రాజ్యాంగంలో పదో షెడ్యూల్ దేనికి సంబంధించింది?
- ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపికచేసే ఉత్తమ గ్రామాల అవార్డుకుగాను భారత్ తరఫున కింది వాటిలో ఏ గ్రామాలను ప్రతిపాదించారు? (డి)
- భూదాన్ పోచంపల్లి
- కోంగ్థోంగ్ 3. లద్పురాఖాన్
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: తెలంగాణలోని భూదాన్ పోచంపల్లితో పాటు మేఘాలయాలోని కోంగ్థోంగ్, మధ్యప్రదేశ్‌లోని లద్పురాఖాన్ గ్రామాలను ప్రపంచ పర్యాటక సంస్థ ఇచ్చే గ్రామీణ అవార్డులకు ప్రతిపాదించారు. తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి ఉంది. భూదానోద్యమం ఇక్కడే ప్రారంభమయ్యింది. చేనేతకారులకు ఇది ప్రసిద్ధి చెందింది. కోంగ్థోంగ్ గ్రామానికి ‘ఈలల గ్రామంగా (విజిల్ విలేజ్)’ పేరుంది. ఇక్కడి ప్రజలు ఒకరితో మరొకరు పాటలతో పలుకరిస్తుంటారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి రెండు పేర్లు ఉంటాయి. సాధారణ పేరుతో పాటు, మరొకటి పాట లేదా రాగం రూపంలో ఉంటుంది. రాగం రూపంలో ఉండే పేరును ‘జింగ్వ్రాయి ఐబే’ అంటారు.
- ఈ ఏడాది నిర్వహించిన బ్రిక్స్ సమావేశం
ప్రధానంగా ఏ అంశంపై చర్చించింది? (బి)
ఎ) పర్యావరణ పరిరక్షణ
బి) ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ
సి) కరోనా కట్టడి డి) ఓజోన్ పరిరక్షణ
వివరణ: ‘బ్రిక్స్ కొనసాగింపునకు సహకారం, బలోపేతం, ఏకాభిప్రాయం’ అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 9న వర్చువల్ పద్ధతిలో బ్రిక్స్ కూటమి దేశాల సమావేశం నిర్వహించారు. భారత్ దీనికి అధ్యక్షత వహించింది. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికకు ఈ అయిదు దేశాల కూటమి ఆమోదం తెలిపింది. ఇందులోని సభ్య దేశాలు- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. దీని ప్రధాన కేంద్రం చైనాలోని షాంఘైలో ఉంది. ప్రపంచంలో దాదాపు 41% జనాభా ఇక్కడే ఉంది. ప్రపంచ జీడీపీలో ఈ కూటమిలోని దేశాల వాటా 24% కాగా, ప్రపంచ వాణిజ్యంలో 16% వాటాను కలిగి ఉంది. - ‘ఖెఖెర్టక్ అవనార్లేఖ్’ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) అత్యంత దక్షిణాన ఉన్న దీవి
బి) సముద్రంలో లభించిన కొత్త జంతు జాతి
సి) అత్యంత ఉత్తరాన ఉన్న దీవి
డి) కొత్త వృక్ష జాతి
వివరణ: భూమిపై అత్యంత ఉత్తరాన కొత్త దీవిని గుర్తించారు. ఇది గ్రీన్లాండ్ తీరానికి ఎగువన అంటే ఉత్తర భాగంలో ఉంది. దీనిని కనుగొనక ముందు వరకు భూమికి అత్యంత ఉత్తర దీవిగా ‘ఊడాక్’కు పేరుంది. పరిశోధకులు దీనికంటే ఉత్తరాన సముద్ర మట్టానికి మూడు మీటర్ల ఎత్తులో మరో దీవిని కనుగొన్నారు. దీనికి ‘ఖెఖెర్టక్ అవనార్లేఖ్’ అని పేరు పెట్టాలని సూచించారు. గ్రీన్లాండ్ భాషలో ఈ పదం అర్థం ‘అత్యంత ఉత్తరాన ఉన్న దీవి’. - బాలలు డిజిటల్ పరిజ్ఞానం వినియోగించడంలో ఇటీవల ఏ దేశం ఒక నియమావళిని రూపొందించింది? (ఎ)
ఎ) యూకే బి) నార్వే
సి) నెదర్లాండ్స్ డి) డెన్మార్క్
వివరణ: డిజిటల్ పరిజ్ఞాన వినియోగంలో యూకే ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించింది. ఆన్లైన్లో సేవలు పొందే బాలలకు ఇది వర్తిస్తుంది. 15 ప్రమాణాలను నిర్దేశించింది. ఇందులో పిల్లలకు అవసరమైన యాప్స్, క్రీడలు, విద్య, నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంచే వివిధ అంశాలు ఉంటాయి. ఆన్లైన్ నియంత్రణ లేకపోవడంతో అది చిన్నారులపై చెడు ప్రభావం పడుతుందని గుర్తించి, కొత్తగా నియమావళిని తెచ్చింది అక్కడి ప్రభుత్వం. గ్రాఫిక్‌ల రూపంలో విద్య అంశాలను బోధిస్తున్నారు. - ‘ఆర్ఈఎక్స్ ఎంకే-II’ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (డి)
ఎ) కరోనా గుర్తింపునకు కొత్త పరీక్ష విధానం
బి) అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్
సి) అంతరిక్షంలో గుర్తించిన కొత్త ఉపగ్రహం
డి) రోబో
వివరణ: ‘ఆర్ఈఎక్స్ ఎంకే-II’ అనే పేరుతో ఇజ్రాయెల్ మిలిటరీ సేవలకు ఒక రోబోను రూపొందించింది. ఇది రిమోట్‌తో పనిచేస్తుంది. పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు చొరబాటుదారులను పసిగడుతుంది. కాల్పులు చేపడుతుంది. అలాగే రహస్య సమాచారాన్ని చేరవేసేందుకు కూడా దీనిని వినియోగించుకొనే వీలుంది. గాయపడిన జవానులను మోసుకెళ్లడంలో సాయపడుతుంది. యుద్ధ సమయాల్లో అవసరమైన సామగ్రిని దీని ద్వారా తరలించేందుకు వీలు ఉంటుంది. - కేంద్రం విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో అగ్రస్థానంలో ఉన్న విద్యాసంస్థ? (సి)
ఎ) ఐఐఎస్సీ (బెంగళూర్)
బి) ఐఐటీ (ఖరగ్‌పూర్) సి) ఐఐటీ (చెన్నై)
డి) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ)
వివరణ: కేంద్రం విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విద్యాసంస్థ తొలి స్థానాన్ని ఆక్రమించడం వరుసగా ఇది మూడోసారి. దేశంలో పది అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఏడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలే. రెండో స్థానంలో ఐఐఎస్సీ (బెంగళూర్) ఉంది. విభాగాల వారీగా పరిశీలిస్తే ఇంజినీరింగ్‌లో తొలి స్థానంలో ఐఐటీ మద్రాస్, విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూర్, కళాశాలల విభాగంలో ఢిల్లీలోని మిరండా హౌస్, ఫార్మసీలో ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్, వైద్య కళాశాలల విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. అయిదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులను కేటాయిస్తారు. ఐఐటీ హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో ఉన్నాయి. - ‘2+2 చర్చలు’ ఇటీవల తరచూ వార్తల్లో వినిపిస్తుంది. భారత్‌కు చెందిన ఏ శాఖ మంత్రులు ఇందులో పాల్గొంటారు? (ఎ)
ఎ) విదేశాంగ, రక్షణ బి) విదేశాంగ, హోం
సి) రక్షణ, ఆర్థిక డి) రక్షణ, వాణిజ్యం
వివరణ: భారత విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు, ఇతర దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులతో సమావేశమయ్యే పద్ధతినే 2+2 చర్చలుగా పిలుస్తారు. అమెరికా, జపాన్ దేశాలతో భారత్ ఈ చర్చలను నిర్వహిస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా చర్చలను భారత్ చేపట్టింది. రష్యాతోనూ ఈ పద్ధతిలో చర్చిస్తుంది. క్వాడ్ దేశాలు కాకుండా ఈ తరహా చర్చలు భారత్ నిర్వహిస్తుంది కేవలం రష్యాతోనే. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చర్చల్లో అఫ్గానిస్థాన్‌పై చర్చించారు. ఉగ్రవాద ముఠాల శిక్షణ, కార్యకలాపాలకు ఆ దేశం సురక్షిత ఆవాసం కాకుండా చూడాలని భారత్, ఆస్ట్రేలియాలు స్పష్టం చేశాయి. - రాజ్యాంగంలో పదో షెడ్యూల్ దేనికి సంబంధించింది? (డి)
ఎ) భూసంస్కరణలు బి) పంచాయతీ
సి) మున్సిపాలిటీలు
డి) ఫిరాయింపు నిరోధకచట్టం
వివరణ: రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది. ఇటీవల ఈ అంశం వార్తల్లో నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2014-21 కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1633 మంది అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఆ సంస్థ ఈ విశ్లేషణ చేసింది. ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎక్కువ మంది చేరింది భారతీయ జనతాపార్టీలో. - ‘మై భీ డిజిటల్ 3.0’ను ఇటీవల ప్రారంభించారు. ఇది ఎవరికి ఉద్దేశించింది? (సి)
ఎ) ఆన్లైన్ పాఠాలు చెప్పే అధ్యాపకులు
బి) రైతులు సి) వీధి వ్యాపారులు
డి) విద్యార్థులు
వివరణ: వీధి వ్యాపారుల ప్రయోజనం కోసం ‘మై భీ డిజిటల్ 3.0’ అనే కార్యక్రమాన్ని గృహ నిర్మాణ & పట్టణ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా 223 జిల్లాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. భారత్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర సంస్థలు యూపీఐ, ఐడీ, క్యూర్ కోడ్లపై వీధి వ్యాపారులకు శిక్షణ ఇస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తారు. - రానున్న మూడు దశాబ్దాల్లో 200 మిలియన్లకు పైగా ప్రజలు వలస బాట పట్టనున్నారని ఇటీవల ప్రపంచ బ్యాంక్ నివేదిక విడుదల చేసింది. దీనికి కారణం ఏమని పేర్కొంది? (ఎ)
ఎ) పర్యావరణ మార్పులు
బి) కరోనా విజృంభణ
సి) పట్టణీకరణ డి) అల్పాభివృద్ధి
వివరణ: నీటి కొరత, తగ్గుతున్న పంట ఉత్పాదకత, పెరుగుతున్న సముద్ర మట్టాలు తదితర మార్పులతో వలసలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ‘పర్యావరణ వలసలు’గా వర్ణించింది. రానున్న మూడు దశాబ్దాల్లో 200 మిలియన్లకు మించి ప్రజలు తమ సొంత ప్రదేశాలు వదిలి వలసలు వెళతారని పేర్కొంది. వీటిని అరికట్టాలంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆరు ప్రాంతాల నుంచి ఈ వలసలు ఉంటాయని వెల్లడించింది. అవి లాటిన్ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, సబ్-సహార ఆఫ్రికా, తూర్పు యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియా. హరిత వాయు ఉద్గారాలు తగ్గించడం, సుస్థిరాభివృద్ధి సాధించినా 44 మిలియన్ ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని విశ్లేషించింది. - కింద పేర్కొన్న ఏ రాష్ర్టాలు ప్రైవేటు సంస్థల్లోనూ స్థానికులకు 75% రిజర్వేషన్
కల్పించాయి? (డి)- ఆంధ్రప్రదేశ్ 2. హర్యానా 3. జార్ఖండ్
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: ప్రైవేట్ రంగంలోనూ స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పిస్తూ జార్ఖండ్ శాసనసభ తీర్మానం చేసింది. రూ.40,000 వరకు వేతనం ఉండే ఉద్యోగాలకు ఇది వర్తిస్తుంది. నోటిఫై చేసిన తర్వాత ఈ తరహా రిజర్వేషన్ తెచ్చిన మూడో రాష్ట్రం జార్ఖండ్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్,
హర్యానాలు ఈ చట్టాలు చేశాయి.
- ఆంధ్రప్రదేశ్ 2. హర్యానా 3. జార్ఖండ్
- చిరుధాన్యాల హబ్‌గా మారాలని ఏ రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది? (సి)
ఎ) పంజాబ్ బి) మహారాష్ట్ర
సి) ఛత్తీస్‌గఢ్ డి) తమిళనాడు
వివరణ: చిరుధాన్యాల మిషన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఇటీవల ప్రారంభించారు. వీటిని పండించే రైతులకు సరైన ధరలు చెల్లించేందుకు ఉద్దేశించింది ఇది. రాష్ర్టాన్ని చిరుధాన్యాల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. చిరుధాన్యాల సేకరణ, పెట్టుబడి సాయం తదితరాలను ఇవ్వనున్నారు. ఇందుకుగాను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌తో ఒప్పందం కూడా కుదుర్చకుంది. - ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ పథకాన్ని ఇటీవల ఏ ఉత్పత్తులకు విస్తరించారు? (బి)
ఎ) జౌళి రంగం బి) పాల ఉత్పత్తులు
సి) సాఫ్ట్వేర్ ఉత్పత్తులు డి) ఏదీకాదు
వివరణ: ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ పథకాన్ని పాల ఉత్పత్తులకు విస్తరించారు. రవాణా, మార్కెటింగ్ అంశాల్లో సాయం చేసే పథకం ఇది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వ్యయం తగ్గించడం, ఎగుమతులను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. దీనిని ప్రస్తుతం ‘రివైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ యాక్సిస్ ఫర్ స్పెసిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ స్కీం’గా మార్చారు. కొత్త పథకంలో ప్రధానంగా రెండు మార్పులు చేశారు. అవి 1. ఈ పథకాన్ని పాల ఉత్పత్తులకు విస్తరించడం 2. సముద్ర మార్గం ద్వారా చేసే ఎగుమతులకు సాయం ఆర్థిక సాయం 50%, వాయు మార్గం ద్వారా చేసే సాయం 100% పెంచారు. - దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేసే ప్రయోగాన్ని
ఎక్కడ చేపట్టారు? (డి)
ఎ) రంగారెడ్డి జిల్లా బి) ఔరంగాబాద్
సి) వారణాసి డి) వికారాబాద్
వివరణ: దేశంలో తొలిసారిగా మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అనే ప్రాజెక్ట్‌ను తెలంగాణలోని వికారాబాద్‌లో చేపట్టారు. మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు ఉద్దేశించింది ఇది. స్కైలైన్ ఎయిర్ అనే అంకుర సంస్థ బ్లూడార్ట్ ఎయిర్‌తో కలిసి డ్రోన్లు సమకూర్చి ఈ ప్రాజెక్ట్ నిర్వహించనుంది. ఒక్కో డ్రోన్ సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో సుమారు 15 కిలోల ఔషధాలు, టీకాల సరఫరాకు వీలుంటుంది. - అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అనే సంస్థ స్థానంలో బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) జీఎస్టీ బి) పెట్రోలుపై సుంకం
సి) ఆదాయపు పన్ను డి) ఏదీ కాదు
వివరణ: ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారానికి మూడు బోర్డులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఏర్పాటు చేసింది. వీటిని బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (బీఏఆర్) అంటారు. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పనిచేస్తున్నాయి. రెండు బోర్డులను ఢిల్లీలో, మరో దానిని ముంబయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఉన్న అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) స్థానంలో కొత్త బోర్డులు ఉంటాయి. ఏఏఆర్ ఇచ్చే పరిష్కారాలకు ఫిర్యాదుదారుడు, పన్నుల శాఖ కట్టుబడి ఉండాలి. అయితే బీఏఆర్ ఇచ్చే తీర్పులను హైకోర్టులో సవాల్ చేసేందుకు వీలుంది.
-వి. రాజేంద్ర శర్మ , ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
శివార్లకే మొగ్గు!
Next article
పారామెడికల్‌తో అవకాశాలు అపారం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు