దుఃఖస్ఫోరకమైన అభిప్రాయాలను మృదువుగా చెప్పడం?
అర్థవిపరిణామం
- భాషలో కాలక్రమాన వర్ణాలూ, ధ్వనులూ, వాక్యనిర్మాణమూ, వ్యాకరణ నిర్మాణమూ మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పునే అర్థవిపరిణామం అంటారు అని నిర్వచించినది?
1) ఆచార్య జీఎన్ రెడ్డి
2) ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం
3) మైకేల్ బ్రెయిల్
4) ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి - అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథమైన ‘La Semantique (1897)’ను రచించినది?
1) సీపీ బ్రౌన్ 2) కాల్డెల్
3) మైకేల్ బ్రెయిల్
4) పోరంకి దక్షిణామూర్తి - తెలుగు భాషలో అర్థపరిణామం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోథన గ్రంథం ‘A Study of Telugu Semantics’ను రచించినది?
1) ఆచార్య జీఎన్ రెడ్డి
2) సీ నారాయణ రెడ్డి
3) ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం
4) విశ్వనాథ సత్యనారాయణ - మొదట పరిమితార్థాన్ని బోధించేటటువంటి ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించేటట్లయితే అది అర్థవిపరిణామంలో దేనికి చెందినది?
1) అర్థ సంకోచం 2) అర్థవ్యాకోచం
3) అర్థసౌమ్యత 4) అర్థగౌరవం - కింది వాటిలో అర్థ వ్యాకోచానికి ఉదాహరణ?
1) సభికులు 2) స్వాహా
3) సాని 4) చెంబు - నువ్వుల నూనెకు మాత్రమే వాచకమైన ‘నూనె’ శబ్దం నేడు వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, వేపనూనె అని సామాన్య వాచిగా వాడబడుతుంది. ఇందులో జరిగిన అర్థవిపరిణామం?
1) సభ్యోక్తి 2) మృదూక్తి
3) అలంకారిక ప్రయోగం
4) అర్థ వ్యాకోచం - కింది వాటిలో అర్థ విపరిణామంలో భాగంగా అర్థ వ్యాకోచానికి సంబంధించి తప్పుగా పేర్కొన్నది?
1) కమ్మ 2) ధర్మరాజు
3) సందూక 4) భీముడు - అర్థ వ్యాకోచానికి సంబంధించి సరికాని ఉదాహరణ?
1) నారదుడు, అవధాని
2) మహారాజు, గంగ
3) రాక్షసుడు 4) తద్దినం, శ్రాద్ధం - ‘అష్టకష్టాలు’ అంటే దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధు దర్శనం, ఉచ్చిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ట, దారిద్య్రం అని అర్థం. కానీ నేడు ‘ఎక్కువ కష్టాలు’ అని సామాన్యమైన అర్థంలో వాడటం అర్థవిపరిణామంలో దేనికి చెందినది?
1) అర్థసంకోచం 2) అర్థగౌరవం
3) అర్థవ్యాకోచం 4) అర్థగ్రామ్యత - కింది వాటిలో అర్థ వ్యాకోచానికి సంబంధించి సరికానిది?
1) తైలం 2) వారం
3) గ్లాసు 4) సాంవత్సరీకం - ‘ఐష్టెశ్వర్యాలు’ అంటే దాసి, ధనం, ధాన్యం, బంధువు, భృత్యువు, వస్త్రం, వాహనం, సుతుడు అని అర్థం. కానీ నేడు ఏ ఐశ్వర్యానికయినా ఐష్టెశ్వర్యాలు అనే పదం ఉపయోగించడంలో జరిగిన అర్థ విపరిణామం?
1) అర్థోత్కర్ష 2) అర్థాపకర్ష
3) అర్థసౌమ్యత 4) అర్థవ్యాకోచం - అర్థవిపరిణామంలోని రకాలు, ఉదాహరణలను జతపర్చండి.
అ. అర్థ వ్యాకోచం య. కర్మ
ఆ. అర్థ సంకోచం ర. సభికులు
ఇ. అర్థ సౌమ్యత ల. కోక
ఈ. అర్థ గ్రామ్యత వ. నంజుడు
మొదటి వరుసలోని అ, ఆ, ఇ, ఈ లకు వరుసగా సరిపోయే రెండో వరుసలోని అంశాలు
1) వ, ల, ర, య 2) య, ల, ర, వ
3) య, ర, ల, వ 4) ర, ల, వ, య - విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే దానిని ఎలా అంటారు?
1) అర్థగ్రామ్యత
2) అలంకారిక ప్రయోగం
3) అర్థసంకోచం 4) అర్థాపకర్ష - మధుపర్కాలు, వస్తాదు, ఉద్యోగం, పత్రం, ఆరాధ్యుడు, సంభావన, పెద్ద, వ్యవసాయం, మృగం, తద్దినం, శ్రాద్ధం, సాంవత్సరీకం, నెయ్యి, సాహెబు, చాడీ, సందూక అనే పదాలు అర్థవిపరిణామంలో దేనికి చెందినవి?
1) అర్థవ్యాకోచం 2) సభ్యోక్తి
3) మృదూక్తి 4) అర్థసంకోచం - ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు, సామాన్య అర్థంలో వాడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకోవడం అర్థవిపరిణామంలో దేనికి చెందినవి?
1) అర్థగౌరవం/అర్థోత్కర్ష
2) అర్థగ్రామ్యత/అర్థాపకర్ష
3) లోకనిరుక్తి 4) వస్తుపరిణామం - సభికులు, ముహూర్తం, మర్యాద, వైతాళికుడు, అదృష్టం, అంతస్థు అనే పదాలు అర్థ విపరిణామంలో దేనికి చెందినవి?
1) సభ్యోక్తి 2) మృదూక్తి
3) అర్థ సంకోచం 4) అర్థసౌమ్యత - పాత కాలంలోని అర్థం కంటే తర్వాత కాలంలో అర్థం నీచమైంది, చెడు అయింది అయితే దానిని ఎలా పిలుస్తారు?
1) సభ్యోక్తి 2) మృదూక్తి
3) అర్థగ్రామ్యత 4) లోకనిరుక్తి - జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి, బాధ కలిగి పరిహాసార్థంలో కానీ, నిందార్థంలో కానీ, నిమ్నార్థంలో కానీ పదం వాడితే దానిని ఎలా అంటారు?
1) అర్థగ్రామ్యత/అర్థాపకర్ష
2) లోకనిరుక్తి
3) జననిరుక్తి 4) వస్తుపరిణామం - కర్మ, వ్యంగ్యం, కంపు, సన్యాసి, స్వాహా, దేవదాసి, కళావంతులు, కైంకర్యం, అసహ్యం, సాని, విధవ, ముండ, గ్రహచారం, పూజ్యం, నిండుకొన్నవి, శనిగ్రహం, ఘటం మొదలైన పదాలు అర్థవిపరిణామంలో వేటికి చెందినవి?
1) లోకనిరుక్తి 2) వస్తుపరిణామం
3) అర్థాపకర్ష
4) అలంకారిక ప్రయోగం - ‘ఛాందసుడు’ అనే పదానికి పూర్వార్థం వేదవేత్త. దీని ప్రస్తుతార్థం ‘లోకజ్ఞానం లేనివాడు ఇది?
1) అర్థసంకోచం 2) అర్థవ్యాకోచం
3) అర్థసౌమ్యత 4) అర్థగ్రామ్యత - సభలో గానీ, కొందరి సమక్షంలో గానీ, సంఘంలో కానీ ప్రత్యక్షంగా ఉచ్ఛరించడానికి వీలుకాని పదాల అర్థాన్ని పరోక్షంగా కానీ, నూతన పదబంధ కల్పన వల్ల కానీ తెలియజేసే విధానాన్ని ఏమంటారు?
1) సభ్యోక్తి 2) వస్తుపరిణామం
3) అర్థాపకర్ష 4) అర్థసంకోచం - ‘చనిపోవు’ అనే పదానికి బదులుగా కాలధర్మం, కీర్తిశేషుడు, బాల్చీతన్నాడు, శివైక్యం పొందాడు అనేవి ఉపయోగించడం?
1) అర్థగౌరవం 2) సభ్యోక్తి
3) అలంకారిక ప్రయోగం 4) మృదూక్తి - గంటిజోగి సోమయాజి ‘మోసగాడు’ అనే పదాన్ని ‘పెద్దమనిషి’ అనే అర్థంలో వాడటం అర్థవిపరిణామంలో దేనికి చెందింది?
1) లోకనిరుక్తి 2) మృదూక్తి
3) అర్థగౌరవం 4) సభ్యోక్తి - కఠినమైన లేదా దుఃఖ స్ఫోరకమైన అభిప్రాయాలను మృదువైన రీతిలో చెప్పడం?
1) లక్ష్యార్థ సిద్ధి 2) కార్యకారణ సంబంధం
3) మృదూక్తి 4) అర్థసౌమ్యత - ‘దీపం ఆరిపోయింది’ అనే కఠిన మాటకు బదులుగా దీపం పెద్దదైంది, దీపం కొండెక్కింది అని ఉపయోగించడం ఏ రకమైన అర్థవిపరిణామం?
1) అంగాంగ సంబంధం
2) లోకనిరుక్తి
3) జననిరుక్తి 4) మృదూక్తి - ‘ముష్టి’ ఈ పదానికి నైఘంటికార్థం ‘పిడికిలి’ ఇప్పుడు ‘భిక్షం’ అనే అర్థంలో స్థిరపడింది. ఏ అర్థవిపరిణామం? (ఎస్జీటీ-2018)
1) లోకనిరుక్తి 2) అర్థసంకోచం
3) లక్ష్యార్థ సిద్ధి 4) సభ్యోక్తి - ‘అరుదు’ అనే పదం ప్రస్తుతం ‘అసామాన్యం’ అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం ప్రాచీనార్థం? (ఎస్జీటీ-2018)
1) అంత 2) కొంత
3) వింత 4) ఎంత - గోడ+కాలు-> గోడకాలు అర్థవిపరిణామాన్ని వివరిస్తూ పేర్కొనే పరిభాష? (ఎస్జీటీ-2018)
1) ధ్వని స్వయం ద్యోతకత
2) వ్యాకరణ ద్యోతకత
3) అర్థ ద్యోతకత 4) నానార్థకత - ‘దాహం’ అంటే దహించడం, తపించడం అని నైఘంటికార్థం. కానీ కార్యకారణ సంబంధంవల్ల దప్పిక, పానీయం అనే అర్థాలు ఏర్పడ్డాయి. ఇక్కడ జరిగిన అర్థవిపరిణామం?
1) అర్థసౌమ్యత 2) అర్థగ్రామ్యత
3) అర్థసంకోచం 4) లక్ష్యార్థసిద్ధి - ‘సూది’ అనే పదం లక్ష్యలక్షణ సంబంధంవల్ల బట్టలు కుట్టే సూదిగాను, డాక్టర్లు మందును పేషెంట్ల శరీరంలోకి ఎక్కించడానికి ఉపయోగించే పరికరంగానూ అర్థవిపరిణామం పొందడం దేనికి
సంబంధించినది?
1) లక్ష్యార్థ సిద్ధి 2) అర్థోత్కర్ష
3) మృదూక్తి
4) అలంకారిక ప్రయోగం - పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ‘పూర్వం లక్కతో చేయడంవల్ల వాటిని లక్కపిడతలు’ అనే పదం రూఢి అయ్యింది. ఇప్పుడు కర్రతో చేసిన వాటిని కూడా ఈ పేరుతోనే వ్యవహరించడం ఏ రకమైన అర్థవిపరిణామం?
1) లక్ష్యార్థ సిద్ధి 2) మృదూక్తి
3) వస్తుపరిణామం
4) అలంకారిక ప్రయోగం - అలంకారిక ప్రయోగానికి సంబంధించిన ఉదాహరణల్లో సరికానిది?
1) వాడు మన్మథుడు 2) కర్మ
3) ఆమె రంభ 4) వాడు నారదుడు - తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం, వాడు సిసింద్రీ, ఎండ నిప్పులు చెరుగుతుంది, చలాకీ మనిషి, కడుపులో చిచ్చుపెట్టిపోయాడు, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది, గుండె చెరువు మొదలైన ప్రయోగాలు అర్థవిపరిణామంలో దేనికి చెందినవి?
1) వస్తుపరిణామం
2) అర్థవ్యాకోచం
3) అలంకారిక ప్రయోగం
4) అర్థగౌరవం - ప్రజలు తమకు ఉన్న జ్ఞానంలో, తమకు బాగా పరిచయమైన పదాలను, ఆ పదంలోని అక్షరాల్ని కొద్దిగా అటూ ఇటూ మారుస్తారు. ఇలాంటి మార్పునే ఎలా పిలుస్తారు?
1) అలంకారిక ప్రయోగం 2) అర్థోత్కర్ష
3) అర్థాపకర్ష 4) లోకనిరుక్తి - Over Oiling, నారద సింహాచలం, మధురవాడ, బోరన్ మిఠాయి, మొక్కజొన్న, చక్రకేళి, ఆకాశరామన్న, ఆరంజోతి అనే పదాలు అర్థవిపరిణామంలో దేనికి చెందినవి?
1) అర్థసంకోచం 2) అర్థవ్యాకోచం
3) లోకనిరుక్తి 4) మృదూక్తి - పదజాలానికి సంబంధించినటువంటి అర్థంలో కలిగే మార్పును అర్థవిపరిణామం అంటారు అని నిర్వచించినవారు?
1) ఆచార్య జీఎన్ రెడ్డి
2) ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
3) బొడ్డుపల్లి పురుషోత్తం
4) ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం - అర్థవిపరిణామానికి సంబంధించిన హేతువుల్లో తప్పుగా పేర్కొనబడినది?
1) నాగరిక కారణాలు, చారిత్రక కారణాలు
2) పదసృష్టి-పదనాశనం, కొత్త పదాలు సృష్టించడం
3) మరోభాషలోంచి వచ్చి స్థిరరూపం దాల్చకపోవడం
4) వస్తువుల వాడకం తగ్గడం, మరో భాషలోంచి వచ్చి స్థిరరూపం దాల్చడం
Answers
1-2, 2-3, 3-1, 4-2, 5-4, 6-4, 7-3, 8-4, 9-3, 10-4, 11-4, 12-1, 13-3, 14-4, 15-1, 16-4, 17-3, 18-1, 19-4, 20-4, 21-1, 22-2, 23-4, 24-3, 25-4, 26-3, 27-3, 28-3, 29-4, 30-1, 31-3, 32-2, 33-3, 34-4, 35-3, 36-1, 37-3.
లోక్నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- Education News
Previous article
మైక్రో టీచింగ్ అనే భావన ఎక్కడ ఆవిర్భవించింది?
Next article
కుతుబ్షాహీలు – సైనిక వ్యవస్థ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు