TSPSC JL/DL Special | పరస్పర సహకారం.. అన్యోన్యాశ్రయ జీవనం
ఆవరణ శాస్త్రం(Ecology)
- జీవులు, వాటి పరిసరాలకు మధ్యగల సంబంధాలను అధ్యయనం చేయడాన్ని ఆవరణ శాస్త్రం(Ecology) అంటారు.
- ‘ఇకాలజీ’ అనే పదాన్ని రీటర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు.
- ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఎ.జి.ట్రాన్స్‌లే పరిచయం చేశాడు.
- నిర్ణీత ప్రదేశంలోని జీవ సముదాయం, నిర్జీవ పరిసరాలు కలిసి నిర్వహించే క్రియను ఆవరణ వ్యవస్థ అంటారు.
జీవరాసుల ఆవాసం - ఏ ఆవాసంలోనైనా, ఏ జీవి దానంతట అది నివసించి మనుగడ సాగించలేదు.
- ఒక ఆవాసంలోని వివిధ జీవులు పరస్పర సంబంధాలు ఏర్పరుచుకుని ఉంటాయి.
- ఒక జీవి జీవన సరళి మరొక జీవి జీవన సరళితో ముడిపడి ఉంటుంది. దీన్ని అన్యోన్యాశ్రయం అంటారు.
- ఒక ఆవాసంలో నివసించే జీవుల మధ్య పరస్పర సంబంధాలు జాత్యాంతస్థ, జాతుల మధ్య అని రెండు రకాలుగా ఉంటాయి.
- ఆవాసంలోని ఒకే జాతి జీవుల మధ్య ఆహారం, వసతి, సహచరుల కోసం జరిగే పరస్పర సంబంధాలను జాత్యంతస్థ పరస్పర సంబంధాలంటారు.
- జాత్యంతస్థ పరస్పర సంబంధాల వల్ల జాతిలో శక్తి సామర్థ్యాలున్న జీవులు ఎన్నుకోబడతాయి. ఇలా ఎన్నుకోబడ్డ జీవులు వాటి లక్షణాలను తమ సంతానానికి అందజేస్తాయి. దీని వల్ల జాతి సామర్థ్యం పెరుగుతుంది.
- జాతుల సంఖ్యను జాత్యంతస్థ పరస్పర సంబంధాలు అదుపులో పెడతాయి.
- ఆవాసంలో నివసించే రెండు అంతకన్నా ఎక్కువ జాతుల మధ్య సంబంధాలను జాతుల మధ్య పరస్పర సంబంధాలు అంటారు.
- ఒక ఆవాసంలోని వివిధ జాతులకు వేర్వేరు రకాల ఆహారం అవసరమైతే ఆహారం కోసం ఈ జాతుల మధ్య జరిగే పోటీ అతితక్కువగా ఉంటుంది.
ఉదా: ఒకే ఆవాసంలోని నివసించే పక్షులు, ఆవుల మధ్య ఆహారానికి పోటీ తక్కువగా ఉంటుంది - జీవరాసులకు ఆవాసాలుగా భూమి, నీరు, సముద్రం ఉంది.
ఉష్ణోగ్రత- మొక్కల అనుకూలనాలు - ఉష్ణోగ్రతలోని మార్పులను తట్టుకునేందుకు సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసించే మొక్కలు శీతాకాలానికి ముందే ఆకులను రాలుస్తాయి. దాని వల్ల బాష్పీభవనం తగ్గి, మొక్కకు అవసరమయ్యే నీటి పరిమాణం తగ్గుతుంది.
- ఉష్ణ మండల ప్రాంతాల్లో వేసవి కాలం ప్రారంభానికి ముందే మొక్కలు ఆకులను రాలుస్తాయి.
ఉష్ణోగ్రత- జంతువుల అనుకూలనాలు - జంతువులు కూడా ఉష్ణోగ్రతలోని మార్పులకు అనుకూలనాలను చూపిస్తాయి.
- శీతల వాతావరణంలో నివసించే జంతువులకు దట్టమైన ఉన్ని లేక రోమాలతో కూడిన చర్మం, చర్మం కింద దళసరి కొవ్వు పొర ఉంటుంది. ఇది శరీరం నుంచి వేడిని బయటకు పోనివ్వదు.
- కొన్ని జంతువులు శీతాకాలం ప్రారంభానికి ముందే వాటి చర్మం కింద కొవ్వు పొరను ఏర్పరుచుకుని శీతాకాలం అంతా నిద్రపోతాయి. ఈ స్థితిని శీతాకాల సుప్తావస్థ అంటారు. ఈ సమయంలో శక్తి విడుదలకు, ఉష్ణాన్ని విడుదల చేయడానికి కొవ్వు పొర ఉపయోగపడుతుంది.
ఉదా: కప్ప - పరిస్థితులు అనుకూలంగా లేకపోతే జంతువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోతాయి.
స్థిరోష్ణ- అస్థిరోష్ణ జంతువులు - కొన్ని జంతువులు వాతావరణ ఉష్ణోగ్రతలోని మార్పులతో సంబంధం లేకుండా తమ శరీర ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచుకుంటాయి. ఇటువంటి జంతువులను స్థిరోష్ణ జంతువులు అంటారు.
ఉదా: పక్షులు, క్షీరదాలు - స్థిరోష్ణ జంతువుల్లో వేడిగా ఉన్నప్పుడు చమట పట్టడం, చల్లగా ఉన్నప్పుడు శరీరం వణకడం కన్పిస్తాయి.
- ఇతర జంతువులన్నీ వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోలేవు. వాటిని అస్థిరోష్ణ జంతువులు అంటారు.
ఉదా: అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు
జంతువుల అనుకూలనాలు
- తక్కువగా నీరు దొరికే ప్రాంతాల్లో నివసించే జంతువులు కూడా తగిన అనుకూలనాలు చూపిస్తాయి.
- ఇవి నీటి కొరతను తట్టుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి.
- వేసవి రుతువుల్లో నీటి కొరత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఇవి కొన్ని నెలల పాటు లోతైన బొరియల్లో నివసిస్తాయి. ఈ స్థితిని గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు. నీరు తిరిగి లభించే వరకు ఈ జంతువులు బయటకు రావు.
ఉదా: నత్త, కప్ప - సరీసృపాలు, పక్షులు, మూత్ర విసర్జన జరిపే ముందు, మూత్రంలోని నీటిని తిగిరి పీల్చుకొని మూత్రాన్ని ఎక్కువ గాఢత కలిగిన ద్రవరూపంలో విసర్జిస్తాయి.
- ఈ జంతువులు (సరీసృపాలు, పక్షులు) నైట్రోజన్ సంబంధిత వ్యర్థ పదార్థాలను యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జిస్తాయి.
- యూరిక్ ఆమ్లం నీటిలో కరగదు. ఇది తెల్లటి స్ఫటికాల రూపంలో ఉంటుంది.
నీటి ఆవాసం
- భూమి మీద నీరు ఒక ముఖ్యమైన ఆవాసం.
- నీటి ఆవాసాన్ని రెండు ముఖ్య ఆవాసాలుగా విభజించవచ్చు. అవి మంచి నీటి ఆవాసం, సముద్ర నీటి ఆవాసం.
- ఈ రెండు ఆవాసాల్లో జీవన పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆవాసాల్లో నివసించే జీవులు కూడా వేరుగా ఉంటాయి.
- సముద్ర, మంచి నీటి ఆవాసంలో నివసించే జీవులపై అనేక కారకాలు ప్రభావాన్ని చూపుతాయి.
లవణత - మంచి నీటి లవణత అతి తక్కువగా (1.8 శాతం) ఉంటుంది.
- మంచి నీటిలో కంటే సముద్రపు నీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర నీటి లవణత 3.5 శాతం ఉంటుంది.
- సముద్ర నీటిలో అత్యధికంగా ఉండే లవణం సోడియం క్లోరైడ్. దీనితో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం క్లోరైడ్, కార్బోనేట్లు, సల్ఫేట్లు కూడా ఉంటాయి.
- సముద్రపు నీటి జీవులు, తమ శరీరం నుంచి నీరు నష్టపోకుండా అనేక పద్ధతులను అలంబిస్తాయి. వాటి శరీర ద్రవాల్లోనూ, కణాల్లోనూ యూరియాను ఇతర సమ్మేళనాలను నిల్వ చేస్తాయి. దీని వల్ల శరీర ద్రవాల లవణత పెరిగి, ద్రవాభిసరణ, మూత్రోత్పత్తి తగ్గి దేహం నుంచి నీటి నష్టం తగ్గుతుంది.
- మంచి నీటి జంతువుల్లో ఎక్కువగా ఉన్న నీటిని తీసివేయడానికి సంకోచ రిక్తికలు, జ్వాలా కణాలు, వృక్కాలు, మూత్రపిండాలు ఉంటాయి.
- అన్ని మంచినీటి జీవులు తక్కువ గాఢత గల మూత్రాన్ని విసర్జిస్తాయి. నైట్రోజన్ సంబంధిత వ్యర్థ పదార్థాలను అమ్మోనియా లేదా యూరియా రూపంలో విసర్జిస్తాయి.
ఉష్ణోగ్రత - ఉష్ణోగ్రత నీటి ఆవాసంలోని జీవుల మీద ప్రభావం చూపే మరో కారకం.
- మంచి నీటి ఆవాసాల్లో శీతాకాలంలో ఉపరితలంలోని నీరు మాత్రమే గడ్డ కడుతుంది. లోపలి పొరల్లోని నీరు గడ్డ కట్టదు. కాబట్టి అన్ని జీవులు నీటి పొరల్లో నివసిస్తాయి.
- ఉష్ణమండలంలోని జలచరాలు, గ్రీష్మకాల సుప్తావస్థ ద్వారా కాని, కోశాలు ఏర్పరుచుకొని కాని వేసవిని తట్టుకుని జీవిస్తాయి.
- సముద్రం పై పొరల్లో ఉండే నీరు వేడెక్కుతుంది. సముద్రాల్లో లోతుకు పోయే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్రపు అడుగు భాగంలోని నీరు చల్లగా, చీకటిగా ఉంటుంది.
ఆక్సిజన్ - జలచరాల శ్వాసక్రియకు ఆక్సిజన్ కావాలి.
- మంచినీటిలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది. దీన్ని జలచరాలు శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి.
- మొక్కలు, జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను నీటిలోకి విడుదల చేస్తాయి.
- సముద్రాల్లో లోతు పెరిగే కొద్ది లభించే ఆక్సిజన్ తగ్గుతుంది.
కాంతి - సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు మాత్రమే కాంతి లభిస్తుంది. ఈ లోతులో ఉన్న మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియను జరుపుకొంటాయి.
- ప్రాంతాన్ని ఫోటిక్ మండలం అంటారు.
ఉదా: వృక్ష ప్లవకాలు
ఆహారం - జలావాసంలో నివసించే అనేక జంతువులు ప్లవకాలను, శైవలాలను ఆహారంగా తీసుకుంటాయి.
- లోతైన నీటిలో తక్కువ ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇక్కడ నివసించే జంతువులు మరణించి నీటి అడుగుకు చేరిన మృత కళేబరాల నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి.
మంచినీటి వృక్ష సముదాయం
వృక్ష ప్లవకాలు: వాల్ వాక్స్, యూగ్లినా, కొన్ని శైవలాలు
తంతురూప శైవలాలు: స్పైరోగైరా
స్వేచ్ఛగా నీటి మీద తేలుతూ కదిలే మొక్కలు: పిస్టియా, గుర్రపు డెక్క ఆకు మొక్కలు, ఉల్ఫియా, లెమ్నా, అజొల్లా.
నీటిలో మునిగి ఉన్న మొక్కలు: వాలిస్‌నేరియా, హైడ్రిల్లా, కారా (శైవలం)
మంచినీటి జంతు సముదాయం
జంతు ప్లవకాలు: ప్రొటోజోవన్లు, కోపిపోడ్లు, రోటిఫెర్లు, కీటకాల లార్వాలు, క్రస్టేషియాలు, మొలస్కాలు
నెక్టాన్: అనేక కీటకాలు, చేపలు, కప్పలు, నీటి పాములు
బెంథాస్: నీటి అడుగున నివసించేవి
ఉదా: మొలస్కాలు, ప్లనేరియన్లు, మొసళ్లు, ఎలిగేటర్లు
మొక్కల అనుకూలనాలు
- తగినంతగా నీరు దొరకని ప్రాంతాల్లో నివసించే మొక్కలు నిర్మాణంలో, శరీర ధర్మ చర్యల్లోనూ అనేక అనుకూలనాలు చూపిస్తాయి. ఉదా: ఎడారి మొక్కలు నిర్మాణంలోనూ శరీర ధర్మ చర్యోల్లోనూ అనేక అనుకూలనాలు చూపిస్తాయి (ఎడారి మొక్కలు)
- నీరు లభించే ప్రదేశాల్లో నివసించే మొక్కలు నీటిని పదిల పరుచుకోవటానికి ఎటువంటి అనుకూలనాలు చూపించవు.
- ఎడారి ప్రాంతాల్లో నివసించే మొక్కలు చిన్న ఆకులను కలిగి అయినా ఉండొచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు. దీని వల్ల బాష్పీభవనం తక్కువగా జరిగి నీరు ఆదా
అవుతుంది. - ఆకులు ఉన్నప్పుడు వాటి ఉపరితలం మీద మైనపు పూత ఉంటుంది. కాబట్టి ఆకుల ఉపరితలం ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు పోదు.
- ఎడారి మొక్కల కాండాలు రసభరితంగా పత్రాలవలె ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు