మైక్రో టీచింగ్ అనే భావన ఎక్కడ ఆవిర్భవించింది?
ప్రణాళికలు (విద్యాప్రణాళిక-బోధనా ప్రణాళిక)
- విద్యా ప్రణాళికలోని అంశాలు విద్యార్థి ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు, అభిరుచులు శక్తి సామర్థ్యాలు విద్యా ప్రక్రియలను ప్రభావితం చేసేవిగా ఎంపిక చేయడం జరగాలి అనేది?
1) సాంస్కృతిక సూత్రం
2) సృజనాత్మక సూత్రం
3) శిశుకేంద్రీకృత సూత్రం
4) వ్యాసక్తి సూత్రం - ‘పాఠశాల స్థాయి విద్యాప్రణాళిక ఏర్పాటుకు ఇది తగిన పద్ధతికాదు’ అనే లోపం కలిగిన విధానం?
1) ఉదావర్త విధానం 2) శీర్షికా విధానం
3) ఏకకేంద్ర విధానం
4) కాలక్రమ విధానం - నిర్దిష్టమైన పాఠ్యవిషయాలను ఎన్నుకొని వాటిలోని మౌలిక విషయాలను కింది తరగతిలోను, క్లిష్టమైన విషయాలను పై తరగతుల్లోనూ చెప్పే విధానం?
1) శీర్షికా విధానం 2) కాలక్రమ విధానం
3) యూనిట్ విధానం
4) ఏకకేంద్ర విధానం - వార్షిక ప్రణాళిక రూపకల్పన వల్ల ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనం?
ఎ. ఏ యూనిట్‌ను ఏ నెలలో ఎంతమేరకు బోధించాలో తెలుసుకుంటాడు
బి. ఆ యూనిట్ ద్వారా తాను సాధించాల్సిన లక్ష్యాలు తెలుసుకుంటాడు
సి. ప్రణాళికాబద్ధంగా బోధించగలుగుతాడు
1) ఎ, బి 2) బి, సి
3) సి, ఎ 4) ఎ, బి, సి - జాతీయ విద్యావిధానం NPE-86కు సంబంధించిన అంశం?
1) విరామ సమయ వినియోగానికి శిక్షణ
2) SUPW 3) 10+2+3 విద్యావిధానం
4) అభ్యసనం, పని-అనుభవ సూత్రాల ప్రాధాన్యత - మోరిసన్ సూచించిన పాఠ్యపథక దశలననుసరించి
1) సాంశీకరణ తర్వాత వ్యవస్థీకరణ
2) ప్రదర్శన తర్వాత అన్వేషణ
3) అన్వేషణ తర్వాత వల్లెవేయడం
4) వ్యవస్థీకరణ తర్వాత ప్రదర్శన - అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయం?
1) యూనిట్ 2) పీరియడ్
3) కరికులం 4) సిలబస్ - సూక్ష్మ బోధన (మైక్రో టీచింగ్) అనే భావన మొదటిసారి ఎక్కడ ఆవిర్భవించింది?
1) ఇంగ్లండ్ 2) అమెరికా
3) స్విట్జర్లాండ్ 4) భారత్ - ‘మొక్కలు-జంతువులు’ పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు వివిధ రకాల జంతు నమూనాలను ఉపయోగించి వివరించడం హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో ఏ సోపానాన్ని అనుసరిస్తుంది?
1) సన్నాహం 2) సమర్పణ
3) సంసర్గం 4) సాధారణీకరణం - వాస్తవ సంఖ్యలు అనే అంశాన్ని విద్యార్థులకు ఏడో తరగతిలోనే నేర్పించి, 8, 9, 10 తరగతుల్లో వీటిని గురించి ఎలాంటి బోధన చేయకుంటే ఆ విద్యా ప్రణాళిక ఏ విధానం ఆధారంగా రూపొందించబడినది?
1) ఏకకేంద్ర పద్ధతి 2) సర్పిల పద్ధతి
3) శీర్షికా పద్ధతి 4) యూనిట్ పద్ధతి - బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనాను అనుసరించి సరైన క్రమంలో అమర్చండి?
ఎ. మూల్యాంకనం చేయడం
బి. లక్ష్యాలు రూపొందించడం
సి. అనుభవాలు కలిగించడం
1) ఎ, బి, సి 2) సి, బి, ఎ
3) ఎ, సి, బి 4) బి, సి, ఎ - భూమి అనే పాఠ్యాంశంలో 3వ తరగతిలో భూమి అనే భావన, 4వ తరగతిలో భూమి వివిధ మండలాలు, అక్షాంశాల గురించి 5వ తరగతిలో భూమి ఆకారం మొదలైన అంశాలను వ్యవస్థీకరించడం అనేది?
1) శీర్షికా పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) యూనిట్ పద్ధతి 4) సమైక్యతా పద్ధతి - ‘కాలక్రమ రీతి’ సాంఘిక శాస్త్రంలో ఏ విభాగ బోధనకు అనుకూలంగా ఉంటుంది?
1) భూగోళశాస్త్రం 2) చరిత్ర
3) పౌరశాస్త్రం 4) అర్థశాస్త్రం - కింది వాటిలో కరికులం నిర్వచనానికి సంబంధించి సరికానిది? 1) ఉపాధ్యాయుడు మార్గదర్శి అయితే కరికులం ఒక మార్గం- విలియం జే బెన్నెట్ 2) పాఠశాల పరిసరాలు ఆ వాతావరణంలో కలిగే సమస్త అనుభవాలు కరికులం
- అండర్సన్
3) కరికులం పాఠశాల వెలుపలి, లోపలి మార్గదర్శకం- డ్రాపర్
4) విద్యార్థిని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దడానికి ఒక కళాకారుని వలే ఉపాధ్యాయుడు ఉపయోగించేది కరికులం- కొఠారి
- అండర్సన్
- పరిసరాల విజ్ఞానంలోని చారిత్రక కట్టడాలు అనే పాఠంలో ఇమిడి ఉన్న మౌలిక అంశం?
1) హక్కులు-విధులు
2) స్త్రీ, పురుష సమానత్వం
3) ప్రజాస్వామ్యం-సామ్యవాదం
4) భారతీయ సంస్కృతి సంప్రదాయం - ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర సబ్జెక్టులతో అంతస్సంబంధాన్ని నెలకొల్పుతూ బోధన చేయడం?
1) సమైక్య ఉపగమం
2) సహసంబంధ ఉపగమం
3) విషయభాగ ఉపగమం
4) అంశ ఉపగమం - విద్యాప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాల్లో లేనిది?
1) పరిసరాల పరిరక్షణ
2) చిన్న కుటుంబ భావన
3) రోడ్డు భద్రత విద్య
4) స్వాతంత్య్రోద్యమ చరిత్ర - పాఠ్యప్రణాళికను సుమారుగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆధునీకరిస్తారు?
1) 5 2) 10 3) 2 4) 20 - ‘శాస్త్రీయ విజ్ఞానం భవిష్యత్తులో విద్యార్థులు చేరే గమ్యాలకు మార్గదర్శకంగా రాబోయే మార్పులను ముందుగానే ఊహించే విధంగా ఉండాలి’ అనేది?
1) సమాజ కేంద్రీకృత సూత్రం
2) దూరదృష్టి సూత్రం
3) వ్యాసక్తి సూత్రం
4) పరిరక్షణ సూత్రం - కింది వాటిని జతపర్చండి.
- వ్యాసక్తి సూత్రం ఎ. విద్యాప్రణాళిక
- ఏకకేంద్ర విధానం బి. నిర్మాణ సూత్రం
- కేవలం పాఠ్యాంశాల సముదాయం సి. విషయ ప్రణాళిక
- పాఠ్య, పాఠ్యేతర అంశాల సముదాయం డి. నిర్వహణ విధానం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
Answers
1-3, 2-2, 3-4, 4-4, 5-4, 6-1, 7-1, 8-2, 9-2, 10-3, 11-4, 12-2, 13-2, 14-4, 15-4, 16-2, 17-3, 18-2, 19-2, 20-2
‘సిద్ధాంత శిరోమణి’ అనే గ్రంథ రచయిత?
శాస్ర్తాలు-చరిత్ర-స్వభావాలు-సహసంబంధం
- బెంజిమన్ పీర్స్ ప్రకారం గణితం అంటే?
1) పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ
2) పరిమాణ శాస్త్రం 3) పరోక్ష మాపనం
4) అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం - ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయంలోని కాలపాదానికి సంబంధించిన అంశం?
1) అంకెలకు సంకేతంగా అక్షరాలను ఉపయోగించి రాసే విధానం
2) ఉత్తరాయన, దక్షిణాయనాల వివరణ
3) కొలమానం, గ్రహగతుల గురించిన
వివరణ
4) త్రిభుజం, త్రికోణమితి, బీజగణిత భావనల వివరణ - అరబ్బీ భాషలోకి ‘సింధ్-హింద్’ అనే పేరుతో అనువదించిన ప్రముఖ గ్రంథం?
1) ఆర్యభట్టీయం
2) బ్రహ్మస్ఫుట సిద్ధాంతం
3) సిద్ధాంత శిరోమణి 4) ఎలిమెంట్స్ - గ్రంథాలు-గ్రంథకర్తలను జతపర్చండి.
- ఆర్యభట్టీయం ఎ. యూక్లిడ్
- సిద్ధాంత శిరోమణి బి. బ్రహ్మగుప్త
- బ్రహ్మస్ఫుట సిద్ధాంతం సి. ఆర్యభట్ట
- ఎలిమెంట్స్ డి. భాస్కరాచార్య
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
- ‘పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం లేదు’ అనేది గణితం ఏ స్వభావాన్ని సూచిస్తుంది?
1) సౌందర్య లక్షణం 2) కచ్చితత్వం
3) సరిచూసే స్వభావం
4) ఆగమన స్వభావం - గణిత శాస్త్రంలో సంఖ్యావిధానానికి ‘అర్థమెటికా’ అని, గణన విధానానికి ‘లాజిస్టికా’ అని పేరు పెట్టినవారు?
1) అరబ్బులు 2) ఈజిప్షియన్లు
3) గ్రీకులు 4) భారతీయులు - అంకగణితంలోని లాభనష్టాలు, భాగస్వామ్యం వడ్డీ మొదలైన అంశాలకు చెందిన కొన్ని సమస్యలను బీజగణిత సమీకరణల ద్వారా సాధించడం’. ఈ అంశం ఏ రకమైన సహసంబంధాన్ని సూచిస్తుంది?
1) నిత్యజీవిత అంశాలతో బాహ్య సహసంబంధం
2) ఇతర విషయాలతో బాహ్య సహసంబంధం
3) ఒకే శాఖలో అంతర్గత సహసంబంధం
4) గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధం - “P’ ఒక ప్రధాన సంఖ్య, a ఏదేనీ ఒక పూర్ణ సంఖ్య అయితే ap-a అనే పూర్ణసంఖ్య pకి గుణిజమవుతుంది’ అనేది?
1) ఫెర్మాలిటిల్ సిద్ధాంతం
2) ఫెర్మాలాస్ట్ సిద్ధాంతం
3) యూక్లీడియన్ సిద్ధాంతం
4) నిగమన ప్రక్రియ - కాంతి వేగం, తరంగదైర్ఘ్యం, సాంద్రత, వాయుపీడనం లాంటి అంశాలను బోధించడంలో దాగి ఉన్న సహసంబంధం?
1) గణితం-సాంఘిక శాస్త్రం
2) గణితం-రసాయన శాస్త్రం
3) గణితం-భౌతిక శాస్త్రం
4) గణితం-జీవశాస్త్రం - శాస్త్రీయ విధానంలోని దశ కానిది?
1) దత్తాంశాలను పరిశీలించి నిరూపించడం
2) దత్తాంశాలను అంగీకరించడం, మార్పు చేయడం
3) సమస్యకు సర్దుబాటు కావడం
4) సమస్యకు తగు పరిశీలన చేయడం - మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలు?
1) యథార్థాలు 2) సిద్ధాంతాలు
3) నియమాలు 4) సూత్రాలు - ‘హిస్టరీ’ అనేది ఏ భాషా పదం?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఇటాలియన్ 4) ఆంగ్లం - NCF-2005 ప్రకారం కింది ఏ తరగతుల్లో భూగోళం, చరిత్ర, అర్థశాస్ర్తాలను బోధిస్తూ పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్ర్తాన్ని అభ్యసింపజేయాలి?
1) 6, 7, 8 తరగతులు
2) 8, 9, 10 తరగతులు
3) 6, 7 తరగతులు
4) 1 నుంచి 5 తరగతులు - ‘సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం’ అని పేర్కొన్నవారు?
1) జేమ్స్ హెమ్మింగ్స్ 2) జేఎం ఫారెస్టర్
3) ఈబీ వెస్లీ 4) జేవీ మైకేల్స్ - సరైనది సూచించండి?
ఎ. శాస్త్రం అంటే చేయడం- కొఠారి
బి. శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం- NPE-86
సి. శాస్త్రం అంటే సత్యాన్వేషణ- NCF-2005
1) ఎ, బి 2) బి, సి
3) సి, ఎ 4) ఎ, బి, సి - కింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగం?
1) యధార్థాలు 2) సిద్ధాంతాలు
3) ప్రయోగాలు 4) భావనలు - ‘దేశ గతానుభవాల పరంపరే చరిత్ర’ అని అభిప్రాయపడినవారు?
1) గాంధీజీ 2) సర్వేపల్లి
3) నెహ్రూ 4) వివేకానంద - 1 నుంచి 5 తరగతులకు ప.. వి-i, ప.. వి-ii లను సమైక్యం చేసి ఒకే పాఠ్యపుస్తకంగా రూపొందించాలని సూచించారు?
1) NPE-86 2) NCF-2005 3) NCF-2011 4) ఈశ్వరీబాయి - ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధం అని పేర్కొన్నవారు?
1) బ్రాడ్ఫోర్డ్ 2) జాన్ డూయీ 3) థార్న్‌డైక్ 4) బ్లూమ్స్ - జతపర్చండి.
- గీతికా పాదం ఎ. 33 శ్లోకాలు
- గణిత పాదం బి. 50 శ్లోకాలు
- కాల పాదం సి. 10 శ్లోకాలు
- గోళ పాదం డి. 25 శ్లోకాలు
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
Answers
1-4, 2-3, 3-2, 4-1, 5-2, 6-3, 7-4, 8-1, 9-3, 10-3, 11-2, 12-4, 13-3, 14-1, 15-4, 16-3, 17-2, 18-2, 19-3, 20-2
ఏఎన్ రావు
విషయ నిపుణులు
- Tags
- Education News
Previous article
భూమిలో నత్రజని పెంపొందించే పంట?
Next article
దుఃఖస్ఫోరకమైన అభిప్రాయాలను మృదువుగా చెప్పడం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు