మాంటిల్ పొర మందం ఎంత?
గది ఉష్ణోగ్రత, పీడనాల మధ్య వాయువులన్ని విద్యుత్ బంధకాలుపీడనాన్ని తగ్గించి విద్యుత్ శక్మాన్ని పెంచితే వాయువులు విద్యుద్వాహకాలుగా మారతాయి .ఉత్సర్గనాళంలో ధనావేశానికి కలిపిన ఎలక్ట్రోక్ను అనోడ్ (ఎ) అని అంటారు.రుణావేశానికి కలిపిన ఎలక్ట్రోడ్‌ను కాథోడ్ (సి) అని పిలుస్తారు.
- కాథోడ్ కిరణాలను కనుగొన్నది- జె.జె. థామ్సన్
- అనోడ్ కిరణాలను కనుగొన్నది- గోల్డ్ స్టీన్
- ఎక్స్ కిరణాలను కనుగొన్నది- రాంట్జన్
- కాథోడ్ కిరణాల ఉత్సర్గ నాళంలో 0.01mm Hg పీడనం వద్ద ఉత్పత్తి అవుతాయి.
కాథోడ్ కిరణాలు
ఎ) రుజుమార్గంలో ప్రయాణిస్తాయి
బి) గతిశక్తి కలిగిన వస్తువులపై యాంత్రిక చలనాన్ని కలుగజేసాయి
కాథోడ్ కిరణాలు భార లోహాలపై పడినపుడు ఎక్స్- కిరణాలను ఉత్పత్తి చేస్తాయి.
కాథోడ్ కిరణాల ఉపయోగాలు
వీటిని టెలివిజన్ పిక్చర్ ట్యూబ్స్ కంప్యూటర్ డిస్ప్లే, ప్రకటనలకు వాడే చిహ్నాల ట్యూబ్స్, ఇండ్లలో వాడే ట్యూబ్లైట్స్గాను మార్చవచ్చును.
ఎక్స్-కిరణాలు
మాలిబ్డినమ్, టంగ్స్టన్ వంటి భార లోహాలను వేగంగా ప్రయాణించే ఎలక్ట్రాన్లు (కాథోడ్ కిరణాలు) ఢీకొన్నప్పుడు ఎక్స్-కిరణాలు ఉత్పత్తి అవుతాయి.
ఎక్స్- కిరణాలు రుజుమార్గంలో, కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి
ఎక్స్-కిరణాల వేగం 3X108మీటరు/సెకను
ఎక్స్-కిరణాలు విద్యుత్‌క్షేత్రం లేదా అయస్కాంత క్షేత్రంలో అపవర్తనం కావు .ఎక్స్- కిరణాలు జింక్సల్ఫైడ్ (ZnS) వంటి పదార్థాలపై పడినపుడు ప్రతిదీప్తిని కలుగజేస్తాయి
ఈ కిరణాలు అవి ప్రయాణించే మార్గంలో ఉండే వాయువులను ఆయనీకరణం చేస్తాయి.
ఎక్స్- కిరణాల ఉపయోగాలు
వైద్యరంగంలో విరిగిన ఎముకలను, అంగ వైకల్యాలను తెలుసుకునేందుకు వాడతారు.
పరిశ్రమల్లో వస్తువుల తయారీ లోపాలు, పగుళ్లు తెలుసుకునేందుకు, లోహాల్లో రంధ్రాలు వేసేందుకు ఉపయోగిస్తారు.
నేరపరిశోధనలో కస్టమ్స్ అధికారులు దొంగ రవాణా చేయబడే వస్తువులు, ఆయుధాల ఉనికిని తెలుసుకునేందుకు వాడతారు.
రూథర్‌ఫోర్డ్ పరమాణు నమూనా
పరమాణువులో అత్యధిక ద్రవ్యరాశి గల కేంద్రకం ఉంటుందని, అది ప్రోటానులు అనే ధనావేశ కణాలను కలిగి ఉంటుందని ప్రతిపాదించారు.
న్యూక్లియస్ లేదా కేంద్రకానికి కొంత దూరంలో (బయట) ఎలక్ట్రాన్లు భ్రమణం చేస్తుంటాయి. కేంద్రకానికి, ఎలక్ట్రానులకి మధ్య చాలా ఖాళీ స్థలం ఉంది.
పరమాణు కేంద్రకంలో ఉన్న ధనావేశం పరిమాణం, కేంద్రకం బయట ఉండే ఎలక్ట్రానుల రుణావేశ పరిమాణానికి సమానం.
బోర్ పరమాణు నమూనా
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతాయి.
ఎలక్ట్రానులు నిర్ణీత ‘స్థిర కక్ష్య’ల్లో మాత్రమే భ్రమణం చేస్తాయి. ఈ కక్ష్యల్లో ఉన్నంతవరకు అవి శక్తిని ఉద్గారించవు. ఇది పరమాణు స్థిరత్వాన్ని వివరిస్తుంది.
పరమాణు సంఘటన భాగాలు
పరమాణు సంఘటన భాగాలు- ప్రోటానులు, ఎలక్ట్రానుల, న్యూట్రాన్లు
న్యూట్రాన్లను కనుగొన్నది-చాడ్విక్
న్యూక్లియర్ (కేంద్రక) పరమాణు నమూనా ప్రకారం న్యూట్రాన్లు, ప్రోటానులు, కేంద్రకంలోనూ, ఎలక్ట్రాన్లు కేంద్రకం బయట ఉంటాయి
న్యూట్రాను విద్యుదావేశం- తటస్థం
న్యూట్రాను ద్రవ్యరాశి- ప్రోటాను ద్రవ్యరాశికి సమానం
ఎలక్ట్రాను ఆవేశం- రుణావేశం
ప్రోటాను ఆవేశం-ధనావేశం
ప్రోటాను ద్రవ్యరాశి- ఎలక్ట్రాను ద్రవ్యరాశి కన్నా 1836 రెట్లు ఎక్కువ
ఎలక్ట్రాను ద్రవ్యరాశి, న్యూట్రాను లేదా ప్రోటాను ద్రవ్యరాశితో పోల్చితే చాలా తక్కువ కాబట్టి ఉపేక్షించవచ్చు.
ప్రోటానులు, న్యూట్రానులను కలిపితే- న్యూక్లియనులు
రేడియో ధార్మికత
రేడియో ధార్మికతను ఆవిష్కరించినది- బెక్వెరెల్
యురేనియం నుంచి కొత్తగా ఆవిష్కరించిన కిరణాలకు పేరు- బెక్వెరెల్ కిరణాలు
పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువ గల కొన్ని పరమాణువుల కేంద్రకాలు, అస్థిరత్వం వల్ల, వికిరణాలను ఉద్గారం చేస్తూ స్వచ్ఛంద, స్వయం విఘటనం చెందే దృగ్విషయాన్ని సహజ రేడియో ధార్మికత అంటారు.
కొన్ని రకాల పదార్థాలపై పతనమయ్యే అతి నీలలోహిత కిరణాలు, ఆ పదార్థాల వల్ల దృగ్గోచర కాంతి మారడాన్ని ప్రతిదీప్తి అంటారు.
రేడియో ధార్మిక పదార్థాల నుంచి వెలువడే వికిరణాల వర్గీకరణ
ఆల్ఫా- కిరణాలు (ధనావేశ కణాలు)
బీటా- కిరణాలు (రుణావేశ కణాలు)
గామా- కిరణాలు (తటస్థ కణాలు)
ప్రాక్టీస్ బిట్స్
- రుబీ లేసర్‌లో ప్రేరితమయ్యే వ్యవస్థ?
1) అల్యూమినియం ఆక్సైడ్ 2) క్రోమియం ఆక్సైడ్
3) సర్పిలాకార జినాన్ ఫ్లాష్ గొట్టం 4) గాజు గొట్టం - ఉష్ణాన్ని సంపూర్ణంగా పనిగా మార్చడం అసాధ్యం అనే నిర్వచనాన్ని తెలిపేది?
1) శూన్యాంక ఉష్ణ గతికశాస్త్ర నియమం
2) మొదటి ఉష్ణగతిక శాస్త్ర నియమం
3) రెండవ ఉష్ణగతిక శాస్త్ర నియమం
4) మూడవ ఉష్ణగతిక శాస్త్రనియమం
3.సమాంతర పలకల కెపాసిటర్ క్షమశీలత?
1) పలకల మధ్య దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది
2) పలకల వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది
3) పలకల వైశాల్యానికి అనులోమానుపాతంలోనూ, పలకల మధ్య దూరానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది
4) పలకల వైశాల్యంపై, పలకల మధ్య దూరాలపై ఆధారపడదు - ఏకరీతి కాని విద్యుత్ క్షేత్రంలో ఒక ద్విధృవాన్ని ఉంచినప్పుడు ఆ ద్విధృవం లోనయ్యేది?
1) టార్క్ మాత్రమే 2) బలం, టార్క్
3) బలం 4) ఏదీకాదు - రెండు సమాంతర తీగలనుంచి ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఒకే పరిమాణం కలిగి ఒకే దిశలో ప్రవహించినట్లయితే అవి?
1) ఒకదానిపై ఒకటి ఏ విధమైన బలాన్ని కలుగచేసుకోవు
2) ఒకదానిపై ఒకటి టార్క్‌ను కలుగచేసు కొంటాయి
3) ఒకదానిపై ఒకటి వికర్షణ బలాలను ప్రయోగించుకొంటాయి
4) ఒకదానిపై మరొకటి ఆకర్షణ బలాలను ప్రయోగించుకొనును - ద్రవ్యరాశి లోప పరిమాణ కొలమానం?
1)ఘనపదార్థములోని
పరమాణువుల బంధనం
2) పరమాణువులోని ఎలక్ట్రానుల బంధనం
3) కేంద్రక స్థిరత్వం 4) కేంద్రక అస్థిరత్వం - విమానం సూపర్సోనిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు?
1) మాచ్ నంబర్ 2) డెసిబుల్
3) హెర్ట్జ్ 4) ఏదీకాదు - డాప్లర్ ఎఫెక్ట్‌కు దేనితో సంబంధం?
1) ధ్వని 2) కాంతి
3) అయస్కాంత శక్తి
4) ఎలక్ట్రోమేగ్నటిక్ ఇండక్షన్ - జతపర్చండి
ఎ. అనిమోమీటర్ 1. అధిక ఉష్ణోగ్రత
బి.టాకోమీటర్ 2. యంత్ర సామర్థ్యం
సి. పైరోమీటర్ 3. భ్రమణవేగం
డి. డైనమోమీటర్ 4. ద్రవవేగం
1) ఎ-2, బి-1, సి-3, డి-4,
2) ఎ-3, బి-4, సి-2, డి-1,
3) ఎ-4, బి-3, సి-1, డి-2,
4) ఎ-4, బి-3, సి-2, డి-1, - దగ్గరి వస్తువులను చూడలేకపోవడాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) పుటాకార-కుంభాకార కటకం
4) కుంభాకార-పుటాకార కటకం - లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది?
1) ఛార్లెస్ డార్విన్ 2) ఛార్లెస్ టావెలన్స్
3) ఛార్లెస్ బాబేజి 4) క్రిష్టియన్ హైజిన్స్ - గంధకాన్ని రబ్బర్‌తో కలిపి వేడిచేయటాన్ని ఏమంటారు?
1) గాల్వనైజేషన్ 2) సల్ఫోనేషన్
3) వల్కనైజేషన్ 4) బేసెమిరైజేషన్ - నీటిలోపలి తరంగాలను కొలిచే సాధనం?
1) హైడ్రోఫోన్ 2) జైరోస్కోప్
3) ఎపిటియుస్కోప్ 4) ఫొటోమీటర్ - ఒక విద్యుత్ రోధక పదార్థాన్ని ఒక విద్యుత్ క్షేత్రంలో ఉంచినపుడు ద్విధ్రువాలన్ని అనువర్తిత క్షేత్ర దిశకు సమాంతరంగా ఉండే విధంగా దిశను మార్చుకుంటాయి. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) విద్యుత్ స్థానభ్రంశం
2) విద్యుత్ రోధక ధ్రువణం
3) విద్యుత్ రోధక సడలింపు
4) విద్యుత్ రోధక అయస్కాంతీకరణ - లేసర్ ఈ ప్రక్రియ ద్వారా అతి తీవ్రత గల ఏకవర్ణ, సంబద్ద కాంతిని ఉత్పన్నం చేస్తుంది?
1) స్వచ్ఛంద ఉద్గారం 2) ఉత్తేజిత శోషణం
3) ఉత్తేజిత ఉద్గారం 4) బ్రెమ్స్ట్రాలంగ్ - భూగర్భంలోకి లోతుగా వెళ్లే కొద్దీ పీడనం, ఉష్ణోగ్రతలు ఏవిధంగా మారతాయి?
1) పీడనం తగ్గి, ఉష్ణోగ్రత పెరుగుతుంది
2) పీడనం పెరిగి, ఉష్ణోగ్రత తగ్గుతుంది
3) పీడనం, ఉష్ణోగ్రత రెండూ తగ్గుతాయి
4) పీడనం, ఉష్ణోగ్రత రెండూ పెరుగుతాయి
17.మాంటిల్ పొర మందం ఎంత?
1) 2950 కి.మీ 2) 2800 కి.మీ
3) 2900 కి.మీ 4) 3200 కి.మీ - పూర్వజీవుల శిథిల శిలారూపాన్ని ఏమంటారు?
1) అగ్నిశిల 2) వెంట్
3) లావా 4) శిలాజం - ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
1) అల్యూమినియం ఆక్సైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) పొటాషియం నైట్రేట్ - వర్ణ వినథనానికి కారణం?
1) దోషపూరిత కటకాల అమరిక
2) దృష్టిలోపం
3) కాంతి శోషణం 4) కాంతి విక్షేపణం
Answers
1-3, 2-1, 3-3, 4-2, 5-4, 6-3, 7-1, 8-1, 9-3, 10-2, 11-4, 12-3, 13-1, 14-3, 15-2, 16-4, 17-3, 18-4, 19-3, 20-4,
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు