TSPSC Group 4 Model Paper | మిషన్ కాకతీయను ఎప్పుడు ప్రారంభించారు?
గ్రూప్-4 మోడల్ పేపర్ Paper -I
92. నిజాం సంస్థానం పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది?
ఎ) హిందీ బి) తెలుగు
సి) ఉర్దూ డి) ఆంగ్లం
93. హైదరాబాద్‌లో తన పేరు మీదుగా మీరాలం చెరువును నిర్మించిన మీర్ ఆలం ఎవరు?
ఎ) సికిందర్ జా కు ప్రధానమంత్రి (దివాన్)
బి) సికిందర్ జా కు సైనికాధికారి
సి) సికిందర్ జా కు పేష్కార్
డి) స్థానిక జమీందారు
94. కింది అంశాలను జత చేయండి.
పాలకుడు నిర్మాణం
1. నిజాం అలీఖాన్ ఎ. టౌన్ హాల్ (ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ)
2. అఫ్జలుద్దౌలా బి. చాదర్‌ఘాట్ వంతెన
3. నాసిరుద్దౌలా సి. అఫ్జల్‌గంజ్ (నయాపూల్ వంతెన)
4. మీర్ మహబూబ్ అలీఖాన్ డి. పురాని హవేలి
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
95. 1857లో హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు సమయంలో ఏ నిజాం పరిపాలిస్తున్నాడు?
ఎ) నసీరుద్దౌలా బి) అఫ్జలుద్దౌలా
సి) మహబూబ్ అలీఖాన్
డి) ఉస్మాన్ అలీఖాన్
96. సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి కింది అంశాలను జతపరచండి.
1. న్యాయ శాఖ ఏర్పాటు ఎ. 1867
2. వైద్యశాఖ ఏర్పాటు బి. 1862
3. అటవీశాఖ ఏర్పాటు సి. 1886
4. ప్రజా పన్నుల శాఖ ఏర్పాటు డి. 1864
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
97. 1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలను క్రమపద్ధతిలో అమర్చండి.
1. పన్నుల సత్యాగ్రహ ఉద్యమం (వరంగల్)
2. స్త్రీల సత్యాగ్రహం (అబిడ్స్)
3. కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
4. కుమార్ లలిత్ కమిటీ
ఎ) 3, 4, 2, 1 బి) 3, 4, 1, 2
సి) 1, 2, 3, 4 డి) 4, 3, 2, 1
98. జై తెలంగాణ ఉద్యమ సమయం (1969)లో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎవరు?
ఎ) ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ
బి) ప్రొఫెసర్ సూరి భగవంతం
సి) హషీం అలీ డి) ఎవరూ కాదు
99. ప్రతిపాదన (ఎ) – 1969 తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతానికి కలిగిన ప్రయోజనాలన్నీ 1973 జై ఆంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు కోల్పోయారు
కారణం (ఆర్)- ఆంధ్రులకు అనుకూలంగా ప్రధాని ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం ప్రకటించడం
ఎ) ఎ, ఆర్ రెండూ సరైనవే, ఆర్, ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ రెండూ సరైనవే, ఆర్), ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
100. ప్రతిపాదన (ఎ) – 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభమైనప్పటికీ 1971లో ఉద్యమం నీరుగారి విఫలమయ్యింది
కారణం (ఆర్) – తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యతిరేకత, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉద్యమ ప్రభావం ఉండటం, గ్రామీణ ప్రాంత ప్రజలు కలుపుకోలేకపోవడం, రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం, తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం కావడం ముఖ్య కారణాలు.
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవే, (ఆర్), (ఎ) కు సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవే, (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ, (ఆర్) తప్పు
డి) (ఎ) తప్పు, (ఆర్) సరైనది
101. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య తేదీలను జతపరచండి
1. తెలంగాణ విద్రోహ దినోత్సవం ఎ. 1969 ఏప్రిల్ 22
2. మృత వీరుల దినోత్సవం బి. 1970 జనవరి 24
3. తెలంగాణ పోరాట దినోత్సవం సి. 1969 ఏప్రిల్ 15
4. తెలంగాణ ఫ్లాగ్ డే డి. 1969 జూలై 12
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
102. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి సరైనది గుర్తించండి.
1. 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ, 2010 డిసెంబర్ 30న తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించింది.
2. కమిటీ నివేదికలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు – తెలుగు ప్రాంతాలకు సంబంధించి చేసిన ఆరు సిఫారసుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తమయింది.
3. సిఫారసులు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను, వెనుకబాటుతనాన్ని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంత సమస్యలను శ్రీకృష్ణ కమిటీ వెలుగులోకి తెచ్చిందన్నది వాస్తవం.
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) 3
103. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ విషయంలో ఎన్ని రకాల ప్రత్యామ్నాయాలను తన నివేదికలో పేర్కొంది?
ఎ) 8 బి) 6 సి) 5 డి) 10
104. టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ 2003 అక్టోబర్ 22న సమ్మక్క-సారలమ్మ పుణ్యక్షేత్రమైన మేడారం నుంచి ప్రారంభించిన కార్యక్రమం?
ఎ) పల్లెబాట కార్యక్రమం
బి) కదనభేరి కార్యక్రమం
సి) పాదయాత్ర కార్యక్రమం
డి) పలకరింపు కార్యక్రమం
105. సరైన వాక్యాలను గుర్తించండి.
1. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రిమండలి 2013, డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది.
2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
3. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014, జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎ) 1 బి) 1, 2, 3 సి) 2 డి) 2, 3
106. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి అంశాలను జతపరచండి.
1. సహాయ నిరాకరణ ఉద్యమం ఎ. 2012 సెప్టెంబర్ 30
2. మిలియన్ మార్చ్ బి. 2011 సెప్టెంబర్ 13 – అక్టోబర్ 24
3. సకల జనుల సమ్మె సి. 2011 మార్చి 10
4. సాగర హారం డి. 2011 ఫిబ్రవరి 17 – మార్చి 4
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
107. కింది పథకాల ప్రారంభ తేదీలను జతపరచండి.
1. మిషన్ కాకతీయ పథకం ఎ. 2015 సెప్టెంబర్ 8
2. కళ్యాణ లక్ష్మి పథకం బి. 2015 జనవరి 1
3. ఆరోగ్య లక్ష్మి పథకం సి. 2015 అక్టోబర్ 2
4. షీ క్యాబ్స్ డి. 2015 మార్చి 12
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
108. సూర్యుడికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. సూర్యుడిలో ఉండే ప్రధాన వాయువులు హైడ్రోజన్, హీలియం. ఈ రెండు వాయువులు 3:1 నిష్పత్తిలో ఉంటాయి.
2. సూర్యుడి ప్రధాన భాగం ఒక పెద్ద అణురియాక్టర్ వలె పనిచేసి అధిక మొత్తంలో హైడ్రోజన్ వాయువును హీలియంగా మారుస్తుంది.
3. ఈ ప్రక్రియలో అణు సంలీనం (న్యూక్లియర్ ఫ్యూజన్) జరిగి బ్రహ్మాండమైన శక్తి విడుదలై సూర్యుడికి నలువైపులా ప్రసరిస్తుంది.
ఎ) 1 బి) 1, 2 సి) 2 డి) 1, 2, 3
109. కింది నాలుగు సముద్రాలను వాటి పరిమాణం బట్టి తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో అమర్చిన జవాబును గుర్తించండి.
ఎ) పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాలు
బి) ఆర్కిటిక్, హిందూ, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు
సి) హిందూ, ఆర్కిటిక్, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు
డి) అట్లాంటిక్, ఆర్కిటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాలు
110. కింది వాటిలో సరైన జతలను గుర్తించండి.
1. చరకుడు – ఆయుర్వేదం
2. సుశ్రుతుడు – శస్త్ర చికిత్స
3. పతంజలి – యోగా
4. ఆర్యభట్టు – ‘పై’ విలువ కనుగొన్నాడు
ఎ) 3, 4 బి) 1, 2
సి) 1, 2, 3 డి) 1, 4
111. రామన్ ఫలితం (ఎఫెక్ట్) కింది ఏ శాస్త్రీయ అంశానికి సంబంధించినది?
ఎ) కాంతి ప్రతిబింబం
బి) కాంతి పరిక్షేపణం
సి) కాంతి వక్రీభవనం
డి) కాంతి శోషణం
112. నాన్‌స్టిక్ వంట సామగ్రి తయారీలో ఉపయోగించే పదార్థం ఏది?
ఎ) పాలిటెట్రాఫోరో ఇథలీన్
బి) పాలి ఇథలీన్
సి) కాపర్ నైట్రేట్
డి) పాలి వినైల్ క్లోరైడ్
113. కింది అంశాలను సరిగా జత చేయండి?
1) మొదటి తరం ప్రయోగ వాహక నౌక ఎ) ఎస్ఎల్వి
2) రెండో తరం ప్రయోగ వాహక నౌక బి) ఏఎస్ఎల్వీ
3) మూడో తరం ప్రయోగ వాహక నౌక సి) పీఎస్ఎల్వీ
4) నాలుగో తరం ప్రయోగ వాహక నౌక డి) జీఎస్ఎల్వీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
114. తెలంగాణ ప్రముఖులకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి?
1) 1962లో భారత జాతీయ ప్రతిజ్ఞ (భారత దేశం నా మాతృభూమి)ను రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన రచయిత బహు భాషావేత్త
2) 1897 హైదరాబాద్‌లో జన్మించిన జాకీర్ హుస్సేన్ భారత మూడవ రాష్ట్రపతిగా పనిచేశారు. అతను మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి. పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి
3) వరంగల్‌కు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీగా పేరు పొందారు. ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇతని జన్మదినం డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకొంటారు.
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1 డి) 3
115. రజాకార్ల సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరికాని వ్యాఖ్యలను గుర్తించండి?
1) రజాకార్ అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు
2) రజాకార్లు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రైవేట్ సైన్యం
3) నైజాం రాజ్యంలో రజాకార్ల ఇమ్రోజ్ పత్రికలో రాసినందుకు షోయబుల్లాఖాన్‌ను హత్య చేశాడు
4) సయ్యద్ ఖాసిం రజ్వీ రజాకార్ల నాయకుడు
ఎ) 2, 3 బి) 3, 4
సి) 1 మాత్రమే డి) 2, 3, 4
116. భారతదేశానికి సంబంధించి కిందివ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి?
1) భారతదేశం ప్రపంచంలో 2.4 శాతం భూభాగం కలిగి 17.5 శాతం జనాభాను కలిగి ఉంది.
2) భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న మతం క్రైస్తవ మతం
3) పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్ (షెడ్యూల్డ్ తెగ) జనాభా లేదు
4) భారత్‌లో ముస్లిం జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్
ఎ) 1, 2, 3 2) 4 మాత్రమే
3) 1,3 4) 2, 3
117. భారతదేశ అటవీ నివేదిక -2021 ప్రకారం వివిధ రాష్ర్టాల అటవీ విస్తీర్ణతలను సరిగా జత చేయండి?
1) మహారాష్ట్ర ఎ) 66, 431 చ.కి.మీ.
2) ఒడిశా బి) 50,798 చ.కి.మీ
3) ఛత్తీస్‌గఢ్ సి) 52, 156 చ.కి.మీ
4) అరుణాచల్ ప్రదేశ్ డి) 55, 717 చ.కి.మీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
118. 2011 నాటికి భారతదేశంలో జనాభా లెక్కలను ఎన్నిసార్లు నిర్వహించారు?
ఎ) 10 సార్లు బి) 15 సార్లు
సి) 12 సార్లు డి) 14 సార్లు
119. తెలంగాణ నైసర్గిక స్వరూపానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్యలను గుర్తించండి?
1) తెలంగాణ దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమిపై ఉంది
2) దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం సోలామైన ఇది జనగామ జిల్లాలో ఉంది
3) తెలంగాణ ప్రాంతలోకి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ప్రవేశిస్తాయి
4) పశ్చిమ కనుమలను తెలంగాణలో సహ్యాద్రిశ్రేణి (పంక్తి) అని పిలుస్తారు
ఎ) 1, 2, బి) 2, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
ANS :-
92-సి, 93-ఎ, 94-బి, 95-బి, 96-బి, 97-ఎ, 98-ఎ, 99-ఎ, 100-ఎ, 101-ఎ, 102-సి, 103-బి, 104-ఎ, 105-బి, 106-బి, 107-బి, 108-డి, 109-సి, 110-సి, 111-బి, 112-ఎ, 113-ఎ, 114-బి, 115-సి,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు