గెట్ రెడీ ఆన్లైన్ లెర్నింగ్
కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లాక్డౌన్లతో రోడ్లు బోసి పోయాయి. స్కూల్స్‌ని మూసివేశారు. కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. తరగతి గదుల్లో జరిగే పాఠాలు అంతర్జాలంలోకి అడుగుపెట్టాయి. టీచర్లు ఆన్‌లైన్‌లోకి వచ్చి పాఠాలు చెబుతున్నారు. వేసవి సెలవులు పూర్తయి మళ్లీ స్కూల్, కాలేజీకి వచ్చే విద్యార్థులకు కొంతకాలం ఆ వాతావరణం అలవాటు పడటానికి ఓరియంటేషన్ యాక్టివిటీస్ వంటివి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా డిజిటల్ లెర్నింగ్ జరుగుతుంది. భవిష్యత్తులో ఆన్లైన్ లెర్నింగ్ ఇండస్ట్రీ ఎంతో బాగుంటుందనే వ్యాపార నిపుణులు ఉన్నారు. ఆన్లైన్ తరగతుల వల్ల పిల్లలు సరిగా నేర్చుకోవట్లేదనే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే వరకు ఆన్లైన్ లెర్నింగ్‌ని అలవాటు చేసుకోవడం, సరిగా ఉపయోగించడం అవసరం.
లెర్నింగ్ ఎన్విరాన్మెంట్
పాఠశాలల్లో కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. టీచర్లతో పాటు ఇతర విద్యార్థుల నుంచి కూడా నేర్చుకుంటారు. చాలా సందర్భాల్లో విద్యార్థులు ‘ఇతరులని చూసి చదవడం మొదలుపెట్టాం’ అనేవారు లేకపోలేదు. అది చుట్టూ ఉన్న చదువుకునే వాతావరణ ప్రభావం.
అందుకే ఇంట్లో కూడా ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండటం అవసరం.
కుటుంబ సభ్యులందరికి ఎవరి పనులు వారికి ఉంటాయి. ఇంట్లో అందరూ వాడుకునే ప్రదేశాలు ఉంటాయి. కాబట్టి చదువుకోవడానికి ఎటువంటి భంగం కలగని చోటు చూసుకోవాలి.
ఇంటికి ఎవరైనా వచ్చినా మొహమాటానికి పోయి క్లాసులకు భంగం కలుగకుండా చూసుకోండి.
వీలైనంత వరకు ఇంట్లో టెలివిజన్ వంటివి పిల్లల క్లాసులు జరిగే సమయంలో నడవకుండా ఉంటే బాగుంటుంది. ఆ సౌండ్ ఒక డిస్ట్రాక్షన్ అవ్వచ్చు.
కొంతమందికి స్టడీ రూం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు చక్కగా కూర్చొని పాఠాలు వినాలి. ఉన్న వసతిని సద్వినియోగం చేసుకోవాలి.
సరిగ్గా కూర్చోకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
స్టడీ షెడ్యూల్ పాటించండి
- చిన్న తరగతుల్లో తల్లిదండ్రులు పిల్లలని కూర్చోబెట్టి చదివించగలరు. కానీ పై తరగతుల్లో సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి. అంటే వారి షెడ్యూల్, స్టడీ ప్లాన్ వారు చేసుకొని, దానిని పాటించగలగాలి.
- డిజిటల్ లెర్నింగ్ యుగంలో ఆన్లైన్ పాఠాలు ఎలాగూ తప్పవు. అలాగే కొన్నిసార్లు అంతర్జాలంపై చదివే విషయాలు కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎప్పుడు స్క్రీన్ బేస్డ్ లెర్నింగ్ చేస్తారు. ఎప్పుడు పాఠ్య పుస్తకాలనుంచి చదువుకుంటారన్న దానికి నిర్దిష్ట సమయం కేటాయించండి.
- పరీక్షలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి విలువైన సమయానికి టైం టేబుల్ సిద్ధం చేసుకోండి.
- వార్తాపత్రికలు చదవడం అవసరమనుకుంటే, వీలైతే హార్డ్ కాపీలో చదవండి. టెక్ట్స్‌బుక్స్ చదవడమైన తరువాత, అప్పుడు ఇంటర్నెట్లో చదువుకోవచ్చు.
- ఇంటర్నెట్లో ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉండే అవకాశముంది. కానీ ఇంటర్నెట్పై వెచ్చిస్తున్న సమయం చదువుకు అవసరమైన విషయాలకే అన్నది తరచూ గమనించుకోవాలి.
- చదువుతున్న వ్యాసాలు వంటివి విశ్వసనీయమైన సోర్స్ అయి ఉండాలి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆన్లైన్ తరగతుల్లో మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం. అలాగే ఆడియో, వీడియో ఆన్ చేయగలగాలి.
కొన్ని డిజిటల్ టూల్స్ మొబైల్లో కూడా ఉపయోగించవచ్చు. కానీ అంత చిన్న స్క్రీన్‌తో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. తరగతి అవసరాలకు అనుగుణమైన డివైజ్ వాడుకుంటే ఉత్తమం.
కంటిన్యూయిటీ మిస్సయితే క్లాస్ అర్థం చేసుకోవడం కాస్త కష్టమవుతుంది. కాబట్టి క్లాస్ మధ్యలో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా వినాలి. వాటర్ బాటిల్ వంటివి క్లాస్‌లో లాగానే పక్కన పెట్టుకోండి.
రికార్డెడ్ క్లాసులు ఉన్నా లైవ్ క్లాస్‌లో ఎక్కువ శ్రద్ధగా నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్ వంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రికార్డెడ్ క్లాసులు ఉపయోగపడుతాయి.
పరస్పర చర్చలు
విద్యార్థులు పరస్పరం చర్చించుకోవడం వల్ల కూడా ఎంతో నేర్చుకుంటారు. కానీ అది ఆన్లైన్ తరగతుల్లో అంతగా వీలు కాకపోవచ్చు.
కొన్ని తరగతుల్లో టీచర్ల పర్యవేక్షణలో డౌట్ క్లారిఫికేషన్స్ ఉపయోగపడుతాయి. అందులో తప్పక పార్టిసిపేట్ చేయాలి.
విద్యార్థులు ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం స్టూడెంట్ గ్రూప్స్ లేదా డిజిటల్ టూల్స్ ద్వారా కూడా చర్చించుకుంటున్నారు.
ఫోకస్, ప్లాన్
ఒక కాంపిటీటివ్ పరీక్షకు చదివే అన్ని సబ్జెక్టులు ముఖ్యమే. కాబట్టి సమయాన్ని కొన్ని విభాగాలుగా అన్నిటికి కేటాయించండి. ఒక పని అయిపోయిన తరువాత కనీసం గంట సేపయినా ఫోకస్డ్గా చదివిన తరువాత అవసరమైతే చిన్న బ్రేక్ తీసుకోండి. అది రూంలో నడవడం, బాల్కనీలో నిల్చొని ప్రకృతిని ఆస్వాదించడం లేదా వాటర్ బ్రేక్ అయినా తీసుకోవచ్చు.
విద్యార్థులు చాలా సందర్భాల్లో కష్టంగా ఉన్న సబ్జెక్టులను చదవడంలో వాయిదా వేయడం చేస్తారు. అలా చేయకుండా జాగ్రత్త పడాలి.
నోట్ టేకింగ్
- క్లాస్‌రూంలో విద్యార్థులు నోట్స్ రాసుకుంటున్నారా లేదా అన్నది అధ్యాపకులకు తెలుస్తుంది. కానీ ఆన్లైన్ తరగతుల్లో అది కొంత వరకు కష్టమే. అందుకే కొంతమంది టీచర్లు నోట్స్ చెకింగ్ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు.
- విద్యార్థులు రన్నింగ్ నోట్స్ త్వరగా తీసుకోగలగాలి. కాన్సెప్ట్స్‌తో పాటు చెప్పే లింకింగ్ టాపిక్స్ లేదా డిటైల్డ్ డెరివేషన్స్ తప్పక నోట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల తరువాత రిఫరెన్స్‌కి ఉపయోగపడుతుంది.
- పాఠ్యపుస్తకం చదివినప్పుడు, ఇతర విషయాలేమైనా ఉంటే వాటి మీద సులభంగా ఫోకస్ చేయవచ్చు.
- ఎవరి ఇంట్లో వారు ఉండటం వల్ల మీ నోట్స్ మీకు ఉండటం ఉపయోగపడుతుంది. ఎవరికయినా పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారి పుస్తకాలు, నోట్స్‌ని షేర్ చేసుకోవడం కష్టం.
స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్
- తెలిసిన టీచర్లను విద్యార్థులు సులభంగానే వారి సందేహాల్ని అడగగలుగుతారు. కానీ కొత్త క్లాస్ లేదా టీచర్ ఉంటే అప్పుడు టీచర్లు డౌట్స్ అడగమని ప్రోత్సహించినప్పుడు ప్రశ్నలను ధైర్యంగా అడగగలగాలి.
- నాకు తెలీదు, అడిగితే ఎవరేమైనా అనుకుంటారేమోనని మొహమాట పడకూడదు. ఎప్పటి సందేహాలను అప్పుడే తీర్చుకుంటే చివరి నిమిషంలో ధైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ అవచ్చు.
- ఆన్లైన్ తరగతుల్లో టీచర్లు అడిగినప్పుడు తప్పకుండా మీ జవాబు ఇవ్వండి. అప్పుడే డిజిటల్ లెర్నింగ్ అద్భుతంగా ఉంటుంది. కొన్ని డిజిటల్ టూల్స్‌లో చాట్‌బాక్స్ ద్వారా లేదా కొన్నిట్లో ఆడియో వీడియో ఆన్ చేసి కూడా ఇంటరాక్ట్ అవచ్చు. ఆ క్లాస్ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
- జూమ్, గూగుల్ క్లాస్‌రూం వంటివి ఉపయోగిస్తున్నప్పుడు డిజిటిల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం, ఇతర టూల్స్ ఎలా ఉపయోగించాలన్నది పాఠాలు మొదలయ్యే ముందే అవగాహన తెచ్చుకొని ఉండాలి.
- లంచ్ బ్రేక్ వంటి ఇతర సమయాల్లో కూడా విద్యార్థులు టీచర్లతో చర్చిస్తూ వారి సందేహాలను అడిగి తెలుసుకునేవారు. కానీ ఆన్లైన్ విద్యలో అటువంటివి కుదరవు. కాబట్టి వర్చువల్ సెషన్స్ లేదా తరువాత ఫోన్ ద్వారా అయినా ప్రశ్నలు అడగవచ్చు.
- విద్యార్థులు కొన్నిసార్లు వారికి సందేహం లేకపోయినా, వారి స్నేహితులు సందేహాలు అడుగుతుంటే విని నేర్చుకుంటారు. అది మిస్ అవుతుంది ఇక్కడ.
- బ్రిక్ అండ్ మోటార్ యాక్టివిటీస్ ఆన్లైన్లో జరగడం కష్టం. డిజిటల్‌గా జరిగే వాటిలో పాల్గొనాలి.
షెడ్యూల్ అఫ్ క్లాస్
ఆన్లైన్ తరగతుల్లో మధ్యలో బ్రేక్ వల్ల మళ్లీ లాగిన్ అవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెషన్ టైమింగ్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
పరీక్షలు తప్పకుండా రాయాలి. అప్పుడే ఎంతవరకు గ్రహిస్తున్నారు అన్నది తెలుస్తుంది.
ఆన్లైన్ తరగతుల్లో కమ్యూనికేషన్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఏవైనా ముఖ్యమైన విషయాలు అనౌన్స్ చేస్తే తప్పక వినాలి. సిలబస్, హోంవర్క్ , పరీక్షలు వంటి ఇన్ఫర్మేషన్ పిల్లలకు చేరేలా టీచర్లు చూసుకోవాలి. క్లాస్‌రూం అనౌన్స్‌మెంట్స్‌తో పాటు వాట్సాప్ ఈ-మెయిల్ వంటి టూల్స్ ఉపయోగించినప్పుడు వాటిని రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి.
వర్చువల్ పేరెంట్ టీచర్ మీటింగ్స్
- ఆఫీస్ ఉన్నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఆన్లైన్లో అటెండ్ కావడానికి వీలు కల్పించుకోవాలి. ఆన్లైన్లో పిల్లలతో, పెద్దవారితో మాట్లాడి కౌన్సెలింగ్ చేయవచ్చు.
- పేరెంట్, టీచర్ మీటింగ్‌లు.. విద్యార్థుల భవిష్యత్తు గురించి గురువులు, తల్లిదండ్రులు చర్చించుకునే ఒక మంచి అవకాశం. కాబట్టి ఆన్లైన్లో వర్చువల్ మీటింగ్స్ నిర్వహించినప్పుడు తప్పక అటెండ్ అవ్వాలి.
- విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారన్నది అర్థం చేసుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి వారికి ఒక మంచి గోల్ సెట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
- ఆన్లైన్ లెర్నింగ్‌తో కంటిచూపు సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కంటికి కూడా ఎక్సర్సైజ్ అవసరం. ఇతర స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. కళ్లు ఫ్రెష్ వాటర్‌తో శుభ్రపరుచుకోవాలి. ల్యాబ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్లో ఇవ్వడం, అన్ని రకాల కోర్సులకు కుదరక పోవచ్చు.
- స్కూల్స్ తెరుచుకుంటే ఈ సమస్య ఉండదు. ఫోకస్డ్ లెర్నింగ్కి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వం టి ఇబ్బందులుండవు. చాలామంది స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయని ఎదురుచూస్తున్నారు.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు