ప్రిలిమినరీ లాస్ట్ మినిట్ టిప్స్
ప్రిలిమినరీ రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు.
ఉదయం: జనరల్ స్టడీస్ పేపర్-1. 100 ప్రశ్నలకు 200 మార్కులు. 2 గంటల సమయం ఉంటుంది.
నెగెటివ్ మార్కింగ్‌లో ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం మార్కుల కోత విధిస్తారు.
మధ్యాహ్నం: సీ శాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పేపర్-2. ఇది అభ్యర్థి వైఖరిని తెలియజేస్తుంది.
దీనిలో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. 2 గంటల సమయం.
నెగెటివ్ మార్కింగ్ విధానంలో ప్రతి ప్రశ్నకు 0.33 శాతం మార్కుల కోత విధిస్తారు.
ఈ పేపర్లో తప్పకుండా క్వాలిఫై కావాలి. అంటే 33 శాతం మార్కులు సాధించాలి.
దీనిలో క్వాలిఫై అయితేనే జనరల్ స్టడీస్ (పేపర్-1)ను దిద్దుతారు. క్వాలిఫై కాకపోతే పేపర్-1ను పరిగణనలోకి తీసుకోరు.
సివిల్స్ రాసేవారు ప్రిలిమినరీ పరీక్ష 48 గంటల ముందే ప్రిపరేషన్‌ను ఆపివేయాలి.
మెదడు, శరీరం అలిసిపోకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సాత్విక ఆహారం తినాలి. బాగా నిద్రపోవాలి.
ధ్యానం, యోగా, లైట్ ఎక్సర్సైజ్ చేస్తూ మానసిక ఉల్లాసం కోసం బ్యాడ్మింటన్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడాలి.
చదివిన విషయాలను మర్చిపోతామేమోనని గాబరా పడుతూ నోట్స్‌ను తిరగ వేయకూడదు. చదివిన అంశాలు ఎగ్జామినేషన్ హాల్లో తప్పకుండా గుర్తుకువస్తాయనే ధైర్యంతో ఉండాలి.
పరీక్ష హాల్లో కరోనా నిబంధనలు పాటించాలి.
యూపీఎస్సీ నిబంధనల ప్రకారం అనుమతిలేని వస్తువులను లోనికి తీసుకొని వెళ్లరాదు. ఉదా: గాడ్జెట్స్ (మొబైల్, బ్లూటూత్).
హాల్‌టికెట్‌తో పాటు బ్లాక్ పాయింట్ పెన్, ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి.
గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. 10 నిమిషాల ముందు లోనికి ప్రవేశించాలి.
జవాబులు తెలియని ప్రశ్నలను వదిలివేయడం ఉత్తమం. వదిలివేసిన ప్రశ్నలకు మార్కుల కోత ఉండదు.
ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు మొదటి రౌండ్లో సులువుగా ఉన్న ప్రశ్నలను, కచ్చితంగా సమాధానాలు తెలిసిన వాటిని బబ్లింగ్‌తో సహా పూర్తిచేయాలి. బబ్లింగ్ చేసే ముందు తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి.
రెండో రౌండ్లో అనుమానాస్పద ప్రశ్నలను ‘ఎలిమినేషన్’ పద్ధతి ద్వారా తగిన సమాధానాన్ని గుర్తించాలి.
మూడో రౌండ్లో కఠినమైన, సమయం ఎక్కువగా తీసుకునే ప్రశ్నలను ప్రయత్నించాలి.
పేపర్-1లో 60 నుంచి 70 వరకు సరైన సమాధానాలు చేయగలిగితే ప్రిలిమినరీ రౌండ్ గట్టెక్కినట్లే.
బబ్లింగ్ చేసేటప్పుడు సర్కిల్ అంచు నుంచి మొదలుపెట్టి పూరించాలి. సర్కిల్ పరిధి దాటకూడదు.
కోచింగ్ తీసుకోనివారు నిరుత్సాహానికి లోనుకాకూడదు. ఆ భావనను మనస్సులోకి రానీయవద్దు.
పేపర్-1 రాసిన తర్వాత 100 శాతం పేపర్-2పై మనస్సు నిలపాలి.
క్వాలిఫై పేపరే కదా అని నిర్లక్ష్యం చేయరాదు.
ఒకటి మాత్రమే సరైనది, సరైనది కానిది మొదలైన నెగెటివ్ ప్రశ్నల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపడి బబ్లింగ్ చేయవద్దు.
సమయస్ఫూర్తితో, మెలకువతో, మనపై మనకు నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్ష పూర్తిచేయాలి.
నూతన అంశాల జోలికి వెళ్లకూడదు.
హాల్ టికెట్ నంబర్ తప్పుల్లేకుండా పూరించాలి.
నారోజు శంకరాచారి సివిల్స్ మెంటార్
7989132100
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు