ఆగస్ట్ 12ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
- కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి (డి)
- టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో ఉంది
- అగ్రస్థానంలో ఉన్న దేశం అమెరికా
- అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా
- భారత్ మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది
ఎ) 1, 3, 4 బి) 1, 3
సి) 1, 4 డి) 1, 2, 4
వివరణ: జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించి 48వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత్ బంగారు పతకం సాధించింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా దీనిని సాధించాడు. అలాగే మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియాలు పతకాలు సాధించారు. భారత హాకీ జట్టు కాంస్యం గెలిచింది.
- కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి (బి)
- రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డును ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డుగా మార్చారు
- ఈ అవార్డును పొందిన అతిపిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్
- ఆగస్ట్ 29న జాతీయ క్రీడల దినోత్సవంగా నిర్వహిస్తారు
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1 డి) 1, 2, 3
వివరణ: దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర. దీని పేరును ధ్యాన్‌చంద్ ఖేల్త్న్రగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధ్యాన్‌చంద్ ప్రముఖ హాకీ క్రీడాకారుడు. భారత్ 1928, 32, 36 సంవత్సరాల్లో హాకీలో బంగారు పతకాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1928 నుంచి 64 మధ్య ఎనిమిది ఒలింపిక్స్‌లో భారత్ ఏడుసార్లు పతకాన్ని సాధించింది. ధ్యాన్‌చంద్ జయంతి ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డును 1991లో ప్రవేశపెట్టారు. దీనిని పొందిన తొలి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్. అతిచిన్న వయస్కుడు అభినవ్ బింద్రా. తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్
- కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)
- ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి
- భద్రతా మండలిలోని అన్ని దేశాలకు వీటో అధికారం ఉంటుంది
- భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది
- భద్రతా మండలిలో నిర్వహించిన బహిరంగ చర్చకు నేతృత్వం వహించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ
ఎ) 1, 2, 4 బి) 1, 4
సి) 1, 3, 4 డి) 2, 4
వివరణ: ఐక్యరాజ్య సమితికి ఉన్న ఆరు అంగాల్లో భద్రతా మండలి ఒకటి. ఇందులో ఐదు శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా), పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలు రెండు సంవత్సరాలకుగాను ఎన్నికవుతాయి. 2021, జనవరి 1న భారత్ సభ్యత్వం ప్రారంభమయ్యింది. ఈ మండలిలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని సూచించారు.
- ఇటీవల 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.దీని ప్రయోజనం ఏంటి? (ఎ)
ఎ) ఓబీసీ జాబితాను రూపొందించే అధికారం రాష్ర్టాలకు దక్కుతుంది
బి) ఓబీసీ జాబితాను రూపొందించే అధికారం కేంద్రానికి ఉంటుంది
సి) సుప్రీంకోర్ట్ ఉత్తర్వు ద్వారా ఓబీసీ జాబితాను సవరించాల్సి ఉంటుంది
డి) ఏదీకాదు
వివరణ: ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకొనే అధికారాన్ని రాష్ర్టాలకు ఇస్తూ 127వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. 338 బి, 342 ఎ, 366 అధికరణలను సవరించారు. ఈ బిల్లుకు లోక్‌సభలో 385 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. దేశంలోని 671 కులాలు ఈ బిల్లుద్వారా ప్రయోజనాన్ని పొందనున్నాయి - ఎన్ఎంఈవో-ఓపీ పథకాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.ఇది దేనికి సంబంధించింది? (డి)
ఎ) కరోనా నిర్ధారణ పరీక్ష
బి) సూక్ష్మరుణ సంస్థలు
సి) కొత్త సాఫ్ట్వేర్ డి)వంటనూనె
వివరణ: రూ.11,000 కోట్లతో రానున్న అయిదేండ్లలో ఎన్ఎంఈవో-ఓపీ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని పూర్తి రూపం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్ పామ్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా దీనిని అమలు చేయనున్నారు. వంటనూనె ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించింది ఇది. ప్రస్తుతం వంటనూనె అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని 2024-25 నాటికి 45 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. వంటనూనె వినియోగంలో ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. - కింది ఏ పథకం/పథకాలను పొడిగించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది? (సి)
- సర్వశిక్షా అభియాన్
- ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
- రాష్ట్రీయ మహిళాకోష్
ఎ) 1, 3 బి) 2, 3
సి) 1, 2 డి) 1, 2, 3
వివరణ: పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర విద్యా పథకాన్ని మరో అయిదేండ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021, ఏప్రిల్ 1 నుంచి 2026, మార్చి 31 వరకు సమగ్ర విద్యా పథకం-2 అమలులో ఉంటుంది. ఇందుకు రూ.2,94,283.04 కోట్లు వ్యయం చేయనున్నారు. అలాగే 1000 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2023 వరకు ఇది కొనసాగుతుంది. అయితే రాష్ట్రీయ మహిళా కోష్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని 1993లో ప్రారంభించారు. అనేక ప్రత్యామ్నాయ పథకాలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రీయ మహిళా కోష్ తన ప్రాధాన్యతను కోల్పోయింది.
- దేశంలో తొలిసారిగా నీటి విల్లాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (డి)
ఎ) కేరళ బి) పశ్చిమబెంగాల్
సి) అండమాన్ డి) లక్షద్వీప్
వివరణ: లక్షద్వీప్‌లో విలాసవంతమైన నీటి విల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. రూ.800 కోట్ల వ్యయంతో లక్షద్వీప్‌లోని మినికాయ్, కద్మత్, సుహేలి దీవుల్లో మూడు నీటి విల్లా ప్రాజెక్టులు నిర్మించాలని అక్కడ పాలనా యంత్రాంగం నిర్ణయించింది. సముద్ర తీర ప్రాంత ఆర్థికవృద్ధికి బలమైన పర్యటనకు వనరుగా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడి పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే విల్లాలు నిర్మిస్తారు. - జతపరచండి (రాష్ర్టాలు, అక్కడ అమలులోకి రానున్న అంశాలు) (ఎ)
- హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ ఎ. ఒడిశా
- భూకంప ముందస్తు హెచ్చరిక యాప్
బి. ఉత్తరాఖండ్ - 100% కొవిడ్ వ్యాక్సిన్ పొందిన తొలి నగరం ఉన్న రాష్ట్రం సి.కేరళ
ఎ) 1-సి, 2-బి, 3-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి
సి) 1-సి, 2-ఎ, 3-బి
డి) 1-బి, 2-ఎ, 3-సి
వివరణ: దేశంలో తొలి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్‌ను కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రక్తం, కణజాల నమూనాలను నిలువ చేస్తారు. భూకంప ముందస్తు హెచ్చరిక యాప్‌ను తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ప్రారంభించారు. ఒక ప్రాంతంలో భూకంపం వచ్చాక, సమీపంలో ఇంకా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా? ఎంత సమయంలో వస్తుంది? తదితర అంశాలను తెలుసుకొనేందుకు వీలుంటుంది. కొవిడ్-19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో భువనేశ్వర్ 100% వ్యాక్సినేషన్ సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి నగరంగా రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
- ద్రవ్య విధాన రేట్లను జతపరచండి (సి)
- రెపోరేట్ ఎ. 4%
- బ్యాంక్ రేటు బి.4.25%
3 ఎస్ఎల్ఆర్ సి.18%
ఎ) 1-సి, 2-బి, 3-ఎ
బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి
డి) 1-ఎ, 2-సి, 3-బి
వివరణ: విధాన, రిజర్వ్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా ద్రవ్య విధానాన్ని తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రేట్లు.. రెపోరేట్-4%, రివర్స్ రెపో రేట్-3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్-4.25%, బ్యాంక్ రేట్-4.25%, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)-4%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)-18%
- కేంద్ర ప్రభుత్వం, 10 రాష్ర్టాలు, ప్రపంచ బ్యాంక్ కలిసి డీఆర్ఐపీ-2 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపాయి. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) పేదలకు గృహ నిర్మాణం
బి) డ్యామ్‌లను బలోపేతం చేయడం
సి) వ్యవసాయ రంగంలో సంస్కరణలు
డి) సూక్ష్మ రుణ సంస్థలను ఆదుకోవడం
వివరణ: డీఆర్ఐపీ అంటే డ్యాం రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. దీనిని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల కమిషన్, పది రాష్ర్టాలు, ప్రపంచ బ్యాంక్ కలిసి సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు 250 మిలియన్ డాలర్ల వ్యయం కానుంది. డ్యామ్‌లను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇందుకు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి అనుసరిస్తారు. దాదాపు 120 డ్యామ్‌లు దీని పరిధిలోకి వస్తాయి. - 2020 గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ ఎంత? (డి)
ఎ) 181 బి) 78 సి) 54 డి) 122
వివరణ: లండన్ కేంద్రంగా పనిచేసే కామన్వెల్త్ సెక్రటేరియట్.. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. మొత్తం 181 దేశాలకు ర్యాంక్‌లు కేటాయించగా.. భారత్ 122వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. - ఆగస్ట్ 12ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (సి)
- ప్రపంచ యువజన దినోత్సవం
- ప్రపంచ ఏనుగుల దినోత్సవం
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 సరికాదు
వివరణ: ఏటా ఆగస్ట్ 12న ప్రపంచ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు (భారత జాతీయ యువజన దినోత్సవాన్ని ఆగస్ట్ 12న జరుపుతారు). ఈ తేదీని ఎంపిక చేస్తూ 1999లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. ఈ ఏడాది ఇతివృత్తం- ‘ఆహార వ్యవస్థల్లో పరివర్తనం-మానవ-వృక్ష ఆరోగ్యానికి యువత సృజన’. అలాగే ఏటా ఆగస్ట్ 12న వరల్డ్ ఎలిఫెంట్ డే గా కూడా నిర్వహిస్తారు. ఏనుగులను పరిరక్షించేందుకు ఉద్దేశించింది ఇది.
- ఉజ్వల-2ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం
బి) పేదలకు ఉచితంగా ఫ్లోరోసెంట్ బల్బులు ఇచ్చే పథకం
సి) ఉచిత విద్యకు సంబంధించింది
డి) ఏదీకాదు
వివరణ: ఉజ్వల-2 పథకాన్ని ప్రధాని మోదీ ఆగస్ట్ 10న ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించారు. పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు మొదట ఉజ్వల-1ను 2016లో ప్రారంభించారు. కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మందికి ప్రారంభంలో ఇవ్వాలనుకున్నా, ఆ తర్వాత ఇతర వర్గాలను చేర్చి లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచారు. ఆగస్ట్ 2019నాటికి ఎనిమిది కోట్ల మందికి ఇవ్వాలనుకున్నా, అంతకు ముందే ఈ లక్ష్యాన్ని సాధించారు. తాజాగా ఉజ్వల-2లో భాగంగా మరో కోటి మందికి ఈ పథకాన్ని విస్తరించనున్నారు. - ప్రకృతి, దీక్ష ఇటీవల వార్తల్లో నిలిచారు. వీళ్లు ఎవరు? (బి)
ఎ) 2024 ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన యువతులు
బి) ఇండో-టిబెటన్ సరిహద్దు దళంలో నియామకమైన మహిళా అధికారులు
సి) కృత్రిమ మేధలో పేటెంట్ హక్కును పొందిన తొలి మహిళలు
డి) అతిపిన్న వయసులో స్థానిక సంస్థలకు ఎన్నికయిన యువతులు
వివరణ: ఇండో-టిబెటన్ పోలీసు దళంలో ప్రకృతి, దీక్ష అనే ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. వీరికి అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్‌లను కేటాయించారు. మహిళలను ఈ హోదాలో నియమించడం ఇదే తొలిసారి. పారామిలిటరీలో అసిస్టెంట్ కమాండెంట్ అనేది తొలి ప్రవేశ ర్యాంక్ క్యాడర్. - నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన తొలి రాష్ట్రం? (సి)
ఎ) గుజరాత్ బి) మధ్యప్రదేశ్
సి) కర్నాటక డి) కేరళ
వివరణ: కేంద్రం ప్రకటించిన విద్యావిధానం-2020ని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన తొలి రాష్ట్రం కర్నాటక. 2021-22 అకడమిక్ క్యాలెండర్ నుంచి దీనిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానానికి బదులుగా 5+3+3+4 పద్ధతిలో నూతన విద్యావిధానం ఉంటుంది. గతేడాది నూతన విద్యావిధానాన్ని కేంద్రం ప్రకటించింది. మాతృభాషకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.
-వి. రాజేంద్ర శర్మ ,ఫ్యాకల్టీ , 9849212411
- Tags
- Education News
Previous article
మాంటిల్ పొర మందం ఎంత?
Next article
ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు