TSPSC Group 4 Model Paper | నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
గ్రూప్-4 మోడల్ పేపర్ Paper -I
120. గోదావరి నదీతీర ఆలయాలను, వాటి ప్రదేశాలను సరిగా జత చేయండి?
1) విశ్వనాథస్వామి ఆలయం ఎ) మోతే గడ్డ
2) జ్ఞాన సరస్వతి ఆలయం బి) ధర్మపురి
3) లక్ష్మీనరసింహస్వామి ఆలయం సి) బాసర
4) వీరభద్రస్వామి ఆలయం డి) మంచిర్యాల
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
121. కింది అంశాలను సరిగా జతచేయండి?
1. మంజీరా ఎ. జనగామ జిల్లా ఖానాపురం వద్ద జన్మిస్తుంది
2. మూసీనది బి. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది
3. పాలేరు నది సి. గోదావరి ఉపనదుల్లో కెల్లా పొడవైనది
డి. కృష్ణానది డి. తెలంగాణలో 416 కి.మీ. ప్రవహిస్తుంది
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
122. తెలంగాణలో 2021-22 నాటికి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి?
1) తెలంగాణలో పారిశ్రామిక వ్యవసాయ కనెక్షన్లతో పోల్చుకుంటే గృహ సంబంధ విద్యుత్ కనెక్షన్లే ఎక్కువ అంటే 72.14 శాతం అక్రమించాయి
2) తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక-2022 (తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ -2022) ప్రకారం 1.74 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి
3) అన్ని జిల్లాల కంటే వనపర్తి జిల్లా అత్యధిక సంఖ్యలో 2.19 లక్షలు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి
4) అలాగే హైదరాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అత్యధిక (17.72 లక్షల) గృహసంబంధ కనెక్షన్లు ఉన్నాయి
ఎ) 1, 2 బి) 1, 3
సి) 3, 4 డి) 1, 2, 3, 4
123. ఇన్నోవేట్. ఇంక్యూబేట్, ఇన్‌కార్పోరేట్ అనేది ఎవరి నినాదం?
ఎ) తెలంగాణ పారిశ్రామిక విధానం
బి) తెలంగాణ ఐటీ విధాన నినాదం
సి) తెలంగాణ అటవీ విధాన నినాదం
డి) తెలంగాణ వ్యవసాయ విధాన నినాదం
124. భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధిక ఉద్యోగ / ఉపాధులను కల్పిస్తోంది?
ఎ) వ్యవసాయం దాని అనుబంధ రంగాలు
బి) సేవల రంగం
సి) పారిశ్రామిక రంగం డి) రైల్వేలు
125. ఆరోగ్య లక్ష్మి పథకం లక్ష్యం ఏమిటి?
ఎ) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీదలకు ఆరోగ్య రక్షణ నిర్వహించడం
బి) వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం
సి) ప్రతిగ్రామంలో ఆస్పత్రి నిర్మించడం
డి) అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పరిపూర్ణ భోజనం అందించడం
126. తెలంగాణలో బోనాల పండుగను జరుపుకొనే తెలుగుమాసం ఏది?
ఎ) కార్తిక మాసం బి) ఆషాఢ మాసం
సి) ఫాల్గుణ మాసం డి) ధనుర్మాసం
127. కింది వాటిని సరిగా జత చేయండి.
1. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీత రచయిత ఎ. ఏలె లక్ష్మణ్
2. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్న రూపకర్త బి. అందెశ్రీ
3. మా భూమి సినిమా దర్శకుడు సి. ఇ. మధుసూదనాచారి
4. తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ డి. గౌతమ్ ఘోష్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
128. తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకొంటారు?
ఎ) సెప్టెంబర్ 13 బి) సెప్టెంబర్ 20
సి) సెప్టెంబర్ 9 డి) సెప్టెంబర్ 2
129. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకంను ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2016 మార్చి 5 బి) 2015 మార్చి 5
సి) 2014 మార్చి 5 డి) 2017 మార్చి 5
130. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2017 మే 10 బి) 2018 మే 10
సి) 2016 మే 10 డి) 2019 మే 10
131. చక్రవాతాలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1. చక్రవాతాలు అంటే అల్పపీడన కేంద్రం చుట్టూ విస్తారమైన పరిధిలో పెనుగాలులతో కూడిన వలయాకారంలో తిరిగే అధిక పీడన పవన వ్యవస్థ
2. చక్రవాతాలు వెచ్చని సముద్ర ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్ధ్రత, వాతావరణ అస్థిరత కలయికల వల్ల సంభవిస్తాయి
3. చక్రవాత మేఘాలు పైకి ఎగిరి ట్రోపో ఆవరణం మొత్తాన్ని ఆవరిస్తాయి
4. భారతదేశంలో చక్రవాతాలకు అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు అధికంగా ప్రభావితం అవుతాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3, 4 డి) 1, 4
132. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలను సరిగా జతచేయండి.
1. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్
2. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్
3. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్
4. జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ
ఎ. మైసూర్ (1996) బి. ఢిల్లీ (1980)
సి. అహ్మదాబాద్ (1989)
డి. నాగ్‌పూర్ (1958)
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
133. 20వ శతాబ్దానికి చెందిన తెలంగాణ కవులు, వారి రచనలను సరిగా జతచేయండి.
1. బోయనపల్లి వెంకటాచార్యులు ఎ. కాపు బిడ్డ
2. గంగుల శాయిరెడ్డి బి. జానకీ పరిణయం
3. కోదాటి రామకృష్ణారావు సి. తెలంగాణ వీరులు
3. తిరునగరి రామాంజనేయులు డి. భావ కవితా ఖండిక
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
134. మాభూమి నాటకానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఏది?
ఎ) తెలంగాణ సాయుధ పోరాటం
బి) షేక్ బందగీ హత్య
సి) దొడ్డి కొమురయ్య మరణం
డి) వడిశాల వెంకటరెడ్డి హత్య
135. కింది వ్యాఖ్యల్లో సరైనవి గుర్తించండి.
1. స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి సాహితీ సంస్థ సాహితీ మేఖల 1934లో నల్లగొండలో ఏర్పాటయ్యింది
2. నీలగిరి సాహితీ సంస్థను 1991లో సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్థాపించారు
3. తెలంగాణలో భాషా సాహిత్యం దగ్గర నుంచి పౌర హక్కుల దాకా అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్న ఘనుడు వట్టికోట ఆళ్వారుస్వామి అంటే అతిశయోక్తి కాదు
ఎ) 1, 2, 3 బి) 1
సి) 2 డి) 3
136. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు వాటి దర్శకులను సరిగా జతపరచండి.
1. దాసి ఎ. గౌతం ఘోష్
2. మాభూమి బి. బి.నర్సింగరావు
3. అంకూర్ సి. గుణశేఖర్
4. రుద్రమదేవి డి. శ్యామ్ బెనెగల్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
137. తెలంగాణలో ప్రముఖులు వారి రంగాలను సరిగా జతపరచండి.
1. చంద్రబోస్ ఎ. చిత్రకారుడు
2. కాపు రాజయ్య బి. సినీగేయ రచయిత
3. మిథాలీ రాజ్ సి. టెన్నిస్ క్రీడాకారిణి
4. నైనా జైస్వాల్ డి. క్రికెట్ క్రీడాకారిణి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
138. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది?
ఎ) 2014 జూన్ 2 బి) 2014 జూన్ 16
సి) 2014 జూలై 2
డి) 2014 సెప్టెంబర్ 20
139. తెలంగాణలో ఏటా జరిగే జాతరలు, కొలువైన దేవత/దేవుడిని జతపరచండి.
1. కొమురవెల్లి జాతర ఎ. ఆంజనేయస్వామి
2. ఏడుపాయల జాతర బి. లింగమంతులస్వామి
3. కొండగట్టు జాతర సి. మల్లికార్జునస్వామి
4. గొల్లగట్టు జాతర డి. వనదుర్గా భవాని
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
140. తెలంగాణ ప్రముఖులు, వారి బిరుదులను సరిగా జతపరచండి.
1. తెలంగాణ గాంధీ ఎ. భాగ్యరెడ్డి వర్మ
2. తెలంగాణ శివాజీ బి. రావి నారాయణరెడ్డి
3. తెలంగాణ సాయుధపోరాట పిత సి. సర్వాయి పాపన్న
4. దళిత పులి డి. భూపతి కృష్ణమూర్తి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
141. 2023, డిసెంబర్లో ప్రపంచ హైజీన్ సమ్మిట్’ ఎక్కడ జరుగనుంది?
ఎ) అమెరికా బి) సింగపూర్
సి) బ్రిటన్ డి) జర్మనీ
142. 2023, మే 1న నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ‘సామాజిక రంగంలో ఉత్తమ పద్ధతులు: సంగ్రహం, 2023’ను విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న పథకాలు?
ఎ) పల్లెప్రకృతి వనం, మిషన్ భగీరథ
బి) మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ
సి) తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, పల్లెప్రకృతి వనం
డి) తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, మిషన్ భగీరథ
143. 2023, మార్చి 18న మరణించిన ‘పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్’ గురించి సరైన వాక్యమేది?
1. ఈయనను మిల్లెట్ మ్యాన్ అంటారు
2. ఈయన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)ని స్థాపించారు
3. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్‌లో ఉంది
4. ఈయన ప్రారంభంలో జర్నలిస్ట్‌గా పని చేశారు
ఎ) 1, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
144. 2023, ఏప్రిల్ 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న జాతీయ పంచాయతీ అవార్డుల వారోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రం ఎన్ని అవార్డులు పొందింది?
ఎ) 13 బి) 14 సి) 15 డి) 12
145. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నీటి వనరుల సంఖ్య?
ఎ) 64,506 బి) 64,605
సి) 64,056 డి) 64,065
146. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఏ కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది?
ఎ) రాజద్రోహం బి) కిడ్నాప్
సి) హత్య డి) పరువునష్టం
147. సూడాన్‌లో తలెత్తిన సంక్షోభంతో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యకు పేరు?
ఎ) ఆపరేషన్ గంగ బి) ఆపరేషన్ కావేరి
సి) ఆపరేషన్ దేవీశక్తి
డి) ఆపరేషన్ యమున
148. సరిహద్దులో 123 గ్రామాల వివాదాన్ని పరిష్కరించడం కోసం దేశంలో ఏ రాష్ర్టాలు ‘నామ్సాయ్ డిక్లరేషన్’పై సంతకాలు చేశాయి?
ఎ) అసోం-మేఘాలయ
బి) మేఘాలయ-అరుణాచల్‌ప్రదేశ్
సి) అసోం-అరుణాచల్‌ప్రదేశ్
డి) అరుణాచల్‌ప్రదేశ్-సిక్కిం
149. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2022 ఎక్కడ జరిగింది?
ఎ) భోపాల్ బి) ఇండోర్
సి) వారణాసి డి) లక్నో
150. స్వీటీ బూరా ఏ ఆటకు సంబంధించినవారు?
ఎ) చెస్ బి) రెజ్లింగ్
సి) హాకీ డి) బాక్సింగ్
ANS:-
120-బి, 121-సి, 122-డి, 123-ఎ, 124-ఎ, 125-డి, 126-బి, 127-డి, 128-సి, 129-ఎ, 130-బి, 131-సి, 132-ఎ, 133-డి, 134-బి, 135-ఎ, 136-డి, 137-డి, 138-బి, 139-సి, 140-బి 141-బి, 142-సి, 143-డి, 144-ఎ, 145-సి, 146-డి, 147-బి, 148-సి, 149-ఎ, 150-డి.
ప్రశ్న పత్రం రూపొందించిన వారు
ఆంజనేయులు(హిస్టరీ),
కృష్ణ (బయాలజీ),
ఢిల్లీబాబు (ఫిజికల్ సైన్స్),
వెంకట్ (తెలంగాణ పథకాలు,ఎకనామిక్స్), వీరాంజనేయులు (జాగ్రఫీ),
తాన్న రవి (జీకె.&కరెంట్ అఫైర్స్),
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు