ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
- తెలంగాణలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు అవకాశం
రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షల (ఐబీపీఎస్) కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ తెలిపారు. అభ్యర్థులు జూలై 14నుంచి జూలై 25లోగా www.study circle.cgg.gov.in/tstw వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఆగస్టు 5 నుంచి 60 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఉచిత కోచింగ్‌కు మొత్తం 100 మందిని ఎంపిక చేస్తామని, అందులో ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10 సీట్లు కేటాయిస్తామని వివరించారు. మహిళలకు 33%, దివ్యాంగులకు 3% రిజర్వేషన్ ఉంటుందని స్పష్టంచేశారు. ఎంపికైన అభ్యర్థులకు స్టెపెండ్తోపాటు బుక్ మెటీరియల్ ఇస్తామని వెల్లడించారు. వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు 8309494387 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు