తెలంగాణలో బౌద్ధ, జైన మతాలు
- బుద్ధుడి అసలు పేరు?
1) సిద్ధార్థుడు 2) సింగమనుడు
3) అర్జునుడు 4) మహపాలక - బుద్ధుడు క్రీ.పూ. 563లో ఏ వంశంలో ఎవరికి జన్మించాడు?
1) శాక్యవంశంలో శుద్ధోధన, మహామాయ
2) చాళుక్య వంశంలో దుర్యోధన, బోధిశ్రీ
3) హస్తక వంశంలో రామానుజ, అంజలీదేవి
4) ఏదీకాదు - బుద్ధుడి జన్మస్థలం నేపాల్‌లో ఎక్కడ ఉంది?
1) కదంబి 2) గుల్బర్గా
3) కపిలవస్తు 4) రామపాలం - తెలంగాణలో తవ్వకాల్లో బయల్పడిన శిథిలాల్లో బుద్ధుడి పాదాలు, ధర్మచక్రం
లభ్యమైన ప్రాంతం?
1) ఫణిగిరి 2) ఏలేశ్వరం
3) కోటిలింగాల 4) ధూళికట్ట - బౌద్ధ సంఘారామాల పోషణకు విష్ణుకుండిన రాజుల దానాలను పేర్కొన్న శాసనాలు?
1) చైతన్యపురి శాసనం
2) తుమ్మలగూడెం శాసనం
3) 1, 2
4) మైలాంబ శాసనం - ఇక్ష్వాకుల రాజ స్త్రీలలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చెందించిన వారిలో ముఖ్యులు?
1) శాంతిశ్రీ 2) రుద్రభట్టారిక
3) బోధిశ్రీ 4) 1, 2 - శాతవాహన యుగంలో తెలంగాణలో బౌద్ధ ఆరామాలు, స్థూపాలు నిర్మించిన
ప్రదేశాలు?
1) ఫణిగిరి 2) తిరుమలగిరి
3) కొండాపూర్ 4) పైవన్నీ - తెలుగు నాట బౌద్ధం వర్ధిల్లిన కాలం?
1) దాదాపు 2000 సంవత్సరాలు
2) దాదాపు 5000 సంవత్సరాలు
3) దాదాపు 1000 సంవత్సరాలు
4) దాదాపు 1200 సంవత్సరాలు - క్రీ.శ. 5వ శతాబ్దం తరువాత నుంచి 14-15 శతాబ్దాల కాలం వరకు కొనసాగిన బౌద్ధమత శాఖ?
1) వజ్రాయానం 2) అరుణాయానం
3) బౌద్ధాయానం 4) పైవన్నీ - తెలంగాణలో అశోకుని కాలానికి చెందినదిగా భావిస్తున్న ఇటుకలతో నిర్మించిన స్థూపం బయల్పడిన ప్రాంతం?
1) కొండాపూర్
2) ధూళికట్ట (ఉమ్మడి కరీంనగర్)
3) ఫణిగిరి (ఉమ్మడి నల్లగొండ)
4) కొలనుపాక (ఉమ్మడి నల్లగొండ) - తెలంగాణలో నీరో, అగస్టస్ చక్రవర్తుల కాలం నాటి రోమన్ నాణేలు లభించిన ప్రాంతాలు?
1) కోటిలింగాల 2) పెద్దబంకూరు
3) నుస్తులాపూర్ 4) పైవన్నీ - వజ్రాయాన మతాన్ని స్థాపించింది ఎవరు?
1) సిద్ధార్థుడు 2) ఆచార్య నాగార్జునుడు
3) పట్టావళి 4) సిద్ధనాగార్జునుడు - శ్రీలంక నుంచి వచ్చే బౌద్ధ భిక్షువుల కోసం సింహళ విహారం కూడా నిర్మించిన ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం?
1) ఫణిగిరి 2) ధూళికట్ట
3) సోమనాథపురం 4) నేలకొండపల్లి - కరీంనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కుర్క్యాల దగ్గర జైనమత చక్రేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించింది ఎవరు?
1) జినవల్లభుడు 2) బద్దెగుడు
3) మనుమసిద్ధి 4) వర్ధమానుడు - తెలుగు నాట సుప్రసిద్ధ జైనమత శాఖలు?
1) శ్వేతాంబర 2) దిగంబర
3) యాపనీయులు 4) పైవన్నీ - తెలుగునాట అనాదిగా విలసిల్లిన బౌద్ధమతశాఖలు?
1) థేరవాద శాఖ 2) మహాసాంఘిక శాఖ
3) 1, 2 4) ఏదీకాదు - జైనమత మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడి గురించి పేర్కొన్న పురాణాలు?
1) విష్ణుపురాణం 2) ఐతరేయ బ్రాహ్మణం
3) భాగవత పురాణం 4) 1, 3 - వర్ధమాన మహావీరుడు నిర్యాణం పొందిన ప్రదేశం?
1) పావపురి 2) పట్టావళి
3) బోధన్ 4) ఫణిగిరి - మొదటి తీర్థంకరుని కాలపు ప్రాచీన జైన క్షేత్రంగా భావిస్తున్న ప్రాంతం?
1) కొలనుపాక 2) బోధన్
3) పావపురి 4) భదలపురి - భద్రపురి/ భదలపురి అంటే?
1) నేటి నాగార్జున కొండ 2) గోల్కొండ
3) ఓరుగల్లు 4) భద్రాచలం - నదులన్నీ సముద్రాన్ని చేరినట్లే అన్ని కులాలు బౌద్ధమతంలో చేరవచ్చని
ప్రకటించింది ఎవరు?
1) ఆచార్య నాగర్జునుడు
2) బుద్ధఘోషుడు
3) గౌతమ బుద్ధుడు
4) కొండకుందాచార్యుడు - కింది వాటిలో బౌద్ధ పండితులు పేర్కొన్న బౌద్ధ శిల్పరకం ఏది?
1) గాంధార శిల్పం 2) మధుర శిల్పం
3) ఆంధ్ర శిల్పం 4) పైవన్నీ - తెలంగాణలో తొలినాటి బౌద్ధ వికాస ప్రాంతం ఏది?
1) కరీంనగర్ 2) నిజామాబాద్
3) 1, 2 4) వరంగల్ - బుద్ధుడి సమకాలికుడైన ములక రాజ్య వాసి అయిన ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఎవరు?
1) భావరి 2) నాగార్జునుడు
3) అప్పయాచార్యుడు 4) బుద్ధఘోషుడు - కింది వారిలో ‘పరమార్థ జ్యోతిక’ అనే గ్రంథ రచయిత ఎవరు?
1) బుద్ధఘోషుడు
2) ఆచార్య నాగార్జునుడు
3) మహాకాత్యాయనుడు
4) సుగతుడు - కింది వాటిలో ఆచార్య నాగార్జునుడు తన ఏ రచన యజ్ఞశ్రీ శాతకర్ణిని బౌద్ధానికి సహనం చూపమని వీలైతే దానిని పోషించాలని కోరినట్లు తెలుపుతుంది?
1) రత్నావళి 2) ప్రజ్ఞాపారమిత శాస్త్రం
3) ముద్రమరిక కరిక 4) పైవన్నీ - నల్లగొండ జిల్లాలో 1960లో పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తున్న ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం?
1) కొలనుపాక 2) ఫణిగిరి
3) నేలకొండపల్లి 4) తిరుమలగిరి - చైనా యాత్రికుడు ఫాహియాన్ నాగార్జునకొండ ప్రాంతాన్ని ఏ విధంగా పిలిచాడు?
1) పొ-లె-మెలో 2) పొలోయు
3) సెతగిరి 4) మెపోలోమె - 1926లో ప్రప్రథమంగా నాగార్జునకొండ ప్రాంతాన్ని పరిశీలించి అది బౌద్ధక్షేత్రమని పేర్కొన్న ప్రభుత్వ శాసన పరిశోధకుడు ఎవరు?
1) వీవీ కృష్ణశాస్త్రి
2) రంగస్వామి సరస్వతి
3) రావిప్రోలు సుబ్రహ్మణ్యం
4) టీఎస్ రామచంద్రన్ - కాకతీయ యుగారంభం నుంచి సుప్రసిద్ధ జైనక్షేత్రం?
1) ఓరగల్లు 2) హన్మకొండ
3) వంగపల్లి 4) జనగాం - కల్యాణి చాళుక్యుల కాలంలో నల్లగొండ జిల్లా సుప్రసిద్ధ జైనక్షేత్రం?
1) కొలనుపాక 2) ఫణిగిరి
3) ధూళికట్ట 4) కొండాపురం - ఇక్ష్వాక రాజు శాంతమూలుడు వేయించిన పదిలైన్ల శాసనం లభ్యమైన బౌద్ధక్షేత్రం?
1) ఫణిగిరి 2) గాజులబండ
3) కోటిలింగాల 4) హన్మకొండ - కింది వాటిలో పొట్ల చెరువు అంటే?
1) పటాన్ చెరువు
2) లక్క చెరువు
3) నక్కల చెరువు
4) లింగంపల్లి చెరువు - కింది వాటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధ జైనక్షేత్ర ప్రాంతం?
1) ఉజ్జిలి 2) పూదూరు
3) వర్ధమానపురం 4) పైవన్నీ - కింది వాటిలో కాళింగులు ఆరాధించిన తీర్థంకరుడు ఎన్నోవాడు?
1) 8వ తీర్థంకరుడు 2) 9వ తీర్థంకరుడు
3) 10వ తీర్థంకరుడు 4) 11వ తీర్థంకరుడు - శాసనాల ద్వారా తెలుస్తున్న మహాసాంఘిక శాఖ కింది వాటిలో ఏది?
1) చైత్యక 2) అపరశైల
3) పూర్వశైల 4) పైవన్నీ - కింది వాటిలో జంతువుల అస్థికలపై స్థూపాన్ని తొలిసారిగా నిర్మించిన ప్రాంతం ఏ బౌద్ధ క్షేత్రంలో లభించింది?
1) ఫణిగిరి 2) నాగార్జున కొండ
3) ధూళికట్ట 4) నేలకొండపల్లి - జైనులను ‘క్షుద్రక్షత్రియులు’ అని ఏ శాసనం వర్ణించింది?
1) పిల్లలమర్రి శాసనం
2) పాలంపేట శాసనం
3) హనుమకొండ శాసనం
4) పానగల్లు శాసనం - బౌద్ధమతం ఎన్ని శాఖలుగా చీలిపోయింది?
1) 30 2) 32
3) 34 4) 36 - భక్తరామదాసు (కంచర్ల గోపన్న) జన్మస్థలం?
1) కొండాపురం 2) నేలకొండపల్లి
3) ధూళికట్ట 4) ఫణిగిరి
Answers
1-1, 2-1, 3-3, 4-1, 5-3, 6-4, 7-4, 8-1, 9-1, 10-2, 11-4, 12-4, 13-4, 14-1, 15-4, 16-3, 17-3, 18-1, 19-2, 20-4, 21-3, 22-4, 23-3, 24-1, 25-1, 26-2, 27-2, 28-4, 29-2, 30-2, 31-1, 32-1, 33-1, 34-2, 35-3, 36-4, 37-1, 38-3, 39-2, 40-2.
- Tags
- Education News
Previous article
ప్రిలిమినరీ లాస్ట్ మినిట్ టిప్స్
Next article
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు