పారామెడికల్‌తో అవకాశాలు అపారం
ఆర్థిక స్తోమతలేనివారు, త్వరగా ఉద్యోగం సంపాదించాలని, ఉద్యోగం చేస్తూ ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు చదవాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే అపార భవిష్యత్తు ఉంటుంది. పారామెడికల్ కోర్సుల గురించి ‘నిపుణ’ పాఠకుల కోసం ఈ వ్యాసం.
పారామెడికల్ అంటే?
వైద్య నారాయణులకు, పేషెంట్లకు అనుసంధానంగా నిలిచేవారే పారామెడికల్ సిబ్బంది. అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్‌కు వెళితే వైద్యుడు కొన్ని పరీక్షలు చేయించుకోమంటాడు. ఈ పరీక్షలు చేసేవారే పారామెడికల్ సిబ్బంది. వారు చేసిన టెస్టులను డాక్టర్‌కు చూపిస్తేనే రోగానికి తగిన మందులు రాసిస్తారు. ఒక్కో వైద్యనిపుణుడికి సంబంధింత టెక్నికల్ నిపుణుడి సహకారం అవసరం. ఈ టెక్నికల్ నైపుణ్యాన్ని అందించే కోర్సులే ‘పారామెడికల్ కోర్సులు’. ఈ కోర్సుల్లో చేరాలంటే ఇంటర్లో బైపీసీ చదివి ఉండాలి.
వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతుంది. సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. దీంతో ఈ రంగంలో వైద్యులకు అనుబంధంగా పనిచేసే సాంకేతిక నిపుణులు అవసరం ఎంతో ఏర్పడింది. వీరు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసినవారే కావాలి. కానీ డిమాండ్‌కు తగ్గట్టు తగినంత టెక్నీషియన్లు అందుబాటులో లేరు. కాబట్టి ఈ కోర్సులు పూర్తిచేసినవారికి డిమాండ్ చాలా ఉంది. కార్పొరేట్, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో త్వరగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. విదేశాల్లో కూడా స్థిరపడవచ్చు. పారామెడికల్ కోర్సుల వివరాలు తెలుసుకుందాం.
బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ
రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీల విధి. వీటి పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి డయాలసిస్ చేయాలి. దేశంలో చాలామంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. వీరందరికి డయాలసిస్ అవసరం. నిపుణుల పర్యవేక్షణలో ఈ చికిత్స చేయాలి. కాబట్టి ఈ నిపుణులకు బాగా డిమాండ్ ఉంది.
మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేసినవారు డయాలసిస్ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. సొంతంగా ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ
రాల సంబంధిత వ్యాధుల చికిత్స, రోగి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కోర్సులో బోధిస్తారు. మూడేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషీయన్స్, న్యూరాలజిస్టులకు అసిస్టెంట్లుగా సేవలు అందించవచ్చు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.
బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్టీ)
ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తెలిపేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్. రోగ నిర్ధారణ పరీక్షల్లో వీరే కీలకం. వ్యాధుల నిర్ధారణ, సమాచార సేకరణ, శాంపిల్స్ సేకరణ వంటి అంశాలు ఈ కోర్సులో బోధిస్తారు.
మూడేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు అపారం.
బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ
ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ చికిత్స అందిస్తారు. మందులు, వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగికి సూచిస్తారు. మూడేండ్ల ఈ కోర్సు చేసినవారికి డిమాండ్ బాగానే ఉంది.
బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ
మనిషికి ప్రధానమైనది గుండె. దీని సంబంధిత, రక్తనాళాల పనితీరుపై ఈ కోర్సులో బోధిస్తారు. ఓపెన్ హార్ట్ సర్జరీ, పేస్ మేకర్, స్టంట్స్ అమరిక వంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర చాలా కీలకం. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో ఓటీ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. తగిన అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్‌గా, క్యాథ్‌ల్యాబ్ విభాగంలో ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.
బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ
గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టడం, చికిత్స విధానం వంటివి ఈ కోర్సులో నేర్పుకుంటారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు పర్యవేక్షణ, చికిత్సలో వీరి పాత్ర కీలకం. మూడేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో సర్జన్స్ అసిస్టెంట్స్, ఓటీ టెక్నీషియన్లుగా స్థిరపడవచ్చు.
బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ
ఆపరేషన్ చేసే సమయంలో రోగికి నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తుమందు ఇస్తారు. దీనిలో నైపుణ్యం కలిగినవారు కావాలి. రోగికి ఎంత మోతాదులో మత్తుమందు ఇవ్వాలనేది వీరు నిర్ణయిస్తారు. అనస్థీషియా నిపుణులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతంటే వీరు లేకపోతే ఆపరేషన్లను కూడా వాయిదావేస్తారు.
అదేవిధంగా ఆపరేషన్‌కు సంబంధించిన టెక్నికల్ సామగ్రిని సమకూర్చేవారు కావాలి. రోగిని ఆపరేషన్ థియేటర్ (ఓటీ)లోకి తీసుకురావడం దగ్గర నుంచి తిరిగి తీసుకెళ్లే వరకు వీరి పాత్ర కీలకం. వీటికి సంబంధించిన కోర్సే బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ.
మూడేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో ఓటీ టెక్నీషియన్లుగా, వైద్యులకు సహాయకులుగా ఉపాధి పొందవచ్చు. అనుభవం సంపాదించిన తర్వాత అనస్థీషియా టెక్నీషియన్లుగా స్థిరపడవచ్చు. ఓ సర్వే ప్రకారం దేశంలో లక్షమందికి ఒక అనస్థీషియా డాక్టర్ ఉన్నాడు. కాబట్టి ఈ నిపుణులకు అద్భుత అవకాశాలు ఉన్నాయి.
బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ
మనిషి అన్ని ఇంద్రియాల్లో కండ్లు ప్రధానమైనవి. అటువంటి నేత్రాలకు ఏమైనా జరిగితే జీవితం అంధకారమవుతుంది. కాబట్టి అంతటి ప్రధానమైన నయనాలకు చికిత్స అందించేందుకు దోహదపడేదే బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ.
మూడేండ్ల ఈ కోర్సును పూర్తిచేసినవారు ఆస్పత్రుల్లో ఆప్టోమెట్రిస్ట్‌గా ఉద్యోగం పొందవచ్చు. అనుభవం వచ్చిన తర్వాత ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌గా స్థిరపడవచ్చు.
బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ
రోగ నిర్ధారణలో ఉపయోగపడే ఎక్స్‌రే విభాగానికి సంబంధించింది ఈ కోర్సు. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేసినవారు ఎక్స్‌రే టెక్నీషియన్‌గా, ఎంఆర్ఐ, సీటీ స్కానర్స్‌గా ఉద్యోగం పొందవచ్చు. సొంతంగా ల్యాబ్ నడుపుకోవచ్చు. డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేయవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
ఏదైనా ప్రమాదాలు లేదా వృద్ధాప్యంతో శరీర భాగాల్లో ఏవైనా కదలికలు ఏర్పడితే ఫిజియోథెరపీ ద్వారా వారికి చికిత్స అందించవచ్చు. ఎముకలు విరిగినా, పక్కకు జరిగినా, దెబ్బలు తగిలినా ఈ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. మనిషి శరీరంలో వివిధ భాగాలు, వాటి అమరిక తదితర విషయాల గురించి ఈ కోర్సులో బోధిస్తారు.
నాలుగేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారికి ఎంతో డిమాండ్ ఉంది. మంచి జీతభత్యాలు కూడా ఉంటాయి. సొంతంగా ఫిజియోథెరపీ ఆస్పత్రిని కూడా నిర్వహించుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్
రోగికి చికిత్స సమయంలో వారికి సేవలందించడంలో నర్సింగ్ ప్రధానమైనది. అందుకే వైద్య రంగంలో ఈ వృత్తిని అత్యుత్తమైనదిగా పేర్కొంటారు.
రోగికి వైద్య చికిత్సతో పాటు మానసిక చికిత్స అవసరం. దీనిని అందించేవారే నర్సులు. నర్సింగ్ నైపుణ్యాలను ఈ కోర్సులో భాగంగా బోధిస్తారు. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నేర్పుతారు.
నాలుగేండ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేసినవారికి క్లినిక్, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఉద్యోగం పొందవచ్చు.
బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్టీ)
ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తెలిపేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్. రోగ నిర్ధారణ పరీక్షల్లో వీరే కీలకం. వ్యాధుల నిర్ధారణ, సమాచార సేకరణ, శాంపిల్స్ సేకరణ వంటి అంశాలు ఈ కోర్సులో బోధిస్తారు.
మూడేండ్ల ఈ కోర్సు పూర్తిచేసినవారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు అపారం.
బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ
ఊపిరితిత్తులు, ఛాతీ భా గంలో ఏర్పడే అస్తమా, న్యుమోనియా, సీవోపీడీ, ఎంఫసిమా, ఎంఫిమా, న్యుమోథెరాక్స్, పల్మనరీ ఎంబోలజిమ్, క్యాన్సర్ వంటి రోగాలకు చికిత్స చేస్తారు. ఈ రోగులను వీరే పర్యవేక్షిస్తారు.
మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సు చేసినవారికి ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి.
జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ-జీఎన్ఎం (మూడేండ్లు) కోర్సును పారామెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలు అందిస్తున్నాయి.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు