TET -Psychology Special | కౌమార దశను ముఖ్యమైనదిగా పరిగణించడానికి కారణం?
1. పెరుగుదల-వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించి అవగాహన కల్పిస్తుంది?
1) విద్యార్థుల స్మృతి
2) విద్యార్థుల సర్దుబాటు
3) విద్యార్థుల అభ్యసనం
4) విద్యార్థుల వైయక్తిక భేదాలు
2. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు, తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపి తన భయాన్ని తెల్ల ఎలుకకే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం?
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
4) వికాసం సంచితమైనది
3. విషయ ప్రణాళిక రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఏకీకృతం
4) వికాసం ఒక పరస్పర చర్య
4. రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య
5. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్లు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
6. తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండటాన్ని సూచించే వికాస నియమం ఏది?
1) వికాసం ఏకీకృత మొత్తం
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం సంచితం
4) వికాసం ఒక పరస్పర చర్య
7. శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఒక పరస్పర చర్య
4) వికాసం క్రమానుగతం
8. ‘కౌమార దశలో శారీరక, మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి’ అనే వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
2) వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు సంభవిస్తుంది
3) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
4) వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది
9. శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
10. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది?
1) వికాసం సంచితం
2) వికాసం క్రమానుగతం
3) వికాసం అవిచ్ఛిన్నం
4) వికాసం ఏకీకృతం
సమాధానాలు
1. 4 2. 3 3. 1 4. 2
5. 3 6. 2 7. 4 8. 1
9. 3 10. 2
1. మానవ జీవ కణంలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి?
1) 22 జతలు 2) 23 జతలు
3) 46 జతలు 4) 45 జతలు
2. కింది వాటిలో జన్యువులు వేటిలో ఉంటాయి?
1) DNA
2) RNA
3) క్రోమోజోమ్లు
4) లైసోజోమ్లు
3. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని..?
1) అనువంశికత 2) మూర్తిమత్వం
3) ప్రజ్ఞ 4) పరిసరాలు
4. ఒక అండం ఒక శుక్ర కణంతో ఫలదీకరణం చెంది విభజనానంతరం రెండు పిండాలుగా పెరిగేవారు?
1) సమరూప కవలలు
2) విభిన్నరూప కవలలు
3) బహురూప కవలలు
4) ఏదీకాదు
5. మానవ శుక్ర కణంలో క్రోమోజోమ్ల సంఖ్య?
1) 46 2) 23 3) 26 4) 45
6. మానవునిలోని క్రోమోజోమ్ల సంఖ్య?
1) 23 2) 44 3) 46 4) 26
7. కింది వాటిలో సరికానిది ఏది?
1) జన్యువులే అనువంశిక లక్షణాల వాహకాలు
2) స్త్రీ నుంచి కేవలం X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయి
3) పురుషుడి నుంచి X లేదా Y క్రోమోజోమ్స్ విడుదలవుతాయి
4) లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది
8. వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు కింది వాటిలో ఏవి?
1) అనువంశికత 2) పరిసరాలు
3) అనువంశికత, పరిసరాల్లో ఏదో ఒకటి
4) అనువంశికత, పరిసరాలు
సమాధానాలు
1. 2 2. 3 3. 4 4. 1
5. 2 6. 3 7. 4 8. 4
1. ఎన్టీ రామారావు కుమారుల్లో అందరూ నటులు కాలేకపోవడాన్ని నిరూపించే అనువంశిక నియమం?
1) సారూప్య నియమం
2) ప్రతిగమన నియమం
3) పోలిక నియమం
4) వైవిధ్య నియమం
2. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికాని జత?
1) ఫ్రాన్సిస్ గాల్టన్-ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు
2) కెల్లాగ్-డోనాల్డ్ అనే శిశువు, గువా అనే చింపాంజి
3) పియర్సన్-కవలలు, అన్నదమ్ములు, దాయాదులు
4) డగ్డేల్-మాక్ జూక్స్ కుటుంబాలు
3. వ్యక్తి వికాసంపై పరిసర ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికానిది ఏది?
1) పాఠశాల వసతులు, వ్యక్తుల వికాసం- డబ్ల్యూ.సి. బాగ్లే
2) పెంపుడు శిశువులు- స్కోడాక్
3) జిప్సీ నడిపే వారి పిల్లలు- గోర్డన్
4) 19 జతల సమరూప కవలలు- వాట్సన్
4. తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనుకబడటాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు?
1) ప్రతిగమన ప్రభావం ఉంటుందని
2) విద్యపై ఆసక్తి లేనివారిగా
3) కాలయాపన చేసే వారిగా
4) వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని
5. ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశిక ప్రభావం అని తెలియజేసే నియమం?
1) సామ్య నియమం
2) ప్రతిగమన నియమం
3) వైవిధ్య నియమం
4) ప్రవర్తనా నియమం
6. ఫలదీకరణ సమయంలో నిర్ధారించే విషయాలు ఏవి?
1) లింగ నిర్ధారణ
2) అనువంశిక లక్షణాలు
3) శిశువుల సంఖ్య 4) పైవన్నీ
7. రమ అనే బాలిక వయస్సు మూడు సంవత్సరాలు. పోషకాహార లోపం వల్ల ఆమె వికాసంలో జాప్యం జరిగింది. దీనికి గల కారణం ఏమిటి?
1) అనువంశికత
2) జన్యుపరమైనవి
3) పరిసరాలు
4) అనువంశికత, పరిసరాలు
9. వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనేవి?
1) జీవ కారకాలు
2) మనో వైజ్ఞానిక కారకాలు
3) సామాజిక కారకాలు
4) పైవన్నీ
10. రమ్య, గీత అనే ఇద్దరు సోదరిల్లో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం?
1) సారూప్య నియమం
2) వైవిధ్య నియమం
3) ప్రతిగమన నియమం
4) సామ్య నియమం
సమాధానాలు
1. 4 2. 3 3. 4 4. 1
5. 2 6. 4 7. 3 9. 2
10. 2
1. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినప్పటికీ దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దేనికి సంబంధించిన మనో వైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది?
1) సర్దుబాటు విధానాలు
2) అభ్యసన పద్ధతులు
3) ప్రేరణ రకాలు
4) వికాస దశలు
2. సాంఘిక పరిణితి లేని వ్యక్తి లక్షణం?
1) అందరితో సహకరించడం
2) బాధ్యత వహించడం
3) ప్రేమానురాగాలు కలిగి ఉండటం
4) ఒడుదొడుకులను తట్టుకోలేకపోవడం
3. కౌమార దశను ముఖ్యమైనదిగా పరిగణించడానికి కారణం?
1) శారీరక వికాసం వేగంగా జరుగుతుంది
2) మానసిక వికాసం వేగంగా జరుగుతుంది
3) శారీరక, మానసిక వికాసం రెండూ వేగంగా జరుగుతాయి
4) పైవేవీకావు
4. పూర్వ బాల్యదశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించటానికి గల కారణం?
1) పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కాబట్టి
2) పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి
3) పిల్లలు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కాబట్టి
4) పైవన్నీ
5. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ‘ఆత్మభావన’ ప్రారంభమయ్యే దశ?
1) యవ్వనారంభ దశ
2) ఉత్తర బాల్య దశ
3) పూర్వ బాల్య దశ
4) కౌమార దశ
6. కింది వాటిలో మానవ జీవితం దేని నుంచి ప్రారంభమవుతుంది?
1) భ్రూణం
2) సంయుక్త బీజం
3) పిండం 4) శిశువు
7. శిశువులో నైపుణ్యాలు పూర్తిస్థాయిలో వికసించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలకు గురయ్యే దశ ఏది?
1) పూర్వ బాల్య దశ
2) శైశవ దశ
3) యవ్వనావిర్భావ దశ
4) ఉత్తర బాల్య దశ
8. శిశువులో మొదటగా వికాసం చెందే, శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా?
1) స్పర్శ, రుచి
2) దృష్టి, వాసన
3) వినడం, దృష్టి
4) స్పర్శ, దృష్టి
9. చతురస్రాకారంలో ఉండే మొండెం క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ?
1) శైశవ దశ
2) ఉత్తర బాల్య దశ
3) పూర్వ బాల్య దశ
4) నవజాత శిశు దశ
10. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోను వల్ల శారీరక పెరుగుదలను నియంత్రించే దశ?
1) శైశవ దశ
2) పూర్వ బాల్య దశ
3) ఉత్తర బాల్య దశ
4) యవ్వనారంభ దశ
సమాధానాలు
1. 4 2. 4 3. 3 4. 2
5. 3 6. 2 7. 1 8. 4
9. 3 10. 1
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు