారా అభ్యసించాల్సిన అంశాలను 70-80 పనిదినాల్లో అభ్యసించి, పరీక్షలకు హాజరుకావాల్సి వస్తున్నది.
పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యాశాఖ 30శాతం సిలబస్‌ను తగ్గించింది. తెలుగు పరంగా 6 పద్య, 6 గద్య పాఠాలు, రామాయణం (ఉపవాచకం) సిలబస్ ఉండేది. ఇందులో 30 శాతం తగ్గించి కొత్తబాట, నగరగీతం, భిక్ష (3పాఠాలు) పరీక్షల నుంచి తొలగించారు. మిగిలిన 9 పాఠాలు 4పద్య+ 5గద్య, రామాయణం (ఉపవాచకం)ను విద్యార్థులు చదవాలి. కరోనా పరిస్థితుల దృష్ట్యా I, II ప్రశ్నపత్రాల స్థానంలో ఒకే ప్రశ్నపత్రాన్ని నిర్వహించనున్నారు. పరీక్ష భయాన్ని తొలగించి విద్యార్థుల్లో ఒత్తిడిని అధిగమించే విధంగా ఎక్కువ ప్రశ్నలను (అధిక సంఖ్యలో) ఇచ్చి ఎంపిక చేసుకునే అవకాశం(Choice) కల్పించారు. 80 మార్కుల ప్రశ్నపత్రం ( పార్ట్-ఎ 60+ పార్ట్-బి -20) 3గంటల 15 నిమిషాల సమయంలో పరీక్ష రాసేవిధంగా రూపొందించారు.
మాదిరి ప్రశ్నపత్రం పార్ట్-ఎ (60 మార్కులు)
I అవగాహన ప్రతిస్పందన: (20 మార్కులు)
పరిచిత గద్యం (రామాయణం) – 5మార్కులు
పరిచిత పద్యం (పద్యభాగం, చుక్కగుర్తు పద్యాలు) – 10 మార్కులు
అపరిచిత గద్యం -5 మార్కులు
వ్యక్తీకరణ- సృజనాత్మకత (40మార్కులు)
స్వీయరచన (33 మార్కులు)
లఘు సమాధాన ప్రశ్నలు (34= 12) n ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఏవేని 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి (ఏవేని మూడు) ప్రశ్నలు- కవి గురించి (పద్యభాగం) n రచయిత గురించి (గద్యభాగం) n 2 ప్రశ్నలు పద్యభాగం n 2 ప్రశ్నలు గద్యభాగం n వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (37=21)
ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఏవేని మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి
పద్యభాగం (4 పాఠాల నుంచి) 2 ప్రశ్నలు
గద్యభాగం (5 పాఠాల నుంచి) 2 ప్రశ్నలు
ఉపవాచకం (రామాయణం నుంచి) 2 ప్రశ్నలు
సృజనాత్మకత ( 1*7=7)
మూడు ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి
పార్ట్-బి ( 20 మార్కులు)
పదజాలం: 10 మార్కులు
పది ప్రశ్నలు- బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 మార్కులు
వ్యాకరణం- 10 మార్కులు
పదిప్రశ్నలు- బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQ) 10 మార్కులు
(తెలుగు)
పదజాలం, వ్యాకరణ అంశ మార్కులకు కూడా ఈ భాగం సహకరిస్తుంది.
ఉపవాచకం (రామాయణం) ఆరుకాండలు శ్రద్ధగా, అవగాహనతో చదవడం వల్ల పరిచిత గద్యం (5మార్కులు), స్వీయరచన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రెండు రాయవచ్చు. (14 మార్కులు). పద్యభాగం, రామాయణాన్ని పూర్తిగా చదివితే పార్ట్-ఏ లోని 60 మార్కులకు 60 సాధించవచ్చు.
గద్యభాగం: గద్యభాగంలో ఐదుపాఠాలు సిలబస్‌లో ఉన్నాయి.
(ఎవరి భాష వారికి వినసొంపు, భాగ్యరెడ్డివర్మ (భాగ్యోదయ) లక్ష్యసిద్ధి, గోల్కొండ కోట, భూమిక) విద్యార్థులు స్వీయరచన ప్రశ్నలు ఎంపిక చేసుకునే అవకాశం పెరగాలంటే, ముఖ్యంగా ఇప్పటికే భాషపై పట్టున్న విద్యార్థులు గద్యభాగ పాఠాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలి.
సృజనాత్మకత: (7 మార్కులు) ఇవి సాధించడం సులభం
కరపత్రం, సంభాషణ, ప్రశ్నావళి, లేఖ, కవిత, ఆత్మకథ, వ్యాసం, అభినందన వ్యాసం మొదలైన అంశాలను ఉపాధ్యాయుల సహాయంతో అభ్యాసం చేసినట్లయితే అంశం మారవచ్చు కాని నిర్మాణం మారదు.
నిర్మాణం ఎంత ముఖ్యమో అందులోని అంశాన్ని వ్యక్తపరిచే తీరుకూడా అంతేముఖ్యం. కాబట్టి ఉపాధ్యాయుల సూచనలు చాలా ముఖ్యం.
పదజాలం- పాఠాలన్నింటి పట్ల స్పష్టమైన అవగాహన చాలా ముఖ్యం. పుస్తకం వెనుకభాగంలో పొందుపరిచిన ‘పదవిజ్ఞానం’ పూర్తిగా చదివి ఉండాలి. (అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి/వికృతులు)
వ్యాకరణం: (సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు)
6వ తరగతి నుంచి 10తరగతి వరకు గల పాఠ్యపుస్తకాల్లో ‘సిలబస్’కు పరిమితమైన ప్రతి వ్యాకరణాంశం సూత్ర సహితంగా ఉదాహరణలతో సహా ఇచ్చారు. వాటిపై స్పష్టమైన అవగాహన ఉంటే చాలు. ముఖ్యంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాన్ని అంటే పాఠాలను అర్థమయ్యేవరకు చదివి, విషయావగాహన చేసుకుని సొంత మాటల్లో రాసే విధంగా అభ్యాసం చేయాలి. పదాల పట్ల పట్టు సాధించడం ద్వారా సమాధానాలు మాత్రమే కాక పదజాల వ్యాకరణాంశాలను కూడా సులభంగా రాయగలుగుతారు.
ఎలా చదవాలి?
పద్యభాగంలోని 4 పాఠాలు. దానశీలం, వీరతెలంగాణ, శతకమధురిమ,
జీవనభాష్యంపై ప్రత్యేక శ్రద్ధవహిస్తే మంచి మార్కులు పొందవచ్చు.
పరిచిత పద్యం: 10 మార్కులు.(దానశీలం, వీరతెలంగాణలోని చుక్క పద్యాలపై)
స్వీయరచన: లఘు, వ్యాసరూప సమాధానాలు (సారాంశాలు పుస్తకంలోనే ఉంటాయి)
అన్ని ప్రశ్నలకు అంటే పూర్తి మార్కులకు రాయవచ్చు.
చక్రవర్తుల శ్రీనివాస్
SRG పాఠ్యపుస్తక రచయిత
ZPHS చర్లపల్లి, వరంగల్ రూరల్ జిల్లా
ఇవీ కూడా చదవండి…
ఐఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 502 పోస్టులు
నేటి నుంచి లాసెట్ దరఖాస్తులు ప్రారంభం
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు