ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం?
టెట్ మోడల్ టెస్ట్-1 మ్యాథ్స్
- బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ఉత్తేజితుడైన అపర గణిత మేధావి భాస్కరాచార్యుడు రచించిన ఏ గ్రంథం గ్రహగణన పద్ధతులను వివరిస్తుంది?
1) బ్రహ్మస్ఫుట సిద్ధాంతం
2) కరణకుతూహలం
3) సింద్-హిద్ 4) కరణ-ఖండ-భాద్యక - ‘గణిత ప్రణాళికలో చేర్చే అంశాలు జీవితంతో సహసంబంధం కలిగి ఉండటమే కాకుండా, జీవితంలో విద్యార్థి స్థిరపడటానికి కూడా సహకరించాలి’ అనేవి కింది ఏ సూత్రాలను తెలియజేస్తాయి?
1) సన్నాహ సూత్రం, సహసంబంధ సూత్రం
2) సన్నాహ సూత్రం, సాంస్కృతిక సూత్రం
3) సన్నాహ సూత్రం, క్రమశిక్షణ సూత్రం
4) సహసంబంధ సూత్రం, క్రమశిక్షణ సూత్రం - కింది ప్రవచనాలను పరిశీలించండి.
ఎ. ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని
అనుసరిస్తుంది
బి. నిగమన పద్ధతి ఆగమన పద్ధతిని
అనుసరిస్తుంది
1) ఎ, బి సత్యాలు
2) ఎ, బి అసత్యాలు
3) ఎ సత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం - ‘అభినందనలు’ ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు?
1) మున్నిక్ 2) స్కోర్లింగ్
3) బ్రెస్లిచ్ 4) యంగ్ - కింది వాటిలో ఏది అధిక అమూర్తత్వం కలిగి ఉంటుంది?
1) ప్రాతినిధ్య అనుభవాలు
2) క్షేత్రపర్యటనలు
3) చలన చిత్రాలు
4) శాబ్దిక చిహ్నాలు - బహుళైచ్ఛిక రకానికి చెందిన ప్రశ్న లక్ష్యం-స్పష్టీకరణ
1) జ్ఞానం-జ్ఞప్తికి తెచ్చుకోవడం
2) జ్ఞానం-గుర్తించడం
3) అవగాహన-గుర్తించడం
4) అవగాహన-పునఃస్మరణ
సైన్స్+సోషల్ - సరైనవి సూచించండి.
ఎ. శాస్త్రం అంటే చేయడం- కొఠారి
బి. శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం- NPE-86
సి. శాస్త్రం అంటే సత్యాన్వేషణ
– NCF-2005
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి, సి సరికాదు
3) ఎ, బి సరైనవి
4) బి, సి సరైనవి - కింది వాటిలో వ్యతిరేక ప్రవచనం కానిది?
1) ఆశయాలు స్వల్పకాలిక సాధితాలు, లక్ష్యాలు దీర్ఘకాలిక సాధితాలు
2) లక్ష్యాలు సాధించదగినవి కావు, ఉద్దేశాలు సాధించదగినవి
3) ఉద్దేశాల పరిధి సంక్షిప్తం,
లక్ష్యాల పరిధి విశాలం
4) లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతాయి - 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల ‘రవాణా విద్య’ అనే అంశం?
1) శీర్షిక ఉపగమం 2) ఏకకేంద్ర ఉపగమం
3) సమైక్య ఉపగమం
4) కాలక్రమ ఉపగమం - ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం?
1) విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించవచ్చు
2) తక్కువ వ్యయంలో ఎక్కువ లాభం పొందవచ్చు
3) తక్కువ సమయంలో ఎక్కువ విషయాల బోధన
4) అన్ని పాఠ్యాంశాలు బోధించవచ్చు - కింది వాటిలో పరికల్పనలు చేయడం అనే విద్యాప్రమాణానికి చెందిన ప్రశ్న?
1) పుష్పించే మొక్కలకు ఉదాహరణలు రాయండి?
2) ఉత్పతనం అంటే ఏమిటి?
3) నోటిలో దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది?
4) గాలికి పీడనం ఉందని ఎలా నిరూపిస్తావు? - కింది వాటిలో పాఠ్య పుస్తక భౌతిక సంబంధితం కానిది?
1) కవర్‌పేజీ 2) పాఠ్యాంశ కూర్పు
3) పేపర్ నాణ్యత 4) బరువు
Answers
1-2, 2-1, 3-4, 4-3, 5-4, 6-2, 7-1, 8-4, 9-2, 10-1, 11-3, 12-2.
టెట్ మోడల్ టెస్ట్-2 మ్యాథ్స్
- వోగెల్స్ చెక్‌లిస్ట్ ప్రకారం గణిత పాఠ్య పుస్తకం నిమ్న, సగటు, ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉండాలని సూచించే అంశం?
1) అనుకూలనీయత 2) నిర్వహణ
3) కచ్చితత్వం 4) భౌతికరూపం - కింది వాటిలో గణిత క్లబ్ ప్రయోజనం కానిది?
1) పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం
2) బులిటెన్ బోర్డు నిర్వహణ
3) మధ్యాహ్న భోజన పరిశీలన
4) స్క్రాప్ బుక్ తయారీ - గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించాడు. ఈ అంశం దేనికి చెందుతుంది?
1) సంశ్లేషణ 2) విశ్లేషణ
3) వ్యవస్థాపనం 4) హస్తలాఘవం - కింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం?
1) తెలిసిన దాని నుంచి తెలియని దానికి పోవడం
2) సూక్ష్మ విషయాల నుంచి ఉన్నత విషయాలకు
3) ఒక తరగతిలో నేర్చుకున్నది పై తరగతికి ప్రేరణ
4) ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం - ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఉండదు?
1) ఇంద్రియ చాలక దశ 2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ 4) నియత ప్రచాలక దశ - విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగిస్తుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి సాధించిన
విద్యాప్రమాణం?
1) వ్యక్త పరచడం
2) కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం
3) అనుసంధానం
4) ప్రాతినిధ్య పరచడం – దృశ్యీకరణ
సైన్స్+సోషల్ - విద్యార్థి అడవుల నరికివేతకు, మృత్తికా క్రమక్షయానికి మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - చార్టుల ఉపయోగం?
1) త్రిమితీయ ఉపకరణాలు ప్రదర్శించడానికి
2) సూత్రాలు, సిద్ధాంతాలు రాబట్టడానికి
3) ఇంటి పని ఇవ్వడానికి
4) సూత్రాలు, సాంకేతిక పదాలు రాసి
ప్రదర్శించడానికి - పరిసరాల విజ్ఞానం సంగ్రహ మూల్యాంకనంలో రెండో విద్యాప్రమాణం?
1) కారణాలు-నిరూపణలు
2) ప్రశ్నించడం-పరికల్పించడం
3) ప్రశంస-జీవవైవిధ్యం
4) సమాచార సేకరణ-ప్రాజెక్టు - ‘చలన నాడులకు విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ’ అనేవి ముఖ్యాంశాలుగా గల విధానం?
1) కిండర్ గార్డెన్ 2) మాంటిస్సోరి
3) అన్వేషణ 4) ప్రకల్పన - ‘పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారత దేశం’ అని పేర్కొన్నది?
1) గాంధీజీ 2) నికోలస్ రైట్
3) సర్వేపల్లి 4) కొఠారి - విద్యార్థిలోని బలం, బలహీనతలను తెలుసుకునే మూల్యాంకనం?
1) లోప నిర్ధారణ మూల్యాంకనం
2) రూపణ మూల్యాంకణం
3) సంకలన మూల్యాంకనం
4) ప్రాగుక్తీక మూల్యాంకనం
Answers
1-1, 2-3, 3-2, 4-4, 5-2, 6-2, 7-2, 8-4, 9-2, 10-2, 11-1, 12-1
-ఏఎన్ రావు ,విషయ నిపుణులు
టెట్ మోడల్ టెస్ట్-3 మ్యాథ్స్
- సరైనది సూచించండి.
ఎ. ఆర్యభట్ట- ఆర్యభట్ట సిద్ధాంతం
బి. బ్రహ్మగుప్త- కరణకుతూహలం
సి. భాస్కరాచార్య- కరణ-ఖండ-ఖాద్యక
1) ఎ సరైనది 2) సి సరైనది
3) ఎ, బి సరైనది 4) బి, సి సరైనది - ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఆటలపోటీలు నిర్వహిస్తూ, నియమ నిబంధనలు వివరించి చెప్పడం ఏ అంశాల సహసంబంధం సూచిస్తుంది?
1) గణితం-కళలు 2) గణితం-వ్యాయామ విద్య
3) గణితం-భాష 4) గణితం-తత్వశాస్త్రం - గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్ర వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరడంలో అనుసరించే బోధన పద్ధతి?
1) క్రీడా పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి 4) నిగమన పద్ధతి - డామినో కార్డుల ఉపయోగం?
1) స్థాన విలువల అవగాహన
2) ఆరోహణ, అవరోహణ
3) చతురస్ర, దీర్ఘచతురస్ర భావనలు
4) క్రమ, అపక్రమ భిన్నాల భావనలు - కింది వాటిలో గణిత నైపుణ్యానికి సంబంధించని వాక్యం?
1) మనోగణనలు, లిఖిత గణనలు త్వరితంగా, కచ్చితంగా చేస్తాడు
2) సమస్యాసాధనకు అనవసరమైన సోపానాలు వదిలేస్తాడు
3) గణిత నమూనాలు తయారు చేస్తాడు
4) కారణాంకాలకు, గుణిజాలకు మధ్య తేడాలు తెలుపుతాడు - AB=5 సెం.మీ., BC= 4 సెం.మీ., CA=7 సెం.మీ. మొ.. కొలతలతో త్రిభుజం ABCని నిర్మించడం?
1) కారణాలు చెప్పడం-నిరూపణలు చేయడం
2) వ్యక్తపరచడం 3) అనుసంధానం
4) ప్రాతినిధ్యపరచడం-దృశ్యీకరణ
సైన్స్+సోషల్ - ఎల్బీ స్టాండ్స్ ప్రకారం కార్యాచరణ ప్రణాళిక?
1) విద్యాప్రణాళిక 2) విషయ ప్రణాళిక
3) వార్షిక ప్రణాళిక 4) పీరియడ్ ప్రణాళిక - కింది వాటిలో వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ
1) పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లను అభినందించడం
2) పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కును నిజాయితీగా వినియోగించడం
3) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించడం
4) పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ నమూనాను తయారు చేయడం - ‘అక్బర్ పరిపాలన’ను ఉపన్యాసం ద్వారా విన్న విద్యార్థిలో జరిగే అభ్యసన శాతం?
1) 83 2) 11 3) 3.5 4) 1.5 - అభ్యసనలో విద్యార్థి ఏకాగ్రతను నిలిపి ఉంచడమే కాక, సైన్యంలో శిక్షణ ఇవ్వడానికి ఉపకరించే ఉత్తమ చార్టు?
1) వృక్ష చార్టు 2) ప్రక్రియ చార్టు
3) ఫ్లిప్ చార్టు 4) స్ట్రిప్‌టీజ్ చార్టు - ప్రయోగశాలకు సంబంధించిన ఏ రిజిస్టర్లో విద్యార్థి సంతకం తప్పనిసరి?
1) బ్రేకేజ్ రిజిస్టర్ 2) స్టాక్ రిజిస్టర్
3) ఇష్యూ రిజిస్టర్ 4) ఆర్డర్ రిజిస్టర్ - కింది వాటిలో మౌఖిక పరీక్షలకు వ్యతిరేక వాక్యం?
1) తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను పరీక్షించవచ్చు
2) ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించలేం
3) ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం వచ్చిన విద్యార్థులకు ఉపయోగం
4) వీటి ఫలితాలకు సాక్ష్యాధారం లేదు
Answers
1-1, 2-2, 3-2, 4-3, 5-4, 6-4, 7-4, 8-2, 9-2, 10-4, 11-3, 12-3
- Tags
- Education News
Previous article
ఆగస్ట్ 12ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
Next article
తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు