Economy Groups Special | ప్రైవేటు రంగాన్ని సమర్థించిన పారిశ్రామిక విధాన తీర్మానం ?
1. కింది వాటిలో మూలధనం కానిది ఏది?
ఎ) భూములు బి) భవనాలు
సి) ఆహారం డి) యంత్రాలు
2. ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) కీన్స్
సి) మార్షల్ డి) డాల్టన్
3. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనక పోయినప్పటికీ చెల్లించే వాటిని ఏమంటారు?
ఎ) సబ్సిడీలు
బి) తలసరి వినియోగం
సి) బదిలీ చెల్లింపులు డి) పైవన్నీ
4. ఒక సంవత్సరం ధరలను ఇతర సంవత్సరాల ధరలతో పోలిస్తే ఆ సంవత్సరాన్ని ఏమంటారు?
ఎ) ప్రస్తుత సంవత్సరం
బి) ఆధార సంవత్సరం
సి) ఎ, బి డి) భవిష్య సంవత్సరం
5. మంచి నౌకరు, చెడ్డ యజమాని అని దేన్ని వ్యవహరిస్తారు?
ఎ) వస్తువు బి) ద్రవ్యం
సి) భూములు డి) యంత్రాలు
6. ధనవంతుడి ద్రవ్యం ఉపాంత ప్రయోజనం పేదవాడితో పోల్చినపుడు?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) స్థిరం డి) ఏదీకాదు
7. ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉపయోగించే పన్నులు ఏవి?
ఎ) పురోగామి పన్నులు
బి) తిరోగామి పన్నులు
సి) అనుపాతపు పన్నులు
డి) పైవన్నీ
8. వర్తక నిబంధనలు దేన్ని తెలియజేస్తాయి?
ఎ) ఎగుమతి ధరల నిష్పత్తి
బి) దిగుమతి ధరల నిష్పత్తి
సి) ఎగుమతి, దిగుమతి, ధరల నిష్పత్తి
డి) ఏదీకాదు
9. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) కారల్ మార్క్స్ జర్మనీకి చెందిన వ్యక్తి
బి) కారల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ గ్రంథ రచయిత
సి) కారల్ మార్క్స్ శాస్త్రీయ సామ్యవాద పితామహుడు
డి) పైవన్నీ సరైనవే
10. ఫ్లోబ్యాక్ అంటే?
ఎ) ఒక పరిశ్రమ లాభాన్ని తిరిగి అదే పరిశ్రమలోనే పెట్టుబడి పెట్టడం
బి) ఒక పరిశ్రమ లాభాన్ని మరొక పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం
సి) ఒక పరిశ్రమ లాభాన్ని వివిధ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడం డి) పైవన్నీ
11. జనాభా పరిణామ సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
12. కింది వాటిని జతపరచండి?
ఎ) ప్రణాళిక విరామం 1) 1992-97
బి) వార్షిక ప్రణాళికలు 2) 2002-07
సి) 8వ ప్రణాళిక 3) 1990-92
డి) 10వ ప్రణాళిక 4) 1966-69
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
13. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి రెండూ పర్యాయ పదాలు అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఆర్థర్ లూయిస్ బి) నాసా సీనియర్
సి) ఏసీ పీగూ డి) పై అందరు
14. ఆర్థికాభివృద్ధి జరిగే కొద్ది వేగంగా అభివృద్ధి చెందే రంగం?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
15. అమర్త్యసేన్ గురించి సరైనవి?
ఎ) 1933లో బెంగాల్లో జన్మించాడు
బి) 1999లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు
సి) పేదరికాన్ని లెక్కించే పి-ఇండెక్స్ రూపకర్త
డి) అన్ని సరైనవే
16. జతపరచండి?
ఎ) మొదటి ప్రపంచ దేశాలు 1) కమ్యూనిస్ట్ దేశాలు
బి) రెండో ప్రపంచ దేశాలు 2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు 3) పెట్టుబడిదారీ దేశాలు
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-1, సి-2
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-3, బి-2, సి-1
17. వ్యాపార చక్రాల్లో సౌభాగ్యం తర్వాత వచ్చేదశ ఏది?
ఎ) పునరుజ్జీవనం బి) తిరోగమనం
సి) సౌభాగ్యం డి) ఆర్థిక స్థిరత్వం
18. ప్రపంచ బ్యాంకు విషయంలో సరైనవి ఏది?
ఎ) దీనికి ఐబీఆర్డీ అని పేరు
బి) ఐఎంఎఫ్‌తో కలిపి బ్రెట్టన్ ఉడ్స్ కవలలు అంటారు
సి) ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది
డి) పైవన్నీ సరైనవే
19. ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ఎక్కువగా ఉండే పరిశ్రమ?
ఎ) వస్త్ర పరిశ్రమ
బి) ఇనుం ఉక్కు పరిశ్రమ
సి) కుటీర పరిశ్రమ డి) పైవన్నీ
20. జతపరచండి?
ఎ) భూదానోద్యమం 1) 1934
బి) గ్రామదానోద్యమం 2) 1950
సి) సర్వోదయ ప్రణాళిక 3) 1952
డి) విశ్వేశ్వరయ్య ప్రణాళిక 4) 1951
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-4, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
21. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
22. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతుంది
బి) భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు
సి) హరిత విప్లవం వ్యవసాయ రంగానికి చెందినది డి) పైవన్నీ సరైనవే
23. మేక్ ఇన్ ఇండియాకు సంబంధించినది?
ఎ) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం
బి) 2014 సెప్టెంబర్ 25న ప్రారంభం
సి) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ
డి) పైవన్నీ సరైనవే
24. ప్రైవేటు రంగాన్ని సమర్థించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది?
ఎ) 1948 బి) 1956
సి) 1977 డి) 1991
25. దేశంలో మొదటి ఆధునిక పరిశ్రమ ఏది?
ఎ) పంచదార బి) వస్త్ర
సి) జనపనార డి) ఇనుము-ఉక్కు
26. ప్రణాళికా సంఘాన్ని నెహ్రూ హయాంలో ఏమని పిలిచేవారు?
ఎ) క్యాబినెట్ కమిటీ బి) సూపర్ కమిటీ
సి) సూపర్ క్యాబినెట్ డి) పైవన్నీ
27. మూడో ప్రణాళికకు సంబంధించినవి ?
ఎ) 3వ ప్రణాళిక కాలం 1961-66
బి) హరిత విప్లవం ఈ కాలంలోనే ప్రవేశ పెట్టారు
సి) వ్యవసాయం పెరుగుదల తిరోగమనం పట్టింది డి) పైవన్నీ
28. నాలుగో పంచవర్ష ప్రణాళికకు ముందు అమలైన ప్రణాళికలు ఏవి?
ఎ) 3వ పంచవర్ష ప్రణాళిక
బి) 3 వార్షిక ప్రణాళికలు
సి) నిరంతర ప్రణాళిక డి) పైవన్నీ
29. అంత్యోదయ కార్యక్రమం తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) పంజాబ్
సి) రాజస్థాన్ డి) తమిళనాడు
30. ఏ పేదరిక భావన ద్వారా ఆర్థిక అసమానతలను తెలుసుకోవచ్చు?
ఎ) నిరపేక్ష పేదరికం బి) సాపేక్ష పేదరికం
సి) పేదరిక గీత డి) దారిద్య్ర రేఖ
31. అసంపాదిత ఆదాయం అంటే ?
ఎ) శ్రమ, పని ద్వారా పొందిన ఆదాయం
బి) సంపద, ఆస్తుల నుంచి పొందే ఆదాయం
సి) పన్ను ఎగవేత ద్వారా పొందే ఆదాయం
డి) నల్లధనం
32. ఒక రాష్ట్ర ఆగంతుక నిధిని నిర్వహించేది?
ఎ) ముఖ్యమంత్రి బి) గవర్నర్
సి) రాష్ట్ర క్యాబినెట్ డి) పై అందరు
33. కింది వాటిని జతపరచండి?
ఎ) మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ 1) జవహర్లాల్ నెహ్రూ
బి) మొదటి ఫిస్కల్ కమిషన్ చైర్మన్ 2) సి.డి. దేశ్‌ముఖ్
సి) మొదటి ప్రణాళిక సంఘం చైర్మన్ 3) కె.సి. నియోగి
డి) మొదటి ఆర్బీఐ భారతీయ గవర్నర్ 4) ఇబ్రహిం రహీముల్లా
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2 బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1 డి) ఎ-1, బి-2, సి-3, డి-4
34. కింది వాటిని జతపరచండి?
ఎ) భారత పారిశ్రామిక పితామహుడు 1) జంషెడ్జీ టాటా
బి) నూతన సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు 2) ఎ.సి.పిగూ
సి) సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు 3) ఆడమ్‌స్మిత్
డి) అర్థశాస్త్ర పితామహుడు 4) జె.ఎం. కీన్స్
ఇ) ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు 5) పారెటో
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5 బి) ఎ-5, బి-4, సి-2, డి-3, ఇ-1
సి) ఎ-1, బి-5, సి-2, డి-3, ఇ-4 డి) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
35. కింది వాటిని జతపరచండి?
ఎ) అడవులు 1) ప్రాథమిక రంగం
బి) విద్యుత్ 2) ద్వితీయ రంగం
సి) నిర్మాణ రంగం 3) తృతీయ రంగం
ఎ) ఎ-1, బి-3, సి-2
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-3, సి-1 డి) ఏదీకాదు
36. కింది వాటిని జతపరచండి?
ఎ) వాల్యూ అండ్ క్యాపిటల్ 1) మార్షల్
బి) ప్లానింగ్ అండ్ పూర్ 2) దండేకర్ & రాథ్
సి) పావర్టీ ఇన్ ఇండియా 3) మిన్హాస్
డి) ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమిక్స్ 4) హిక్స్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
37. జీఎస్టీ అంటే?
ఎ) గూడ్స్ అండ్ సేవింగ్ ట్యాక్స్
బి) గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్
సి) జనరల్ సర్వీస్ ట్యాక్స్
డి) జనరల్ షిఫ్ట్ టారిఫ్
38. కింది వాటిలో సరైనది కానిది?
ఎ) ఆధునిక బాటక సిద్ధాంతం – కీన్స్
బి) సాపేక్ష ఆదాయ సిద్ధాంతం – డ్యూసెన్ బెర్రీ
సి) టికిల్ డౌన్ వ్యూహం – ఫీల్డ్‌మన్
డి) శ్రామిక ప్రత్యేకీకరణ- బెన్గామ్
39. PAN CARD అంటే?
ఎ) Primary Account Number Card
బి) Post Account Number Card
సి) Primary Add Number Card
డి) Permanent Account Number Card
40. కింది వాటిని జతపరచండి?
ఎ) జాతీయ గణాంక దినం 1) అక్టోబర్ 31
బి) ప్రపంచ పొదుపు దినం 2) జూన్ 29
సి) ప్రపంచ వినియోగదారుల దినం 3) మార్చి 15
డి) అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినం 4) అక్టోబర్ 17
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-3, సి-4, డి-2
41. ఆల్ఫ్రెడ్ మార్షల్‌కు సంబంధించినది ఏది?
ఎ) ఆర్థిక సూత్రాలను అలలతో పోల్చాడు
బి) లాభాలు మిశ్రమ ఆదాయంగా పేర్కొన్నారు
సి) డిమాండ్ వ్యాకోచత్వం భావనను ప్రవేశ పెట్టాడు డి) పైవన్నీ
42. స్థూల ఆర్థిక శాస్త్రం ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది?
ఎ) 1976 బి) 1854
సి) 1936 డి) 1933
43. రాజా చెల్లయ్య పేరు దేనితో ముడిపడి ఉంది
ఎ) బ్యాంకింగ్ సంస్కరణలు
బి) పన్నుల సంస్కరణలు
సి) ఆదాయ సంస్కరణలు
డి) ఆదాయ వ్యయ సంస్కరణలు
44. సూచనాత్మక ప్రణాళిక భావనను మనదేశం ఏ దేశం నుంచి గ్రహించింది?
ఎ) జపాన్ బి) రష్యా
సి) ఫ్రాన్స్ డి) ఏదీకాదు
45. బ్యాంకుల నుంచి ఎన్ని సార్లయినా ద్రవ్యాన్ని తీసుకునే అవకాశమున్న ఖాతా ఏది?
ఎ) సేవింగ్ బి) కరెంట్
సి) ఎ, బి డి) శాశ్వత
46. శక్తి సామార్థ్యాలకు లభించని పని?
ఎ) అల్ప ఉద్యోగిత
బి) నిర్మిత నిరుద్యోగిత
సి) ఘర్షణ నిరుద్యోగిత డి) పైవన్నీ
47. ఆర్థిక వ్యవస్థ టెర్షియరీ రంగం అని దేన్ని పిలుస్తారు?
ఎ) వ్యవసాయ రంగం
బి) ద్వితీయ రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
48. కింది వాటిని జతపరచండి?
ఎ) వ్యాట్ 1) విలువ ఆదారిత పన్ను
బి) వినోదపు పన్ను 2) ఎగ్జిబిషన్లు
సి) కస్టమ్స్ పన్ను 3) దిగుమతి వస్తువులపై పన్నులు
డి) టోల్ ట్యాక్స్ 4) వంతెనలు రహదారులపై
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
49. ఇందిరాగాంధీ మానస పుత్రికగా ప్రసిద్ధి గాంచి గుర్తింపు పొందిన పేదరిక నిర్మూలన పథకం ఏది?
ఎ) అంత్యోదయ పథకం
బి) 20 సూత్రాల పథకం
సి) డ్వాక్రా గ్రూప్ పథకం
డి) ఉపాది హామీ పథకం
Key :-1-సి 2-బి 3-సి 4-బి
5-బి 6-ఎ 7-ఎ 8-సి
9- డి 10-ఎ 11-బి 12-బి
13-ఎ 14-సి 15-డి 16-బి
17-బి 18-డి 19-బి 20-ఎ
21-సి 22-డి 23-డి 24-డి
25-డి 26-సి 27-డి 28-బి
29-సి 30-బి 31-బి 32-బి
33-ఎ 34-సి 35-ఎ 36-బి
37-బి 38-ఎ 39-డి 40-ఎ
41-డి 42-సి 43-బి 44-సి
45-బి 46-ఎ 47-సి 48-ఎ
49-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు