శిశు వికాసం – పెడగాజీ

1. నారాయణ అనే విద్యార్థికి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం.
1) వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం ఒక పరస్పర చర్య
4) వికాసం ఒక కచ్చితమైన దిశగా సాగుతుంది
2. పెరుగుదల, వికాసానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1) పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం
2) పెరుగుదల అనేది పుట్టుక నుంచి ప్రారంభమై జీవితాంతం కొనసాగుతుంది
3) వికాసం పుట్టుకతో ప్రారంభమై 20 సంవత్సరాల తరువాత ఆగిపోతుంది
4) పెరుగుదలకు, వికాసం మధ్య ఎలాంటి సంబంధం లేదు
3. వ్యక్తి వికాస దశల్లో [ముఠా దశ] అని పిలవబడే వికాస దశ ఏది?
1) పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ
3) యవ్వనారంభ దశ 4) శైశవ దశ
4. కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్లు ఉన్నందువల్ల దానిని కూడా కుక్క అని పిలవడంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1) సాంశీకరణం 2) అనుగుణ్యం
3) వ్యవస్థీకరణ 4) సమతుల్యత
5. శిశువు లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాల ఆవిర్భావం మనకు హఠాత్తుగా సంభవించినట్లు అనిపిస్తాయి. ఇందులోని వికాస సూత్రం ఏది?
1) వికాసం ఒక పరస్పర చర్య
2) వికాసం సంచితమైనది
3) వికాసం ఏకీకృత మొత్తం
4) వికాసాన్ని అంచనా వేయవచ్చు
6. వ్యక్తి ‘సంరక్షణ’ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి.
1) ఉత్పాదకత vs స్తబ్దత
2) చొరవచూపడం vs అపరాధ భావన
3) నమ్మకం vs అపనమ్మకం
4) సమగ్రత vs నిరాశ
7. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతివేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతుంది. అలాగే చేతి వేళ్లు పట్టు సాధించిన తరువాత సూక్ష్మ చర్యలైన రాయడం చేయగలుగు తుంది. ఇందులో ఉన్న వికాసం?
1) వికసం ఒక కచ్చితమైన దిశగా సాగుతుంది
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వికసం సాధారణ దిశ నుంచి నిర్ధిష్ట దిశగా సాగుతుంది
4) వికాసం సంచితమైనది
8. శిరఃపాదాభిముఖ వికాసం అంటే
1) వికాసం శరీర కేంద్రం నుంచి భాగాలకు విస్తరిస్తుంది
2) వికాసం పాదాల నుంచి ప్రారంభమై శిరస్సు వరకు వ్యాపిస్తుంది
3) వికాసం శిశువు శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖంగా జరుగుతుంది
4) పైవేవి కావు
9. ఏ వికాస దశను వాగుడు కాయ దశ అని, [పూర్వముఠా] దశ అని అంటారు.
1) శైశవ దశ 2) పూర్వ బాల్య దశ
3) ఉత్తర బాల్య దశ 4) యవ్వనారంభ దశ
10. పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే వికాస దశ?
1) శైశవ దశ
2) పూర్వ బాల్య దశ
3) ఉత్తర బాల్య దశ
4) కౌమార బాల్య దశ
11. పెరుగుదల, వికాసానికి సంబంధించి సరికానిది ఏది?
1) పెరుగుదల జీవితకాలం కొనసాగదు
2) వికాసం పరిశీలనకు సాధ్యమైనది
3) పెరుగుదలను కచ్చితంగా కొలవగలం
4) వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ
12. వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేవి
1) అనువంశికత
2) పరిసరాలు
3) అనువంశికత, పరిసరాల సమతుల్యత
4) పైవేవీ కావు
13. ఒక జాతి సంతానం అదే జాతి పిల్లలను పోలి ఉండటం ఏ సూత్రానికి సంబంధించినది?
1) ప్రతిగమన సూత్రం
2) వైవిధ్య సూత్రం
3) సామీప్య సూత్రం
4) పరిపక్వత
14. అయిన డగ్డేల్ పరిశీలించిన కుటుంబం
1) హోమిని కుటుంబం
2) కల్లికాక్ కుటుంబం
3) ఎడ్వర్డ్స్ కుటుంబం
4) జ్యూక్ కుటుంబం
15. లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకొనే దశ ఏది?
1) బాల్య దశ
2) వయోజన దశ
3) యవ్వనారంభ దశ
4) శైశవ దశ
16. ‘వ్యక్తిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక సమస్యలను అధిగమించి సర్దుబాటు పొందే దశ కౌమార దశ’ అని చెప్పినవారు?
1) స్టాన్లీ హాల్ 2) కొహ్లన్
3) షేక్స్పియర్ 4) కోఫ్కా
17. స్టాన్లీ హాల్ ఏ దశను ‘ఒత్తిడి, సంచలనం’తో కూడుకున్న దశగా పేర్కొన్నారు?
1) పూర్వ బాల్య దశ
2) ఉత్తర బాల్య దశ
3) కౌమార దశ
4) వయోజన దశ
18. అనుగుణ్యం ఎక్కువగా ఉన్న పిల్లలు అంటే?
1) కొత్త పరిస్థితులతో తొందరగా సర్దుబాటు చేసుకుంటారు
2) కొత్త పరిస్థితులను అర్థం చేసుకోరు
3) కొత్త పరిస్థితులతో కలవడానికి ఎక్కువ ఇబ్బంది పడతారు
4) కొత్త పరిస్థితులను అసలు ఇష్టపడనివారు
19. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ‘ఉత్పాదకత, స్తబ్దత’ అనేవి ఏ దశలో కనిపిస్తాయి?
1) మధ్య వయోజన దశ
2) పూర్వ వయోజన దశ
3) కౌమార దశ
4) శైశవ దశ
20. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ‘సన్నిహితం, ఏకాంతం’ ఏ దశలో కనిపిస్తాయి?
1) ఉత్తర బాల్య దశ
2) పూర్వ వయోజన దశ
3) మధ్య వయోజన దశ
4) కౌమార దశ
21. చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం?
1) సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
2) ఆత్మభావన సిద్ధాంతం
3) నైతిక వికాస సిద్ధాంతం
4) భాషా వికాస సిద్ధాంతం
22. రాణి మొదటగా పాకడాన్ని, తరువాత నిలబడటాన్ని, నడవడాన్ని అభ్యసించింది. ఇది నిరూపించే వికాస సూత్రం?
1) క్రమ వికాస సూత్రం
2) శిరఃపాదాభిముఖ వికాస సూత్రం
3) సమీపదూరస్థ వికాస సూత్రం
4) పై వాటిలో ఏవైనా రెండు
23. కిరణ్ ఒక అబ్బాయి, కీర్తన అతని చెల్లెలు. కిరణ్‌ను ‘నీకు ఒక చెల్లి ఉందా?’ అని ప్రశ్నిస్తే ‘అవును- ఉంది’ అన్నాడు. ‘నీ చెల్లెలికి అన్నయ్య ఉన్నాడా?’ అని ప్రశ్నిస్తే- ‘లేదు. లేడు’ అని బదులిచ్చాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా కిరణ్ ఏ దశలో ఉన్నట్టుగా గుర్తిస్తారు?
1) సంవేదన చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
24. రీటా తన దగ్గర ఉన్న చిన్న పాప బొమ్మకు రోజూ స్నానం చేయిస్తూ, పాలు పడుతుంది. పియాజే ప్రకారం ఈ అమ్మాయి వయస్సు దాదాపుగా ఎంత?
1) 0-2 సంవత్సరాలు
2) 2-7 సంవత్సరాలు
3) 5-8 సంవత్సరాలు
4) 1-4 సంవత్సరాలు
సమాధానాలు
1) 3 2) 1 3) 2 4) 1 5) 2 6) 1 7) 3 8) 3 9) 2 10) 1 11) 2 12) 3 13) 3 14) 4 15) 3 16) 2 17) 3 18) 1 19) 1 20) 2 21) 4 22) 1 23) 2 24) 2
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు